ఇండియన్ రాయల్ నేవీ తిరుగుబాటు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇండియన్ రాయల్ నేవీ తిరుగుబాటు (లేదా బొంబాయి తిరుగుబాటు) బొంబాయి ఓడరేవులో 1946 ఫిబ్రవరి 18న పూర్తిస్థాయి సమ్మెగా ప్రారంభమై, క్రమేణా భారతీయ నౌకాదళ నావికుల తిరుగుబాటుగా మారిన సంఘటన. బొంబాయిలో తొలుత చిన్న మెరుపుసమ్మెగా ప్రారంభమైనా, వెనువెంటనే బ్రిటీష్ ఇండియా మొత్తం తిరుగుబాటు, దానికి సమర్థన విస్తరించాయి. ఆ విస్తరణ ఇటు పశ్చిమాన కరాచీ నుంచి తూర్పున కలకత్తా వరకూ వేగంగా తిరుగుబాటు విస్తరణ జరిగింది.