సీతమ్మధార
Jump to navigation
Jump to search
సీతమ్మధార విశాఖపట్నం నగరం లోని ఒక ప్రముఖ ప్రాంతం. ఈ ప్రాంతం విశాఖలోని సింహాచలం పర్వత శ్రేణి దిగువ భూమిలో నెలకొని ఉంది. ఒకపుడు కొండనుండి ప్రవహించే నీటి ధార ఆధారంగా ఈ ప్రాంతానికి సీతమ్మధార అని పేరు వచ్చిందని నానుడి.
ఈ ప్రాంతం ఇప్పుడు విశాఖ లోని ఒక ప్రాముఖ్య విద్యా, వాణిజ్య, గృహ నివాస ప్రాంతం. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ తెలుగు దినపత్రిక అయిన "ఈనాడు" ప్రథమ కార్యాలయం సీతమ్మధార లోని నక్కవానిపాలెంలో స్థాపించబడింది. ఇచ్చట ఆంగ్ల దిన పత్రిక " ది హిందూ" విశాఖ నగర కార్యాలయము కూడా నున్నది. విశాఖ నగర వాసుల నిత్యా వసరాలు తీర్చేందుకు కూరగాయల, నిత్యావసర సరుకుల బజారు ""రైతు బజార్" ఇచ్చట నెలకొల్పబడింది. విశాఖ లోని వైద్యుల నివాస ప్రాంతం "డాక్టర్స్ కాలనీ" సీతమ్మధార లోనే ఉంది.
ప్రముఖ సంస్థలు[మార్చు]
- సీతమ్మధార లోని బ్యాంకులు--
- భారతీయ స్టేట్ బ్యాంక్
- ఆంధ్రా బ్యాంక్
- ఇండస్ ఇండ్ బ్యాంక్,
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
- సీతమ్మధార లోని విద్యాలయాలు--
- సెంట్ ఫ్రాన్సిస్ సేల్స్ (ఎస్ ఎఫ్ ఎస్ ) హై స్కూల్,
- సరస్వతి విద్య మందిర్.
- సీతమ్మధార లోని ప్రముఖ దేవాలయాలు---
- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం -హెచ్ బి కాలని రోడ్.
- శ్రీ షిర్డీ సాయి బాబా మందిరం - శ్రీ షిర్డీ సాయి బాబా స్పిరిత్చువల్ సెంటర్, షిర్డీ మార్గ్,
- శ్రీ కృష్ణ (గురువాయురప్పన్ ) మందిరం -నార్త్ ఎక్స్ టెన్షన్ [1],
- శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం -నార్త్ ఎక్స్ టెన్షన్,
- బాల ఏసు మందిరం (ఇన్ఫాంట్ జీసస్ చర్చ్) -మెయిన్ రోడ్
- సీతమ్మధార లోని ఆసుపత్రులు--
- నిఖిత హాస్పిటల్,
- లయన్స్ కాన్సర్ హాస్పిటల్,
- ఎన్ . ఆర్ . ఐ . హాస్పిటల్.
- సీతమ్మధారకు వెళ్ళే బస్సుల వివరాలు--
20A (పాత పోస్ట్ ఆఫీసు - హెచ్ బి కాలని) 69 (రైల్వే స్టేషను - ఆరిలోవ కాలనీ)