మహారాణిపేట మండలం
మహారాణిపేట | |
|---|---|
| Coordinates: 17°42′36″N 83°18′11″E / 17.709920°N 83.303109°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| భారతదేశపు జిల్లా | విశాఖపట్నం |
| పరిపాలనా కేంద్రం | మహారాణిపేట |
| భాష | |
| • అధికారక | తెలుగు |
| Time zone | UTC+5:30 |
మహారాణిపేట మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకు చెందిన మండలం.[1]ఇది విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ క్రింద నిర్వహించబడుతుంది. దీని పరిపాలనా కేంద్రం మహారాణిపేటలో ఉంది. ఈ మండలం బంగాళాఖాతం తీరంలో ఉంది. దీనికి ఉత్తరాన విశాఖపట్నం గ్రామీణ మండలం, పశ్చిమాన విశాఖపట్నం పట్టణ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.[2]
మహారాణిపేట పౌర సదుపాయాలకు బాధ్యత వహించే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నందున ఈ మండలంలో గ్రామాలు లేవు.[3][4]
2022 లో ఏర్పడిన మండలం - చరిత్ర
[మార్చు]ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 ముందు విశాఖపట్నం జిల్లాలో ఉన్న 43 మండలాలలో విశాఖపట్నం పట్టణ మండలం ఒకటి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో భాగంగా విశాఖపట్టణం జిల్లా పరిధిని సవరించి, విశాఖపట్నం పట్టణ మండలం స్థానంలో కొత్తగా సీతమ్మధార, గోపాలపట్నం, ములగాడ , మహారాణిపేట అనే నాలుగు మండలాలు కొత్తగా ఏర్పడ్డా యి. వీటిలో సీతమ్మధార మండలం కొత్తగా ఏర్పడిన భీముని పట్టణం రెవెన్యూ డివిజను పరిధిలో చేరగా, మిగిలిన మూడు మండలాలు విశాఖపట్టణం జిల్లా, పూర్వపు విశాఖపట్టణం రెవెన్యూ డివిజను పరిధి కిందకు చేరాయి.[5] [6]అయితే ఈ నాలుగు మండలాలలో ఎటువంటి గ్రామాలు లేవు, మహా విశాఖ నగరపాలక సంస్థకు చెందిన వార్డులు, ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Details of all 26 Districts in Andhra Pradesh" (PDF). Animal Husbandry Department. Department of Animal Husbandry, Government of Andhra Pradesh. Archived from the original on 2022-04-23. Retrieved 2026-02-25.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Visakhapatnam district - District handbook of statistics" (PDF). Visakhapatnam district website, Government of AP. Retrieved 2022-05-12.
- ↑ "Sub-District Details of Visakhapatnam District". The Registrar General & Census Commissioner, India. Retrieved 23 October 2014.
- ↑ "Visakhapatnam (urban) mandal villages" (PDF). apland.ap.nic.in. Archived from the original (PDF) on 19 మార్చి 2015. Retrieved 23 అక్టోబరు 2014.
- ↑ https://ahd.aptonline.in/AHMS/Views/DownLoads/All26Districts.pdf
- ↑ "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.