విశాఖపట్నం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?విశాఖపట్టణం
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
View of విశాఖపట్టణం, India
అక్షాంశరేఖాంశాలు: 17°43′20″N 83°17′25″E / 17.7221°N 83.2902°E / 17.7221; 83.2902
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 540.00 కి.మీ² (208 చ.మై)[1]
ముఖ్య పట్టణము విశాఖపట్నం
ప్రాంతం కోస్తా
జనాభా
జనసాంద్రత
20,35,922 (2011 నాటికి)
• 3,770/కి.మీ² (9,764/చ.మై)
విశాఖపట్నంలోని తెన్నేటి ఉద్యానవనం వద్ద సముద్ర తీరం
విశాఖపట్నంలోని తెన్నేటి ఉద్యానవనం వద్ద సాయంత్రాన సముద్ర తీరం

విశాఖపట్నం (విశాఖ , విశాఖపట్టణం , వైజాగ్‌) భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రముఖ నగరం.[2] విశాఖపట్నం (పట్టణ), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. ఆంధ్ర ప్రదేశ్‌లో గ్రేటర్ సిటి హోదా పొందిన తొలి నగరం (హైదరాబాదు కంటే ముందే). బ్రిటిషు పాలనలో వాల్తేరుగా కూడా పిలువబడింది ఈ నగరం. బంగాళా ఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. స్వతంత్ర భారత దేశపు మొట్ట మొదటి ఓడ అయిన "జల ఉష" ఇక్కడే తయారయి, అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేసింది. సుందరమైన సముద్ర తీరం, అహ్లాదకరమైన కొండలతో అలరారే విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల ఎన్నో ప్రసిద్ధ యాత్రా స్థలాలు ఉన్నాయి. అద్భుతమైన అరకు లోయ సౌందర్యం, మన్యం అడవుల సౌందర్యం, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు, 11 వ శతాబ్ది నాటి దేవాలయం, ప్రాచీన బౌద్ధ స్థలాలు మొదలైన ఎన్నో యాత్రా స్థలాలు విశాఖ చుట్టుపట్ల చూడవచ్చు. విశాఖపట్నం రేవుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది సహజ సిద్ధమైన నౌకాశ్రయం. సముద్రంలోకి చొచ్చుకొని ఉన్న కొండ కారణంగా నౌకాశ్రయానికి అలల ఉధృతి తక్కువగా ఉంటుంది. "డాల్ఫిన్స్‌ నోస్‌" అనే ఈ కొండ సహజ సిద్ధమైన బ్రేక్‌వాటర్స్‌గా పనిచేస్తుంది.

చరిత్ర[మార్చు]

శివ పార్వతుల తనయుడు, శుక్ర గ్రహాధినేత, యుద్ధాల దేవుడు, ధైర్య సాహసాలకు మారు పేరూ అయిన, విశాఖ పేరిట నగరానికి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. ప్రాచీన గ్రంథాలైన రామాయణ, మహాభారతాలలో ఈ ప్రాంత ప్రస్తావన ఉన్నట్లు కనిపించుచున్నది. రాముడు సీత కొరకు వెదకుచూ ఈ ప్రాంతం గుండానే వెళ్ళినట్లు, ఈ పరిసరాల్లోనే శబరిని కలవగా ఆమె హనుమంతుడు నివసించే కొండలకు దారి చూపినట్లుగా రామాయణం తెలియజేస్తున్నది. రాముడు జాంబవంతుని కలిసింది కూడా ఈ ప్రాంతంలోనే. ఈ ప్రాంతంలోనే భీముడు బకాసురుని వధించినాడని ప్రతీతి. నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని ఉప్పలం గ్రామంలో పాండవుల రాతి ఆయుధాలను చూడవచ్చు.

స్థానికంగా వినవచ్చే కథ ఒకటి ఇలా ఉంది.(9-11 శతాబ్దపు) ఒక ఆంధ్ర రాజు, కాశీకి వెళ్తూ ఇక్కడ విశ్రాంతి కొరకు ఆగాడు. ఆ ప్రదేశ సౌందర్యానికి ముగ్ధుడై, తన ఆరాధ్య దైవమైన విశాఖేశ్వరునికి ఇక్కడ ఒక గుడి నిర్మింపజేసాడు. కాని పురాతత్వ శాఖ ప్రకారం మాత్రం ఈ గుడి 11, 12 శతాబ్దాలలో కుళోత్తుంగ చోళునిచే నిర్మించబడినదని తెలుస్తోంది. శంకరయ్య చెట్టి అనే ఒక సముద్ర వ్యాపారి ఒక మండపాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ గుడి లేనప్పటికీ, - ఒక 100 ఏళ్ళ కిందట తుపానులో కొట్టుకు పోయి ఉండవచ్చు - ఈ ప్రాంతపు పెద్దవారు తమ తాతలతో ఈ గుడికి వెళ్ళినట్లుగా చెప్పే వృత్తాంతాలు ఉన్నాయి.

గోదావరి నది వరకు విస్తరించిన ప్రాచీన కళింగ సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతపు ప్రస్తావన క్రీ. పూ. 5, 6 శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంథాలలోను, క్రీ.పూ. 4 వ శతాబ్దికి చెందిన సంస్కృత వ్యాకరణ పండితులైన పాణిని, కాత్యాయనుని రచనలలోను ఉంది.

