దాచేపల్లి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దాచేపల్లి
—  మండలం  —
గుంటూరు జిల్లా పటములో దాచేపల్లి మండలం యొక్క స్థానము
గుంటూరు జిల్లా పటములో దాచేపల్లి మండలం యొక్క స్థానము
దాచేపల్లి is located in ఆంధ్ర ప్రదేశ్
దాచేపల్లి
ఆంధ్రప్రదేశ్ పటములో దాచేపల్లి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°40′13″N 79°45′23″E / 16.6704°N 79.756393°E / 16.6704; 79.756393
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండల కేంద్రము దాచేపల్లి
గ్రామాలు 12
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 68,060
 - పురుషులు 34,370
 - స్త్రీలు 33,680
అక్షరాస్యత (2001)
 - మొత్తం 52.50%
 - పురుషులు 64.66%
 - స్త్రీలు 40.11%
పిన్ కోడ్ 522414
దాచేపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
దాచేపల్లి is located in ఆంధ్ర ప్రదేశ్
దాచేపల్లి
అక్షాంశరేఖాంశాలు: 16°40′13″N 79°45′23″E / 16.6704°N 79.756393°E / 16.6704; 79.756393
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం దాచేపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 14,256
 - పురుషుల సంఖ్య 7,237
 - స్త్రీల సంఖ్య 7,019
 - గృహాల సంఖ్య 3,164
పిన్ కోడ్ 522 414
ఎస్.టి.డి కోడ్ 08649

"దాచేపల్లి",గుంటూరు జిల్లా,దాచేపల్లి మండలానికి చెందిన గ్రామము మరియు మండలము. పిన్ కోడ్ = 522 414, ఎస్.టి.డి కోడ్ = 08649.

విషయ సూచిక

గ్రామ చరిత్ర[మార్చు]

పేరువెనుక చరిత్ర[మార్చు]

బంగినపల్లి మామిడి పండు పేరు మనకు తెల్సిందే కదా! అలాగే దాచినపల్లి అని కూడా మామిడిపళ్ళల్లో మరో రకం ఉండేది. బంగినపళ్ళూ దాచినపళ్ళూ చూడ్డానికి ఒకేలా నిగనిగలాడుతూ ఉంటాయి. అయితే` బంగినపళ్ళు కోసి ముక్కలుగా కూడా తినొచ్చు. కానీ, దాచినపళ్ళకు పై తొక్క కొంచెం గట్టిగా ఉంటుంది. చిన్న గాటు పెట్టగానే రసం ధారగా వచ్చేస్తుంది. కాలక్రమంలో ఈ పళ్ళ చెట్లు అంతరించి పోయాయి. ఈ పంట ఎక్కువగా పండే దాచేపల్లి మాత్రం ఆ తీపి పళ్ళను గుర్తు చేస్తుంటుంది.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

గామాలపాడు 3 కి.మీ, నడికుడి 4 కి.మీ, మాదినపాడు 4 కి.మీ, ముత్యాలంపాడు 7 కి.మీ, వీరాపురం 8 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

పశ్చిమాన గురజాల మండలం, తూర్పున మాచవరం మండలం, ఉత్తరాన దామెరచెర్ల మండలం, పశ్చిమాన రెంటచింతల మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

ఈ గ్రామ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి అయిన కళ్యాణ్ (నారాయణపురం), 2014 ఫిబ్రవరిలో మహారాష్ట్రలో జరుగు, జాతీయస్థాయి సైకిల్ పోలో పోటీలలో పాల్గొనుటకు ఎంపికైనాడు. [3]

1917 లో ఈ పాఠశాల నిర్మాణానికి, కీ.శే. కోలా వెంకటరెడ్డి మరియు కోలా కేశవరెడ్డి రెండెకరాల భూమిని విరాళంగా అందజేసినారు. పాఠశాలలో అభివృద్ధిలో భాగంగా దాతలు, పూర్వ విద్యార్థులు తమ వంతు తోడ్పాటు అందించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 1183 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. ఈ పాఠశాలలో ప్రతి సంవత్సరం పదవ తరగతిలో 93 నుండి 96 శాతం ఉత్తీర్ణత సాధించుచున్నారు. ఇప్పటి వరకు ఈ పాఠశాలలో 15 మంది విద్యార్థులు, ఐ.ఐ.ఐ.టిలో ప్రవేశం పొందినారు. 153 మంది విద్యార్థులు నేషనల్-మెరిట్-కం-మీన్స్ (N.M.M.T) ఉపకార వేతనాలు పొందినారు. ఈ పాఠశాల, 2017లో శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుచున్నది. [8]

