విశాఖపట్నం జిల్లా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?విశాఖపట్నం
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
View of విశాఖపట్నం, India
అక్షాంశరేఖాంశాలు: 17°43′20″N 83°17′25″E / 17.7221°N 83.2902°E / 17.7221; 83.2902
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 11,161 కి.మీ² (4,309 చ.మై)
ముఖ్య పట్టణము విశాఖపట్నం
ప్రాంతం కోస్తా
జనాభా
జనసాంద్రత
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
42,88,113 (2011 నాటికి)
• 384/కి.మీ² (995/చ.మై)
• 2140872
• 2147241
• 59.45(2001)
• 68.84
• 49.99
సింహాచలం ఆలయం పై వరాహమూర్తి రాతి ప్రతిమ
మహాస్తూపం, తొట్లకొండ బౌద్ధారామం
విశాఖపట్నంలో తెన్నేటి ఉద్యానవనం వద్ద సంధ్యా సమయం
విశాఖపట్నం వద్ద బంగాళాఖాతం
మంచు దుప్పట్లో పాడేరు ఘాటి రోడ్డు
భీమునిపట్నం మండలంలోని రాజుల తాళ్లవలస గ్రామం
బొజ్జన్నకొండ బౌద్ధారామం వద్ద సుందర దృశ్యం
భీమునిపట్నం వద్ద సంధ్యా సమయం
ఆహ్లాదకరమైన అరకులోయ

విశాఖపట్నం జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం విశాఖపట్నం

జిల్లా పేరు వెనుక చరిత్ర[మార్చు]

శివ పార్వతుల తనయుడు, శుక్ర గ్రహాధినేత, యుద్ధాల దేవుడు, ధైర్య సాహసాలకు మారు పేరూ అయిన, విశాఖ పేరిట నగరానికి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. ప్రాచీన గ్రంథాలైన రామాయణ, మహాభారతా లలో ఈ ప్రాంత ప్రస్తావన ఉన్నట్లు కనిపించుచున్నది. రాముడు సీత కొరకు వెదకుచూ ఈ ప్రాంతం గుండానే వెళ్ళినట్లు, ఈ పరిసరాల్లోనే శబరి ని కలవగా ఆమె హనుమంతుడు నివసించే కొండలకు దారి చూపినట్లు గా రామాయణం తెలియజేస్తున్నది. రాముడు జాంబవంతుని కలిసింది కూడా ఈ ప్రాంతం లోనే. ఈ ప్రాంతంలోనే భీముడు బకాసురుని వధించినాడని ప్రతీతి. ఇక్కడికి 40 కి మీల దూరంలోని ఉప్పలం గ్రామంలో పాండవుల ఆయుధాలను (రాతి)చూడవచ్చు.


స్థానికంగా వినవచ్చే కథ ఒకటి ఇలా ఉంది.(9-11 శతాబ్దపు) ఒక ఆంధ్ర రాజు, కాశీ కి వెళ్తూ ఇక్కడ విశ్రాంతి కొరకు ఆగాడు. ఆ ప్రదేశ సౌందర్యానికి ముగ్ధుడై,తన ఆరాధ్య దైవమైన విశాఖేశ్వరునికి ఇక్కడ ఒక గుడి నిర్మింపజేసాడు. కాని పురాతత్వ శాఖ ప్రకారం మాత్రం ఈ గుడి 11, 12 శతాబ్దాలలో కుళోత్తుంగ చోళునిచే నిర్మించబడినదని తెలుస్తోంది. శంకరయ్య చెట్టి అనే ఒక సముద్ర వ్యాపారి ఒక మండపాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ గుడి లేనప్పటికీ, - ఒక 100 ఏళ్ళ కిందట తుపానులో కొట్టుకు పోయి ఉండవచ్చు - ఈ ప్రాంతపు పెద్దవారు తమ తాతలతో ఈ గుడికి వెళ్ళినట్లుగా చెప్పే వృత్తాంతాలు ఉన్నాయి.

