Jump to content

సీతమ్మధార మండలం

అక్షాంశ రేఖాంశాలు: 17°44′N 83°19′E / 17.74°N 83.31°E / 17.74; 83.31
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°44′N 83°19′E / 17.74°N 83.31°E / 17.74; 83.31
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్నం జిల్లా
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు

సీతమ్మధార మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలోని 11 మండలాలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం సీతమ్మధారలో ఉంది. ఇది విశాఖపట్నం నగరం మధ్యలో ఉంది. [1]

సీతమ్మధార పౌరసౌకర్యాలకు బాధ్యత వహించే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. ఈ మండలంలో ఎటువంటి గ్రామాలు లేవు. ఈమండలానికి ఉత్తరాన విశాఖపట్నం గ్రామీణ, తూర్పున మహారాణిపేట మండలం సరిహద్దులుగా ఉన్నాయి. [2] [3]

2022 లో ఏర్పడిన మండలం - చరిత్ర

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 ముందు విశాఖపట్నం జిల్లాలో ఉన్న 43 మండలాలలో విశాఖపట్నం పట్టణ మండలం ఒకటి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో భాగంగా విశాఖపట్టణం జిల్లా పరిధిని సవరించి, విశాఖపట్నం పట్టణ మండలం స్థానంలో కొత్తగా సీతమ్మధార,  గోపాలపట్నం, ములగాడ , మహారాణిపేట  అనే నాలుగు మండలాలు కొత్తగా ఏర్పడ్డా యి. వీటిలో సీతమ్మధార మండలం కొత్తగా ఏర్పడిన భీముని పట్టణం రెవెన్యూ డివిజను పరిధిలో చేరగా, మిగిలిన మూడు మండలాలు విశాఖపట్టణం జిల్లా, పూర్వపు విశాఖపట్టణం రెవెన్యూ డివిజను పరిధి కిందకు చేరాయి.[4] [5]అయితే ఈ నాలుగు మండలాలలో ఎటువంటి గ్రామాలు లేవు, మహా విశాఖ నగరపాలక సంస్థకు చెందిన వార్డులు, ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి.

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Visakhapatnam district - District handbook of statistics" (PDF). Visakhapatnam district website, Government of AP. Retrieved 2022-05-12.
  2. "Sub-District Details of Visakhapatnam District". The Registrar General & Census Commissioner, India. Retrieved 23 October 2014.
  3. "Visakhapatnam (urban) mandal villages" (PDF). apland.ap.nic.in. Archived from the original (PDF) on 19 March 2015. Retrieved 23 October 2014.
  4. https://ahd.aptonline.in/AHMS/Views/DownLoads/All26Districts.pdf
  5. "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.