భారతదేశ విభజన

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మూస:Colonial India భారతదేశ విభజన (హిందుస్తానీہندوستان کی تقسیم: हिन्दुस्तान की तक़्सीम, ہندوستان کی تقسیم హిందూస్తాన్ కి తక్లిం ) అనేవి బ్రటిష్ ఇండియా ను మత,భౌగోళిక పరంగా ఆగస్టు 14 ,1947 తేదిన వరుసగా డొమినియన్ అఫ్ పాక్సిస్తాన్ ( ఆ తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్ అఫ్ పాకిస్తాన్ మరియు పీపుల్స్ రిపబ్లిక్ అఫ్ బంగ్లాదేశ్ గా మారినవి)మరియు ది సేకులర్ యునియన్ అఫ్ ఇండియా ( ఆ తర్వాత రిపబ్లిక్ అఫ్ ఇండియా గా మారినది) సార్వభౌమ రాస్ష్ట్రాలు అనుసరించి విభజన కు దారి తీసిన పరిస్థితి.

ఈ విభజన అనే దానిని భారత స్వాతంత్ర్య చట్టం 1947 లో తొలగించబడినది మరియు బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్ ను రద్దు చేయబడినది. ఈ చీలిక పర్యవసానంగా,బ్రిటిష్ భారత సామ్రాజ్యము దాదాపు 12.5 మిలియన్ల ప్రజలు నిర్వాసితులుకాగా , కొన్ని వందల, వేల మిలియన్ల[1] నష్టం వాటిల్లినది.

ఈ విభజన వలన భూ భౌతిక పరిస్తితులననుసరించి, బ్రిటిష్ భారత దేశం లోని బెంగాల్ ప్రాంతాన్ని తూర్పు పాకిస్తాన్ మరియు పశ్చిమ బెంగాల్ (భారతదేశం) గా మారినవి. అదే విధంగా పంజాబ్ ప్రాంతం పశ్చిమ పంజాబ్ (ఆ తర్వాత పాకిస్తానీ పంజాబ్ మరియు ఇస్లామాబాద్ రాజధానిగా గల పాలిత ప్రాంతం )గాను మరియు తూర్పు పంజాబ్ (ఆ తర్వాత ఇండియన్ పంజాబ్, హర్యానా,మరియు హిమాచల్ ప్రదేశ్ )గా విభజించబడినవి. ఈ విభజన ఒప్పందం ప్రకారం రాష్ట్ర ఆస్తుల విభజన లో భాగంగా బ్రిటిష్ భారత సైన్యం ,ది ఇండియన్ సివిల్ సర్వీసు మరియు ఇతర పరిపాలిక సేవలు,భారతీయ రైల్వేస్ మరియు కేంద్ర ధనాగారం లు ఉంటాయి.

విభజన తర్వాత పర్యవసానంగా, భారతీయ స్వాతంత్ర్య చట్టం 1947 ప్రకారం రాచరికపు రాష్ట్రాలు భారతదేశంలో కలవాలా లేక పాకిస్తాన్ లో కలవాలా లేదా స్వతంత్రం గా ఉండిపోవాల[2], లేదా అన్ని కలసి ఒక సరికొత్త సామ్రాజ్యాలు గా ఉండాలా అనేది ప్రస్తావించలేదు. ఈ ప్రశ్న పరంగా జమ్మూ కాశ్మిర్ లో తలెత్తిన ప్రస్తాపన 1947 లో భారత పాకిస్తాన్ యుద్ధానికి మరియు ఇతర యుద్దాలకు మరియు భారతదేశం పాకిస్తాన్UNIQ--nowiki-00000007-QINU3UNIQ--nowiki-00000008-QINU మధ్య జటిల సమస్య లకు దారి తీసినది.

పాకిస్తాన్ మరియు భారతదేశం[మార్చు]

ఆగస్టు 15 ,1947లో అర్ధరాత్రి చట్టపరంగా రెండు ప్రజా సత్టాక రాజ్యాలు వెలిశాయి. ఆ ముందు రోజున , ఆప్పటి కొత్త పాకిస్తాన్ దేశపు రాజధానిగా ఉన్న కరాచిలో అధికార బదలాయింపు సంభందించిన కార్యక్రమాలు జరిగినవి. తద్వారా అప్పటి చివరి బ్రిటిష్ రాజప్రతినిధి , బర్మాకు చెందిన లార్డ్ మౌంట్ బాటన్ కరాచి లోను మరియు ఢిల్లీలో జరిగిన కార్యక్రమాలకు హాజరు కావడానికి వీలైనది. కానీ ఇందుకు మరో కారణం, భారత్ నుండి విడిపోతున్న పాకిస్తాన్ కు భారత్ సార్వభౌమత్వంలో పాలు పంచుకోవడం ఇష్టం లేకపోవడమే. అందుచేతనే పాకిస్తాన్ ఆగస్టు 14న స్వాతంత్ర్యదినోత్సవం జరుపుకోగా, భారతదేశం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటుంది.

ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడానికి మరో కారణం, విభజన[ఆధారం కోరబడింది] తర్వాత పాకిస్తాన్ తన సరికొత్త కాలమానమును అమలు చేయడమే. పశ్చిమ పాకిస్తాన్ (నవీన పాకిస్తాన్) యొక్క సరికొత్త కాలమానము, భారత కాలమానము కన్నా 30 నిమిషాలు ఆలస్యంగా ఉంటుంది మరియు తూర్పు పాకిస్తాన్ (నవీన బంగ్లా దేశ్) యొక్క ప్రామాణిక కాలం భారతీయ ప్రామాణిక కాలం కన్నా 30 నిమిషాల ముందు ఉంటుంది. సాంకేతికంగా మాట్లాడుకుంటే ఆగస్టు 14 మరియు 15 మధ్య అర్ధ రాత్రి భారత దేశం స్వ్సతంత్రం పొందినప్పటికీ పశ్చిమ పాకిస్తాన్లో సమయం 11.30 pm మాత్రమే.

నేపథ్యం[మార్చు]

19 శతాబ్దపు అంతం లోను మరియు 20 శతాబ్ది ప్రారంభం[మార్చు]

దస్త్రం:Send-off-delhi1947.jpg
పాకిస్తాన్ కు వెళ్ళే రైలుకు హార్దిక వీడ్కోలు ఇవ్వబడుటకొత్త డిల్లి రైల్వే స్టేషను,1947

ది అల్ ఇండియా ముస్లిం లీగ్ (AMIL) 1906లో ఢాకా నందు, హిందువుల మెజారిటీ గల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పట్ల నమ్మకం లేని ముస్లీములచే స్థాపించబడినది. హిందూ సభ్యులతో సమానంగా ముస్లిం సభ్యులకు హక్కులు ఇవ్వలేదని వీరు ఫిర్యాదు చేశారు. పర్యవసానంగా వివిధ సమయాల్లో వివిధ రకాలైన పరిస్థితులు తలెత్తినవి. మొట్ట మొదటిగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను రచయిత/వేదాంతి అయిన అల్లమ ఇక్బాల్ లేవనెత్తాడు. ఇతను 1930లో జరిగిన ముస్లీం లీగ్ సమావేశంలో, హిందువులు ప్రభలంగా ఉన్న భారత ఉపఖండంలో ముస్లీంలకు ప్రత్యేక రాష్ట్రం ఖచ్చితంగా అవసరమని డిమాండ్ చేసాడు.

ది సింద్ అసెంబ్లీ 1935 దీనిని ఒక డిమాండ్ గా చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించినది. ఇక్బాల్ జౌహర్ మరియు ఇతరులు కలిసి ,అప్పటివరకు హిందూ ముస్లిం ఐక్యత కోసం పని చేసిన, మొహమ్మద్ ఆలి జిన్నాను తమ కొత్త దేశానికి నాయకత్వం వహించేలా ఒప్పించడంలో చాలా శ్రమించారు. 1930 నుండి సమైక్య భారతదేశంలోని అల్ప సంఖ్యాక వర్గాల స్థితిగతుల గురింఛి, వారిలోని నిరాసక్తతను తొలగించడానికి జిన్నా ప్రయత్నం ప్రాభించాడు. ప్రధాన పార్టీ ఇయిన కాంగ్రెస్ లో తనూ ఒకప్పటి సభ్యుడు అయినందున ముస్లిం వారి ఆకాంక్షల గురించి వాదించడం మొదలుపెట్టాడు.