ఈ గుడికి దగ్గర లోనే, నాటి విశాఖపట్నంలోనే ధనికుడయిన వ్యక్తికి పెద్ద ఇల్లు ఉండేదట ఆ ఇంటి సింహద్వారానికి, దెవుడి గుడి కి ఉన్నట్లుగా, చిన్న చిన్న గంటలు ఉండేవని, అ ఇంటి కోడలు, రాత్రి పడుకునే ముందు సింహద్వారపు తలుపులు మూసివేస్తున్నప్పుడు అయ్యే గంటల చప్పుడు ఊరంతా వినబడేవట అతి చిన్న గ్రామమయిన విశాఖపట్టణ గ్రామ ప్రజలు , ఆ గంటల చప్పుడు విని, పలానావారి కోడలు పనిపూర్తిచేసుకుని తలుపులు వేసుకుంటుంది అని అనుకునేవారు అని పెద్దలు చెప్పగా 1963 లో విన్నాను. అప్పటికి సముద్రము చాలా దూరంగా ఉండేదట

జిల్లా చరిత్ర[మార్చు]

గోదావరి నది వరకు విస్తరించిన ప్రాచీన కళింగ సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతపు ప్రస్తావన క్రీ. పూ. 5, 6 శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంధాలలోను, క్రీ.పూ. 4 వ శతాబ్ది కి చెందిన సంస్కృత వ్యాకరణ పండితులైన పాణిని, కాత్యాయనుని రచనల లోను కలదు.

చరిత్ర ప్రకారం, ఇది ఒక పల్లె గ్రామము. జాలరులు చేపలు పట్టుకునే కుగ్రామము. ఇక్కడ విశాఖేశ్వరుని ఆల యం ఉండేదని, ఆయన పేరుమీదే, ఈ గ్రామానికి ఆ పేరు వచ్చిందట. కాలక్రమంలో, సముద్రం ముందుకు రావటంతో, ముంపుకు గురై, ఆ ఆలయం సముద్రంలో కలిసిపోయిందని చెబుతారు. సముద్రాల పక్కన, నదుల పక్కన ఉండే గ్రామాలను తెలుగు వారు పట్టణము గా పిలిచే వారు. అందుచేత , పూర్వీకులకు , ఆ గ్రామం పేరు వినగానే, ఆ గ్రామం నది ఒడ్డున గాని, సముద్రం ప్రక్కన గాని ఉన్నట్లు గా తెలిసేది. ఆంధ్రులకు ఈ పట్టణము అన్నమాట ఒక సంకేతమును ఇచ్చే పదము. . ఈ ప్రాంతమంతా . క్రీస్తు పూర్వం 260 లో అశోక చక్రవర్తి పాలనలో కళింగ దేశం ఉండేది. ఆ కళింగ దేశంలో , అంతర్భాగంగా ఈ విశాఖపట్టణము ప్రాంతం అంతా ఉండేది. తెలుగు దేశాన్ని, త్రికళింగదేశము అనే (త్రిలింగ దేశము, తెలుగు దేశము) చరిత్ర కారులు చెబుతారు. ఈ ప్రాంతాన్ని ఎన్నో ప్రముఖ వంశాల వారు పరిపాలించారు. వాటిలో కొన్ని: 7 వ శతాబ్దం లో కళింగులు, 8 వ శతాబ్దం లో వేంగి (ఆంధ్ర రాజులు) చాళుక్యులు(ఆంధ్రమహాభారతం రచన వీరి కాలంలోనే జరిగింది), తరువాతి కాలంలో రాజమండ్రి రెడ్డి రాజులు, పల్లవ రాజులు, చోళులు, తరువాత గంగ వంశం రాజులు గోల్కొండకు చెందిన కుతుబ్‌ షాహి లు, మొగలులు, హైదరాబాదు నవాబులు, ఈ ప్రాంతాన్ని పాలించారు. 15వ శతాబ్దం నాటికి , ఆంధ్రదేశానికి స్వర్ణయుగం తెచ్చిన విజయనగర సామ్రాజ్యం లో అంతర్బాగమైంది.

