తెలుగు సాహిత్యము
![]() తెలుగు సాహిత్యం దేశభాషలందు తెలుగు లెస్స | |
---|---|
తెలుగు సాహిత్యం యుగ విభజన | |
నన్నయకు ముందు | క్రీ.శ. 1000 వరకు |
నన్నయ యుగము | 1000 - 1100 |
శివకవి యుగము | 1100 - 1225 |
తిక్కన యుగము | 1225 - 1320 |
ఎఱ్ఱన యుగము | 1320 – 1400 |
శ్రీనాధ యుగము | 1400 - 1500 |
రాయల యుగము | 1500 - 1600 |
దాక్షిణాత్య యుగము | 1600 - 1775 |
క్షీణ యుగము | 1775 - 1875 |
ఆధునిక యుగము | 1875 – 2000 |
21వ శతాబ్ది | 2000 తరువాత |
తెలుగు భాష తెలుగు లిపి ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా తెలుగు సాహితీకారుల జాబితాలు | |
తెలుగు సాహిత్యమునకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ఆధ్యాత్మికములోనైనా, శృంగారాది నవరసములలోనైనా, జాతిని జాగృతం చేయు విషయంలోనైనా, తెలుగువారందరూ గర్వపడేటంత విశేషమై వెలుగొందుతున్నది తెలుగు సాహిత్యం. నన్నయ్య వ్రాసిన భారతము తెలుగులో మొదటి కావ్యము. అంతకు ముందే జానపద గీతాలు, కొన్ని పద్యాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. గాథా సప్తశతి లో తెలుగు జానపద గీతాల ప్రస్తావన ఉంది.
చరిత్ర, యుగ విభజన[మార్చు]
కాలానుగుణ తెలుగు సాహితీ చరిత్ర కోసం తెలుగు సాహితీ చరిత్ర ను చూడండి.
తెలుగు సాహితీకారుల గురించిన మరిన్ని వివరముల కోసం తెలుగు సాహితీకారుల ను చూడండి.
తెలుగు సాహిత్య చరిత్రను కొన్ని యుగాలుగా విభజించ వచ్చును.
- ప్రాఙ్నన్నయ యుగము : క్రీ.శ. 1000 వరకు
- నన్నయ యుగము : 1000 - 1100
- శివకవి యుగము : 1100 - 1225
- తిక్కన యుగము : 1225 - 1320
- ఎఱ్ఱన యుగము : 1320 - 1400
- శ్రీనాధ యుగము : 1400 - 1500
- రాయల యుగము : 1500 - 1600
- దక్షిణాంధ్ర యుగము లేదా నాయకరాజుల యుగము : 1600 - 1775
- క్షీణ యుగము : 1775 - 1875
- ఆధునిక యుగము : 1875 నుండి
క్రీ.శ. 1000 వరకు - నన్నయకు ముందు కాలం[మార్చు]
11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగులోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కాని అది బహుశా గ్రంథస్తం కాలేదు. లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉంది. కాని మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. క్రీ.శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం. (వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది). అంతకు ముందు కాలానికి చెందిన అమరావతీ శాసనంలో నాగబు అనే పదం కనిపిస్తుంది.
1000 - 1100 : నన్నయ యుగము[మార్చు]
దీనిని "పురాణ యుగము" లేదా "భాషాంతరీకరణ యుగము" అని అంటారు. నన్నయ్య ఆది కవి. ఈయన మహా భారతాన్ని తెలుగులో వ్రాయ ప్రారంభించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని (అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని, ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించారు; తెలుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి, పండితులు పామరులు మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ,నారాయణులు యుగపురుషులు. వీరు తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒకసారి అయినా నన్నయ్య అడుగుజాడలను అనుసరించిన వారే. నన్నయ్య ఆది కవి.
1100 - 1225 : శివకవి యుగము[మార్చు]
నన్నయ తరువాతి కాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటు చేసుకొన్నాయి. వీరశైవం భక్తిమార్గం ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది.