ఈ ప్రాంతాన్ని ఎన్నో ప్రముఖ వంశాల వారు పరిపాలించారు. వాటిలో కొన్ని: 7 వ శతాబ్దంలో కళింగులు, 8 వ శతాబ్దంలో చాళుక్యులు, తరువాతి కాలంలో రాజమండ్రి రెడ్డిరాజులు, చోళులు, గోల్కొండకు చెందిన కుతుబ్‌ షాహీలు, మొగలులు, హైదరాబాదు నవాబులు. 1700 సంవత్సరం నాటికి బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీవారు దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన అతికొద్ది వర్తకస్థానాల్లో విశాఖపట్టణం కూడా ఒకటిగా ఉండేది.[3]

18 వ శతాబ్దంలో విశాఖపట్నం ఉత్తర సర్కారులలో భాగంగా ఉండేది. కోస్తా ఆంధ్రలోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత బ్రిటిషు వారి అధీనంలోకి వెళ్ళాయి. మద్రాసు ప్రెసిడెన్సీ లో విశాఖపట్నం ఒక జిల్లాగా ఉండేది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి విశాఖపట్నమే దేశంలోకెల్లా అతి పెద్ద జిల్లా. తరువాత దానిని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలుగా విడగొట్టారు. 1950 ఆగస్టు 15 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979 జూన్ 1 న విజయనగరం జిల్లా ఏర్పడింది

భౌగోళికం[మార్చు]

విశాఖపట్నం నగరం

విశాఖపట్నం బంగాళా ఖాతము నానుకొని సముద్రపు ఒడ్డున ఉంది. విశాఖపట్నానికి ఎల్లలు; ఉత్తరాన ఒడిషా రాష్ట్రము మరియు విజయనగరం జిల్లా, దక్షిణాన తూర్పుగోదావరి జిల్లా గలదు. తూర్పున బంగాళాఖాతము, మరియు పశ్చిమాన తూర్పు కనుమలు ఉన్నాయి. ఈ నగరపు అక్షాంశ రేఖాంశాలు; 17.6883° ఉత్తర అక్షాంశం, మరియు 83.2186° తూర్పు రేఖాంశం. ఈ నగరం మైదాన ప్రాంతం మరియు తీరప్రాంతాలతో ఉంది. దీని వైశాల్యం 11,161 km2 (4,309 sq mi).

వాతావరణం[మార్చు]

Climate data for Visakhapatnam
Month Jan Feb Mar Apr మే Jun Jul Aug Sep Oct Nov Dec Year
Record high °C (°F) 34.8 38.2 40.0 40.5 45.0 45.4 41.4 38.8 38.2 37.2 35.0 34.2 nil
(nil)
Average high °C (°F) 28.9 31.3 33.8 35.3 36.2 35.3 32.9 32.7 32.5 31.7 30.4 28.9
Average low °C (°F) 17.0 18.9 22.0 25.1 26.7 26.3 25.1 25.0 24.6 23.3 20.6 17.6
Record low °C (°F) 10.5 12.8 14.4 18.3 20.0 20.6 21.0 21.1 17.5 17.6 12.9 11.3 nil
(nil)
Precipitation mm (inches) 21.4 17.7 17.5 37.6 77.8 135.6 164.6 181.2 224.8 254.3 95.3 37.9
Avg. rainy days 1.7 2.3 2.3 3.2 4.9 8.8 11.9 12.6 12.6 9.9 5.0 1.7
% humidity 71 70 69 71 69 71 76 77 78 74 68 67
Source #1: IMD (average high and low, precipitation)[4]
Source #2: IMD (temperature extremes upto 2010)[5]

నగరం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామనామ వివరణ[మార్చు]

విశాఖ పట్నం అన్న గ్రామనామం విశాఖ అనే పూర్వపదం, పట్నం అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. వీటిలో పట్నం పట్టణానికి రూపాంతరం. పట్టణమంటే వ్యాపారకేంద్రం, నగరం, సముద్రతీరం అనే అర్థాలు వస్తున్నాయి.[6] సముద్రతీరప్రాంతం కావడంతో ఈ నగరం పేరులోని పట్నం అనే పదానికి సముద్రతీర జనావాసం అనే అర్థం ప్రధానంగా స్వీకరించవచ్చు.

మహా విశాఖ నగర పాలన[మార్చు]

మహా విశాఖ నగర పాలక సంస్థను 11 విబాగాలుగా విడదీసి, పరిపాలన చేస్తున్నారు. రెవెన్యూ శాఖ, అక్కౌంట్సు (పద్దులు) శాఖ, సాధారణ పరిపాలన, బట్వాడా శాఖ (సంస్థలోని మిగతా శాఖలు రాసిన ఉత్తరాలు, నోటీసులు పంపించటం), ఇంజినీరింగ్ శాఖ, ప్రజారోగ్య శాఖ (ప్రజల ఆరోగ్యం, వీధులు, మురికి కాలువలు శుభ్రం చేయటం, ఆసుపత్రులు ), టౌన్ ప్లానింగ్ శాఖ, అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (నగర్ అభివృద్ధి సంస్థ), విద్యా శాఖ, ఆడిట్ శాఖ (అక్కౌంట్సు శాఖ రాసిన జమా ఖర్చులు సరిగా ఉన్నాయా లెవ అని పరిశీలించి, తప్పులను, అనవరంగా చేసిన ఖర్చులను వెదికి అభ్యంతరాలను నమోదు చేస్తుంది), లీగల్ సెల్ (మహా విశాఖ నగరపాలక సంస్థ మీద ఎవరైనా దావాలు వేసిన వాటికి సమాధానలు ఇవ్వటం, కొన్ని న్యాయసంబంధమైన సలహాలు సంస్థకు ఇవ్వటం, వంటి పనులు చేస్తుంది). ఈ 11 శాఖలకు అధిపతులు ఉంటారు. ఈ 11మంది అధిపతులు, మహా విశాఖ నగర పాలక సంస్థ అధిపతి అయిన కమిషనరు (ఐ.ఏ.ఎస్ అధికారి) ఆధ్వర్యంలో పనిచేస్తారు.