1932 కమ్మ్యూనల్ అవార్డు ప్రవేసపెట్టడంతో హిందూ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోని ముస్లిముల మనుగడకు ముస్లిం లీగ్ కు జిన్నా నాయకత్వంతో ముప్పు వాటిల్లనున్నదన్న విష్యం ప్రభలంగా వినిపించినది. కానీ 1937లో జరిగిన ప్రాంతీయ ఎన్నికలలో కన్సర్వేటివ్ మరియు స్థానిక శక్తులతో లీగ్ విజయవంతం కాలేకపోయినది. చిత్రశ్రేణి (గ్యాలరీ) చిత్రం: బ్రిటిష్ భారతీయ సామ్రాజ్య మతాలు 3.jpg (1909 లో ఉన్న ఎక్కవ భాగం వివిధ జిల్లాలోని మతాలు,బ్రిటిష్ ఇండియా ఎంపైర్ మ్యాప్. చిత్రం:ముస్లిం శాతం 1909 .jpg (1909 నాటి ముస్లిముల శాతం. చిత్రం:హిందూ శాతం 1909 .jpg (1909 లో హిందువుల శాతం) చిత్రం: సిక్కులు భౌద్ధులు జైనుల శాతం 1909.jpg|1909 లో బుద్దిస్తుల ,సిక్కుల, మరియు జైనుల శాతం. చిత్రం :వాడుకల ఉన్న బాషలు 1909 jpg (1909 లో ఉన్న ఆర్యన్ భాషలు (ఉత్తర ప్రాంతము) Image:జనాభా సాంద్రత1909.jpg |1909 లో జనసాంద్రత

దస్త్రం:Akhand Bharat.jpg
అఖండ భారత దేశం

చిత్రశ్రేణి (గ్యాలరీ)

1932–1942[మార్చు]

1940 లాహోర్ సమావేశంలో ముస్లిములకు ప్రత్యేక దేశం కావాలాన్నట్లు జిన్నా ఒక సందేశం ఇచ్చాడు. కానీ ఈ సందేశం అస్పష్టం గాను మరియు అసంబద్దంగా ఉండడంతో, ముస్లింలలో ప్రాంతీయ ఆలోచనను రేకేత్తించలేదు. ఈ ఆలోచన ముస్లిముల మనసులో నాటుకున్నా, ఆ తర్వాతి ఏడు సంవత్సరాల కాలంలో, ఒక ముస్లిం ప్రాంతీయ వాదానికి పునాది వేసింది. ఖక్సర్ తెహ్రిక్ అఫ్ అల్లామా మష్రికి తో సహా అన్నీ ముస్లిం రాజకీయ పార్టీలు భారతదేశపు[4] విభజనను వ్యతిరేకించాయి. 1940 మార్చ్ 19న మష్రికి ఖైదు చేయబడ్డాడు.

హిందూ మహాసభలాంటి హిందూ సంస్థలు, దేశ విభజనకు వ్యతిరేకం అయినా కూడా, హిందూ ముస్లిముల మధ్య విభేదాలను పురిగోలిపేవి[ఆధారం కోరబడినది]. 1937లో అహమ్మదాబాదులో జరిగిన హిందూ మహాసభల 19 సమ్మేళనంలో వీర్ సావర్కర్ ఈ విషయాన్ని నొక్కి చెప్పాడు[5].

India cannot be assumed today to be Unitarian and homogeneous nation, but on the contrary there are two nations in the main — the Hindus and the Muslims.
దస్త్రం:Oxcart-train1947.jpg
గ్రామిఇన సిక్కులు ఒక ఎద్దుల బండి లో భారత దేశం వైపు వెళ్ళడం.1947. మార్గరెట్ బౌర్కే=వైట్
దస్త్రం:Old-sikh-man-carrying-wife1947.jpg
ఒక వృద్ద సిక్కు వ్యక్తీ తన భార్యను మోసుకేల్లడం.10 మిలియన్ ప్రజలకు పైగా తమ మాతృభూమి నుండి నిరాశ్రయులై ,కాలినడకన,ఎద్దులబండ్లలో,మరియు రైళ్ళలో తమకు వాగ్దానం చేసిన నివాసాలకు ప్రయాణించారు.

ఎక్కువ మంది కాంగ్రెస్ నాయకులందరూ లౌకికవాదులు[ఆధారం కోరబడినది] మరియు మతపరంగా దేశాన్ని విభజించడం తీవ్రంగా వ్యతిరేకించారు. హిందూ మరియు ముస్లిములు కలిసి శాంతియుతంగా నివసించగలరని మరియు నివసిస్తారని మొహన్దాస్ గాంధిమరియు అల్లామా మష్రిక్ గట్టిగా నమ్మారు. దేశ విభజనను వ్యతిరేకిస్తూ గాంధి ఇలా అన్నారు:

My whole soul rebels against the idea that Hinduism and Islam represent two antagonistic cultures and doctrines. To assent to such a doctrine is for me a denial of God.

గాంధీ మరియు అతని అనుయాయులు కాంగ్రేస్ పార్టీలో(ముస్లీం ఔత్సాహికులు 1930 నుండి బయటకు వెళ్ళడం ప్రారంభించారు) ముస్లీములను ఉంచాలని ఎన్నో సంవత్సరాలుగా కృషి చేసారు. ఈ ప్రక్రియలో హిందూ జాతీయ వాదులకు, మరియు ముస్లిం జాతీయవాదులకు ఘర్షణలు తలెత్తాయి. (హిందూ జాతీయవాది నాధూరాం గాడ్సేచే గాంధి హత్య గావించబడ్డాడు. హిందువుల పేరిట ముస్లీములను గాంధి సమర్ధిస్తున్నాడని గాడ్సే నమ్మాడు.

రెండువైపులా రాజకీయనాయకులు మరియు మతపెద్దలు తమ పరస్పర సందీహాలను మరియు భయాలను వ్యక్తం చేసారు. ముస్లీం లీగ్ వారి డైరెక్ట్ యాక్షన్ డే 1948 కలకత్తాలో, ఐదు వేలకు పైగా ప్రజలు చంపబదడమే గాక పెక్కు మంది గాయపడ్డారని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. ఉత్తరాంధ్ర మరియు బెంగాల్ లో నిరసన పెల్లుబుకగా ప్రజా యుద్ధం ఆపేందుకు ప్రాంతాల వారీగా విభజన ఒక్కటే మార్గమని ఒత్తిడి పెరగడం ప్రారంభమైనది.

1942–1946[మార్చు]

దస్త్రం:Mountbatten 4 august 1947.jpg
బర్మా కుచెందిన రాజ ప్రతినిధి లార్డ్ మౌంట్ బాటన్ కౌంట్ డౌన్ క్యాలెండర్ తో అధికార బదిలీ కి సిద్దం గా ఉన్న చిత్రం

1946 వరకు లీగ్ డిమాండ్ చేసిన పాకిస్తాన్ అనే పదానికి నిర్వచనం చాలా అనువైనది. ఎలాగంటే పాకిస్తాన్ ఒక సార్వభౌమ దేశంగా చెప్పుకోగలిగినది లేదా సంయుక్త భారతదేశపు సభ్య దేశంగా పిలుచుకోవచ్చు.

ముస్లీములు ప్రభలంగా ఉన్న పడమటి ప్రాంతాలలో హిందూ ప్రాభల్యం గల కేంద్రాల కన్నా[6] ఎక్కువ స్వాతంత్ర్య్యం ముస్లీములకు కల్పించడానికి విభజన అనేది, బేరసారలాడటానికి ఒక ఆయుధంగా, జిన్నా ఉపయోగించుకున్నాడని చరిత్రకారులు నమ్ముతారు.

పాకిస్తాన్ లోకి పొడిగించబడిన భారతదేశపు హిందూ ఆధిక్యత ప్రాంతాలకుగాను, తూర్పు పంజాబ్ మరియు పశ్చిమ బెంగాల్, అస్సాంలతో సహా పాకిస్తాన్ లో కలపాలని డిమాండ్ చేయాలని జిన్నా అసలైన ఆలోచన అని ఇతర చరిత్రకారులు చెపుతుంటారు. ముస్లీములు ఎక్కువ భాగం కలిగి, హిందూ పాలకులు పాలిస్తున్న కాశ్మీర్ ను కూడా పాకిస్తాన్ లో కలుపుకోవాలని మరియు హిందూ మెజారిటీ రాష్ట్రాలై ఉండి[ఆధారం కోరబడింది]ముస్లిం పాలకులు గల హైదరబాద్ మరియు జునాగడ్ లను కూడా పొందాలని జిన్నా ఏంతో పోరాటం సాగించాడు.

భారతదేశ సంతతిని బ్రిటిష్ వారు నేరుగా పరిపాలించలేదు. ఇందుకు గాను వివిధ రకాలైన పలు రాజకీయ ఏర్పాట్లు అమలులో ఉండేవి. ప్రాంతాలను నేరుగ ఆంగ్లేయులు పరిపాలిచుట మరియు రాచరికపు రాష్ట్రాలలో చట్టబద్దమైన సామంత ప్రభుత్వాలను నడిపేవారు.