1225 - 1320 : తిక్కన యుగము[మార్చు]
తిక్కన మహాభారతం లోని 15 పర్వాలను పూర్తి చేసాడు. దీని ద్వారా ఈయన గొప్ప కవి అయ్యరు.
1320 - 1400 : ఎఱ్ఱన యుగము[మార్చు]
ప్రధాన వ్యాసము: ఎఱ్ఱన యుగము
1320 నుండి 1400 వరకు ఎఱ్ఱన యుగము అంటారు. ఈ యగంలో ప్రబంధ రచనా విధానానికి పునాదులు పడ్డాయి. మహాభారతంలో అరణ్యపర్వశేషం తెనుగించబడింది. నన్నయ తిక్కనాదుల కాలములో చెల్లిన గ్రాంధిక, పౌరాణిక భాష ఈ యుగంలో ఆధునికతను సంతరించుకోసాగింది.
తిక్కన మరణానికి సుమారు 10 సంవత్సరాలముందు (1280 ప్రాంతంలో) ఎఱ్ఱన జన్మించి ఉంటాడు. ఎఱ్ఱన మరణం 1360లో జరిగి ఉండవచ్చును. 1365-1385 ప్రాంతంలో జన్మించిన శ్రీనాథుడు తరువాతి యుగకవిగా భావింపబడుతున్నాడు.
ఆంధ్ర వాఙ్మయంలో ఆఖ్యాన పద్ధతిని నన్నయ, నాటకీయ పద్ధతిని తిక్కన ప్రారంభించినట్లే వర్ణనాత్మక విధానానికి ఎఱ్ఱన ఆద్యుడు. నన్నయ యొక్క శబ్దగతిని, తిక్కన యొక్క భావగతిని అనుసంధించి క్రొత్త శైలిని కూర్చిన మహానుభావుడు ఎఱ్ఱన. తెలుగుభాష పలుకుబడి, వాక్య నిర్మాణము ఈ కాలంలో ఆధునికతను సంతరించుకొన్నాయి. శ్రీనాథుని వంటి అనంతరీకులు ముందుగా ఈ శైలినే అలవరచుకొని రచనలు సాగించారు.
1400 - 1500 : శ్రీనాథ యుగము[మార్చు]
తిక్కన (13వ శతాబ్ది), ఎర్రన (14వ శతాబ్దం)లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణాలు ఆధారంగా వ్రాయబడ్డాయి. అందువలననే ఈ కాలాన్ని పురాణ యుగము అంటారు.
ఈ కాలంలో సంస్కృతకావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. ప్రబంధము అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపుదిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాథుడు, పోతన, జక్కన, గౌరన పేరెన్నికగన్న కవులు. ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని శృంగార నైషధం, పోతన భాగవతం, జక్కన విక్రమార్క చరిత్ర, తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కల్యాణం మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు.
ఈ సందర్భంలో రామాయణము కవుల గురించి కూడా చెప్పకోవచ్చును. గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం మనకు అందిన మొదటి రామాయణం.
ఈ కాలాన్నే "మధ్యయుగం" అని కూడా అంటారు.
1500-1600 : రాయల యుగము[మార్చు]
దీనినే "ప్రబంధ యుగము" అని కూడా అంటారు. విజయనగర చారిత్రక శకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది. స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యదతో ప్రబంధం అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాలతో ఆయన ఆస్థానం శోభిల్లింది.
1600 - 1775 : దక్షిణాంధ్ర యుగము[మార్చు]
కర్ణాటక సంగీతపు ప్రముఖులు ఎంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితాలోనివే త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్య వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగునే ఎంచుకొన్నారు.
1775 - 1875 : క్షీణ యుగము There is no much information about this.[మార్చు]
1875 తరువాత - ఆధునిక యుగము[మార్చు]
1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో, షెల్లీ, కీట్స్, వర్డ్స్ వర్త్ వంటి ఆంగ్ల కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు భావకవిత్వం అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.