జనాభా[మార్చు]

 • జనాభా పెరుగుదల కారణంగా 1981లో 180 మురికి వాడలున్న విశాఖపట్నంలో, 2011 సంవత్సరానికి 650 పైగా మురికి వాడలు ఉన్నాయి. వీరికి ఉండటానికి చోటు లేక, సిండియా నుంచి గాజువాక వరకూ వున్న పారిశ్రామిక ప్రాంతంలోని కొండల మీద నివాసం ఉంటున్నారు. అలాగే కప్పరాడ, మధురవాడ ప్రాంతాలలోని కొండల మీద నివాసాలు పెరిగాయి. వీరంతా వలస వచ్చిన వారే. ఫలితంగా వర్యావరణ సమస్యలు, కొండల మీద పచ్చదనం అంతరించి పోవటం జరుగు తుంది. విశాఖపట్నంలో జనాభా పెరిగిన తీరు. క్రింద ఇచ్చిన టేబుల్ చూడు.
 • విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ జనాభా (2001 జనాభా లెక్కల ఆధారంగా)........... 9,82,910
 • 32 గ్రామ పంచాయతీల జనాభా (ఇవి మహావిశాఖపట్నం నగరపాలక సంస్థలో కలిసినవి).. 1,95,489.
 • గాజువాక పురపాలక సంఘము (ఇది మహావిశాఖపట్నం నగరపాలక సంస్థలో కలిసినది)... 2,48,953.
 • మొత్తం జనాభా ...........................................................................20,91,320.


సంవత్సరం జనాభా పెరుగుదల శాతం
1901 40,892
1931 57,303 28.16%
1951 1,08,042 53.81%
1961 2,11,190 95.47%
1971 3,63,504 66.91%
1981 5,65,321 60.37%
1991 10,57,118 86.99%
2001 13,45,938 25.76%
2011 20 లక్షల వరకూ పెరగ వచ్చును (అంచనా మాత్రమే)

జనాభా 2001 నుంచి 2011 వరకు (గత పదేళ్ళలో) నాలుగు లక్షల వరకు పెరిగి ఉంటుందని జనాభా అధికారులు అంచనా వేస్తున్నారు. 2011 ఫిబ్రవరి 9 నుంచి 2011 ఫిబ్రవరి 28 వరకు రెండో విడత జనాభా లెక్కల సేకరణ జరిగింది. 2001 లో నగర జనాభా 13.5 లక్షలు.ఇంతవరకూ, సేకరించిన జనాభా లెక్కల ఆధారంగా, 17.5 లక్షలవరకు నగర జనాభా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రాథమిక అంచనా. పూర్తిగా జనాభా లెక్కలు సేకరించిన తరువాత ఈ లెక్కలు మరింత పెరగ వచ్చును. గ్రామీణ ప్రాంతంలో పెరుగుదల 11 శాతం అంటే 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉండ వచ్చును. 2001 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో 24.50 లక్షల మంది ఉండగా, ఆ అంకె 27.50 లక్షలకు చేరవచ్చని అంచనా. విశాఖ నగరంతో కలిపి విశాఖపట్నం జిల్లా జనాభా 2001లో 38 లక్షలు. అదే 2011 నాటికి ఈ అంకెలు 45 లక్షలకు చేరవచ్ఛని అంచనా.

పరిశ్రమలు[మార్చు]

విశాఖ ప్రముఖ పారిశ్రామిక కేంద్రం. ఎన్నో భారీ పరిశ్రమలు ఇక్కడ నెలకొని ఉన్నాయి. వాటిలో కొన్ని:

ఉక్కునగరంలోని విశాఖ ఉక్కు కర్మాగారం 6.3 మిలియన్ టన్నుల సామర్ధ్యానికి విస్తరిస్తున్న తరుణంలో భవిష్యత్తులో ముడిసరుకు కొరత తలెత్తకుండాఅ ఉండేందుకు ఐరన్ ఓర్ (ఇనుప ఖనిజం) ఐరన్ ఓర్ యార్డు నిర్మాణాన్ని సంస్థ చేపడుతోంది సుమారు రూ.418 కోట్లతో నిర్మించనున్న ఐరన్ ఓర్ యార్డు నిర్మాణానికి 2010 జూలై 21 బుధవారం శంకుస్థాపన జరిగింది. ఐరన్ ఓర్ యార్డు నిర్మాణం పూర్తయితే సుమారు ఆరు లక్షల టన్నుల ముడి ఇనుప ఖనిజాన్ని నిల్వ చేయవచ్చు. యార్డు నిర్మాణంలో 65 వేల ఘనపు మీటర్ల కాంక్రీటు, 930 టన్నుల ఇనుము ఉపయోగించనున్నారు యార్డు నుంచి బ్లాస్ట్ ఫర్నేస్ విభాగానికి నేరుగా ఇనుప ఖనిజాన్ని చేరవేసేందుకు పది కి.మీ పొడవుగల కన్వేయరు బెల్టును నిర్మిస్తారు. ఐరన్ ఓర్ యార్డు నుంచి 3.4 కి.మీ పొడవుగల రైల్వే లైను ఏర్పాటు చేస్తున్నారు. అనుకోని పరిస్థితిలో (బందులు, లారీల సమ్మె, ఆందోళనలు, శాంతిభద్రతలకు భంగం జరిగిన సమయంలో, యుద్ధ వాతావరణంలో) రవాణా జాప్యమైతే కర్మాగారం ఇబ్బందుల్లో పడకుండా నిల్వ ఉంచిన ముడిసరుకును వినియోగించుకోవచ్చును. భవిష్యత్తులో గనుల నుంచి నేరుగా కర్మాగారానికి పైపుల ద్వారా ముడిసరుకు సరఫరా చేసేలా ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు.

పరిశ్రమల అభివృద్ధి కొరకు విశాఖపట్నంలో ఒక ప్రత్యేక ఆర్ధిక ప్రాంతంను ప్రభుత్వం నెలకొల్పింది. విశాఖపట్నంలో తమ కార్యకలాపాలను ప్రారంభించే విషయమై వివిధ సంస్థలతో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం సంప్రదిస్తూ ఉంది. భారత ప్రభుత్వపు భాభా అణు పరిశోధనా సంస్థ వారు తమ పరిశోధనా కేంద్రాన్ని, ఒక అణు విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విషయం పరిశీలిస్తున్నారు.

