Jump to content

హనుమంతవాక

అక్షాంశ రేఖాంశాలు: 17°45′37″N 83°19′33″E / 17.760167°N 83.325831°E / 17.760167; 83.325831
వికీపీడియా నుండి
హనుమంతవాక
సమీపప్రాంతం
హనుమంతవాక జంక్షన్
హనుమంతవాక జంక్షన్
హనుమంతవాక is located in Visakhapatnam
హనుమంతవాక
హనుమంతవాక
విశాఖట్నం నగర పటంలో హనుమంతవాక స్థానం
Coordinates: 17°45′37″N 83°19′33″E / 17.760167°N 83.325831°E / 17.760167; 83.325831
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
ప్రభుత్వం
 • సంస్థమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
కాల మండలంUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530040
Vehicle registrationఏపి-31, 32, 33

హనుమంతువాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఒక ప్రాంతం.[1] మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలన పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతం మొదట్లో విశాఖపట్నం వెలుపల ఒక చిన్న శివారు ప్రాంతంగా ఉండేది. విశాఖపట్నం నగరంలోని పేరొందిన పర్యాటక ప్రదేశం కైలాసగిరి ఈ ప్రాంతంలోనే ఉంది.

భౌగోళికం

[మార్చు]

ఇది 17°45′37″N 83°19′33″E / 17.760167°N 83.325831°E / 17.760167; 83.325831 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో రవీంద్రనగర్, అరిలోవ, సుందర్ నగర్, దుర్గా నగర్, ఆదర్శ్ నగర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

ఆస్పత్రులు

[మార్చు]

ఈ ప్రాంతంలో విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్), ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉన్నాయి.

రవాణా

[మార్చు]

16వ జాతీయ రహదారి ద్వారా కలుపబడి ఉన్న హనుమంతువాక నగరంలోని అత్యంత రద్దీగా ఉండే జంక్షన్లలో ఒకటిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో హనుమంతవాక మీదుగా అరిలోవ, తగరపువలస, భీమిలి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో మర్రిపాలెం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[2]

మూలాలు

[మార్చు]
  1. "Hanumanthavaka Locality". www.onefivenine.com. Retrieved 17 May 2021.
  2. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 17 May 2021.