మొట్టమొదటి నవలగా పరిగణించబడుతున్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రముతో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), గిడుగు రామ్మూర్తి, కట్టమంచి రామలింగారెడ్డి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం), సురవరం ప్రతాపరెడ్డి మొదలైన తెలుగు సాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యావహారిక భాషను వాడడం, వ్యావహారిక భాషా వాదమునకు దారితీసింది.
తెలుగు సాహితీ చరిత్ర - ముఖ్యమైన ఘట్టాలు[మార్చు]
- స్త్రీల కోకిల కంఠములలో, కర్షక శ్రామికుల స్వేదంలో, జానపదుల సంతోషములలో, తెలుగువారి ఘనమైన పండుగలలో తెలుగు సాహితీ చరిత్ర మొదలయింది.
- తరువాత క్రీ.శ తొమ్మిదవ శతాబ్దం నుండి శిలా శాసనాలకు ఎక్కింది.
- క్రీ.శ పదకొండవ శతాబ్దములో ఆదికవి నన్నయ్య చేతిలో, ఆంధ్ర మహాభారతం రూపంలో ఆదికావ్య రచన మొదలయింది.
- ఈ ఆంధ్ర మహాభారతమును పద్నాలుగవ శతాబ్దాంతానికి తిక్కన, ఎర్రనలు పూర్తి చేసారు. ఈ ముగ్గురూ తెలుగు కవిత్రయము అని పేరుపొందినారు.
- పదనేనవ శతాబ్దంలో గోన బుద్ధారెడ్డి రామాయణమును తెలుగువారికి తెలుగులో అందించాడు.
- పదునేనవ శతాబ్దంలో బమ్మెర పోతనామాత్యుడు భాగవతమును తేట తెలుగులో రచించి, తెలుగువారిని ధన్యులను గావించాడు.
- పోతనకు సమకాలికుడైన శ్రీనాథ కవిసార్వభౌముడు తన ప్రబంధాలతో తెలుగుభాషకు ఎనలేని సేవ చేసాడు.
- పదహారవ శతాబ్దంలో విజయనగర శ్రీ కృష్ణదేవరాయల పాలనా కాలంలో తెలుగు వైభవంగా వెలిగింది. తెలుగు పండితులను పోషించుటే కాక స్వయంగా తాను కూడా తెలుగులో రచనలు చేసిన సవ్యసాచి, రాయలు.
- పదిహేనవ శతాబ్దంలో ప్రారంభమైన ప్రబంధ యుగము తరువాత రెండు శతాబ్దాలు తెలుగు సాహితీ జగత్తును ఏలింది
- పదకవితా పితామహుడైన అన్నమయ్య తిరుపతి వేంకటేశ్వరునిపై రచించి, పాడిన ముప్పైరెండువేల పద్యాలు ఓ ప్రత్యేక సాహితీ భాండాగారం.
- క్షేత్రయ్య, త్యాగరాజు, భద్రాచల రామదాసు వ్రాసిన కీర్తనలు నేటికీ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాయి. త్యాగరాజ కీర్తనలు కర్ణాటక సంగీతానికి ఆయువుపట్టు వంటివి.
- తెలుగు భాషకు బ్రౌను చేసిన సేవలు బహు శ్లాఘనీయమైనవి. "ప్రపంచంలోని తెలుగు ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ సంస్థలు అన్నీ కలిసి తెలుగు భాషకు చేసిన సేవ, బ్రౌను ఒక్కడే చేసిన సేవలో ఓ చిన్న భాగం కూడా కాదు" అంటారు.
- ఆధునిక యుగంలోని గురజాడ అప్పారావు, వాడుక భాషా ఉద్యమనేతలు, శ్రీశ్రీ, ఇంకా ఎందరో మహానుభావులు వివిధ సాహితీ ప్రక్రియల ద్వారా తెలుగు భాషను సుసంపన్నం చేసారు, చేస్తున్నారు.