ఐ.టీ రంగంలో శీఘ్రంగా పురోగమిస్తున్న నగరాలలో విశాఖ ఒకటి. సత్యం కంప్యూటర్స్, హెచ్.ఎస్.బి.సి, సైనెక్టిక్ ఇన్ఫోటెక్ ప్రైవేటు లిమిటెడ్, నూనెట్ టెక్నాలజీస్ ఇక్కడ స్థావరం ఏర్పరచుకున్న ప్రముఖ సంస్థలు. ఐ.బీ.ఎమ్ వారు విశాఖ నడి ఒడ్డున వున్న రాంనగర్ లో కార్యాలయం ఏర్పాటు చేసారు వైజాగ్ సమీపంలోని పరవాడ,పైడి భీమవరంలో ఫార్మా కంపెనీలు అభివృద్ధి చెందాయి mylan,pfizer,avra వంటి కంపనులు ఉన్నాయి.దువ్వడా v సెజ్ లో కూడా ఉన్నాయి

భారత నౌకాదళం (ఇండియన్ నేవీ)[మార్చు]

విశాఖపట్నం సముద్రం వీక్షణ దృశ్యం

భారత నౌకా దళ తూర్పు కమాండుకు విశాఖపట్నం కేంద్ర స్థానం.(ప్రధాన స్థావరం).

పర్యాటకం[మార్చు]

తెన్నేటి పార్కు వద్ద బంగాళా ఖాతం సముద్రం వీక్షణ
విశాఖపట్నం, ఋషికొండ వద్ద సంధ్యా సమయం
సింహాచలం ఆలయం

జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి చెందింది, పలు పర్యాటక స్థలాలు, పుణ్యక్షేత్రాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ కలిపి 2017లో కోటి 78 లక్షల మంది పైచిలుకు, 2016లో రెండుకోట్ల 6 లక్షల పైచిలుకు పర్యాటకులు సందర్శించారని ప్రభుత్వ అంచనా.[7] 2016, 2017 సంవత్సరాల్లో అత్యధిక పర్యాటకులు సందర్శించిన ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో విశాఖపట్టణం జిల్లా మూడవ స్థానంలో కొనసాగుతోంది. విదేశీ పర్యాటకులు అత్యధికులు సందర్శించిన జిల్లాల్లో 2016, 2017ల్లో రెండో స్థానం నిలబెట్టుకుంది.

 • సింహాచలం - శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం.
 • డాల్ఫిన్స్ నోస్ (డాల్ఫిన్ చేప ముక్కులాగ వుంటుందని, ఈ కొండకు, ఆ పేరు పెట్టారు). 174 మీటర్ల ఎత్తులో, సముద్ర మట్టానికి 358 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ కొండమీద ఉన్న లైట్ హౌస్, సముద్రంలో ప్రయాణిస్తున్న నావికులకు, దారి చూపుతుంది. యాత్రికులు ఈ లైట్ హౌస్‌ను చూడవచ్ఛు. ఈ కొండ మీద నౌకాదళ సిబ్బందికి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. ఈ కొండ దిగితే, యారాడ అనే గ్రామం కనిపిస్తుంది. అరటి, కొబ్బరి పంట పొలాలతో పచ్ఛని పొలాలతో ఈ పల్లె కనిపిస్తుంది. కనకాంబరాలు కూడా ఇక్కడ పండిస్తారు.
 • రామకృష్ణ బీచ్ - విశాఖ వాసులకు ఇది మొదటి బీచ్. చాలా సుందరమైనది. సముద్రపు కోత వలన, బీచ్ విస్తీర్ణం తగ్గింది. ఈ ప్రాంతంలో, దేశ నాయకుల విగ్రహాలు, ప్రాంతీయ నాయకుల విగ్రహాలు నెలకొల్పారు. ఈ తీరానికి దగ్గరలోనే కాళికాలయం, రామకృష్ణా మిషన్, హవా మహల్, జలాంతర్గామి (కాల్వరి) మ్యూజియం ఉన్నాయి. భారత దేశంలో ఇటువంటి మ్యూజియం మరెక్కడా లేదు
 • కాళికా దేవి ఆలయం
 • ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఆంధ్ర విద్యా కళా పరిషత్)
 • కైలాసగిరి - శంఖం, ఛక్రం, నామాలు రాతిపూట కైలాసగిరి కొండ మీదనుంచి రాత్రివేళ మెరుస్తూ కనిపిస్తాయి. శివ పార్వతుల విగ్రహాలు కనువిందు చేస్తాయి కొండమీద.
 • వైజాగ్ స్టీలు ప్లాంటు
 • రిషికొండ బీచ్ - నగరానికి 8కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ పర్యాటక శాఖ, పున్నమి రిసార్టులను వర్యాటకులకు అద్దెకు ఇస్తుంది. ఇక్కడి సముద్ర తీరం స్నానాలు చేయటానికి సురక్షితమైన చోటు.
 • జగదాంబా సెంటరు - జగదాంబ సినీమా హాలు కట్టక ముందు, ఈ ప్రాంతాన్ని, ఎల్లమ్మ తోటగా పిలిచే వారు. నాగుల చవితి నాడు, ఇక్కడి చుట్టుపక్కల వున్న ప్రజలు పుట్టలో పాలు పోసేవారు. అన్ని పాము పుట్టలు వుండేవి. చిన్న అడవి లాగా వుండేది. ఇప్పటికీ, ఇక్కడ ఎల్లమ్మ గుడి ఉంది. ఇక్కడి భూములన్నీ 'దసపల్లా' రాజులకు చెందినవి. అందుకు గుర్తుగా ఇక్కడ కట్టిన సినిమా హాలు పేరు 'దసపల్లా ఛిత్రాలయ'. హోటల్ వేరు 'దసపల్లా హోటల్'. జగదాంబ 70 ఎమ్. ఎమ్. థియేటర్ కట్టిన తరువాత, ఈ ప్రాంతం అంతా వ్యాపార పరంగా అభివృద్ధి చెంది, విశాఖపట్నం అంటే, జగదాంబ సెంటరు ఆందరికీ గుర్తు వస్తుంది. అర్.టి.సి. కాంప్లెక్స్ కట్టేవరకు, విశాఖపట్నం జగదాంబ సెంటర్ వరకే వుండేది.
 • విశాఖపట్నం జిల్లా కలెక్టరు కార్యాలయం
 • ఆంధ్ర వైద్య కళాశాల
 • విశాఖ నౌకాశ్రయము
 • విశాఖపట్నం చేపలరేవు
 • ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల
 • అరకు: వేసవి విడిది. ఇక్కడికి 112 కి.మీ దూరం. అరకు లోయ 3100 అడుగుల ఎత్తులో ఉంది. విశాఖ నుంచి అరకు లోయకు రైలు ప్రయాణం ఒక మధురానుభూతి. పచ్ఛని లోయలు, హోటళ్ళు, విశ్రాంతి మందిరాలు వునాయి. పద్మాపురం గార్డెన్స్, బొర్రా గుహలు కూడా చూడదగినవి. బొర్రా గుహలు (90 కి.మీ దూరం) 10లక్షల సంవత్స్రరాల క్రితం ఏర్పడినవి. పర్యాటక శాఖ ఈ గుహలను విద్యుత్ దీపాలతో అలంకరించింది.
 • జంగిల్ బెల్స్, తైద: విశాఖకి 75 కి.మీ దూరంలో వున్న తైద ఒక గిరిజన గ్రామం
 • ముడసర్లోవ
 • భీమిలి బీచ్
 • ఆంధ్రా తాజ్ మహల్ (కురుపాం రాజులది)
 • ఇసుక కొండ మీద వెలిసిన సత్యనారాయణ స్వామి.
 • నీలమ్మ వేపచెట్టు.
 • కరక చెట్టు పోలమాంబ.
 • శ్రీ కనక మహాలక్ష్మి అమ్మ వారి దేవస్థానం
 • పోర్టు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ మూడు కొండలు ఉన్నాయి.ఒక కొండపై వెంకటేశ్వర స్వామి, ఒక కొండపై ముస్లిములకు పవిత్రమైన దర్గా, మరొక కొండపై (రాస్ కొండ) క్రైస్తవులకు పవిత్రమైన ఛర్చి ఉన్నాయి. విశాఖపట్నంలోని ఈమూడు మతాల పవిత్ర ప్రదేశాలు చూడటం ఒక మధురానుభూతి.
 • కణితి బేలన్సింగ్ రిజర్వాయరు (స్టీల్ సిటీలో ఉన్నది).
 • అయ్యప్ప గుడి (షీలా నగర్ దగ్గర).
 • వైశాఖి జల ఉద్యానవనం
 • ఎర్రమట్టి దిబ్బలు
 • వుడా పార్క్
 • బావనా ఋషి కోవెల (బురుజు పేట దగ్గర వున్న కనక మహాలక్ష్మి గుడికి దగ్గర)
 • ఇస్కాన్ టెంపుల్
 • శారదా పీఠం. (చిన ముషిడివాడ దగ్గర)
 • కాళికాలయం. మూడు కాళికాలయాలు ఉన్నాయి. ఒకటి రామకృష్ణ బీచ్ దగ్గర, రెండవది ఉక్కు నగరంలో, మూడవది రైల్వే స్టేషను దగ్గర.
 • సాగర దుర్గాదేవి (డాల్ఫిన్స్ నోస్ కొండ క్రింద - కోరమాండల్ బీచ్ )
 • కటికి జలపాతం