ది బ్రిటిష్ కలోనియల్ అడ్మినిస్ట్రేషన్ నందు భారతదేశపు రాష్ట్ర కార్యదర్శి, భారతదేశపు కార్యాలయము,ది గవర్నర్ జనరల్ అఫ్ ఇండియా మరియు ఇండియన్ సివిల్ సర్వీస్ లు ఉండేవి ఆయా ప్రాంతాన్ని సమైక్యం గా ఉంచడానికి బ్రిటిష్ ఇష్టపడేది. కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ ల మధ్య సయోధ్యత కుదర్చడానికి ప్రయత్నించుటకు 1946లో క్యాబినెట్ మిషన్ పంపబడినది. రాష్ట్రాలను వికేంద్రీకరించి, స్థానిక ప్రభుత్వాలకు అధిక అధికారాన్ని ఇవ్వడమనేది ప్రాధమికంగా ఆమోదం పొందబడినది. రాష్ట్ర వికేంద్రీకరణకు నెహ్రు ఒప్పుకోకపోగా జిన్నా స్వతంత్ర పాకిస్తాన్[7] కావాలని డిమాండ్ చేయడం ప్రారంభించాడు.

భారతీయ రాజకీయ పార్టీలు

భారతదేశ విభజన 1947[మార్చు]

మౌంట్ బాటన్ ప్లాన్[మార్చు]

రెండు దేశాల మధ్య అసలైన విభజన 3 జోన్ ప్లాన్ లేదా మౌంట్ బాటన్ ప్లాన్ అనే దాని ప్రకారం జరిగినది.

భారత పాకిస్తాన్ల మధ్య సరిహద్దు ఆంగ్లేయుల ప్రభుత్వంచే నిర్నయించబడినది. దీని అమలు రిపోర్ట్ ను రాడ్ క్లిఫ్ఫ్ లైనే అని పిలువబడేది. దీనికి కారణం లండన్ లో పేరొందిన న్యాయవాది సర్ సిరిల్ రాడ్ క్లిఫ్ఫ్ చే రచించబడినది. రెండు వివిధ ప్రాంతాలను కలిపి పాకిస్తాన్ ఆవిర్భవించినది. తూర్పు పాకిస్తాన్ (నేడు బాంగ్లా దేశ్) మరియు పశ్చిమ పాకిస్తాన్లు బౌగోళికంగా ఇండియాచే వేరు చేయబడినవి. ఎక్కువ భాగం హిందూ మతాలతో ఇండియా ఆవిర్భవించగా ఎక్కువ భాగం ముస్లీముల ప్రాంతాలతో పాకిస్తాన్ ఆవిర్భవించినది.

ఆధునిక భారత ఉప ఖండం లోని దేశాలు.

జూలై 18, 1947 న బ్రిటిష్ పార్లమెంట్ భారత స్వాతంత్ర్య్య చట్టంను జారీ చేసి దేశ విభజన ఏర్పాటును ఖారారు చేసినది. రెండు దేశాలకు చట్టబద్దత కల్పించడానికి భారత ప్రభుత్వ చట్టం1947 అమలు లోనికి వచ్చినది. దేశ విభజన తర్వాత,ఐక్య రాజ్యాల నందు పాకిస్తాన్ ఒక సభ్య దేశంగా చేర్చుకోబడినది. హిందూ రాష్ట్రాలు అన్నింటిని కలిపి ఒకే సమూహంగా భారతదేశం/0} అనే పేరు ఏర్పడినది. తద్వారా అప్పటి వరకు బ్రిటిష్ భారతదేశం (ఐక్య రాజ్యాలలో 1945 నుండి సభ్యత్వం కలదు) పేరు ఇండియా వారసత్వ దేశం UNIQ--nowiki-00000018-QINU8UNIQ--nowiki-00000019-QINU గా చోటుచేసుకున్నది.

అప్పటి 625 రాచరికపు రాష్ట్రాలకుఏ దేశంలో చేరాలో అనే నిర్ణయాన్ని వారికే వదిలివేయబడినది.

విభజన యొక్క భౌగోళిక స్వరూపం: ది రాద్క్లిఫ్ఫ్ లైన్[మార్చు]

ది పంజాబ్ : సింధు నదికి తూర్పున గల జీలం,చీనాబ్ ,రావి ,బియాస్ మరియు సట్లేజ్ ఇదు నదుల ప్రాంతం. దీనిని పరివాహక ప్రాంతం లేదా రెండు జీవనదుల మధ్య ప్రాంతంగా చెప్పుకోవచ్చు. అవి ఏవనగా సింద్ - సాగర్ పరివాహక ప్రాంతం (సింధు మరియు జీలం నదుల మధ్య ప్రాంతం) ది జక్ పరివాహక ప్రాంతం (జీలం/చీనాబ్), ది రేచన పరివాహక ప్రాంతం (చీనాబ్/రావి ) ది బరీ పరివాహక ప్రాంతం (రావి/బియాస్ ) మరియు ది బిస్ట్ పరివాహక ప్రాంతము (బియాస్/సట్లేజ్ )(పటాన్ని చూడండి) 1947 సంవత్సరం ప్రారంభపు నెలల్లో జరిగిన పంజాబ్ సరిహద్దు కమిషన్ చర్చలలో ప్రధానంగా వివాదాస్పదమైన ప్రాంతాలు బరీ మరియు బిస్ట్ పరివాహక ప్రాంతాలు అని తెలుస్తుంది. అయినప్పటికీ, రేచన పరివాహక ప్రాంతాన్ని కాంగ్రెస్ మరియు సిక్కులు కావాలని కోరారు. బరీ పరివాహక ప్రాంతంలోని గుర్దాస్పూర్, అమృత్సర్, లాహోర్ మరియు మాన్తెగోమారి (సహివాల్) జిల్లాలన్నీ వివాదాస్పదమైనవి[9].

ఈ అన్నీ జిల్లాలలో (అమృత్సర్ తప్ప అన్నింటిలో 46.5% ముస్లిములు) ముస్లీముల ఆధిక్యత కలిగి ఉన్నవి. గురుదాస్పూర్ లోని అల్బీ ప్రాంతంలో అత్యధికంగా 5.1% శాతం ముస్లిం ఆధిక్యత కలదు. కొద్ది పాటి విస్తీర్ణం గల ప్రదేశాలలో, కేవలం మూడు తాలుకా లలో (జిల్లాలోని విభాగాలు)గల బరీ పరివాహక ప్రాంతంలో ముస్లిం ఆధిక్యత లేదు. అవి పఠాన్ కోట్ ,(గురుదాస్పూర్ కు సరాసరి ఉత్తర ప్రాంతం, వివాదాల్లో లేదు) మరియు అమృత్సర్ మరియు అమృత్సర్ జిల్లాలోని తరన్ తరాన్. వీటితో బాటు బియాస్ - సట్లేజ్ ప్రాంతంలోని తూర్పు తాలూకాలలో నాలుగు ముస్లిం మెజారిటీ తాలుకాలు కలవు. (వీటిలో రెండు ప్రాంతాలలో హిందువులు మరియు సిక్కులను కలిపిన దానికన్నా[9] ముస్లిములు ఎక్కువగా ఉన్నారు)

పంజాబ్ ప్రాంతపు చిత్రపటం ca 1947
దస్త్రం:Partition-punjab-spate.jpg
క్లైములు అ(కాంగ్రెస్/సిక్కు మరియు ముస్లిములు)మరియు బౌందరి కమిషన్ అవార్డ్ తాలూకా లపరంగా పంజాబ్ లో ముస్లిముల శాతం. సహదే చ్యని ప్రాంతాలు రాచరికపు దేశాలు.

బౌండరీ కమిషన్ ప్రాధమిక వివరణలు వినే ముందే తూర్పు మరియు పశ్చిమ పంజాబ్ లకు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వీటి పాలిత ప్రాంతాలను మూజువాణి విభజన ఆధారంగా సాధారణ జిల్లా ఆధిక్యతల పరంగా విభజన జరిగినది. పంజాబ్ మరియు బెంగాల్ రెండింటిలోను సరిహద్దు కమిషన్ ఇద్దరు ముస్లిం మరియు ఇద్దరు ముస్లిమేతర న్యాయమూర్తులను నియమించినది. వీరిలో సర్ సిరిల్ రాద్క్లిఫ్ఫ్ అందరికి చెందిన ఛైర్మన్[9].

పంజాబ్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మాటల్లో చెప్పాలంటే:

పంజాబ్ లోని రెండు ప్రాంతాలకు నిర్దిష్టమైన హద్దులను ముస్లిములు మరియు ముస్లిమేతర మెజారిటి ప్రాంతాల ఆధారంగా ఇద్దరికీ ఆమోదయోగ్యమైన సరిహద్దులను ఏర్పాటు చేయడం. అలా చేయడానికి ఇతరత్రా కారణాలను[9] కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు.

రెండు వైపులా (ముస్లీములు మరియు కాంగ్రెస్/సిక్కులు) తాము కోరేదాన్ని బేరసారాలకు తావులేని ఒక బృందం ద్వారా తెలుపుకోవచ్చు. న్యాయమూర్తులకు కూడా రాజీ పడే ప్రసక్తి లేదు మరియు అన్నీ ప్రధాన సమస్యలను రెండు మరియు రెండుగా విభజించి అసలైన విధాన నిర్ణయాన్ని [9] సర్ రాడ్క్లిఫ్ఫ్ స్వయంగా తీసుకునే వీలు కల్పించబడినది.