 • 1794: పద్మనాభయుద్ధం 10 జూలై 1794 నాడు విజయనగరం రాజు (చిన విజయ రామరాజు) కి, కల్నల్ పెండర్గస్ట్ (మద్రాసులోని బ్రిటిష్ గవర్నర్ జాన్ ఆండ్రూస్ తరపున) కి మధ్య జరిగింది. ఆంగ్లేయులు గెలిచిన కారణంగా, మొత్తం విజయనగరం సంస్థానం (బొబ్బిలి సంస్థానం తో కలిపి), ఆంగ్లేయుల పాలన లోకి వచ్చింది. అప్పటికి , విశాఖపట్నం జిల్లా ఏర్పడలేదు). కానీ, ఈ సంస్థానం అంతా , మద్రాసు ప్రెసిడెన్సీ పాలనలోనికి వచ్చింది అనుకోవాలి.
 • 1804 నుంచి 1920 వరకు జిల్లా పరిపాలన విధానం గురించి స్పష్టంగా తెలియదు.
 • 1857: ప్రధమ స్వాతంత్ర యుద్ధం జరిగినది ఈస్ట్ ఇండియా కంపెని మూటా ముల్లె సర్దుకుని , భారతా దేశాన్ని, బ్రిటిష్ ప్రభుత్వానికి అప్ప చెప్పి వెళ్ళిపోయింది. భారత దెశ పాలనా బాధ్యతా బ్రిటిష్ ప్రభుత్వం మీద పడింది.
 • 1858: యునైటెడ్ కింగ్ డం పార్లమెంటు, (బ్రిటిష్ పార్లమెంట్ ), గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము 1858 చేసింది. భారత దేశ పాలనా బాధ్యతను, బ్రిటిష్ సివిల్ సర్వీసు కి చెందిన అధికార్లు , తీసుకున్నారు.
 • 1860: ఇప్పటి మెసర్స్ ఎ.వి.ఎన్ . కళాశాల, ఒక చిన్న పాఠశాల గా మొదలైంది.
 • 1866 లేదా 1876: ఈ చిన్న పాఠశాల, ఉన్నత పాఠశాల ( ఈ నాటి మెసర్స్ ఎ.వి.ఎన్ . కళాశాల) గా ఎదిగింది. ఇ. వింక్లర్ అనే యూరోపియన్ ప్రధాన ఉపాధ్యాయుడు గా ఉన్నాడు.
 • 1878: ఈ ఉన్నత పాఠశాల ( ఈ నాటి మెసర్స్ ఎ.వి.ఎన్ . కళాశాల), కళాశాల స్థాయికి ఎదిగింది. ఇ.వింక్లర్ , ప్రధాన ఉపాద్యాయుడే, ఇ కళాశాలకు ప్రిన్సిపాల్ . ఈ కళాశాల పేరు “హిందూ కళాశాల”
 • 1882: మద్రాస్ ఫారెస్ట్ చట్టము1882 లో చేసారు. దీనివలన అడవులలో పోడు పద్ధతిన వ్యవసాయము చేసే గిరిజనులకు ఇబ్బందులు కలిగాయి. ఈ ఇబ్బందులే, రంప పితూరీ (1922-1924) కి కారణమయ్యాయి.
 • 1886: 1858 నుంచి భారత దేశపాలనా బాధ్యతను తీసుకున్న బ్రిటిష్ సివిల్ సర్వీసు వారి స్థానంలో, ఇంపీరియల్ సివిల్ సర్వీసు కి చెందిన అధికార్లు వచ్చారు. [[బ్రిటిష్ ఇండియా సివిల్ సర్వీస్ ) గా కూడా వీరిని పిలిచే వారు. ఈ అధికార్లను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము 1858 లోని సెక్షన్ 32 ప్రకారం నియమించేవారు. తరువాత కాలంలో వీరినే ఇండియన్ సివిల్ సర్వీస్ ఐ.సి.ఎస్ గా పిలిచేవారు