విద్యుత్ శక్తి[మార్చు]

విశాఖపట్నానికి, 2011 వేసవి కారణంగా, ఆంధ్ర ప్రదేశ్ ట్రాన్స్‌కో, 'ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్'(ఈపీడీసీఎల్) కు, ప్రతిరోజు 12 మిలియన్ యూనిట్ల వరకు వినియోగించుకునేందుకు అవకాశం 2011 మే 6 నుంచి ఇచ్చింది. ఈపీడీసీఎల్ సంస్థ పరిధిలో విశాఖపట్నం జిల్లాలోనే విద్యుత్ వాడకం ఎక్కువగా ఉంటుంది. భారీ పరిశ్రమలు, వాణిజ్య, గృహావసరాలకు అవసరమైన విద్యుత్ సరఫరాను ఈ సంస్థ సరఫరా చేయాలి. ప్రతి ఏడాది రోజువారీ పరిమితి (కోటా) 8 మిలియన్ యూనిట్ల నుంచి పది మిలియన్ యూనిట్ల వరకు ఉండేది. 2011 సంవత్స్రానికి ఈ పరిమితి 11 మిలియన్ యూనిట్లకు పెరిగింది. 2011 మే 3 నుంచి పగటి వేడి 37 డిగ్రీలకు పెరగడంతో, నగరంలో ఏ.సి.ల వాడాకం విపరీతంగానే ఉంది. పరిశ్రమలు, సినిమాహాళ్ళు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వరంగ సంస్థల వినియోగం ఒక్కసారిగా పెరిగింది. అందుచేత, పట్టణ అవసరాలకు అనుగుణంగా, కోతల్లేని సరఫరా చేయటానికి సహకరించాలని, ఈపీడీసీఎల్ ఏపి ట్రాన్స్‌కోకు విన్నవించుకుంది. వెంటనే 'ఏపిట్రాన్స్‌కో' రోజువారీ వాడకానికి తగ్గట్లుగా పరిమితిని 12 మిలియన్ యూనిట్లకు పెంచింది. మే 2011 వరకూ ఈ పరిమితి ఉంటే ఛాలు అనుకుంటుంది ఈపీడీసీఎల్. కానీ, గ్రామాలలో విద్యుత్ కోత మామూలుగానే ఉంటుంది. వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్తును ఇవ్వాలని నిర్ణయించింది.నగరంలోని పరిశ్రమలకు 'హేపీ డే' అమలు కారణంగా, పారిశ్రామికులు ఆనందిస్తున్నారు. వాణిజ్య విద్యుత్ సరఫరాకు ఎటువంతి అంతరాయాలు కలగటంలేదు.