తెలుగు సాహిత్యంలో ముస్లిం కవులు రచయితలు[మార్చు]
తెలుగు సాహిత్యంలో ముప్ఫైకి పైగా శతకాలను ముస్లిం కవులు రాశారు.భక్తి, నీతి, తాత్విక, ప్రబోధాత్మక సాహిత్యంలో ముస్లిం కవులు శతకాలు రాశారు.తెలుగుముస్లిం కవులు రాసిన కొన్ని శతకాలు ;
- ముహమ్మద్ హుస్సేన్
భక్త కల్పద్రుమ శతకం (1949) మొక్కపాటి శ్రీరామశాస్త్రితో కలసి రాసిన శతకం సుమాంజలి. హరిహరనాథ శతకము అనుగుబాల నీతి శతకము తెనుగుబాల శతకము
- మాతృదేవి యొకటి,మాతృభూమి యొకండు
- మాతృ భాష యొండు మాన్యము గదా
- మాతృ శబ్దము విన మది పులకింపదా?
- వినుత ధర్మశీల తెనుగు బాల"
- షేక్ దావూద్
1963లో రసూల్ ప్రభు శతకము అల్లా మాలిక్ శతకము
- సయ్యద్ ముహమ్మద్ అజమ్
సయ్యదయ్యమాట సత్యమయ్య సూక్తి శతకము
- ముహమ్మద్ యార్
సోదర సూక్తులు
- గంగన్నవల్లి హుస్సేన్‌దాసు
హుస్సేన్‌దాసు శతకము-ధర్మగుణవర్య శ్రీ హుసేన్ దాసవర్య
- హాజీ ముహమ్మద్ జైనుల్ అబెదీన్
ప్రవక్త సూక్తి శతకము,భయ్యా శతకము
- తక్కల్లపల్లి పాపాసాహెబ్
వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ బెండ్లియాడి మతమభేదమనియె హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల? పాపసాబు మాట పైడిమూట
- షేక్ ఖాసిం
సాధుశీల శతకము కులము మతముగాదు గుణము ప్రధానంబు దైవచింత లేమి తపముగాదు, బాలయోగి కులము పంచమ కులమయా, సాధులోకపాల సత్యశీల
- షేక్ అలీ
గురుని మాట యశము గూర్చుబాట అనే మకుటంతో 'గురుని మాట' శతకం మానస ప్రబోధము శతకం
- ఇంగిలీసు బాస ఎంతగ నేర్చిన
- పాండితీ ప్రకర్ష పట్టుబడదు
- పరులభాష గాన భాధను గూర్చును
- గురుని మాట యశము గూర్చు బాట
- దేశ భాషలెల్ల దీక్ష వహించి నీ
- వభ్యసించ వలయు నర్భకుండ
- మాతృ భాష నేర్చి మర్యాదలందుమా
- గురుని మాట యశము గూర్చు బాట
- షేక్ రసూల్
మిత్రబోధామృతము అనే శతకం
బ్రహ్మ విద్యా విలాసము.
- "తెలుగు సాహిత్యం-1984 వరకు ముస్లిముల సేవ" అనే సిద్ధాంతవ్యాసానికి అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యుడు షేక్ మస్తాన్ గారికి 1991 లో నాగార్జున యూనివర్శిటీ లో పి.హెచ్.డి వచ్చింది.
- ఉర్దూ మాతృభాషగా గల ఎందరో ముస్లిములు కూడా తెలుగు సాహిత్యాన్ని ఉత్పత్తి చేశారు.
- సయ్యద్ నశీర్ అహ్మద్ "అక్షర శిల్పులు" పేరుతో 333 మంది తెలుగు ముస్లిం కవులు,రచయితల వివరాలతో 2010 లో పుస్తకం ప్రచురించారు.
- సయ్యద్ సలీం నవల "కాలుతున్న పూలతోట"కు 2010 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
- వేంపల్లె షరీఫ్ కథలపుస్తకం "జుమ్మా''కు కేంద్రసాహిత్య అకాడెమి యువ పురస్కారం లభించింది.