 • 1892: “హిందూ’’ కళాశాల పేరును మెసర్స్ ఎ.వి.ఎన్ . కళాశాల గా మార్చారు. ఆనాటి జమీందారు ఇచ్చిన 11 ఎకరాల భూమి, లక్షరూపాయల విరాళం, కళాశాల కోసం ఒక పెద్ద భవనం, మరొక 15000 రూపాయలు అతని భార్య గుర్తుగా, అంకితం వెంకట నరసింగరావు. విరాళం ఇచ్చాడు అందుకని అతని భార్య పేరు పెట్టారు. .
 • 1902 - ఆంధ్ర వైద్య కళాశాలను స్థాపించారు. ఈ వైద్య విద్యార్ధులకు కింగ్ జార్జి ఆసుపత్రిలో శిక్షణ ఇస్తారు .
 • 1904 - మద్రాసు నుంచి కలకత్తా వరకు విశాఖపట్టణము (నాడు వైజాగ్ పటేంగా ఇంగ్లీషు వాడు పలికే వాడు) మీదుగా రైలు దారిని (రైల్వే) ప్రారంభించారు.
 • 1907 - బ్రిటిష్ పురాతత్వశాస్త్రవేత్త , అలెగ్జాండర్ రీ, 2000 సంవత్సరాల నాటి బౌద్ధుల కాలంనాటి శిధిలాలను, విశాఖపట్టణానికి 40 కి.మీ దూరంలో ఉన్న శంకరం గురించి వెల్లడించాడు. అక్కడి ప్రజలు, ఆ ప్రాంతాన్ని బొజ్జన్నకొండ అంటారు.
 • 1920: ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1920,
 • 1920: 1920 నుంచి 31 అక్టోబర్ 1959 వరకూ విశాఖపట్టణం జిల్లా పరిపాలన డిస్ట్రిక్ట్ బోర్డ్ (జిల్లా బోర్డ్) ద్వారా జరిగింది.
 • 1922: అల్లూరి సీతారామరాజు జరిపిన రంప పితూరీ, 1922 నుంచి 1924 వరకు రెండు సంవత్సరాలు జరిగింది. ఆ సమయంలో, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గా రూదర్ ఫొర్డ్ ఉన్నాడు.
 • 1933 - 7 అక్టోబరు 1933 - విశాఖపట్టణం (వైజాగ్ పటేం పోర్టు) పోర్టును స్థాపించారు.
 • 1941 - 6 ఏప్రిల్ 1941 - జపాన్ వారి యుద్ధ విమానాలు విశాఖపట్టణం మీద బాంబులు వేసాయి. ఎవరూ మరణించ లేదు. ఆ భయంతో, విశాఖ వాసులు కొందరు ఇళ్ళు తక్కువ ధరకు అమ్ముకుని విశాఖ వదిలి పోయారు. భయంలేని వారు, ఆ ఇళ్ళను తక్కువ ధరకు కొనుక్కున్న సంగతి, ఆ నాటి తరంవారు కథలుగా చెప్పుతారు.
 • 1947: 1947 లో స్వాతంత్ర్యం వచ్చేనాటికి, భారత దేశంలో ఉన్న ఒకే ఒక్క పెద్ద జిల్లా విశాఖపట్టణం జిల్లా. స్వాతంత్ర్యం వచ్చే నాటికి విశాఖపట్నమే దేశంలోకెల్లా అతి పెద్ద జిల్లా. తరువాత దానిని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలుగా విడగొట్టారు.

