పిడుగురాళ్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్టణం
Map
నిర్దేశాంకాలు: 16°29′N 79°54′E / 16.48°N 79.9°E / 16.48; 79.9Coordinates: 16°29′N 79°54′E / 16.48°N 79.9°E / 16.48; 79.9
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండలంపిడుగురాళ్ళ మండలం
విస్తీర్ణం
 • మొత్తం31.63 km2 (12.21 sq mi)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం63,103
 • సాంద్రత2,000/km2 (5,200/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1003
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08649 Edit this on Wikidata )
పిన్(PIN)522 413 Edit this on Wikidata
జాలస్థలిEdit this at Wikidata

పిడుగురాళ్ల, పల్నాడు జిల్లా చెందిన పట్టణం, పిడుగురాళ్ల మండల కేంద్రం.

భౌగోళికం[మార్చు]

జిల్లా కేంద్రమైన నరసరావుపేట నుండి వాయవ్య దిశలో 35 కి.మీ దూరంలో వుంది.

జనగణన గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 50,127. ఇందులో పురుషుల సంఖ్య 25,546, స్త్రీల సంఖ్య 24,581, గ్రామంలో నివాస గృహాలు 11,222 ఉన్నాయి. పట్టణ విస్తీర్ణము 3,149 హెక్టారులు.

రవాణా సౌకర్యాలు[మార్చు]

పిడుగురాళ్ల, పలు జాతీయ రహదారుల కూడలి. జాతీయ రహదారి 167A (భారతదేశం), నార్కెట్‌పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారి ఇక్కడ కలుస్తాయి. గుంటూరు-నడికుడి - మాచర్ల రైలు మార్గం, హైదరాబాదు - నడికుడి - గుంటూరు రైలు మార్గం ఇక్కడ కలుస్తాయి. పగిడిపల్లి -నల్లపాడు విభాగంలోకి ఈ రైలు నిలయం వస్తుంది. ఇక్కడ కొత్త పిడుగురాళ్ల జంక్షన్ నుండి నడికుడి- శ్రీకాళహస్తి మార్గంలో శావల్యాపురం వరకు 46 కి.మీ. దూరం కొత్త రైలుమార్గం పనులు పూర్తయ్యాయి.

విద్యా సౌకర్యాలు[మార్చు]

మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల: రాష్ట్రంలోనే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో ఇది మూడవది. ఇక్కడ 1583 మంది విద్యార్థులు ఉన్నారు.[3]

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ ఎకాడమీ[మార్చు]

పిడుగురాళ్ళలోని ఏ.బి.సి.విద్యాసంస్థల నిర్వాహకులు ఏ.కె.అయ్యంగార్‌కు సంగీతం అంటే ప్రాణం. వీరు హైదరాబాదులోని యూసఫ్‌గూడాలో ఒక రికార్డింగ్ స్టూడియో నిర్మించాడు. ఈ స్టూడియోని ప్రముఖ గాయకులు ఎస్.ప్.బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించాడు. పిడుగురాళ్ళలో బాలుగారి అనుమతితో అయ్యంగార్, "శ్రీ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ అకాడమీ" ని రిజిస్టర్ చేయించి, తద్వారా పిల్లలకు సంగీతం, నాట్యం, సాహిత్యం, చిత్రలేఖనం నేర్పించుచున్నాడు. [4]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  • శ్రీ భోగలింగేశ్వర స్వామివారి ఆలయం: ఈ ఆలయం ఐదు శతాబ్దాల కాలం నాటిదని చారిత్రిక ఆధారాల ద్వారా తెలియుచున్నది. శివపరివార దేవతలతో అందంగా ఆహ్లాదకరంగా ఉన్న ఈ ఆలయ శోభ విశిస్టమైనది. ప్రతి సోమవారం విశేష పర్వదినాలలో ప్రత్యేక పూజలు విశేషంగా జరుగును. [5]
  • శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం
  • శ్రీ దేవీ భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం
  • శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయం: ఈ ఆలయం, పిడుగురాళ్ళలోని నాగులగుగుడిలో ఉంది.
  • శ్రీ సువర్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం: పిడుగురాళ్ళ పట్టణంలోని ప్రజాశక్తినగర్ లో ఉన్న ఈ ఆలయంలో, 2016,జనవరి-28వ తేదీ గురువారంనాడు, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. [6]

మూలాలు[మార్చు]

  1. http://piduguralla.cdma.ap.gov.in/.
  2. 2.0 2.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  3. ఈనాడు గుంటూరు రూరల్; 2017,జులై-12; 8వపేజీ.
  4. ఈనాడు గుంటూరు రూరల్;2020,సెప్టెంబరు-26;1వపేజీ.
  5. ఈనాడు గుంటూరు రూరల్; 2013,జులై-8; 15వపేజీ.
  6. ఈనాడు గుంటూరు రూరల్; 2016,జనవరి-29; 16వపేజీ.

వెలుపలి లింకులు[మార్చు]