వినుకొండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వినుకొండ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాలోని ప్రముఖ పట్టణం.ఆ మండలానికి ప్రధాన కేంద్రం.

వినుకొండ
Vinukonda
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం వినుకొండ
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522647
ఎస్.టి.డి కోడ్ 08646

గ్రామ నామ చరిత్ర[మార్చు]

వినుకొండ అన్న పేరు ఈ గ్రామంలో శ్రీరాముడు సీతాదేవి అపహరణ గురించి వినడం జరిగింది కాబట్టి విను అన్న క్రియను బట్టి ఆ పేరు వచ్చిందని లోకనిరుక్తి ఉంది. ఈ నిరుక్తిని అనుసరించి తెలుగు, సంస్కృత పండితులు ఈ పేరును సంస్కృతీకరించి శృతగిరి పురం (శృత= విను, గిరి= కొండ, పురం= పట్టణం/నగరం) అన్న పదం కల్పించారు.[1] [నోట్ 1]

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

ఈ ఊరికి రైల్వే స్టేషను సదుపాయం ఉంది.

వినుకొండలో విద్యా సౌకర్యాలు[మార్చు]

 1. సాయి డిగ్రీ కళాశాల.
 2. గీతాంజలి జూనియర్ కళాశాల.
 3. గీతాంజలి విద్యా వికాస్ ఉన్నత పాఠశాల.
 4. నారాయణ పాఠశాల.
 5. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
 6. కృష్ణవేణి జూనియర్ కళాశాల.(బి.లింగారావు)

గ్రామ పంచాయతీ[మార్చు]

1952లో వినుకొండ శాసనసభ్యులుగా గెలుపొందిన పులుపుల వెంకటశివయ్య, 1953లో వినుకొండ పంచాయతీ సర్పంచిగా ఎన్నికైనాడు. రెండు పదవులలో 1955 దాకా ఉన్నాడు. సర్పంచిగా 1964 వరకూ పనిచేశాడు. 1962లో మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికలలో గెలుపొంది శాసనసభ్యులుగా 8 ఏళ్ళు పనిచేశాడు. సర్పంచిగా 11 ఏళ్ళు పనిచేశాడు. నిరాడంబరుడైన ఇతని స్మృతి చిహ్నంగా పట్టణం నడిబొడ్డున స్మారకస్థూపం ఏర్పాటుచేశారు.[1]

గ్రామములో దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

వందేళ్ల చరిత్ర ఉన్న చెట్లు[మార్చు]

 • వినుకొండ పట్టణానికి అతి చేరువగా ఉన్న విఠంరాజుపల్లె వాటి పుట్టిల్లు. నరసరావుపేట రోడ్డు అంచున గుబురుగా కనిపిస్తాయి. చెరువు గట్టు మీద ఉండటంతో చల్లటి ఆహ్లాదాన్నిస్తుంది. గ్రామస్థులు, ప్రయాణికులు ఏ మాత్రం ఖాళీ ఉన్నా ఈ చెట్టు నీడలో సేదదీరుతారు. వేసవిలో ఖాళీ ఉండకుండా ఉంటారు. ఊరిలో ఏమూలకెళ్లినా పలానా చెట్టు ఎక్కడ అంటే టక్కున చెప్పేస్తారు.
 • వివాహానికి ముందు వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచే ప్రతి ఒక్కరూ మార్కాపురం రోడ్డులో ఉన్న రావిచెట్టుకు పూజలు చేయాల్సిందే. ఇక్కడ పూర్వకాలం నుంచి వేపచెట్టు, రావిచెట్టు కలిసి ఉండేవి. రెండింటినీ కలిపి పూజించి వాటికి పెళ్ళిచేస్తే కొత్త దంపతులకు దోషాలు అన్నీ పోతాయన్నది ఇక్కడి వారి నమ్మకం. ఇటీవల రోడ్డు విస్తరణలో వేపచెట్టు మాయమైంది. మిగిలిన ఒక్క చెట్టుకు ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి.
 • ఏనుగుపాలెం రోడ్డులో గోనుగుంట్లవారిపాలెం ఉంది. గతంలో ఇక్కడ ఊరు ఉండేది కాదు. హసన్నాయునిపాలెం, పెదకంచర్ల గ్రామాల నుంచి వలస వచ్చి ఇళ్లు కట్టుకున్నారు. ఆర్‌.అండ్‌.బి. రోడ్డు అంచున పెద్ద రావి చెట్టు ఉంది. పక్క గ్రామాల ప్రజలు అక్కడే బస్సు దిగి వెళ్లే వారు. ఇప్పటికీ బస్సు ఎక్కిన తర్వాత రావిచెట్టు అంటే తడుముకోకుండా సిబ్బంది టిక్కెట్‌ ఇచ్చేస్తారు. చివరకు రావిచెట్టును బస్‌స్టాప్‌గా పిలుస్తున్నారు.
 • పట్టణంలోని అంకాళమ్మ గుడి ముందు ఏపుగా ఎదిగిన రావిచెట్టుకు వందేళ్లు ఉన్నాయి. నరసరావుపేట జమీందారు కాలంలో నిర్మించిన ఈ గుడికి నిత్యం వచ్చే భక్తులు అమ్మవారితోపాటు చెట్టును కూడా పూజించడం విశేషం. 108 సార్లు ప్రదిక్షణం చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్నది ఇక్కడి వారి విశ్వాసం. చెట్టు కింద ఎత్త్తెన అరుగు వేశారు. అటు దానికి రక్షణ ఇటు ప్రజలకు ఉపయోగం ఒనగూరుతోంది.
 • ముళ్లమూరు బస్టాండులో శృంగారవనం ముందు మహాలక్ష్మమ్మ చెట్టు ఉంది. దీనికి నిత్య పూజలు చేస్తారు. ప్రారంభంలో వేప చెట్టు వరకు ఉండేది. ఇప్పుడు చుట్టుపక్కల వ్యాపారులు, ప్రజలు అరుగు కట్టించి అక్కడ అమ్మవారికి చిన్న గుడి కట్టించారు. ఏటా తొలిఏకాదశి నాడు చెట్టుకు విద్యుత్తు బల్బులు అలంకరిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరికీ మహాలక్ష్మమ్మ చెట్టు అంటే ఇట్టే తెలిసిపోతుంది.

