భారతీయ సాహిత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతీయ సాహిత్యం (Indian literature) 1947 వరకుభారత ఉపఖండం లో, ఆతరువాత భారత లౌకిక రాజ్యంలో రచించబడిన సాహిత్యాన్ని భారతీయ సాహిత్యం గా అభివర్ణించవచ్చును. భారత్ లో 22 అధికారిక భాషలు గలవు.

ప్రాచీన భారతీయ సాహితీ చరిత్ర గురించి అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. యూరోపియన్ స్కాలర్లు శతాబ్దం తరువాత, భారత సాహితీ చరిత్ర కాలరేఖలను గుర్తించి వ్రాయడం మొదలు పెట్టారు. వీరు అనేక భారతీయ గ్రంథాలను మూలంగా చేసుకుని భారతీయ సాహితీ చరిత్ర కాలరేఖను వ్రాసారు. ప్రాచీన భారత సాహిత్యం స్మృతి, శృతి ద్వారా ఇతర తరాలకు అందేది. సంస్కృత సాహిత్యం ఋగ్వేదంతో ప్రారంభమౌతుంది. ఈ కాలం క్రీ.పూ. 1500–1200. సంస్కృత ప్రబంధకాలైన రామాయణం, మహాభారతంలు క్రీ.పూ. వెయ్యి సం.లకు చెందినవి.[1] తమిళ సంగం సాహిత్యం, పాలీ కానన్ చేసినట్లుగా.మధ్యయుగ కాలంలో, కన్నడ, తెలుగులో సాహిత్యం వరుసగా 9వ, 11వ శతాబ్దాలలో కనిపించింది[2]. తరువాత, మరాఠీ, బెంగాలీ, హిందీ, పర్షియన్, ఉర్దూ యొక్క వివిధ మాండలికాలలో సాహిత్యం కూడా కనిపించడం ప్రారంభమైంది. 20వ శతాబ్దం ప్రారంభంలో, బెంగాలీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశపు మొట్టమొదటి నోబెల్ గ్రహీత అయ్యాడు. సమకాలీన భారతీయ సాహిత్యంలో, రెండు ప్రధాన సాహిత్య పురస్కారాలు ఉన్నాయి; ఇవి సాహిత్య అకాడమీ ఫెలోషిప్, జ్ఞానపీఠ్ అవార్డు. హిందీ, కన్నడ భాషలలో ఒక్కొక్కటి ఎనిమిది జ్ఞానపీఠ్ అవార్డులు, బెంగాలీలో ఐదు, ఒరియాలో నాలుగు, మలయాళంలో నాలుగు,, గుజరాతీ, మరాఠీ, ఉర్దూలో మూడు, అస్సామీ, తమిళం, తెలుగులో[5] ఒక్కోదానిలో రెండేసి ప్రదానం చేయబడ్డాయి.

ప్రాచీన భారతీయ భాషలలో భారతీయ సాహిత్యం

[మార్చు]

వైదిక సాహిత్యం

[మార్చు]

వైదిక సంస్కృతంలో వ్రాయబడిన హిందూధర్మ సాహిత్యం, ఉదాహరణకు వేదములు. ఇతర ఉదాహరణలు సుల్బ సూత్రాలు, ఇవి గణితశాస్త్ర విభాగమైన జియోమెట్రి లో ప్రథమ రచనలు.

సంస్కృత ఇతిహాస సాహిత్యం

[మార్చు]

వ్యాస మహర్షి రచించిన మహాభారతం, వాల్మీకి మహర్షి రచించిన రామాయణం ఇతిహాసాలు ప్రసిద్ధి. ఇవి సంస్కృతభాషలో రచింపబడిన సాహితీ అణిముత్యాలు.

