మధురవాడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధురవాడ వద్ద జాతీయ రహదారి 5.

మధురవాడ ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం నగరమున శివారు గ్రామం. ఇది జాతీయ రహదారి 5 మీద విశాఖ-విజయనగరం మధ్య విశాఖపట్నం నుండి 16 కి మీ దూరంలో ఉంది. ఈ ఊరు మహా విశాఖపట్నం నగర పాలక సంస్థలో విలీనం చేయబడింది.

ఈ ప్రాంతం విశాఖ నగర శివారు ప్రాంతంగా క్రీడా, విద్యా వాణిజ్య పరంగా బాగా అభివృధి చెందుతున్నది. విశాఖ నగరానికి మణిపూస అయిన ఏ సి ఏ వీ డి సి ఏ అంతర్జాతీయ క్రికెట్ మైదానం మధురవాడకు కేవలం ఒక కి. మీ. దూరంలో ఉంది.

విశాఖ లోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలు - గాయత్రీ ఇంజినీరింగ్ కళాశాల, చైతన్య ఇంజినీరింగ్ కళాశాల, సాంకేతిక విద్యా పరిషత్ ఇంజినీరింగ్ కళాశాల మరియు ప్రముఖ విద్య సంస్థలు జవహర్ నవజీవన్, మాస్టర్స్ పబ్లిక్ స్కూల్ ఈ ప్రాతంలోనే ఉన్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే మధురవాడలో ఏర్పడబడిన "జాతర" కళావేదిక పర్యాటకులకు ఒక ప్రధాన ఆకర్షణ.

మధురవాడ లోని శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి దేవాలయం చాలా ప్రసిద్ధం.

విశాఖ నగరం నుండి 25E, 25B, 222, 999, మరియు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకుకు వెళ్ళే జిల్లా సర్వీసు బస్సుల ద్వారా మధురవాడ చేరుకోవచ్చును.

"https://te.wikipedia.org/w/index.php?title=మధురవాడ&oldid=2231039" నుండి వెలికితీశారు