దేవాలయాలు[మార్చు]

 • శ్రీ ప్రసన్న రామలింగేశ్వరస్వామివారి ఆలయం:- కొండమీద ఉంది
 • శ్రీ మదమంచిపాటి వీరాంజనేయస్వామివారి ఆలయం:-వినుకొండకు ఏడు కి.మీ.దూరంలో, గుండ్లకమ్మ నదీ తీరాన కొలువైయున్న ఈ స్వామివారిని భక్తులు మహిమాన్వితుడిగా కొలుస్తున్నారు. ప్రతి సంవత్సరం చైత్ర బహుళ పంచమినాడు, స్వామివారి తిరునాళ్ళను వైభవంగా నిర్వహించుచున్నారు. ఈ తిరునాళ్ళకు భక్తులు వేలాదిగా తరలి వచ్చెదరు. ఈ తిరునాళ్ళ సందర్భంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు. ఈ తిరునాళ్ళకు ఆర్.టి.సి. వారు ప్రత్యేక బస్సులను నడిపెదరు.[3]

ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

వినుకొండ పాలు, స్వీట్స్[మార్చు]

హైదరాబాద్‌ పుల్లారెడ్డి స్వీట్లంటే రాష్ట్రంలో ఎంత గుర్తింపు ఉందో వినుకొండ పాలకు, స్వీట్స్ కు మార్కెట్లో అంత గిరాకీ ఉంది. నాణ్యత, రుచిలో ఈ పాలకు పెట్టింది పేరు. వినుకొండ ప్రాంతం పాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. మెట్ట ప్రాంతం కావడంతో పాలు నాణ్యంగా, అత్యంత ప్రత్యేకంగా ఉంటాయని పశు వైద్యాధికారులు నిర్ధారించారు. పాలలో వెన్న, ఇతర పదార్థాలు (ఎస్‌.ఎన్‌.ఎఫ్‌.) అత్యధికంగా ఉండటంతో 90 శాతం డెయిరీలు ఇక్కడి పాలను సేకరించేందుకు మక్కువ చూపుతున్నాయి. ఇక్కడి పాలు గది ఉష్ణోగ్రతలో ఎక్కువ సేపు నిల్వ ఉంటాయి. వినుకొండలో ప్రసిద్ధి చెందిన సంగం డెయిరీ, హెరిటేజ్‌, తిరుమల, జెర్సీతోపాటు మొత్తం ఆరు పాల శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.అన్ని గ్రామాల్లో కలిపి 30వేల మంది పాలు విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు.

నోట్స్[మార్చు]

 1. వినుకొండకు చెందిన జాషువా కవితలో "రఘురామ వీరవరుడు పృథివి జాతాపహరణంబు విన్నచోటు శృతగిరి పురంబు నాది" అని ఈ ఊరి గురించి చెప్పుకోవడంలో ఈ లోకనిరుక్తి, సంస్కృతీకరించిన గ్రామనామం రెండూ కనిపిస్తాయి.

మూలాలు[మార్చు]

 1. కేతు విశ్వనాథరెడ్డి. కడప ఊర్ల పేర్లు. p. 126.

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వినుకొండ&oldid=2866937" నుండి వెలికితీశారు