చూడు : విద్యుత్తు వాడకం

రవాణా సౌకర్యాలు[మార్చు]

రోడ్డు మార్గము[మార్చు]

విశాఖపట్నం నగరంలోని నగర బస్సులు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఎ.పి.ఎస్.ఆర్.టి.సి) వారి అజమాయిషీలో నడుపుతున్నారు. ఈ బస్సులు ఆరు రూట్లలో నడుపుతున్నారు. రూట్ నెంబర్లు 1 నుంచి 9ఇ 9జి నుంచి 25, 28 నుంచి 38, 38 నుంచి 55, 56 నుంచి 338, 400 ఎమ్ నుంచి 777.

ద్వాకకాబస్ స్టేషన్ విశాఖ పట్నం
 • ఈ స్టేషను నుంచి ఇతర రాష్ట్రాలకి, ఇతర నగరలాకి, ఇతర జిల్లాలకి బస్సులు ఉన్నాయి. బస్సు ప్లాట్ పారాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సిటీ బస్సుల ప్లాట్ పారాలు వేరుగాను, రూట్ బస్సుల ప్లాట్ పారాలు వేరుగాను ఉన్నాయి. రమారమి 40 రూటు సర్వీసులను ఇక్కడ నుంచి నడుపుతున్నారు.
 • ఆర్.టి.సి బస్సుల మీద రాసే ఈ దిగువ అక్షరాలకి అర్ధం ఇలా వుంటుంది. ఆయా బస్సు డిపోల పేర్లు క్లుప్తంగా ఇలా వుంటాయి.
  • సి.బి.ఎస్ అంటే సెంట్రల్ బస్ స్టేషను (ద్వారకా బస్ స్టేషను) కానీ ప్రజల వాడుకలో ఇది ఆర్.టి.సి. కాంప్లెక్స్.
  • ఎమ్.డి.పి. అంటే మద్దిలపాలెం డిపో.
  • ఎమ్.వి.పి. అంటే మువ్వలవాని పాలెం డిపో.
  • ఎస్.ఎమ్.ఎల్ అంటే సింహాఛలం.
  • జి.డబల్యు.కె అంటే గాజువాక.
  • ఓ.హెచ్.పి.ఓ అంటే ఓల్డ్ హెడ్ పోస్టు ఆఫీసు (పాత పోస్టు ఆవీసు అని వాడుక).
  • జెడ్.పి అంటే జిల్లా పరిషత్ ఆఫీసు. (కలెక్టరు ఆఫీసు దగ్గర).
 • ప్రజలకు, పర్యాటకులకు కావలసిన అద్దె కార్లు (టాక్సీలు), లగ్జరీ బస్సులు, సరుకు రవాణాకు కావలసిన్ లారీలు సరఫరా చేయటానికి నగరంలో చాలా ప్రైవేటు సంస్థలు ఉన్నాయి.

మెట్రో రైలు వ్యవస్థ[మార్చు]

నగరంలో మెట్రో రైలు వ్యవస్థ ఎర్పాటు ప్రతిపాదించబదింది.

రైలు మార్గము[మార్చు]