పర్యాటక ప్రాంతాలు[మార్చు]

ఈ జిల్లాలో, బౌధ్ధమతము కూడ వర్ధిల్లింది. అందుకు గుర్తుగా, ఈ జిల్లాలోబొజ్జన్నకొండ, శంకరము, తొట్లకొండ వంటివి పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. ఋషికొండ, రామకృష్ణ బీచ్ , భీముని పట్టణము వంటి, చక్కటి సముద్ర తీరాలు, అనంతగిరి, అరకు లోయ, కైలాసగిరి వంటి ఎత్తైన కొండల ప్రాంతాలు, భీముని పట్టణములోని, సాగర నదీ సంగమ ప్రాంతాలు, బొర్రా గుహలు, ప్రసిద్ధి చెందినవి, ప్రాచీనమైన సింహాచలం వంటి దేవాలయాలు, వలస పక్షులు వచ్చే కొండకర్ల ఆవ, తాటి దోనెల లో కొందకర్ల ఆవ లో నౌకా విహారము వంటి పర్యాటక కేంద్రాలు జిల్లాలో ఉన్నాయి.

భౌగోళిక స్వరూపం[మార్చు]

ఆర్ధిక స్థితి గతులు[మార్చు]

హిందుస్తాన్ షిప్ యార్డ్
భీమునిపట్నం మండలంలోని తగరపువలస పట్టణం
భీమునిపట్నం సముద్ర తీరం
విశాఖపట్నం రైల్వే స్టేషను
ఉత్తరాంధ్ర సంజీవని కింగ్ జార్జ్ ఆసుపత్రి KGH
విశాఖపట్నం వోడ రేవులోకి వెళ్తున్న నౌక
విశాఖపట్నం నగరం
సహ్రక్షి మేరు ఆలయం

డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు[మార్చు]

భౌగోళికంగా విశాఖపట్నం జిల్లాను 42 రెవిన్యూ మండలాలుగా విభజించినారు[1]. ఇది ఒక పట్టణ ప్రాంతంతో కలిపి మొత్తం 43 విభాగాలు అయ్యాయి.

విశాఖపట్నం జిల్లా మండలాలు, రెవెన్యు విభాగాలు(స్పష్టతకై బొమ్మల పైన నొక్కండి)
సంఖ్య పేరు సంఖ్య పేరు సంఖ్య పేరు
1 ముంచంగిపుట్టు 15 గొలుగొండ 28 విశాఖపట్నం మండలం
2 పెదబయలు 16 నాతవరం 29 విశాఖపట్నం (పట్టణ)
3 హుకుంపేట 17 నర్సీపట్నం 30 గాజువాక
4 డుంబ్రిగుడ 18 రోలుగుంట 31 పెదగంట్యాడ
5 అరకులోయ 19 రావికమతం 32 పరవాడ
6 అనంతగిరి 20 బుచ్చెయ్యపేట 33 అనకాపల్లి
7 దేవరాపల్లి 21 చోడవరం 34 మునగపాక
8 చీడికాడ 22 కె.కోటపాడు 35 కశింకోట
9 మాడుగుల 23 సబ్బవరం 36 మాకవరపాలెం
10 పాడేరు 24 పెందుర్తి 37 కోట ఉరట్ల
11 గంగరాజు మాడుగుల 25 ఆనందపురం 38 పాయకరావుపేట
12 చింతపల్లి 26 పద్మనాభం 39 నక్కపల్లి
13 గూడెం కొత్తవీధి 27 భీమునిపట్నం 40 శృంగరాయవరం
14 కొయ్యూరు 41 ఎలమంచిలి 42 రాంబిల్లి
43 అచ్యుతాపురం

విశాఖపట్టణము జిల్లా ప్రజా పరిషత్[మార్చు]