దస్త్రం:Upper-bari-doab-prevailing-religions1947a.jpg
ఎగువ బరి డూబ్ ప్రాంతలో వివాదాస్పద ప[రాన్తాలలో తేగల వారు. 1947

స్వాతంత్ర్యము మరియు జనాభా మార్పిడులు[మార్చు]

దేశ విభజన తర్వాత రెండు సరికొత్త దేశాల ఏర్పారు జరిగిన వెంటనే కొన్ని నెలలోనే రెండు దేశాల మధ్య విపరీతంగా జనాభా మార్పిడులు చోటు చేసుకున్నవి. సరిహద్దులు నిర్ణయించిన వెంటనే 14.5 మిలియన్ల జనాభా వారు ఆశించిన ఆధిక్యత మత బంధు రక్షణ పరంగా హద్దులు దాటారు. 1951 జనాభా లెక్కల ప్రకారం నిర్వాసిత ప్రజల్లో, 7,22,000 ముస్లిములు భారత దేశం నుండి పాకిస్తాన్ కు వెళ్ళగా, 7,249,000 మంది హిందువులు మరియు సిక్కులు కలసి విభజన తర్వాత పాకిస్తాన్ నుండి భారతదేశానికి చేరుకున్నారు.

దాదాపు 11.2 మిలియన్ల లేదా 76% జనాభా తరలింపు పశ్చిమ దిశ నుండి జరిగినది.ఇందులో పంజాబ్ నుండి 5.3 మిలియన్ల ముస్లిములు భారతదేశం నుండి పాకిస్తాన్ లోని పశ్చిమ పంజాబ్ తరలి వెళ్లారు. 3.4 మిలియన్ల హిందువులు మరియు సిక్కులు పాకిస్తాన్ నుండి భారతదేశంలోని తూర్పు పంజాబ్ కు తరలి వచ్చారు. పశ్చిమ దిశలో కొన్ని చోట్ల నుండి 1.2 మిలియన్ల ప్రజలు రెండు వైపుల నుండి సింద్[ఆధారం కోరబడింది] ప్రాంతానికి తరలి రావడం/వెళ్ళడం జరిగినది. కానీ మొత్తానికి ముస్లిముల వలస పాకిస్తాన్ నుండి భారత దేశం కు ఎక్కువ. ఎక్కువ మంది ముస్లిములు భారతదేశం నుండి పాకిస్తాన్ కు వెళ్ళే దాని కన్నా పాకిస్తాన్[10] నుండి భారతదేశానికి రావడానికే సిద్దపడ్డారు.

దస్త్రం:Manchester guardian purana-qila1947.jpg
డిల్లి లోని ఓల్డ్ ఫోర్ట్ (పురాణ ఖిల్లా)వద్ద గుమి కూడిన ఒక ముస్లిముల గుంపు.ఇది ఒక విస్తృతమైన,పాకిస్తాన్ కు తరలిమ్పవలసిన ముస్లిం కాందిశీకుల శిబిరం గా మార్చబడినది.మాంచెస్టర్ గార్డియన్ 27 ,సెప్టెంబరు 1947

అత్యంత ఎక్కువగా జరిగిన ఈ వలసలను తట్టుకోడానికి కొత్తగా ఏర్పాటైన ఇరు దేశాల ప్రభుత్వాలు అన్ని హంగులతో ఉన్నవి కాకపోవడం వలన , మూకుమ్మడి హింస మరియు హత్యాకాండలు ఇరు దేశాల సరిహద్దులలో చోటుచేసుకున్నవి మరణాల సంఖ్య షుమారుగా 500000 కాగా కనిష్ట అంచనాలో 200000, గరిష్ట అంచనా 1000000.[11]

పంజాబ్[మార్చు]

ఇంతకు ముందు గల పంజాబ్ రాచరికపు సంస్థానాన్ని దేశ విభజన సమయంలో ఇండియా మరియు పాకిస్తాన్ లకు విడగోట్టబడే సమయంలో భారత దేశపు పంజాబ్ రాష్ట్రం 1947లో రూపొందించబడినది. ఎక్కువగా ముస్లిం ఆధిక్యత గల పశ్చిమ ప్రాంతం పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సు కాగా ,సిక్కులు మరియు హిందువులు ఎక్కువగా గల తూర్పు ప్రాంతం భారత దేశపు పంజాబ్ రాష్ట్రంగా మారినవి. ఎక్కువ మంది హిందువులు మరియు సిక్కులు పశ్చిమ దిశలో నివసించగా, ఎక్కువ మంది ముస్లిములు తూర్పు ప్రాంతం లో నివసించేవారు. అందుచేత విభజన సందర్భంగా ఎక్కువ మంది నిర్వాసితులు అయ్యారు మరియు మత ఘర్షణలు జరిగినవి.

లాహోర్ మరియు అమృత్సర్ లు ఈ సమస్యకు కేంద్ర బిందువులు. బ్రిటిష్ పాలకులకు భారతదేశం లేదా పాకిస్తాన్ లోని ఎక్కడ /ఎ ప్రాంతంలో వీరిని ఉంచాలనే విషయంలో స్పష్టత లేదు. లాహోర్ ను పాకిస్తాన్ కు ఇవ్వాలని, అమృత్సర్ ను భారతదేశంకు ఇవ్వాలని బ్రిటిష్ వారు నిర్ణయించారు. పశ్చిమ పంజాబ్ ప్రాంతాలైన లాహోర్, రావల్పిండి, ముల్తాన్ గుజార్ట్ లలో ఎక్కువ సిక్కు జనాభా ఉన్నారు మరియు ఇందులో ఎక్కువ మంది నివాసులు ర్యాడికల్ ముస్లిములచే[ఆధారం కోరబడింది]హత్య గావించబడ్డారు. మరో పక్క తూర్పు పంజాబ్ లోని అమృత్సర్, లుధియానా మరియు గురుదాస్పూర్ నగరాలలో ఎక్కువ మంది ముస్లిముల జనాభా ఉండగా 'ఆల్ అవుట్ వార్ అగెనెస్ట్ ది ముస్లిమ్స్' ఉద్యమం పేరున ప్రారంభించిన సిక్కు గొరిల్లాలు ఎంతో మంది ముస్లిములను హత్య గావించారు.

వంగ విభజన[మార్చు]

వంగ ప్రాంతము రెండుగా విభజించబడెను. తూర్పు వంగము పాకిస్తాన్ కునూ పశ్చిమ వంగము భారత దేశానికినీ చెందునట్లు విభజన జరిగెను. 1955లో తూర్పు వంగపు పేరు తూర్పు పాకిస్తాన్ గా మార్చబడెను. పాకిస్తాన్ దేశమందు ఉర్దును మాత్రమే అధికార భాషగా ప్రకటించుటచే వంగాళీ ప్రజల మనోభావములు దెబ్బతినెను. ఇది అంతిమంగా 1971 లో పకిస్తాన్ దేశ విభజనకు దారి తీసెను. 1971 వంగదేశ విమోచన యుధ్ధమునకు పిదప తూర్పు వంగ రాష్ట్రము, వంగదేశము లెక బంగ్లాదేశ్ అను స్వతంత్ర దేశముగా ఆవిర్భవించెను.

ముర్షిదాబాద్ లోని ముస్లిముల ఆధిక్యత జిల్లాలను భారతదేశానికి ఇవ్వబడినవి. ఖుల్న మరియు బౌద్దుల ఆధిక్యత గల జిల్లా అయిన చిట్టగాంగ్ ప్రాంతమును పాకిస్తాన్ కు అవార్డు ప్రకారం ఇవ్వబడినవి.

కాశ్మీర్ సమస్య[మార్చు]

కాశ్మీర్ మరియు జమ్మూ రాజ సంస్థానంలో, ఎక్కువ మంది ముస్లిం జనాభా కాశ్మీర్ లోయలో ఉండగా, ఎక్కువ మంది హిందూ జనాభా జమ్మూలోనూ, ఇతర చోట్ల పార్సీ జనాభా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ మహారాజు భారత దేశానికి మొగ్గుచూపగా హింస చెలరేగినది. ఈ కాశ్మీర్ సమస్య ఈ ప్రాంతంలో భారత దేశం మరియు పాకిస్తాన్ల మధ్య 1947 యుద్ధానికి దారి తీసినది.

