నాగబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది శాసనాల్లో గుర్తించబడిన మొదటి తెలుగు పదము. దీనిని శాసనములలో కనుక్కున్నారు. ఇవి సుమారు సా.శ.పూ. 2వ శతాబ్దం నుండి సా.శ. 2వ శతాబ్దినాటి బ్రాహ్మీ లిపి అక్షరములు. శాసనంలో ఉన్న ఈ పదాన్ని ఒక శిల్పకారుని పేరుగా ఊహించిరి.[1] అది పాళీ భాషా పదంగా ఊహించినా ఆ భాషలో ఇలాంటి పదం లేదు. తరువాత పరిశోధకులు దీనిని మొదటి తెలుగు భాషా పదంగా గుర్తించారు.[2] అమరావతిలోని ఒక స్తూపం మీద ‘నాగబు’ అనే పదం ఉంది. శాసనాల్లో తొలి తెలుగు పదం అదే అని పలువురు భాషా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ పదం ఉన్న రాతిబండ అమరావతి స్తూపం దిబ్బలలో దొరికింది. ఇది ఒక వ్యక్తి పేరు. పురాతత్వ పండితులు కొందరు దీనిని "నాగ - బు" అని పద విభాగం చేసి, రెండూ వేరువేరు పాలీబాషా పదాలని భ్రాంతిపడ్డారు. కానీ శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఇది తెలుగు పదమని, నాగబు అనేది తెనుగు ప్రథమావిభక్తి ప్రత్యాయంతో ఉన్న నాగ అనే తత్సమ పదమని, నాగంబు నాగము అనే నేటి రూపాల పూర్వ స్వరుపమని సకారణంగా నిరూపించారు.[3] నాగబు అంటే నాగము లేదా పాము అని అర్థం.

మూలాలు[మార్చు]

  1. "The Arrow Sign in the Indus Script 3". Harappa.com. Nagabu: Prob. name of a stone mason. On a granite pillar in the Amaravati Stupa. Dated variously between 2nd cent. B.C.E. and 2nd cent. CE
  2. Kasinathuni Nageswara Rao (1928-06-01). Bharathi Magazine భారతి Volume 5 Issue 6 (in Telugu).{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  3. "ప్రాచీనాంధ్రశాసనములు, శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి, భారతి మాస పత్రిక, జూన్ 1928".
"https://te.wikipedia.org/w/index.php?title=నాగబు&oldid=3880068" నుండి వెలికితీశారు