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

యోగవిఙాన కేంద్రం[మార్చు]

బ్యాంకులు[మార్చు]

  1. భారతీయ స్టేట్ బ్యాంక్.
  2. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు. ఫోన్ నం. 08649/257635., సెల్=9390478323

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ లక్ష్మీ రంగనాయకస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణం, 2015,జూన్-9వ తేదీ మంగళవారంనాడు, కన్నులపండువగా నిర్వహించారు. [7]

శ్రీ సీతారామస్వామివారి అలయం[మార్చు]

ఈ ఆలయంలో 2017,మార్చి-5వతేదీ ఆదివారంనాడు నిర్వహించిన శ్రీ హనుమత్, లక్ష్మణ సహిత శ్రీ సీతారామస్వామివారి నూతన విమాన, కలశ, విగ్రహ, ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా మహోత్సవం అంబరాన్నంటినది. తిరుమల తిరుపతి దేవస్థానం లోని పాంచరాత్ర ఆగమపండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పోటెత్తినారు. ఈ సందర్భంగా భక్తులకు మహా అన్నసంతర్పణ నిర్వహించారు. [9]

శ్రీ వీర్లంకమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ గ్రామంలో వెలసిన శ్రీ వీర్లంకమ్మ తల్లి ఉత్సవ విగ్రహాన్ని, ప్రతి సంవత్సరం ఉగాదిరోజున, పురవీధులలో ఊరేగించెదరు. [4]

నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయం[మార్చు]

ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవం, 2015,మార్చి-8వ తేదీ ఆదివారం నాడు నిర్వహించెదరు. ఈ సందర్భంగా తిరునాళ్ళు నిర్వహించెదరు. ఈ కార్యక్రమంలో భాగంగా భజనలు, కోలాటాలతోపాటు, కుంకుమబండ్ల ఊరేగింపు నిర్వహించెదరు. ప్రజల సహకారంతో అన్నదానం నిర్వహించెదరు. [6]

గ్రామములోని ప్రధాన పంటలు[మార్చు]

గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామంలోని ప్రముఖులు[మార్చు]

సుప్రసిద్ధ సినీ నటులు, మారుతీ సేవేంద్ర సరస్వతీ స్వామిగా ప్రసిద్ధి చెందిన శ్రీ ధూళిపాళ్ళ సీతారామశాస్త్రి గారు, ఈ గ్రామంలోనే 1920,సెప్టెంబరు-24న జన్మించారు. వీరు మారుతీనగర్, గుంటూరులో, 1981 లో ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణం చేసారు. వీరు 2007,ఏప్రిల్-14న నిర్యాణం చెందినారు. [5]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 14,256.[1] ఇందులో పురుషుల సంఖ్య 7,237, స్త్రీల సంఖ్య 7,019, గ్రామంలో నివాస గృహాలు 3,164 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 3,358 హెక్టారులు.

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 68,060 - పురుషుల సంఖ్య 34,370 - స్త్రీల సంఖ్య 33,680
అక్షరాస్యత (2001) - మొత్తం 52.50% - పురుషుల సంఖ్య 64.66% - స్త్రీల సంఖ్య 40.11%

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

  • [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి

[3] ఈనాడు గుంటూరు రూరల్; 2014,జనవరి-30; 9వపేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఏప్రిల్-1; 5వపేజీ. [5] ఈనాడు గుంటూరు సిటీ; 2011,సెప్టెంబరు-24; 13వపేజీ. [6] ఈనాడు గుంటూరు రూరల్; 2015,మార్చి-8; 4వపేజీ. [7] ఈనాడు గుంటూరు రూరల్; 2015,జూన్-10; 4వపేజీ. [8] ఈనాడు గుంటూరు రూరల్; 2017,జనవరి-23; 6వపేజీ. [9] ఈనాడు గుంటూరు రూరల్; 2017,మార్చి-6; 7వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=దాచేపల్లి&oldid=2124966" నుండి వెలికితీశారు