అవలోకనాలు[మార్చు]

దస్త్రం:TIME Magazine October 27 1947 cover.jpg
భారత దేశపు విభజన కు గుర్తు గా తనను తానె గాయ పర్చుకున్నట్లు TIME మేగజైన్ కవరు పై 27 అక్టోబర్ 1947 లో బోరిస్ అర్త్జిబశారిఫ్ ను కాళీ రూపం లో చూపిన చిత్రం."ఈ వ్యాఖ్య తెలిపేది 'భారత దేశపు స్వతంత్రము మరియు చావు'

దేశ విభజన అనేది ఎంతో వివాదాస్పదమైన ఏర్పాటు, మరియు ఉపఖండంలో నేటి ఉద్రిక్తతకు ఒక కారణంగా మిగిలిపొయినది. బ్రిటిష్ రాజప్రతినిధి, లార్డ్ మౌంట్ బాటన్(బర్మా) విభజన ప్రక్రియను వేగవంతం చేసాడనే నింద పొందడమే గాక, రాడ్క్లిఫ్ఫ్ ను భారతదేశానికి అనుకూలంగా ప్రభావితం చేసాడని ఆరోపించాబడ్డాడు. ఎందుకంటే ఎంతోమంది[12][13] కి కావలసినది భారతదేశమే అని ప్రతి ఒక్కరూ అంగీకరించారు. కానీ ది కమిషన్ రెండు దేశాల సరిహద్దులను ఖరారు చేసేందుకు ఎక్కువ సమయాన్ని తీసుకుంది. అదీగాక ఈ రెండు దేశాలకు స్వాతంత్ర్యం పొందిన సమయానికి ముందే వారి సరిహద్దులను స్పష్టంగా పెర్కొనడమైనది. అయినా కూడా కమిషన్ యొక్క పని తీరుకు సభ్యలు ఎంతో నిరసన వ్యక్తం చేయగా దాని ఫలితంగా కమిషన్[ఆధారం కోరబడింది] కు పరిహారం చెల్లించేందుకు వారు తిరస్కరించారు.

ఆంగ్లేయుల తొందరపాటుతనమే విభజన [14] పరంగా ఘోరాలకు దారి తీసినది. ఎందుకంటే అసలైన విభజనకు ముందే స్వాతంత్ర్యం ప్రకటించబడినది. కాబట్టి ప్రజలను సరైన రీతిలో ఉంచడం భారతదేశం మరియు పాకిస్తాన్ దేశ కొత్త ప్రభుత్వాలకు పరిమితమైనది. అధిక జనాభా పరంగా ఏ విధమైన సమస్యలు తలెత్తలేదు. కొత్త సరిహద్దు పరమైన ప్రణాళిక ననుసరించి ఇరువైపులా ప్రభుత్వాలకు అల్ప సంఖ్యాక వర్గాల పరిరక్షణ అవసరం ఏర్పడింది. సాధ్యం కాని ఈ కార్యము రెండు వైపులా వైఫల్యం పొందినది. శాంతి భద్రతలు క్షీణించాయి. పెక్కు మంది మూకుమ్మడి అల్లర్లు, ఊచకోతలలో పెక్కుమంది మరణించారు లేదా భద్రతాపరమైన కష్టనష్టాలు అనుభవించవలసి వచ్చింది. అత్యధిక జనాభాలో ఒకటిగా చరిత్రకేక్కినది. రిచర్డ్ సిమాండ్స్

at the lowest estimate, half a million people perished and twelve million became homeless

[15] ప్రకారం

కానీ, అప్పుడు నెలకొని ఉన్న పరిస్తితుల్లో[16] విభజనను వేగవంతం చేయవలసిందిగా బ్రిటిష్ ఒత్తిడిని ఎదుర్కొన్నదని కొంతమంది వాదన. దేశ విభజనకు పూర్వం శాంతి భద్రతలు పలుసార్లు క్షీనించడమే గాక రెండు వైపులా రక్తపాతం జరిగినది. మౌంట్ బాటన్ రాజ ప్రతినిధి అయిన సమయంలో పెద్ద ఎత్తున ప్రజా యుద్ధం తలెత్తే పరిస్థితి వుండినది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత , బ్రిటన్ కు వనరులు[17] తగ్గి పోవడం వలన బహుశా శాంతి భద్రతలను అదుపు చేయలేకపోయి ఉండవచ్చు. మౌంట్ బాటన్ విభజన పరంగా చాల తొందరపడినా, అతనికి వేరే మెరుగైన అవకాశాలు మృగ్యం కావడంతో, అప్పటి క్లిష్ట పరిస్థితుల్లో[18] కూడా సాధ్యమైనంత మంచిని సాధించగలిగాడు. 1947లో మౌంట్ బాటన్ కు విభజించి మరియు వెళ్ళాలనే అవకాశం తప్ప మరేమీ లేదని చరిత్రకారుడు లారెన్స్ జేమేస్ అభిప్రాయపడ్డాడు. కాని ఇందు కు ప్రత్యామ్నాయం ప్రజాయుద్దాన్ని ఎదుర్కోవడం తప్ప గత్యంతరం లేని, బయట పడలేని[19] విపత్కర పరిస్థితి అనిపిస్తుంది.

ఇంగ్లాండ్ లోని సంప్రదాయ శక్తులు భారతదేశ విభజనను బ్రిటిష్ సామ్రాజ్యం తమ అధికారాన్ని కోల్పోయే స్థితిగా నడిపించేదని భావిచారు. ఈ సందర్భంగా కర్జన్ మాటల్లో చెప్పాలంటే "భారతదేశంలో మనకు పట్టు ఉన్నట్లయితే ,మనది మొదటి తరగతి అధికారం'. భారతదేశంను మనం పోగొట్టుకున్నట్లయితే, మనం మూడవ తరగతి అధికారంతో మిగులుతాము."

ఢిల్లీ పంజాబీ కాందిశీకులు[మార్చు]

25 మిలియన్ల హిందువులు, ముస్లిములు, మరియు సిక్కులు (1947 - నాటికీ) కొత్తగా వేయబడిన దేశ సరిహద్దులను దాటి తమ మాతృ దేశాలకు చేరుకున్నారని అంచనా వేయబడినది. ఈ అంచనా పది సంవత్సరాలకు జరిగే 1941 మరియు 1951 జనాభా లెక్కలతో సరిపోల్చుకోవడం ఆధారంగా తీసుకున్నవి. వలస ప్రాంతాలలో సాధారణ జనాభా రేటు సర్దుబాట్లు కూడా జరిగినవి. ఉత్తర భారతదేశంలో అవిభక్త పంజాబ్ మరియు ఉత్తర పశ్చిమ ఫ్రాంటియర్ ప్రాంతము (NWFP) ప్రాంతాలలో రావల్పిండి అల్లర్ల దృష్ట్యా దాదాపు 12 మిలియన్ల ప్రజలను మార్చ్ 1947 నాటికి బలవంతంగా తరలించారు.

అత్యంత అధిక సంఖ్యలో కాందిశీకులు ఢిల్లీ చేరుకున్నారు. దీని వాళ్ళ ఢిల్లీ జనాభా 1947లో ఒక మిలియన్ (917.939) ఉండగా ఇది 1941 -1951 [20] మధ్య కాలంలో 2 మిల్ల్లియన్ల జనాభాకు దగ్గరగా (1.744.072) చేరుకుంది. ఈ కాందిశీకులకు ఆవాసం ఓల్డ్ ఫోర్ట్ (పురాణ ఖిల్లా ) ఎర్రకోట (రెడ్ ఫోర్ట్)కింగ్స్ వే లోని మిలిటరీ బ్యారేక్స్ (ప్రస్తుతం ఢిల్లీ విశ్వ విద్యాలయం ఉన్న ప్రాంతం) లాంటి పలు చారిత్రిక మరియు సైనిక ప్రాంతాలలో కలిగించబడినది. ఎర్రకోట ఆ తర్వాత అత్యధికంగా 35000 కాందిశీకుల ఆవాసంగాను మరియు పానిపట్ దగ్గర గల కురుక్షేత్రతో పాటు అత్యధిక కాందిశీకుల శిబిరంలో ఒకటి గాను పేరు పొందినది.

ఈ శిబిరం లోని వారికి భారత ప్రభుత్వం విస్తృతంగా గృహ నిర్మాణ పధకాల ద్వారా 1948 నుండి శాశ్వత గృహ వసతి కల్పించడం ప్రారంభించినది. ఢిల్లీలో అసంఖ్యాకంగా నివాస కాలనిలు వెలిశాయి. లజపత్ నగర్, రాజిందర్ నగర్, నిజాముద్దీన్ ఈస్ట్, పంజాబీ భాగ్, రేహ్గర్ పుర, జంగ్ పుర మరియు కింగ్స్ వే క్యాంప్ తదితరాలు వీటిలో కొన్ని.

విద్య, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార నిమిత్తం సులభ రుణాలు లాంటి వివిధ పధకాలను కాందిశీకులకు దేశ వ్యాప్తంగా అందించబడినవి. ఢిల్లీ లోని కాందిశీకులు ఈ అవకాశాలను, దేశంలో ఎక్కడెక్కడో[21] ఉన్న ఇతరులతో పోలిస్తే మెరుగైన రీతిలో ఉపయోగించుకున్నారు.

భారతదేశంలో స్థిరపడిన కాందిశీకులు[మార్చు]

ఎక్కువ మంది సిక్కులు మరియు హిందూ పంజాబీలు భారతదేశపు పంజాబ్ మరియు ఢిల్లీ ప్రాంతాలలో స్థిరపడ్డారు. తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్)నుండి వలస వచ్చిన హిందువులు తూర్పు భారతదేశంమరియు ఉత్తర తూర్పు భారతదేశంఅంతటా మరియు దగ్గరలో గల పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు త్రిపురాలలో స్తిరపడ్డారు. వలస వచ్చినవారిలో కొంత మందిని అండమాన్ దీవులకు పంపారు.

