నరసరావుపేట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నరసరావుపేట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522601
ఎస్.టి.డి కోడ్ 08647
  ?నరసరావుపేట మండలం
గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు జిల్లా పటములో నరసరావుపేట మండలం యొక్క స్థానము
గుంటూరు జిల్లా పటములో నరసరావుపేట మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°15′N 80°04′E / 16.25°N 80.07°E / 16.25; 80.07
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము నరసరావుపేట
జిల్లా(లు) గుంటూరు
గ్రామాలు 16
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
1,79,690 (2001)
• 90740
• 88940
• 63.71
• 73.07
• 54.18


నరసరావుపేట గుంటూరు జిల్లా లోని పట్టణాలలో ప్రముఖమైనది. [1]

పట్టణం చరిత్ర[మార్చు]

పట్టణం పేరు వెనుక చరిత్ర[మార్చు]

పట్టణం భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

పట్టణానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పట్టణంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

నందమూరి బసవతారకం కళాశాల.

పట్టణంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

పట్టణానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

పట్టణంలోని దర్శనీయప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

 1. ప్రసిద్ధి చెందిన కోటప్ప కొండ లోని త్రికోటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడికి 12 కి మీల దూరంలో ఉంది. ఆ అలయం లొ శివుడు త్రికొటేశ్వరుడిగా భక్తులు కొలుస్తారు.కొండ పైకి వెళ్ళే దారిలొ మెట్ల దారి దగ్గర విఘ్నేశ్వరుడి గుడి వుంది.కొండ మీద గొల్లభామ గుడి వుంది.పెద్ద శివుని విగ్రహం వుంది. ప్రతి శివరాత్రి చాలా వైభవంగా జరుగుతుంది.యెన్నొ ప్రభలు వస్తాయి.
 2. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ భీమలింగేశ్వరస్వామివారి ఆలయం:-స్థానిక పాతూరులో, 11వ శతాబ్దిలో ప్రతిష్ఠించిన ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులు, 2014,ఫిబ్రవరి-28న శిలాన్యాసం చేసి, ప్రారంభించినారు. 2015 లో పూర్తి చేయాలని నిశ్చయించినారు. ఈ ఆలయ శిల్పకళలో ద్రావిడ, చోళ రీతులకు విశిష్టస్థానం ఉన్నది. దేశంలోని పురాతన ఆలయాలన్నీ ఆయా శైలిలోనే నిర్మించినారు. పూర్తిగా రాతితో ఆలయనిర్మాణం చేయుచున్నారు. అందుకుగాను బెంగళూరులో స్థంభాలు, ఇతర శిలలను తయారుచేయుచున్నారు. తెలుపు, గ్రే వర్ణాలు మిళితంగా ఉండే గ్రానైటు రాతిని నిర్మాణంలో ఉపయోగించుచున్నారు. ఆలయం పునాదులనుండి పైకప్పు వరకు రాతితోనూ, ఆపైన విమానశిఖరం తదితర నిర్మాణాలను సిమెంటుతోనూ తయారు చేసెదరు. పైకప్పు వరకు 15 పొరలుగా నిర్మాణం చేపట్టినారు. ఆలయం ఎత్తు 42 అడుగులు, పొడవు 52 అడుగుల వరకు ఉంటుంది. ప్రస్తుతం పైకప్పు వేసే స్థాయికి నిర్మించినారు. కిటికీలు, ఆలయ రాతిగోడలకు అమర్చిన స్థంభాలు శిల్పుల నైపుణ్యానికి అద్దం పడుతున్నవి. తమిళనాడుకి చెందిన దేవాలయ నిర్మాణ నిపుణులు 10 మంది వరకు, ఈ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో, నిర్దేశించిన నియమాలు పాటించుచూ నిర్మాణం చేయుచున్నారు.[2]
 3. శ్రీ రాధా గోవిందచంద్ర మందిరం:- స్థనిక బరంపేటలోని ఈ మందిరంలో, 2015,సెప్టెంబరు-21వ తెదీ సోమవారంనాడు, రాధారాణి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా అ రోజున రధరాణి నిజపాద దర్శనం, ఉదయం 8-30 నుండి రాత్రి వరకు, అనుమతించినారు. సంవత్సరానికి ఒకరోజు మాత్రమే రాధారాణి నిజపాద దర్శనానికి అనుమతించడంతో, అ రోజున భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి విచ్చేసి, రాధాకృష్ణులను దర్శించుకున్నారు. మద్యాహ్నం భక్తులకు సంపూర్ణ ప్రసాద వితరణ చేసినారు. []
 4. శ్రీ నీలా వేంకటేశ్వరస్వామివారి ఆలయం.
 5. శ్రీ విజయ చాముండేశ్వరీ దేవస్థానం.
 6. శ్రీ రుక్మాబాయి సమేత శ్రీ పాండురంగస్వామివారి ఆలయం.

పట్టణ ప్రముఖులు[మార్చు]

కొండా వెంకటప్పయ్య, అన్నాప్రగడ కామేశ్వరరావు వంటి స్వాతంత్ర్య సమర యోధులను నరసరావుపేట అందించింది. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి, ప్రముఖ వేణు కళాకారుడు-కవి-సంగీత కారుడు అయిన ఏల్చూరి విజయరాఘవ రావు, అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ పర్యవరణ వేత్త ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ఎన్ మూర్తి అని ప్రముఖంగా పిలువబడే నారాయణం నరసింహ మూర్తి కూడా నరసరావు పేట నుండి వచ్చిన వాడే. ప్రస్థుత సినిమా రంగంలొ వున్న సినీ నటుడు శివాజి కూడా నరసరావుపేట కు చెందినవాడు.

పట్టణ విశేషాలు[మార్చు]

 • నరసరావుపేటను పలనాడుకు ముఖద్వారం గా అభివర్ణించారు. జిల్లా లోని నాలుగు రెవెన్యూ కేంద్రాలలో ఇది ఒకటి. ఈమధ్యనే ద్విశతి (200ఏళ్ళు) జరుపుకున్న ఇది రెవిన్యూ మండలానికి కేంద్రం. వాణిజ్యకేంద్రంగా, విద్యా కేంద్రంగా జిల్లాలో ప్రముఖమైన స్థానం పొందింది మరియు రాష్ట్ర రాజకీయాలకు ప్రసిద్ధి.
 • భారతదేశంలోకెల్లా పెద్ద లోక్‌సభ నియోజక వర్గాలలో నరసరావుపేట ఒకటి.
 • నరసరావుపేట పురపాలక సంఘం, శత సంవత్సర వేడుకలను, 2015,ఆగష్టు మొదటి వారంలో నిర్వహించెదరు.

మండలంలోని గ్రామాలు[మార్చు]

గ్రామ గణాంకాలు[మార్చు]

మండల గణాంకాలు[మార్చు]

గ్రామాలు 16

జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ 1,79,690 (2001) • 90740 • 88940 • 63.71 • 73.07 • 54.18

మూలాలు[మార్చు]

[1] ఈనాడు గుంటూరు సిటీ; 2015,సెప్టెంబరు-22; 17వపేజీ.


 1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
 2. ఈనాడు గుంటూరు రూరల్; 2014,సెప్టెంబరు-21; 20వపేజీ