పల్నాడు చుట్టూ కర్నూలు జిల్లాలోని నల్లమలై కొండలున్నాయి. మాచర్ల, యర్రగొండపాలెం శ్రేణిలో స్వామికొండ లేక వామికొండ (605 మీ) ఎత్తులో గలదు. కైరాలకొండ (590 మీ) తరువాత ఎత్తైన కొండ. వాయవ్య అంచున గల కొండలు మల్లవరం దగ్గర కృష్ణానదిలో కలిసేవరకు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా పలకరాయి, క్వార్ట్‌జైట్ రాయి లభిస్తుంది. మాచర్లకు పది కి.మీ. దూరంలో ఎత్తిపోతల జలపాతం నల్లమల కొండలపై చంద్రవంక నదిపై ఉంది. దీనిలో 21 మీ. ఎత్తునుండి నీరు పారుతుంది.
వెంకటాయపాలెం శ్రేణి
సత్తెనపల్లి దగ్గరలోని వెంకటాయపాలెం పేరు కలిగిన పలకరాయి, క్వార్ట్జైట్లు గల కొండలే ఇవి. 40 కిమీ పొడవుతో ఈశాన్య - నైరుతీ దిక్కున వుంటాయి. వీటిలో వజ్రాలు కనుగొన్నారట. దీనిలో ఎత్తైనది మైదర్సాల్ (447 మీ). నరసరావుపేట దగ్గర పల్నాడు, వినుకొండ, సత్తెనపల్లి సరిహద్దులు కలిసేచోట కృష్ణానదివైపుకు ఎత్తుతగ్గుతూ వుండే కొండలు ఉన్నాయి.
కొండవీడు
ఇవి నరసరావుపేట దగ్గర 19 కిమీ విస్తరించి, 523మీ ఎత్తువరకు వున్న కొండలు. వీటిలో గ్రానైట్ రాయి నిక్షేపాలున్నాయి. దీనికి పశ్చిమంగా వేరుగా వున్న యల్లమంద లేక కోటప్పకొండ అని పిలవబడే 489 మీ. ఎత్తులో ఉంది. దానికి దక్షిణంగా అద్దంకి వైపు కొన్ని కొండలున్నాయి.
నేల తీరులో రకాలు.
ఎరుపు గ్రేవెల్లి నేల: ఆర్చెయిన్ ఫార్మేషన్ వలన ఇవి ఏర్పడతాయి. మాచెర్ల, వినుకొండలో ప్రధానంగా ఇవి ఉన్నాయి.
నలుపు పత్తి నేల: కృష్ణానది వడ్డునగల ప్రదేశాలు, సత్తెనపల్లి, మాచెర్లకు ఉత్తరంగా ఉన్నాయి. సున్నపురాయి మెత్తగా మారి ఇవి ఏర్పడుతాయి.
ఇసుక అల్లూవియల్ నేల:సముద్రపు వడ్డున గోండ్వానా రాళ్లుగల ప్రదేశాల్లో ఇవి ఉన్నాయి. కొన్ని చోట్ల కంకర (కాల్కేరియస్ నేలలు) ఉన్నాయి.
పారిశ్రామిక వాడలు సత్తెనపల్లి, నరసరావుపేట, పిడుగురాళ్ళనడికూడిలలో[4] సున్నపు రాయి, గ్రానైట్, ఇసుక ఆధారంగా పనిచేసే భారీ, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. ది దక్కన్ సిమెంట్స్ లిమిటెడ్, శ్రీ చక్ర సిమెంట్స్, కెసిపి సిమెంట్స్ ప్రధాన పరిశ్రమలు.
2011 నాటి జనాభా గణాంకాల ప్రకారం, జిల్లా మొత్తం జనాభా 20,41,723. దీనిలో షెడ్యూలు కులాలు 3,75,554 (18.39%) షెడ్యూలు తెగల జనాభా 1,42,944 (7.00%) .[1]: 77–82
2011 నాటి జనాభా గణాంకాల ప్రకారం, 87.12% జనాభా తెలుగు, 9.90% ఉర్దూ, 2.41% లంబాడీ మాతృభాషగా పేర్కొన్నారు.[6]
జిల్లా పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలు, 3 రెవెన్యూ డివిజన్లు, 28 మండలాలు ఉన్నాయి. జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లులో నరసరావుపేట రెవెన్యూ డివిజను, గురజాల రెవెన్యూ డివిజను గతంలో ఏర్పడిన రెవెన్యూ డివిజన్లుకాగా, సత్తెనపల్లి రెవెన్యూ డివిజను కొత్తగా ఏర్పడింది.[7] మొత్తం 28 మండలాలు, 527 గ్రామపంచాయితీలు, 2 నగర పంచాయితీలు, 6 పురపాలక సంస్థలున్నాయి.[8]బొల్లాపల్లి మండలం గురజాల రెవెన్యూ డివిజన్ నుండి నరసరావుపేట రెవెన్యూ డివిజన్ కు నవంబరు 2022 న మార్చారు.[9]
కొమెర అంకారావు, కారెంపూడికొమెర అంకారావు: ఇతను కారెంపూడి గ్రామంలో 1983లో రాములు, ఏడుకొండలు దంపతులకు జన్మించాడు. ఇతను ప్రకృతిని ఆస్వాదిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, అడవులు సంరక్షణ, పెంపకం, వృద్ధి కోసం నడుముకట్టి, గత రెండు దశాబ్దాలుగా పైగా అలుపెరుగనిపోరాటం చేస్తూ, నల్లమల అడవులలో ప్లాస్టిక్ నిర్మూలన చేస్తూ, సమాజాన్ని చైతన్య పరుస్తూ సరికొత్త హరిత అడవులు సృష్టిస్తున్న, భారతీయ పర్యావరణ యోధుడు, పర్యావరణ వేత్త, నల్లమల అడవితల్లి బిడ్డగా గుర్తింపు పొందాడు.[10]
↑"Those memories are safe! - Sakshi". web.archive.org. 2021-10-03. Archived from the original on 2021-10-03. Retrieved 2021-10-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)