హిందూ సింధీలు తమకు మాతృ భూమి లేని వారయ్యారు. వారికి పునరావాసం కల్పించే బాధ్యత వారి ప్రభుత్వాలు తీసుకున్నాయి. హిందూ సింధీలులకు కాందిశీకుల శిభిరాలు ఏర్పాటు చేయబడినవి.

దస్త్రం:Partion1.jpg
పంజాబ్ లోని ఒక రైల్వే స్టేషను చిత్రం ఎక్కువ మంది ప్రజలు తమ ఆస్తి పాస్తులను వదులుకొని కొత్తగా నిర్మితమైన సరిహద్దులను దాటారు.

పలువురు కాందిశీకులు పేదరికపు మైకం నుండి బయటపడగా, తమకు మాతృదేశం లేదనే బాధ, దాని ప్రభావాన్ని సింధీ సంస్కృతి పై చూపినది.

2004 సంవత్సరాంతంలో అత్యున్నత న్యాయస్థానము నందు ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయబడినది. భారత జాతీయగీతం (రవీంద్రనాథ్ టాగూర్ చే దేశ విభజనకు ముందు రచించబడినది)లోని 'సింద్' పదాన్ని తొలగించాలని భారత ప్రభుత్వాన్ని కోరడం, ఈ పదం పాకిస్తాన్ సార్వాభౌమత్వాన్ని కించపరచేదిగా ఉన్నదన్నది ఆ వ్యాజ్యపు సారాంశం. ఈ వ్యాజ్యాన్ని సింధీలోకమంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారు.

పాకిస్తాన్ లో స్థిరపడిన కాందిశీకులు[మార్చు]

దేశ విభజన జరిగిన తర్వాత కొత్తగా వెలసిన రెండు దేశాల మధ్య జనాభా మార్పిడి గణనీయంగా జరిగినది. సుమారుగా 14.5 మిలియన్ల జనాభా సరిహద్దులు దాటినవి. ఇందులో 7,226,000 ముస్లిములు ఇండియా నుండి పాకిస్తాన్ కు రాగా 7,249,000 హిందువులు మరియు సిక్కులు పాకిస్తాన్ నుండి భారతదేశానికి తరలి వచ్చారు. సుమారు 5.5 మిలియన్ల పంజాబ్ పాకిస్తాన్లో స్థిరపడగా,1.5 మిలియన్ల ప్రజలు సింద్ లో స్థిరపడ్డారు.

పంజాబ్ పాకిస్తాన్ లో స్థిరపడిన కాందిశీకులు ఎక్కువ మంది భారత పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు రాజస్థాన్ ల నుండి వచ్చిన వారే. సింద్ కు చేరుకున్న ఎక్కువ మంది కాందిశీకులలో ఎక్కువ మంది భారతదేశంలోని ఉత్తర మరియు కేంద్ర పట్టణ కూడలి నుండి,ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు రాజస్థాన్ లోని వాఘా మరియు మునబావో సరిహద్దు నుండి వచ్చినవారే. కానీ పరిమిత సంఖ్యలో ముహాజిర్లు వాయు మరియు జల మార్గాలలో వచ్చారు. సింద్ ప్రాంతమంతటి నుండి భారతదేశానికి రావాలని కోరుకునే ప్రజలందరూ తాము బయలుదేరుటకు కరాచి లోని స్వామి నారాయణ్ గుడి వద్ద ఎదురుచూచారు మరియు పాకిస్తాన్ [22] స్థాపకుడు మహామ్మదాలి జిన్నా కూడా వారిని సందర్శించారు.

స్వాతంత్ర్య్యం తర్వాత వలస వచ్చిన ఎక్కువమంది ఉర్దూ మాట్లాడే కాందిశీకులు, దక్షిణ సింద్ లోని కరాచి పోర్ట్ నగరం నందు, హైదరాబాద్, సుక్కూర్, నవాబ్షా మరియు మిర్పుఖాస్ నగరాలలో స్థిరపడ్డారు. అంతే గాక, పలువురు ఉర్దూ వక్తలు పంజాబ్ నగరాలైన లాహోర్ ,ముల్తాన్,బహావాల్పూర్ మరియు రావల్పిండిలలో స్తిరపడ్డారు. సింద్ ప్రాంతం నుండి వలస వచ్చిన వారు సుమారుగా 540000 కాగా , వారిలో మూడింట రెండో వంతు పట్టాన ప్రాంతానికి చెందినవారే. కరాచి విషయానికి వస్తే 1947లో ఉన్న జనాభా 400,000 కాగా 1953 నాటికి 1.3 మిలియన్ల కన్నా ఎక్కువగా మారినది.

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పెర్వేజ్ ముషారఫ్ నగర వాలి హవేలీ , దర్యాగంజ్, ఢిల్లీ, భారతదేశం నందు జన్మించాడు. పలువురు పాకిస్తానీ నాయకులు కూడా భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో జన్మించారు. పాకిస్తాన్ మొట్టమొదటి ప్రధాన మంత్రి లియాఖత్ అలీ ఖాన్ కర్నాల్ (ఇప్పుడు హర్యానాలో ఉంది)లో జన్మించాడు. ఏడుసంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు యొక్క అతిపెద్దదైన ప్రాంతం బెలూచిస్తాన్ గవర్నర్ గాను మరియు సైనికాధికారి గాను పని చేసిన జనరల్ రహిముద్దీన్ ఖాన్ కైమగంజ్ లోని పఠాన్ నగరంలో జన్మించాడు. ఈ నగరం ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో ఉన్నది. జనరల్ మహమ్మద్ జియా ఉల్ హక్ 1977లో సైనిక చర్య ద్వారా అధికారంలోకి వచ్చాడు. ఇతను తూర్పు పంజాబ్ లోని జలంధర్ లో పుట్టాడు. ఈ నలుగురి కుటుంబాలు దేశ విభజన సందర్భంగా పాకిస్తాన్ కావాలని కోరాయి.

చిత్రశ్రేణి (గ్యాలరీ)

చిత్రం ;ముసలి ముస్లిం జంట 1947.jpg (ఒక వయసైన మరియు అనాదరణకు గురైన ముస్లిం జంట మరియు వారి మనుమలు తో పాటు తమ భారమైన ప్రయాణంలో రోడ్ పక్కన కూర్చొని ఉన్న చిత్రం. ముసలివ్యక్తి కష్టాలతో అవస్థ పడుతున్నాడు. "సుదీర్ఘ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది' అని బౌర్కే వైట్ రాసాడు.

చిత్రం: ఒక స్త్రీని మోస్తున్న ఇద్దరు పురుషులు 1947.jpg|ఇద్దరు ముస్లిం వ్యక్తులు( పాకిస్తాన్ వైపు వెళ్తున్న గ్రామీణ కాందిశీకుల రైలు లో)ఒక తరలింపుకు దోలి లేదా పల్లకి లో ఉన్న ఒక వృద్ద మహిళ 1947 లో.

చిత్రం: యవ్వనంలో ఉన్న శరణార్ధి-ఢిల్లీ 1947.jpg|'అగమ్య గోచరమైన భవిష్యత్తు దయనీయ గాధ.ఒక్ యువ కాందిశీకుడు పురాణ ఖిల్లా గోడ పై కూర్చొని,ఢిల్లీ లోని కాందిశీకుల శిబిరం లో ఒకడు గా మారిన దృశ్యం' మార్గరెట్ బౌర్కే వైట్ 1947

చిత్రం: శరణార్ధి 1.jpg| పాకిస్తాన్ పంజాబ్ కు వెళ్తున్న కాందిశీకుల రైలు

చిత్రం: పకిస్తం-ఢిల్లీ మధ్య రైలు 1947.jpg|న్యూ ఢిల్లీ రైల్వే స్టేషను నుండి ఆవిర్ చిమ్ముతూ పాకిస్తాన్ వైపు పరుగులు తీస్తున్న రైలు.1947

చిత్రశ్రేణి (గ్యాలరీ)

దేశ విభజన కళాత్మక చిత్రాలు[మార్చు]

విభజన గురించి మిక్కుటమైన చారిత్రిక సాహిత్యంతో బాటు, విస్తృతమైన కళాత్మక పనితనపు చిత్రాలు (నవలలు, చిన్న కథలు, పద్యము, చలన చిత్రాలు, ఆటలు, రంగులచిత్రాలు తదితరాలు) ఆనాటి బాధాకరం మరియు భయానకమైన సంఘటనను ఊహాజనితంగా తెలియజేస్తాయి.

