రమ్య బెహరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రమ్య బెహరా
జననం(1994-02-01)1994 ఫిబ్రవరి 1
వృత్తిగాయని

రమ్య బెహరా ప్రధానంగా తెలుగు చిత్రాలలో పనిచేసే ఒక భారతీయ నేపధ్య గాయని. రమ్య నరసరావుపేట, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్‌లో పుట్టి హైదరాబాద్, తెలంగాణలో పెరిగింది. నేపథ్య గాయనిగా ఆమె మొదటి చిత్రం 2009 లో విడుదలైన వెంగమాంబ. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ సినిమాలలో ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎం. ఎం. కీరవాణి రమ్య బెహరాను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసాడు.[1] ఈమె ఇటీవల పాటలు పాడిన సినిమాలు - లచ్చిందేవికి ఓ లెక్కుంది[2], కృష్ణాష్టమి, బ్రూస్ లీ, బాహుబలి:ద బిగినింగ్, టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమకథా చిత్రమ్, లౌక్యం, కొత్తజంట, చిన్నదాన నీకోసం, దిక్కులు చూడకు రామయ్య. ఈమె ప్రస్తుతం కొన్ని కన్నడ, హిందీ, తమిళ సినిమాలలో కూడా పాడుతున్నారు. నేపథ్య గాయకురాలిగా ఈమె మొదటి హిందీ చిత్రం పాట "మైన్‌ తుఝ్సె ప్యార్ నహీ కర్తి" ఈ పాటను ఎం.ఎం.కీరవాణి బేబీ (2015 సినిమా) కోసం స్వరపరచాడు.

నేపథ్య గాయనిగా కెరీర్[మార్చు]

రమ్య మాటలలో "నేను నేపథ్య గాయనిని అవుతానని అనుకోలేదు. నేను ఏడవ తరగతి వరకు సినిమాలలో, రేడియోల నుండి పాటలు వింటూ హమ్ చేసేదాన్ని" నా ప్రతిభను గుర్తించిన నా తల్లిదండ్రులు హైదరాబాదులోని లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీలో చేర్పించారు, ఇక్కడ కోమండూరి రామాచారి ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ద్వారా సంగీత ప్రయాణం ప్రారంభమైంది. తర్వాత ఈమె లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీ ద్వారా రంగస్థల ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది.[3]

రమ్య బెహరా సూపర్ సింగర్ - సీజన్ 4 (మాటివిలో ఒక ప్రముఖ సంగీత ప్రతిభా ప్రదర్శన) యొక్క ఫైనలిస్ట్‌లలో ఒకరు. ఈమె సూపర్ సింగర్ - సీజన్ 8 లోని గురువులలో ఒకరు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

రమ్య బెహరా కుటుంబంలో చిన్నది, ఈమెకు ఇద్దరు అక్కలు ఉన్నారు.

పాటలు[మార్చు]

  1. గ్రీన్ సిగ్నల్ (2014): జనేజా సంగీత దర్శకుడు జే. బి
  2. మది (2022): కవ్వించే కలవు [4] సంగీత దర్శకుడు పివిఆర్ రాజా

మూలాలు[మార్చు]

  1. http://www.deccanchronicle.com/150129/entertainment-bollywood/article/baby%E2%80%99s-telugu-connection
  2. https://www.youtube.com/watch?v=b6_7rGu96nU
  3. Singer Ramya Behara In Coffee With Sowjanya https://www.youtube.com/watch?v=Nu2aTJ6eYdA
  4. ""Kavvincche Kalavu" Madhi film". Sppotify. 8 October, 2021. {{cite web}}: Check date values in: |date= (help)