విశాఖపట్నం-విజయవాడ మార్గము
ఖుర్దా రోడ్ - విశాఖపట్నం రైలు మార్గము వరకు
కొత్తవలస-కిరండల్ మార్గము వరకు
24 కొత్తవలస
15 పెందుర్తి
8 ఉత్తర సింహాచలం
7 సింహాచలం
6 గోపాలపట్నం
జాతీయ రహదారి 16
మార్షలింగ్ యార్డు (కుడివైపు లైన్లు
4 విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం
మర్రిపాలెం
నావల్ డాక్ యార్డు
ఎస్సార్ స్టీల్
ఐరన్ ఓర్ సైడింగులు
9 కొత్తపాలెం
విశాఖపట్నం పోర్టు - హార్బరు లోపల
0 విశాఖపట్నం
హిందూస్థాన్ జింక్ లిమిటెడ్
భారత్ హెవీ ప్లేట్ అండ్ వెసెల్స్(బిహెచ్‌పివి)
జాతీయ రహదారి 16
కోరమాండల్ ఇంటర్నేషనల్
విశాఖపట్నం రిఫైనరీ ఆఫ్
హిందూస్థాన్ పెట్రోలియం (హెచ్‌పిసిఎల్)
విశాఖపట్నం పోర్టు చానల్ (నీలం)'
విశాఖపట్నం పోర్టు - హార్బరు లోపల
హిందుస్థాన్ నౌకానిర్మాణ కేంద్రం
విశాఖపట్నం పోర్టు - హార్బరు బయట
డాల్ఫిన్స్ నోస్ (కొండతో లైట్‌హౌస్)
బంగాళాఖాతంలింకుకు
విశాఖ ఉక్కు కర్మాగారం
17 దువ్వాడ
జాతీయ రహదారి 16
సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్
27 తాడి
జాతీయ రహదారి 16
33 అనకాపల్లి
38 కశింకోట
42 బయ్యవరం
జాతీయ రహదారి 16
50 నరసింగపల్లి
57 ఎలమంచిలి
జాతీయ రహదారి 16
62 రేగుపాలెం
75 నర్సీపట్నం రోడ్డు
86 గుల్లిపాడు
జాతీయ రహదారి 16
తాండవ నది
97 తుని
105 హంసవరం
110 తిమ్మాపురం
113 అన్నవరం
123 దుర్గాడ గేటు
133 గొల్లప్రోలు
138 పిఠాపురం
150 / 13 సామర్లకోట
సర్పవరం
కాకినాడ టౌను
0 కాకినాడ పోర్టు
నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్
కాకినాడ
కోరమాండల్ ఇంటర్నేషనల్
గోదావరి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్
6 కొవ్వాడ
10 అర్తలకట్ట
15 కరప
18 వాకాడ
22 వేలంగి
24 నరసపురపుపేట
30 రామచంద్రపురం
35 ద్రాక్షారామం
39 కుందూరు
42 గంగవరం
45 కోటిపల్లి
కోటిపల్లి రేవు (యార్డు)
155 గూడపర్తి
159 మేడపాడు
162 పెదబ్రహ్మదేవం
167 బిక్కవోలు
171 భలబద్రపురం
177 అనపర్తి
181 ద్వారపూడి
185 కేశవరం
జివికె పవర్ ప్లాంట్
191 కడియం
జాతీయ రహదారి 16
200 రాజమండ్రి
204 గోదావరి / రాజమండ్రి విమానాశ్రయం
గోదావరి ఆర్చ్ వంతెన / గోదావరి
గోదావరి వంతెన / గోదావరి
208 కొవ్వూరు
211 పశివేదల
215 చాగల్లు
219 బ్రాహ్మణగూడెం
223 నిడదవోలు
230 కాలధారి
234 సత్యవాడ
జాతీయ రహదారి 16
239 తణుకు
242 వేల్పూరు
245 రేలంగి
234 సత్యవాడ
250 అత్తిలి
252 మంచిలి
257 ఆరవిల్లి
260 లక్ష్మీనారాయణపురం
262 వేండ్ర
272 / 0 భీమవరం
30 నరసాపురం
26 గోరింటాడ
21 పాలకొల్లు
16 లంకలకోడేరు
13 శివదేవుచిక్కాల
11 వీరవాసరం
7 శృంగవృక్షం
5 పెడన
274 భీమవరం టౌన్
281 ఉండి
286 చెరుకువాడ
292 ఆకివీడు
302 పల్లెవాడ
308 కైకలూరు
316 మండవల్లి
319 మొఖాసా కలవపూడి
322 పుట్లచెరువు
324 పసలపూడి
327 గుంటకోడూరు
330 మోటూరు
337 / 0 గుడివాడ జంక్షన్
మచిలీపట్నం పోర్ట్ (ప్రతిపాదన)
374 మచిలీపట్నం
370 చిలకలపూడి
364 పెడన
356 వడ్లమన్నాడు
352 కౌతరం
348 గుడ్లవల్లేరు
343 నూజెళ్ళ
7 దోసపాడు
9 వెంట్రప్రగడ
13 ఇందుపల్లి
18 తరిగొప్పుల
24 ఉప్పలూరు
30 నిడమానూరు
జాతీయ రహదారి 16
35 రామవరప్పాడు
39 మధురానగర్
230 మారంపల్లి
234 నవాబ్‌పాలెం
237 ప్రత్తిపాడు
243 తాడేపల్లిగూడెం
249 బాదంపూడి
254 ఉంగుటూరు
257 చేబ్రోలు
260 కైకరం
265 పూళ్ళ
271 భీమడోలు
277 సీతంపేట
281 దెందులూరు
ఎన్.హెచ్. 5
290 ఏలూరు
292 పవర్‌పేట
299 వట్లూరు
ఎన్.హెచ్. 5
309 నూజివీడు
315 వీరవల్లి
318 తేలప్రోలు
325 పెదఆవుటపల్లి
330 విజయవాడ విమానాశ్రయము
గన్నవరం
337 ముస్తాబాద
344 గుణదల
వరంగల్ కు
350 / 43 విజయవాడ జంక్షన్
కృష్ణానది
గుంటూరుకు
విజయవాడ-చెన్నై రైలు మార్గము నకు

Source:Google maps, India Rail Info 57226,
Visakhapatnam-Machilipatnam passenger,
Machilipatnam Vijayawada DEMU,
Kakinada-Kotipalli Rail Car, Narsapur Hyerabad Express
Narsapur-Bhimavaram Passenger

విశాఖపట్నంలో రైల్వేస్టేషను ఉంది. మర్రిపాలెమ్ రైల్వేస్టేషను, గోపాల పట్నం రైల్వేస్టేషను, సింహాఛలం రైల్వీస్టేషను కూడా ఉన్నాయి. దువ్వాడ దగ్గర ఒక రైల్వే స్టేషను ఉంది. క్రమంగా విశాఖ పట్నం రైల్వేస్టేషను పై ఒత్తిడి తగ్గించుటకు రైళ్ళను దువ్వాడ మీదుగా మళ్లించుట జరుగుతొంది.

విమాన మార్గము[మార్చు]

విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి విజయవాడ, హైదరాబాదు, బొంబాయి, ఢిల్లీ, చెన్నై, భువనేశ్వర్ నగరాలకు విమానాలు తిరుగుతాయి. ఇక్కడ రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. ఒకటి పౌరులకు. రెండవది నౌకాదళానికి చెందిన విమానాశ్రయం (దీన్ని ఐ.ఎన్.ఎస్. డేగ అంటారు). ఇక్కడ నౌకాదళానికి చెందిన విమానాలు, హెలికాప్టర్లు ప్రయాణిస్తుంటాయి. ఇది పౌరులకు నిషిద్ధ ప్రాంతం.

మార్కెట్లు / బజార్లు[మార్చు]