వీటిని కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. Metcalf & Metcalf 2006, pp. 221–222
 2. రేవైసేడ్ స్టాత్యూట్ ఫ్రం ది యు కే స్తత్యూట్ లా డేటాబేస్: ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 at opsi.gov.uk
 3. అలస్తైర్ ల్యామ్బ్కాశ్మీర్: ఎ దిస్ప్యూటేడ్ లెగసి ,1846-1990 , రాక్స్ ఫోర్డ్ బుక్స్ 1991,ఐ ఎస్ బి ఎన్ 0-907129-06-4
 4. నాసిం యూసఫ్:ఫ్యాక్ట్ బిహైండ్ బ్రిటిష్ ఇండియా ఫ్రీడంఅ:ఎ స్కాలర్లీ లుక్ ఇంటుఅల్లామా మశ్రాకి అండ్ క్యార్డ్-ఎ =అజాంస్ పొలిటికల్ కాంఫ్లిక్ట్
 5. V.D.సర్వార్కర్,సమగ్ర సర్వార్కర్ వాంగ్మయ హిందూ రాస్త్ర దర్శనఅ(వి డి సర్వార్కర్ సేకరణలు Vol VI, మహారాష్ట్ర ప్రాంతిక్ హిండుసభ ,పూనా , 1963, p 296
 6. Jalal, Ayesha Jalal (1985). The Sole Spokesman: Jinnah, The Muslim League and the Demand Pakistan. Cambridge University Press. 
 7. వోల్పెర్ట్ , స్టాన్లీ . ఎ న్యూ హిస్టరీ అఫ్ ఇండియా
 8. థామస్ RGC, దేశాలు , రాష్ట్రాలు , మరియు సేస్సేషణ్;లెసన్స్ ఫ్రొం ది ఫార్మర్ యుగోస్లేవియ మెడిటరేనియన్ క్వార్టర్లీ , వాల్యూం 5 నంబర్ 4 Fall 1994, pp. 40–65, డ్యూక్ యూనివెర్సిటీ ప్రెస్
 9. 9.0 9.1 9.2 9.3 9.4 (Spate 1947, pp. 126-137)
 10. "In India, Muslims Find Fair Treatment". The New York Times. 
 11. డెత్ టోల్ ఇన్ ది పార్టిషన్
 12. కే జడ్ ఇస్లాం, 2002, ది పంజాబ్ బౌండరీ అవార్డు , ఇంరేట్రోస్పెక్ట్
 13. పార్తిసిపెటింగ్ ఇండియా ఓవర్ లంచ్, మేమాయిర్స్ అఫ్ ఎ బ్రిటిష్ సివిల్ సర్వెంట్ క్రిస్తోఫెర్ బీమాంట్
 14. స్టాన్లీ వల్పెర్ట్ , 2006, షేమ్ఫుల్ ఫ్లైట్ : ది లాస్ట్ఇయర్స్ అఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా , ఆక్స్ఫర్డ్ యూనివెర్సిటీ ప్రెస్ , ఐ ఎస్ బి ఎన్ 0-19-515198-4
 15. రిచర్డ్ సిమండ్స్, 1950, ది మేకింగ్ అఫ్ పాకిస్తాన్ ,లండన్, ఎ ఎస్ ఐ ఎన్ B0000CHMB1, p 74
 16. బ్రిటిన్ గనుక సివిల్ యుద్దమునందు పాల్గొనడం నివారించినట్లయితే,యుద్ధం తప్పనిసరి అవుతుందన్న పరిస్థితిలో ,దేశ విభజన జరిపి ఇండియా నుండి త్వరగా నిష్క్రమించడం తప్ప గత్యంతరం లేదు అని ఒక సారి తన ఆఫీసు నందు మౌంట్ బాటన్ అర్ధం చేసుకున్నాడు " లారెన్స్ J.బట్లర్ ,2002, బ్రిటిన్ అండ్ ఎంపైర్ :అద్జ్స్తింగ్ తు ఎ పోస్ట్ ఇంపీరియల్ వరల్డ్ , p 72
 17. లారెన్స్J.బట్లర్ ,2002,బ్రిటిన్ అండ్ ఎంపైర్ :అడ్జస్టింగ్ టు ఎ పోస్ట్ ఇంపీరియల్ వరల్డ్ , p 72
 18. రోనాల్డ్ హయాం ,బ్రిటైన్స్ దిక్లైనింగ్ ఎంపైర్ :ది రోడ్ టు దేకాలోనైసేషన్, 1918-1968,' పెజీ 113; కేంబ్రిడ్జి యూనివెర్సిటీ ప్రెస్ , ఐ ఎస్ బి ఎన్ 0521866499, 2007
 19. లారెన్స్ జేమ్స్ ,రైజ్ అండ్ ఫాల్ అఫ్ ది బ్రిటిష్ ఎంపైర్
 20. సెన్సస్ అఫ్ ఇండియా , 1941 మరియు 1951
 21. Kaur, Ravinder (2007). Since 1947: Partition Narratives among Punjabi Migrants of Delhi. Oxford University Press. ISBN 9780195683776. 
 22. Vazira Fazila-Yacoobali Zamindar (2007). The long partition and the making of modern South Asia. Columbia University Press. Retrieved 22 May 2009. పెజీ 52

మరింత చదవడానికి[మార్చు]