 • బల్వంతరాయ్ మెహతా కమిటీ (జనవరి 1957 లో కేంద్ర ప్రభుత్వము నియమించింది. 1957 నవంబరులో ఈ కమిటీ తన సిఫార్సులను కేంద్రప్రభుత్వానికి అందజేసింది) వివిధ స్థాయిలలో అంటే, గ్రామం, మండలం, (లేదా బ్లాక్) మరియు జిల్లా స్థాయిలో అధికార వికేంద్రీకరణకు సాధనం గా మూడు అంచెల ( టైర్) పంచాయితీ రాజ్ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
 • ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టము 1994 ఒక సమగ్రమైన చట్టము. ఈ చట్టము, అంతకు ముందు అమలు లో ఉన్న చట్టాలలోని అన్ని నిబంధనలను, తనలో విలీనం చేసుకుంది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తుల లో ఉన్న ఒకే విషయమైన (ఏక రూపం) ఎన్నికలు, సమావేశాలను ఏర్పాటు చేయటము, ప్రతీ అంచె తోను (మూడు అంచెలు) సంబంధాలు నెలకొల్పటము, పరిపాలనా సంబంధమైన నివేదికలు, జమా ఖర్చులు (బడ్జెట్ ) వగైరా విషయాలను సమగ్రంగా , సవివరంగా కొత్త చట్టములో పొందుపరిచారు.


రవాణా వ్వవస్థ[మార్చు]

విశాఖపట్నం జిల్లా కలెక్టరు కార్యాలయం[మార్చు]

ముఖ్య వ్యాసం: విశాఖపట్నం జిల్లా కలెక్టరు కార్యాలయం

వుడా (విశాఖపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ[మార్చు]

వుడా ఏమి చేస్తుంది. 1. ప్రణాళిక ( ప్లాను) ప్రకారం అభివృద్ధి చేస్తుంది. 2. ఇళ్లు, రోడ్లు, భవనములు నిర్మాణానికి, కావలసిన ప్రణాళికలను తయారుచేసి, వాటిని అమలు చేయటము. 3. బృహత్తర ప్రణాళిక ప్రకారం, అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రాజెక్టులను సంధానించటం. 4. వుడా విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ (వి.ఎమ్ . ఆర్ ) కోసం, వుడా ఒక్ బృహత్తర ప్రణాళిక ను అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతి ని పొందింది. విజయనగరం, భీమునిపట్నం, గాజువాక, అనకాపల్లి పట్టణాలకు, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక (జోనల్ డెవలప్ మెంట్ ప్లాన్ ) లకు ఆం.ప్ర. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మధురవాడ, ఋషికొండ, గోపాలపట్నం పరిసర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలను కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగరాభివృద్ధి కోసం జరుగుతున్న ప్రముఖమైన , ప్రణాళికలను అమలు చేయటం, , అనుసంధానించటం వుడా మీద ఉన్న గురుతర బాధ్యత.

జనాభా లెక్కలు[మార్చు]

సంస్కృతి[మార్చు]

పశుపక్ష్యాదులు[మార్చు]

విద్యాసంస్థలు[మార్చు]

వైద్య సౌకర్యాలు[మార్చు]

ఆకర్షణలు[మార్చు]

క్రీడలు[మార్చు]

ప్రముఖవ్యక్తులు[మార్చు]

విశాఖ జిల్లా లో కొన్ని గణాంకాలు, వాస్తవాలు[మార్చు]

విశాఖపట్నం జిల్లాలోని పెద్దిపాలెం గ్రామంలో అందమైన సాయంకాల సమయం.
కైలాసగిరి, విశాఖపట్నం

ఇవీ చూడండి[మార్చు]

విశాఖపట్నం జిల్లా మండలాలు విశాఖపట్నం జిల్లా గ్రామాలు

బయటి లింకులు[మార్చు]

వనరులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. పంచాయత్ రాజ్ మంత్రిత్వశాఖ వెబ్‌సైటులో విశాఖపట్నం తాలూకాల వివరాలు. జూన్ 30, 2007న సేకరించారు.