రేసపువానిపాలెం
రేసపువానిపాలెం | |
---|---|
సమీపప్రాంతం | |
![]() రేసపువానిపాలెంలో టెక్ మహేంద్ర సెంటర్ | |
నిర్దేశాంకాలు: 17°44′00″N 83°18′55″E / 17.733310°N 83.315314°ECoordinates: 17°44′00″N 83°18′55″E / 17.733310°N 83.315314°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
ప్రభుత్వం | |
• నిర్వహణ | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
కాలమానం | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్‌కోడ్ | 530013 |
రేసపువానిపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని శివారు ప్రాంతం.[1][2]
భౌగోళికం[మార్చు]
బంగాళాఖాతానికి పశ్చిమాన ఉన్న ప్రధాన వాణిజ్య, నివాస శివారు ప్రాంతాలలో ఇదీ ఒకటి. విశాఖపట్నం బిఆర్టిఎస్ రోడ్డు రేసపువనిపాలెంను అసీల్‌మెట్ట, ద్వారకా నగర్ తో కలుపుతోంది. ఇది గతంలో అసీల్‌మెట్ట, మద్దిలపాలెం మధ్య ఒక చిన్న శివారు ప్రాంతంగా ఉండేది. విశాఖపట్నంలోని అతిపెద్ద ఇండోర్ స్టేడియమైన స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం ఇక్కడ ఉంది.
భౌగోళికం[మార్చు]
ఇది 17°44′00″N 83°18′55″E / 17.733310°N 83.315314°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
సమీప ప్రాంతాలు[మార్చు]
ఈ ప్రాంతానికి సమీపంలో మద్దిలపాలెం, నక్కవానిపాలెం, సీతమ్మపేట, ద్వారకా నగర్, మధురానగర్ ఉన్నాయి.
వాణిజ్యం[మార్చు]
ఇక్కడ స్పెన్సర్స్ మార్కెట్, రిలయన్స్ మార్ట్, అనేక ఇతర దుకాణాలు కూడా ఉన్నాయి.
ప్రార్థనా మందిరాలు[మార్చు]
- గణేష్ దేవాలయం
- సంపత్ వినాయగర్ దేవాలయం
- దుర్గా దేవాలయం
- రూహని షిఫా ఖానా
- తారా మసీదు
- యాసిన్ మసీదు
- రామాలయం మందిరం
రవాణా[మార్చు]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రేసపువానిపాలెం మీదుగా విశాఖపట్నం విమానాశ్రయం, రామకృష్ణ బీచ్, కురమనపాలెం, తగరపువలస, హెచ్‌బి కాలనీ, ఓహ్పో, రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[3]
మూలాలు[మార్చు]
- ↑ "location". maps of india. 25 August 2017. Retrieved 8 May 2021.
- ↑ "Resapuvanipalem Locality". www.onefivenine.com. Retrieved 8 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 8 May 2021.