క్లాసికల్ సంస్కృత సాహిత్యం

[మార్చు]

ప్రఖ్యాత రచయిత కాళిదాసు, రఘువంశం రచించాడు. దీనిని క్లాసికల్ సంస్కృతంలో రచించాడు. పాణిని, అష్టాధ్యాయి రచించాడు. దీనిలో వ్యాకరణ సిద్ధాంతాలను రచించాడు. హిందూ ధర్మశాస్త్రంలో మనుస్మృతి అతి ముఖ్యమైనది. కాలిదాసునికి, సంస్కృత సాహిత్యంలో ఘనమైన పేరున్నది. కాలిదాసుడు అభిజ్ఞాన శాకుంతలం రచించాడు,, మేఘదూత రచయిత. ఆంగ్ల సాహిత్యంలో షేక్స్ పియర్ ఎలాంటివాడో, కాళిదాసు సంస్కృతంలో అంతటివాడు. Shakespeare occupies in English literature. Some other famous plays were Mricchakatika by Shudraka, Svapna Vasavadattam by Bhasa, and Ratnavali by Sri Harsha. Later poetic works include Geeta Govinda by Jayadeva. Some other famous works are Chanakya's Arthashastra and Vatsyayana's Kamasutra.

ప్రాకృత సాహిత్యం

[మార్చు]

ప్రాకృత సాహిత్యంలో ప్రాకృతం, జైన ప్రాకృతం (అర్ధమఘది) పాళీ, మహారాష్ట్రి, శౌరసేని భాషలు ముఖ్యమైనవి.

ముఖ్యంగా మహారాష్ట్రి భాషా సాహిత్యంలోని హాలుని కవిత్వం, 3 నుండి 5 శతాబ్దాలకు చెందినా "గాహా సత్తసాయి"లు ప్రస్తావిమ్పదగినవి. కాలిదాసుడు , హర్షుడు కూడా మహారాష్ట్రి భాషను ఉపయోగించారు. జైనులైన శ్వేతాంబరులు మహారాష్ట్రి భాషను ఉపయోగించారు.

అశ్వఘోషుని అనేక రచనలు శౌరసేని భాషలో అనువాదాలయ్యాయి. Many of Aśvaghoṣa's plays were written in Shauraseni as were a sizable number of Jain works and Rajasekhara's Karpuramanjari. Canto 13 of the Bhaṭṭikāvya[3] is written in what is called "like the vernacular" (bhāṣāsama), that is, it can be read in two languages simultaneously: Prakrit and Sanskrit.[4]

పాలీ సాహిత్యం

[మార్చు]

భారతీయ భాషలలో భారతీయ సాహిత్యం

[మార్చు]

అస్సామీ సహిత్యం

[మార్చు]

బడగ సాహిత్యం

[మార్చు]

బెంగాలీ సాహిత్యం

[మార్చు]
Rabindranath Tagore, the author of India's antional anthem 'Jana Gana Mana' and the only nobel prize winner (Literature) in India.

భోజ్‌పురి సాహిత్యం

[మార్చు]

ఆంగ్ల సాహిత్యం

[మార్చు]

హిందీ సాహిత్యం

[మార్చు]

గుజరాతీ సాహిత్యం

[మార్చు]
Gandhi extensively wrote in Gujarati

కన్నడ సాహిత్యం

[మార్చు]
Kannada writer and Jnanpith Award winner for the year 1994, U. R. Ananthamurthy

కాశ్మీరీ సాహిత్యం

[మార్చు]

కొడవ సాహిత్యం

[మార్చు]

కొంకణి సాహిత్యం

[మార్చు]

మలయాళం సాహిత్యం

[మార్చు]

మణిపురి సాహిత్యం

[మార్చు]

మరాఠీ సాహిత్యం

[మార్చు]

మిజో సాహిత్యం

[మార్చు]

నేపాలీ సాహిత్యం

[మార్చు]

ఒరియా సాహిత్యం

[మార్చు]

పంజాబీ సాహిత్యం

[మార్చు]

రాజస్థానీ సాహిత్యం

[మార్చు]

సంస్కృత సాహిత్యం

[మార్చు]

సింధీ సాహిత్యం

[మార్చు]

తమిళ సాహిత్యం

[మార్చు]

తెలుగు సాహిత్యం

[మార్చు]

తెలుగు సాహిత్యమునకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ఆధ్యాత్మికములోనైనా, శృంగారాది నవరసములలోనైనా, జాతిని జాగృతం చేయు విషయంలోనైనా, తెలుగువారందరూ గర్వపడేటంత విశేషమై వెలుగొందుతున్నది తెలుగు సాహిత్యం. నన్నయ్య వ్రాసిన భారతము తెలుగులో మొదటి కావ్యము. అంతకు ముందే జానపద గీతాలు, కొన్ని పద్యాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. గాధా సప్తశతిలో తెలుగు జానపద గీతాల ప్రస్తావన ఉంది.