స్వాతంత్రానికి పూర్వం ముస్లిములు నడిపిన తెలుగు పత్రికలు[మార్చు]
- 1842-"వర్తమాన తరంగిణి "వార పత్రిక ---1842 జూన్ 8 న సయ్యద్ రహమతుల్లా మద్రాసు.సయ్యద్ రహమతుల్లా తెలుగు పత్రికా రంగంలో అడుగు పెట్టిన తొలి ముస్లిం.మొదటి పత్రికలో ఆయన రాసిన మాటలు:"మేము మిక్కిలి ధనవంతులము కాము.ఆంధ్ర భాశ్హ యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము.హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిశ్హ్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ఉదయింపజేయడమునకు కారకులమైతిమి"
- 1891-"విద్వన్మనోహారిణి "—మీర్ షుజాయత్ అలీ ఖాన్,నరసాపురం.తరువాత ఈ పత్రిక వీరేశ లింగం గారు నడిపిన "వివేకవర్ధని " లో కలిసిపోయింది.
- 1892 -- "సత్యాన్వేషిణి "—బజులుల్లా సాహెబ్,రాజమండ్రి.
- 1909 --"ఆరోగ్య ప్రబోధిని " షేక్ అహ్మద్ సాహెబ్,రాజమండ్రి.
- 1944 -- "మీజాన్ " దినపత్రిక -- కలకత్తావాలా,హైదరాబాదు.అడవి బాపిరాజు సంపాదకుడు.
తెలుగు సాహితీ పద్దతులు[మార్చు]
తెలుగుసాహిత్యములో ప్రపంచ సాహిత్యము లో వలెనే వివిధ రకరకాలైన పద్ధతులు ఉన్నాయి. ముఖ్యముగా ఈ క్రింది విషయములు చెప్పుకొనవచ్చు.
- జానపద సాహిత్యము
- వచన కవితా సాహిత్యము
- పద కవితా సాహిత్యము
- పద్య కవితా సాహిత్యము
- చంపూ సాహిత్యము
- శతక సాహిత్యము
- నవలా సాహిత్యము
- చిన్న కథలు
- అవధానములు
- ఆశుకవిత
- సినిమా సాహిత్యము
ప్రముఖ కావ్యాలు[మార్చు]
తెలుగులో వివిధ సాహిత్య రీతుల్లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎన్నో కావ్యాలు వచ్చాయి. వాటి వివరాలు ఇక్కడ చూడండి.
ప్రస్తుత పరిస్థితి, ఓ అవలోకనం[మార్చు]
ప్రస్తుతము విప్లవ సాహిత్యము, అవధానములు, ఇంటర్నెట్టు తెలుగు సాహిత్యము, వివిధ ఇజములుకు చెందిన సాహిత్యములు, నవలలు,టీ. వీ. సాహిత్యము, సినీ సాహిత్యము, రీ మిక్సులు, చిన్న కథలు వంటివి తెలుగు సాహిత్య ముఖ చిత్రాన్ని చాలా వరకు పూర్తి చేస్తున్నాయి
భారతదేశ సాహిత్యంలో తెలుగు సాహిత్యపు స్థానం[మార్చు]
ప్రపంచ సాహిత్యంలో తెలుగు సాహిత్యపు స్థానం[మార్చు]
ఉపభాగములు[మార్చు]
ఇవి కూడా చూడండి[మార్చు]
వనరులు[మార్చు]
చరిత్ర[మార్చు]
- కాళ్ళకూరు వెంకటనారాయణరావు - ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము (1936) - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
- పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
- దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - ప్రచురణ : ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు (1961) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
- ద్వా.నా. శాస్త్రి - తెలుగు సాహిత్య చరిత్ర - ప్రచురణ : ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)
- ఆరుద్ర - సమగ్రాంధ్ర సాహిత్యం
ప్రక్రియలు[మార్చు]
విమర్శ[మార్చు]
విమర్శ ఒక సాహిత్య పక్రియ.ఈ ప్రక్రియ సర్వ స్వతంత్రమైనది. వచన రచన పక్రియ కాదు. ఏదో ఒక సృజనాత్మక సాహిత్య పక్రియ ఆధారం లేకుండా విమర్శ ఉండదు.
సంకలనాలు[మార్చు]
ఇతరాలు[మార్చు]
మూలాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]