ప్రాచుర్యం పొందినవి
 • కాలిన్స్ లర్రి అండ్ డొమినిక్ ల్యాపియారి,ఫ్రీడం అట్ మిడ్ నైట్ లండన్ కాలిన్స్ , 1975 ISBN 0-00-63885-5
 • జుబ్రిజ్కి జాన్ (2006) 'ది లాస్ట్ నిజాం : ఎన్ ఇండియన్ ప్రిన్స్ ఇన్ ది ఆస్త్రేలియన్ అవుట్ బ్యాక్ పాన్ మక్మిల్లన్ ఆస్ట్రేలియా ఐఎస్‌బీఎన్ 978-0-3304-2321-2.
జీవితానుభవాలు
అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అండ్ మొనోగ్రాఫ్స్
 • అన్సారి. సారా 2005 {{0}లైఫ్ ఆఫ్టర్ పార్టిషన్ , మైగ్రేషన్ కమ్మ్యూనిటీ అండ్ స్త్రైఫ్ ఇన్ సింద్ : 1947—1962 ఆక్సఫోర్డ్ UK ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ 256 పేజీలు ISBN 0-19-597834-X
 • బుతాలియ , ఊర్వసి 1998. ది అదర్ సైడ్ అఫ్ సైలెన్స్ ,వాయిసెస్ ఫ్రొం ది పార్టిషన్ అఫ్ ఇండియా . దురహం ,NC డ్యూక్ యూనివెర్సిటీ ప్రెస్, 308 పేజస్ ISBN 0-262-08150-4
 • చటర్జీ జోయ 2002 బెంగాల్ దివైదేడ్ హిందూ కమ్మ్యూనలిజం 1932—1947 కేంబ్రిడ్జ్ అండ్ న్యూ యార్క్ ; కేం బ్రిడ్జ్ అండ్ న్యూ యార్క్, కేంబ్రిడ్జే యూనివెర్సిటీ ప్రెస్ ౩౨౩ పేజస్. ISBN 0-521-52328-1
 • గిల్మార్తిన్ డేవిడ్ 1988. ఎంపైర్ అండ్ ఇస్లాం పంజాబ్ అండ్ ది మేకింగ్ అఫ్ పాకిస్తాన్ బర్కిలీ , యూనివెర్సిటీ అఫ్ క్యాలిఫోర్నియా ప్రెస్ 258 పేజస్ ISBN 0-520-06249-3
 • గాస్మన్ ,పట్రిసియా 1999. రైఎట్స్ అండ్ విక్టిమ్స్:వైలెన్సేఅండ్ ది కనస్ట్రక్షన్ అఫ్ కమ్మ్యూనల్ ఇదేన్టితి అమంగ్ బెంగాలి ముస్లిమ్స్ ,1905 - 1947 Westview Press. 224 pages.వెస్ట్ వ్యూ ప్రెస్ 224 పెజీలు. ఐ ఎస్ బి ఎన్ 0813336252
 • హాన్సెన్ ,అన్దేర్స్ బిజార్న్ , 2004. "పార్టిషన్ అండ్ జేనసైడ్: మ్యానిఫెస్తేషన్ అఫ్ విఒలేన్స్ ఇన్ పంజాబ్ 1937-1947", ఇండియా రిసర్చ్ ప్రెస్ . ఐ ఎస్ బి ఎన్ 9788187943259
 • Hasan, Mushirul (2001), India's Partition: Process, Strategy and Mobilization, New Delhi: Oxford University Press, 444 pages, ISBN 0195635043 .49
 • ఇక్రం , ఎస్.ఎం .1995. ఇండియన్ ముస్లిమ్స్ అండ్ పార్టిషన్ అఫ్ ఇండియా ఢిల్లీ: అట్లాంటిక్ . ఐ ఎస్ బ ఎన్ 8171563740
 • Jain, Jasbir (2007), Reading Partition, Living Partition, Rawat Publications, 338 pages, ISBN 8131600459 
 • Jalal, Ayesha (1993), The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan, Cambridge, UK: Cambridge University Press, 334 pages, ISBN 0521458501 
 • కౌర్ , రవీందర్. 2007. " 1947 నుండి : పార్టిషన్ నరేటివ్స్ అమోంగ్ పంజాబీ మైగ్రెంట్స్ అఫ్ ఢిల్లీ ". ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రచురణ. ఐ ఎస్ బి ఎన్ 9780195683776
 • Khan, Yasmin (2007), The Great Partition: The Making of India and Pakistan, New Haven and London: Yale University Press, 250 pages, ISBN 0300120788 
 • Lamb, Alastair (1991), Kashmir: A Disputed Legacy, 1846-1990, Roxford Books, ISBN 0-907129-06-4 
 • Metcalf, Barbara; Metcalf, Thomas R. (2006), A Concise History of Modern India (Cambridge Concise Histories), Cambridge and New York: Cambridge University Press. Pp. xxxiii, 372, ISBN 0521682258 54
 • పేజి , డేవిడ్, అనిత ఇందర్ సింగ్,పెందేరెల్ మూన్, G. D. ఖోస్ల , మరియు ముషిరుల్ హసన్ . 2001. ది పార్టిషన్ ఆమ్నిబస్ : ప్రీ ల్యుడ్ తో పార్టిషన్ / ది ఆరిజన్స్ అఫ్ ది పార్టిషన్ అఫ్ ఇండియా 1936-1947/డివైడ్ అండ్ క్విట్ /స్తెర్న్ రేకానింగ్ . ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రచురణ. ISBN 0-19-565850-7
 • పాల్ , ఆనందిష్ కుమార్. 2010. ' వరల్డ్ గైడ్తో పార్టిషన్ అఫ్ ఇండియా(/0}. కిన్ద్లె ఎడిషన్; అమెజాన్ డిజిటల్ సర్వీసెస్. 282 KB. ASIN B0036OSCAC
 • పండే, గ్యానేంద్ర. 2002 రేమంబరింగ్ పార్టిషన్:: వైలెన్స్ , నేషనలిజం అండ్ హిస్టరీ ఇన్ ఇండియా కామ్రైడ్, UK: కేంబ్రిడ్జ్ యూనివెర్సిటీ ప్రెస్ .232 పెజీలు. ISBN 0-521-00250-8
 • రజా , హాషిం S.1989. మౌంట్ బాటన్ అండ్ ది పార్టిషన్ అఫ్ ఇండియా న్యూ ఢిల్లీ: అట్లాంటిక్. ISBN 81-7156-059-8.
 • షేక్ ,ఫర్జానా. 1989. కమ్మ్యూనిటీ అండ్ కన్సర్వేషన్ ఇన్ ఇస్లాం ;ముస్లిం రేప్రజంతెషన్,1860—1947 . కేంబ్రిడ్జ్ , UK: కేంబ్రిడ్జ్ యూనివెర్సిటీ ప్రెస్ .272 పెజీలు . ISBN 0-521-36328-4
 • తాల్బాట్ , ఇయాన్ అండ్ గుర్హర్పాల్ సింగ్ (eds). 1999. రేజియన్ అండ్ పార్టిషన్ :బెంగాల్, పంజాబ్ అండ్ ది పార్టిషన్ అఫ్ ది సబ్కాంటినెంట్ ఆక్స్ ఫోర్డ్ అండ్ న్యూ యార్క్ : ఆక్స్ ఫోర్డ్ యూనివెర్సిటీ ప్రెస్ .420 పెజీలు . ఐ ఎస్ బి ఎన్ 0195790510
 • తల్బాట్, ఇయాన్. 2002 ఖిజర్ తివాన: ది పంజాబ్ యూనియనిస్ట్ పార్టి అండ్ ది పార్టిషన్ అఫ్ ఇండియా ఆక్స్ ఫోర్డ్ అండ్ న్యూయార్క్: ఆక్స్ ఫోర్డ్ యూనివెర్సిటీ ప్రెస్ .216 పేజీలు. ఐ ఎస్ బి ఎన్ 0195795512
 • తాల్బాట్,ఇయాన్. 2006. దివైదేడ్ సిటీస్ : పార్టిషన్ అండ్ ఇట్స్ ఆఫ్తర్మాత్ ఇన్ లాహోర్ అండ్ అమృత్సర్ ఆక్స్ ఫోర్డ్ అండ్ కరాచి: ఆక్స్ ఫోర్డ్ యూనివెర్సిటీ ప్రెస్. 350 పేజీలు. ఐ ఎస్ బి ఎన్0195472268
 • వుల్పేర్ట్,స్టాన్లీ . 2006. షేంఫుల్ ఫ్లైట్ : ది లాస్ట్ యియర్స్ అఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా . ఆక్స్ ఫోర్డ్ అండ్ న్యూయార్క్ : ఆక్స్ ఫోర్డ్ యూనివెర్సిటీ ప్రెస్.272 పేజీలు. ఐ ఎస్ బి ఎన్ 0195151984
 • జే.బట్లర్ ,లారెన్స్. 2002 బ్రిటన్ అండ్ ఎంపైర్:అడ్జస్టింగ్ టు ఎ పోస్ట్ ఇంపీరియల్ వరల్డ్ . లండన్: ఐ.బి.టారిస్. 256 పేజీలు. ఐ ఎస్ బి ఎన్ 186064449X
 • ఖోస్ల ,జి.డి స్టెర్న్ రేకానింగ్ :ఇండియా విభజనకు దారి తీసిన సంఘటనలు మరియు ఆతర్వాతి సంఘటనలు ,న్యూ ఢిల్లీ :ఆక్స్ ఫోర్డ్ యూనివెర్సిటీ ప్రెస్.358 పేజీలు.
వ్యాసాలు
 • లాల్ ఖాన్ రచించిన బుక్ 'పార్టిషన్ కెన్ ఇట్ బి అన్దన్'పై పాకిస్తాన్ పార్లమెంటు లో మార్క్సిస్ట్ ఎం పి చౌదరి మంజూర్ అహమ్మద్ సమీక్ష
 • జిల్మార్తిన్ ,డేవిడ్ 1998. "పార్టిషన్, పాకిస్తాన్ , అండ్ సౌత్ ఏషియన్ హిస్టరీ: ఇన్ సర్చ్ అఫ్ అ నర్రెటివ్." ది జర్నల్ అఫ్ ఏషియన్ స్టడీస్ , 57(4):1068-1095.
 • జెఫ్ఫ్రి, రాబిన్ .1974. 'ది పంజాబ్ బౌండరీ ఫోర్సు అండ్ ది ప్రాబ్లం అఫ్ ఆర్డర్,ఆగస్ట్ 1947 - మోడరన్ ఏషియన్ స్టడీస్ 8(4):491-520.
 • కౌర్ రవీందర్ 2007. "ఇండియా అండ్ పాకిస్తాన్ ,పార్టిషన్ లెసన్స్ " ఓపెన్ డెమోక్రసీ
 • కౌర్ ,రవీందర్ 2006. 'ది లాస్ట్ జర్నీ:సోషల్ క్లాసు ఇన్ ది పార్టిషన్ అఫ్ ఇండియా " ఎకనామిక్ అండ్ పొలిటికల్, జూన్ 2006. www.epw.org.in
 • మూకర్జియా-లేయోనార్డ్ , దేబాలి 2005 "దివైదేడ్ హోం ల్యాండ్స్, హోస్తిల్ హోమ్స్ : పార్టిషన్, వుమన్ అండ్ హొంలెస్నెస్". జర్నల్ అఫ్ కామన్వెల్త్ లిటరేచర్ , 40(2):141-154.
 • మొర్రిస్-జోన్స్. 1983. "థర్టీ-సిక్స్ ఇయర్స్ ల్యాటార్:"ది మిక్షెద్ లేగాసీస్ అఫ్ మౌంట్ బ్యాటాన్ త్రన్స్ఫెర్ అఫ్ పవర్. ఇంటర్నేషనల్ అఫెర్స్ (రాయల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంటర్నేషనల్ అఫేర్స్) , 59(4):621-628.
 • Spate, O. H. K. (1947), "The Partition of the Punjab and of Bengal", The Geographical Journal 110 (4/6): 201–218 
 • స్పియర్,పర్సీవల్ 1958. "బ్రితన్స్ ట్రాన్స్ఫర్ ఒఫ్పవర్ ఇన్ ఇండియా." ప్యాసిఫిక్ అఫేర్స్ , 31(2):173-180.
 • తల్బాట్,ఇయాన్ 1994. "ప్లాన్నింగ్ ఫర్ పాకిస్తాన్: ది ప్లానింగ్ కమిటి అఫ్ ది అల్ ఇండియా ముస్లిం లీగ్ , 1943-46". మోడరన్ ఆసియన్ స్టూడియోస్ , 28(4):875-889.
 • విసారియా, ప్రవీణ్ ఎం. 1969. "మైగ్రేషన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ 1951 81 డెమోగ్రఫి ', 6(3):323-334.

బాహ్య లింకులు[మార్చు]

బిబ్లియోగ్రఫీస్
ఇతర లింకులు

మూస:Indo-Pakistani relations మూస:India topics