లాహోర్ తీర్మానం
లాహోర్ తీర్మానం (Urdu: قرارداد لاہور, Karardad-e-Lahore; Bengali: লাহোর প্রস্তাব, Lahor Prostab), ముహమ్మద్ జఫరుల్లా ఖాన్ రాయగా, బెంగాల్ ప్రధానమంత్రి ఎ.కె.ఫజలుల్ హక్ ప్రతిపాదించగా ఆలిండియా ముస్లిం లీగ్ మార్చి 22-24, 1940 సందర్భంగా లాహోరులో ఆమోదించి స్వీకరించిన లాంఛనయుత రాజకీయ ప్రకటన. తీర్మానంలో స్వతంత్ర రాష్ట్రాలను కోరుకుంది:
భౌగోళికంగా అవిచ్ఛిన్నమైన విభాగాలను ప్రాంతాలుగా ఏర్పరిచి, అటువంటి ప్రాదేశిక పునర్విభజన చేసి (బ్రిటీష్) ఇండియా వాయువ్య, తూర్పు జోన్లలో ముస్లింలు సంఖ్యాపరంగా అధికంగా ఉన్న ప్రాంతాలను స్వతంత్ర రాష్ట్రాలుగా గ్రూప్ చేసి స్వయంప్రతిపత్తి, సార్వభౌమత్వం కల్పించాలి.
చౌధరీ రహ్మత్ అలీ తన పాకిస్తాన్ తీర్మానంలోనే పాకిస్తాన్ అన్న పేరును ప్రతిపాదించినా, [1] లాహోర్ తీర్మానం తర్వాత గానీ విస్తృతమైన ప్రచారంలోకి రాలేదు.
స్టాన్లీ వోల్పెర్ట్ ప్రకారం, ఒకప్పటి హిందూ-ముస్లిం ఐక్యతా రాయబారి మహమ్మద్ అలీ జిన్నా పూర్తిగా పాకిస్తాన్ మహా నాయకునిగా రూపాంతరం చెందిన సందర్భం ఇదే.[2]
నేపథ్యం
[మార్చు]వైస్రాయ్ లార్డ్ లిన్‌లిత్‌గో ముస్లిం లీగ్ నాయకులకు గ్రేట్ బ్రిటన్ ప్రభుత్వం హిందువులు, ముస్లిములు, సంస్థానాధీశులకు నడుమ భారతదేశాన్ని విభజించి మూడు డొమినియన్లుగా చేయనుందని చెప్పారు. ముస్లిం లీగ్ వర్కింగ్ కమిటీలో వివిధ ఉప కమిటీలను ఏర్పరిచి, అంతిమ అధికారం బ్రిటీషర్ల వద్ద ఉండేలా అనేక ప్రతిపాదనలు సమర్పించారు. తమ లక్ష్యాలకు అనుగుణంగా లేవని బ్రిటీషర్లు గమనించడంతో, ముస్లింలు సమర్పించిన ప్రతిపాదనలు అన్నిటిని తిరస్కరించారు. ఈ సమయానికి జఫరుల్లా ఖాన్ ను భారత విభజన ప్రతిపాదనను సమర్పించమని కోరారు, దీనిపై వైస్రాయ్ భారత వ్యవహారాల కార్యదర్శికి ఇలా రాశారు:
నా సూచనను అనుసరించి, జఫారుల్లా రెండు డొమినియన్ రాజ్యాలన్న అంశంపై మెమొరాండం రాశారు. ఇప్పటికే నేను దాన్ని మీ దృష్టికి తెచ్చాను. మరింత స్పష్టత కోసం కూడా నేను అతన్ని అడిగాను, అది త్వరలో చేస్తామని వారు పేర్కొన్నారు. ఎవరికీ ఈ ప్లాన్ తయారుచేసింది తానేనన్న విషయం తెలియకూడదని ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఒక కాపీ పంపడంతో సహా దీన్ని నేను ఏమైనా చేసుకోవచ్చునన్న అధికారం ఇచ్చారు. జిన్నాకు, సర్ అక్బర్ హైదరీకి కాపీలు పంపించాం. జఫరుల్లా దీని కర్తృత్వాన్ని అంగీకరించలేకపోవడంతో ఈ డాక్యుమెంట్ ముస్లింలీగ్ స్వీకరించడానికి, పూర్తి స్థాయిలో ప్రాచుర్యం కల్పించడానికి తయారుచేశారు.
---లార్డ్ లిన్‌లిత్‌గో మార్చి 12, 1940[3]
లాహోర్ కాన్ఫరెన్స్
[మార్చు]1940 మార్చి 22 నుంచి 24 వరకూ The session was held between March 22 and March 24, 1940, at Iqbal Park, Lahore. The welcome address was made by Sir Shah Nawaz Khan of Mamdot. He was also the chairman of the reception committee and personally bore all the expenses. A. K. Fazlul Huq presented the resolution. The resolution text unanimously accepted the concept of a united homeland for Muslims on the grounds of growing inter-communal violence[4] and recommended the creation of an independent Muslim state.[5]
మూలాలు
[మార్చు]- ↑ Choudhary Rahmat Ali, (1933), Now or Never; Are We to Live or Perish Forever?, pamphlet, published January 28.
- ↑ Stanley Wolpert (1984), Jinnah of Pakistan.
- ↑ Khan, Wali. "Facts are Facts: The Untold Story of India's Partition" (PDF). pp. 40–42. Archived from the original (PDF) on 2010-12-19. Retrieved March 9, 2011.
- ↑ Muhammad Aslam Malik (2001), The Making of the Pakistan Resolution, Oxford University Press, Delhi.
- ↑ Syed Iftikhar Ahmed (1983), Essays on Pakistan, Alpha Bravo Publishers, Lahore, OCLC 12811079