అన్నపూర్ణ శిఖరం
అన్నపూర్ణ | |
---|---|
అత్యంత ఎత్తైన బిందువు | |
ఎత్తు | 8,091 మీ. (26,545 అ.) పదో ర్యాంకు |
టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్ | 2,984 మీ. (9,790 అ.)[1][2] 94వ ర్యాంకు |
మాతృశిఖరం | Cho Oyu |
టోపోగ్రాఫిక్ ఐసొలేషన్ | 34 కి.మీ. (21 మై.) |
జాబితా | Eight-thousander Ultra |
భౌగోళికం | |
స్థానం | గండకీ జోన్, నేపాల్ |
ప్రాంతం | NP |
పర్వత శ్రేణి | హిమాలయాలు |
అధిరోహణం | |
మొదటి అధిరోహణ | 3 June 1950 మారైస్ హెర్జోగ్ and లూయిస్ లాచెనాల్ (శీతాకాలంలో మొదటి ఆరోహణ 3 ఫిబ్రవరి 1987 జెర్జీ కుకుజెకా and ఆర్టర్ హాజర్) |
సులువుగా ఎక్కే మార్గం | మంచు లేదా మంచుగడ్డలపై ఆరోహణ |
అన్నపూర్ణ (సంస్కృతం, నేపాలీ భాష, నేపాల్ భాష: अन्नपुर्ण) అనేది ఉత్తర మధ్య నేపాల్లోని హిమాలయ పర్వతాల విభాగం. ఈ విభాగంలో 8,091మీ (26,545 అడుగులు) పైగా ఎత్తైన అన్నపూర్ణ I, 7,000 మీ (22,970 అడుగుల) ఎత్తైన 13 ఇతర శిఖరాలు, 6,000 m (19,690 ft) మించిన ఎత్తున్న 16 ఇతర శిఖరాలు ఉన్నాయి.[3] ఈ విభాగం 55 కిలోమీటర్ల-పొడవు (34 mi-పొడుగునా) విస్తరించింది. ఈ పర్వతాలు పశ్చిమాన కాళీగండకీ జార్జ్, ఉత్తరం, తూర్పుల్లో మార్ష్యంగ్డి నది, దక్షిణాన పోఖ్రా లోయల నడుమ విస్తరించాయి. అన్నపూర్ణ I భూమిపై ఎనిమిదివేల అడుగుల శిఖరాల్లో 14వ స్థానంలో నిలుస్తుంది. భూమిపైనే అత్యంత లోతైన లోయగా పేరొందిన కాళీగండకీ జార్జ్ నుంచి పడమట 8167 మీటర్ల ఎత్తైన ధౌలగిరి 34 కిలోమీటర్ల ఎత్తున పైకి నిలిచింది.
అన్నపూర్ణ అనే సంస్కృత నామానికి అక్షరాలా ‘ఆహారంతో నిండినది’ అని అర్థం, కానీ సాధారణంగా ఆహారానికి/సాగుకి అధిదేవత అన్న అర్థం వస్తుంది. హిందూమతంలో, అన్నపూర్ణ "... వంటకు, ఆహారానికి విశ్వవ్యాపితమైన దేవీరూపం.. ఆహారాన్ని అందించే అమ్మ. ఆమె లేకుంటే క్షామము, ఆహార రాహిత్యము, విశ్వవ్యాప్తమైన భయం మిగులుతుంది. ఇది అన్నపూర్ణను విశ్వానికే దేవతగా మలుస్తుంది... ఆమె సుప్రసిద్ధమైన ఆలయం గంగాతీరాన కాశీలో నెలకొంది." ఆహారాన్ని(సంపద) ఇవ్వడంతో ఆమెకున్న సంబంధం ఆమెను కొన్నిమార్లు సంపదకు అధిదేవతయైన లక్ష్మీదేవిగా భావించేలా చేస్తుంది.[4]
మొత్తం పర్వత ప్రాంతం, దాని పరిసరాల పాటుగా 7,629 కిమీ2 విస్తీర్ణం మేరకు నేపాల్ లోని మొదటి, అతిపెద్ద రక్షిత ప్రాంతమైన అన్నపూర్ణ రక్షిత ప్రాంతంగా రక్షిస్తున్నారు. అన్నపూర్ణ రక్షిత ప్రాంతం అన్నపూర్ణ సర్క్యూట్ సహా ఎన్నో ప్రపంచస్థాయి ట్రెక్ లకు నిలయం.
అన్నపూర్ణ శిఖరాలు అధిరోహించేందుకు ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన పర్వతాలు, అయితే 1990ల నుంచి వచ్చిన గణాంకాలను ఉపయోగించి ఇటీవలి చరిత్రను పరిశీలిస్తే, 2012 వరకూ కాంచనగంగ పర్వతంపై ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువ ప్రమాదాలు నమోదైనాయి.[5] 2012 మార్చి నాటికి, అన్నపూర్ణ Iపైకి 191 శిఖరారోహణలు జరుగగా, 61 ఆరోహణ ప్రమాద మరణాలు జరిగాయి.[6] ఈ ప్రమాద మరణాలకు ఆరోహణకు ఉన్న నిష్పత్తి ఏ ఇతర 8000 మీటర్ల ఎత్తైన పర్వతాలలోకెల్లా ఎక్కువ. కొందరు ప్రత్యేకించి దక్షిణ ముఖంగా చేసే ఆరోహణే అన్ని శిఖరారోహణలలోకీ ప్రమాదకరమైనదని భావిస్తున్నారు. అక్టోబరు 2014లో, అన్నపూర్ణ చుట్టుపక్కల ప్రాంతంలో కనీసం 39మంది వరకూ మంచు తుఫాన్లు, కొండచరియలు విరిగిపడటం కారణంగా మరణించారు. ఇది నేపాల్ లోకెల్లా అత్యంత దారుణమైన ట్రెక్కింగ్ ప్రమాదం.[7]
మూలాలు
[మార్చు]- ↑ మూస:Cite peakbagger
- ↑ "Nepal/Sikkim/Bhutan Ultra-Prominences". peaklist.org. Archived from the original on 25 డిసెంబరు 2008. Retrieved 2009-01-12.
- ↑ హెచ్.ఆడమ్స్ కార్టర్ (1985). "క్లాసిఫికేషన్ ఆఫ్ ద హిమాలయా" (PDF). అమెరికన్ ఆల్పైన్ జర్నల్. 27 (59). అమెరికన్ ఆల్పైన్ క్లబ్: 127–9. Retrieved 2011-05-01.
- ↑ Pattanaik (2009), pp. 25, 27.
- ↑ "Complete ascent — fatalities statistics of all 14 main 8000ers". 8000ers.com. June 19, 2008. Retrieved 2013-05-30.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;econdailychart
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;BBC29672358
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు