మౌంట్‌బాటన్
మౌంట్‌బాటన్ లేదా లార్డ్ మౌంట్‌బాటన్ ఒక బ్రిటీష్ నౌకా సేనాని. ఇతడు బ్రిటీష్ పరిపాలనలోని భారతదేశపు చిట్టచివరి వైస్రాయ్ గానూ (1947), స్వత్రంత్ర్య భారత మొదటి గవర్నర్ జనరల్ గా (1947–48) వ్యవహరించాడు.
నేపధ్యము
[మార్చు]1900 జూన్ 25 వ సంవత్సరంలో జన్మించాడు. జన్మనామము ప్రిన్స్ లూయిస్ ఆఫ్ బాటెన్‌బర్గ్. ఇతను ఎడిన్‌బర్గ్ రాకుమారుడు ప్రిన్స్ ఫిలిప్కు స్వయానా బాబాయి, ఎలిజబెత్ 2 మహారాణికి దాయాది. ఇతను రెండవ ప్రపంచ యుద్ధంలో సౌత్ ఈస్ట్ ఏషియా కమాండ్ యొక్క సర్వ సేనాధిపతిగా వ్యవహరించాడు (1943–46).
బాల్యము
[మార్చు]పుట్టినప్పటి నుండి 1917 వరకు బ్రిటీష్ రాజకుటుంబం లోని మిగిలిన వారివలె జన్మతహ సంక్రమించిన జర్మన్ రాచరిక ఆనవాళ్ళు వదులుకున్నారు. అప్పుడు మౌంట్‌బాటన్ కూడా ప్రిన్స్ లూయిస్ ఆఫ్ బాటెన్‌బర్గ్ గా పిలవబడేవాడు. ఇతని తల్లిదండ్రులు రాకుమారుడు లూయిస్ ఆఫ్ బాటెన్‌బర్గ్, రాకుమారి విక్టోరియా ఆఫ్ హెస్సె , రైన్కు ఇతని చివరి సంతానము.
మరణం
[మార్చు]1979 లో ఇతడు, ఇతని మనవడు నికొలస్, మరి ఇద్దరు కలిసి ఐర్లాండ్ లోని షాడీ వి ప్రాంతంలోని ముల్లఘ్‌మోర్, కంట్రీ స్లిగో ప్రాంతంలో చేపల పడవలో విహరిస్తుండగా తన పడవలో ప్రొవిజనల్ ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ (IRA) అమర్చిన బాంబు పేలిపోవడంతో దుర్మరణం చెందారు.