 • పూర్ణా మార్కెట్ : (సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్)
 • కురుపాం మార్కెట్ : మొదటి నుంచి ఈ ప్రాంతం బంగారం, వెండి వ్యాపారానికి ప్రసిద్ధి. విశాఖపట్నంలో మొట్ట మొదటి బంగారం, వెండి వ్యాపార కేంద్రం. కురౌపాం రాజులు,వారి పాలనా కాలంలో ఈ మార్కెట్టును కట్టించారు. ఇప్పటికీ, కురుపాం మార్కెట్టు లోనికి వెళ్ళే ద్వారం మీద వారి పేరు వుంటుంది. ఈ ప్రాంతంలో దొరకని ఆయుర్వేద మూలిక వుండదు. అలగే, యజ్ఞాలు చేసే సమయంలో వేసే పూర్ణాహుతి సామాన్లు కోసం, పెళ్ళి చేసుకునే సమయంలో వేసే కర్పూరం దండలు వగైరా సామాన్లు కోసం కురుపాం మార్కెట్ కి రాక తప్పదు.
 • కాన్వెంట్ జంక్షన్ అని పిలిచే చావుల మదుం దగ్గరకి తెల్లవారు ఝామునే, లారీల మీద దేవరాపల్లి, మాడుగుల వంటి అటవీ (ఏజెన్సీ) ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల కూరగాయలు పండించే రైతులు, ఇక్కడికి తెచ్చి వేలంపాట ద్వారా కూరగాయలు అమ్ముతారు. విశాఖపట్నంలోని కూరగాయల వ్యాపారులు, హోటళ్ళ వారు వీటిని పెద్ద మొత్తంలో కొనుక్కుని వెళతారు. వీరు, విశాఖ నివాసులకి స్థానికంగా వున్న బజారులలో అమ్ముకుంటారు.
 • గాజువాక : గాజువాక మెయిన్ రోడ్డుకి దగ్గరలోనే, పళ్ళ మార్కెట్ ఉంది.ఆరటి పళ్ళ గెలలు, కాలాన్ని బట్టి పండే, మామిడి, పుచ్చకాయలు వంటివి ఇక్కడ వేలంపాట ద్వారా అమ్ముతారు. ఆ పక్కనే, కణితి గ్రామానికి వెళ్ళే దారిలో, గాజువాక చుట్టుప్రక్కల గ్రామాల వారికి కావలసిన కిరాణా సరుకులు, కూరగాయలు, మాంసాహారం, చేపలు వగైరా అమ్ముతారు. ఇది ఈ చుట్టు ప్రక్కల చాలా పెద్ద మార్కెట్టు. రెండు, మూడు సార్లు పెద్ద అగ్నిప్రమాదాల పాలై, కోలుకున్న మార్కెట్టు ఇది. అక్కడికి దగ్గరలోనే వెండి, బంగారం దుకాణాలు ఎక్కువగానే ఉన్నాయి.

స్వచ్ఛంద సంస్థలు[మార్చు]

విశాఖపట్నంలో లైన్స్ క్లబ్ (లయన్స్ క్లబ్), రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్. సావిత్రిబాయి ఫూలే ట్రస్టు, గోపాల పట్నం. ప్రతిజ్ఞ ఛారిటబుల్ ట్రస్టు, ఆర్.పి.పేట, మర్రిపాలెం, ప్రేమ సమాజం వంటి అనేక స్వచ్ఛంద సంస్థలున్నాయి

సాంస్కృతిక సంస్థలు[మార్చు]

విశాఖ సాహితి

కళాభారతి

విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన కళాభారతి 1991 మార్చి 3 న స్థాపించారు. వ్యవస్థాపక దినోత్సవము ప్రతీ సంవత్సరము 3 మార్చి న జరుగుతుంది. సంగీత విద్వన్మణి సుసర్ల శంకర శాస్త్రి కలలకు ప్రతీకగా పుట్టిన ఈ ఆడిటోరియాన్ని 1991 మే 11 తేదీన పిఠాపురం కాలనీలో ప్రారంభించారు. ఇక్కడ నిత్యం, వివిధ సంగీత కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు (సంప్రదాయ, జానపద), నాటకాలు జరుగుతూ, ఆంధ్ర దేశపు ఔన్న్తత్యాన్ని తెలియ జేస్తుంటాయి. ఆగస్టు 2011 లో రజతోత్సవాలు జరుగుతాయి.

విశాఖ మ్యూజిక్ డాన్స్ అకాడమీ

ఈ సంస్థ విశాఖపట్నంలోని సంగీత (కర్ణాటక, హిందుస్థానీ), నృత్య కార్యక్రమాలకు కేంద్ర స్థానంగా ఉంది. సంగీత, నృత్య ప్రదర్శనల కార్యక్రమాలను, త్యాగరాజు ఆరాధనోత్సవాలు, మొదలైన కార్యక్రమాలు జరిస్తుంది. విశాఖపట్నంలోని సంగీతం, నృత్యం అంటే అభిమానం ఉన్నవారికి, ఈ సంస్థ వారిని నిత్యం ఆనందింపచేస్తుంది.

కళ్యాణ మండపాలు[మార్చు]

 • తి.తి.దే. కళ్యాణమండపం. ఇది ఎం.వి.పీ. (మువ్వల వాని పాలెం) కాలనీలో ఉంది.

పత్రికా సంస్థలు[మార్చు]

ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, వార్త, ఆంధ్ర భూమి,వాలు పాఠ్యం ఆంధ్ర ప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్, ద హిందూ (విజయ నగరం నుంచి ముద్రితం అవుతుంది) andhralekha daily

ప్రముఖులు[మార్చు]

నియోజక వర్గాలు[మార్చు]

శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గం
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం - సింహాఛలం (కొంత భాగం), భీమిలి (భీమునిపట్నం) మునిసిపాలిటీ, భీమిలి మండలం, పద్మనాభం, ఆనందపురం.
తూర్పు విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గం - 1 నుంచి 11 వార్డులు,
దక్షిణ విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గం - 12 నుంచి 34, 42, 43 వార్డులు.
పశ్చిమ విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గం - 35 నుంచి 49, మరియు 66 నుంచి 69 వార్డులు.
ఉత్తర విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గం - 26 నుంచి 33 వార్డులు.
గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం - గాజువాక, పెద గంట్యాడ మండలాల్లో వున్న 50నుంచి 65 వార్డులు.
పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం - 69 నుంచి 72 వార్డులు. పెందుర్తి, సింహాచలం మండలంలు.

చిత్రమాలిక[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

అంధ్రప్రదేశ్ టూరిజం

మూలాలు[మార్చు]

 1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 7 February 2016. Retrieved 29 January 2016. 
 2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
 3. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127 – 140. Retrieved 1 December 2014. 
 4. "Visakhapatnam". India Meteorological Department. May 2011. Retrieved 26 March 2010. 
 5. "IMD – Temperature extremes recorded upto 2010". India Meteorological Department (Pune). Retrieved 2 July 2014. 
 6. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 240. Retrieved 10 March 2015. 
 7. [http://web.archive.org/save/http://apfootfall.viswagnan.com/web/ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఫుట్‌ఫాల్స్ సమాచారం (ఆర్కైవ్)

మూసలు, వర్గాలు[మార్చు]