తుళు సాహిత్యం

[మార్చు]

ఉర్దూ సాహిత్యం

[మార్చు]

హిందీభాష మూలంగా గల ఉర్దూ భాష, అరబ్బీ, పర్షియన్, తుర్కీ, పోర్చుగీస్, ఆంగ్ల భాషా పదాలను కలిగిన మిశ్రమ భాష. ఉర్దూ సాహిత్యం ఉర్దూ నాలుగు శతాబ్దాలుగా సాహితీభాషగా విరాజిల్లుచున్నది. దీనికి మునుపు పర్షియన్, అరబ్బీ భాషాసాహిత్యాలు ప్రముఖంగా ఉపయోగపడేవి. ఉర్దూభాషా సాహిత్యం ప్రపంచ సాహిత్యంలో తనదంటూ ఒక స్థానం సంపాదించుకోగలిగినది.

విదేశీ భాషలలో భారతీయ సాహిత్యం

[మార్చు]

భారతీయ పర్షియన్ సాహిత్యం

[మార్చు]

ముస్లిం పాలన తొలికాలంలో పర్షియన్ భాష భారత ఉపఖండంలో ప్రధాన భాషగాను, రాజభాషగాను విరాజిల్లేది. ప్రభుత్వ భాషగాను, విద్యా-సాహితీభాష గాను వుండేది. ఆకాలంలో అనేక భారతీయులు పర్షియన్ సాహిత్యంలో ప్రావీణ్యం గడించారు. ముఖ్య ఉదాహరణలుగా అమీర్ ఖుస్రో, నవీన కాలపు కవి ముహమ్మద్ ఇక్బాల్ లు. ఆ కాలమో అనేక సంస్కృత రచనలు పర్షియన్ భాషలో అనువదింపబడ్డాయి., అలాగే అనేక పర్షియన్ రచనలు భారతీయ భాషలో అనువదింపబడ్డాయి. రామాయణ మహాభారతాలు, పంచతంత్ర కథలు, పర్షియన్ భాషలో అనువదింపబడ్డాయి. మొఘలుల కాలంలోనూ పర్షియన్ భాష రాజభాషగా వుండేది. ఆతరువాత భారతీయ భాష అయిన ఉర్దూ పర్షియన్ భాష స్థానాన్ని ఆక్రమించింది. బ్రిటిష్ కాలంలో పర్షియన్, ఉర్దూ సాహిత్యాలు అనేక భాషలలో తర్జుమాలు చేయబడ్డాయి. అలాగే భారతీయ భాషలలో గల సాహిత్యం పర్షియన్, ఉర్దూ భాషలలో తర్జుమాలు చేయబడ్డాయి. నేటికినీ పర్షియన్ భాష ప్రభావం ఉర్దూ, హిందీ భాషలపై కానవస్తుంది.

ఈశాన్య భారత సాహిత్యం

[మార్చు]

భారతదేశంలో జర్నలిజం

[మార్చు]

పాద పీఠికలు

[మార్చు]
  1. Narayanrao, H.L. "A Brief on Indian Literature and Languages". Journal of Education and Practice. 2 (3): 46. ISSN 2222-288X.
  2. "Kannada literature", Encyclopædia Britannica, 2008. Quote: "The earliest literary work is the Kavirajamarga (c. AD 450), a treatise on poetics based on a Sanskrit model."
  3. Fallon, Oliver. 2009. Bhatti's Poem: The Death of Rávana (Bhaṭṭikāvya). New York: Clay Sanskrit Library[1] Archived 2019-07-07 at the Wayback Machine. ISBN 978-0-8147-2778-2 | ISBN 0-8147-2778-6 |
  4. Narang, Satya Pal. 2003. An Analysis of the Prākṛta of Bhāśā-sama of the Bhaṭṭi-kāvya (Canto XII). In: Prof. Mahapatra G.N., Vanijyotih: Felicitation Volume, Utkal University, *Bhuvaneshwar.

బయటి లింకులు

[మార్చు]

Folklore and the Alternative Modernities