పివిఆర్ రాజా
P.V.R. Raja (Composer) పీ. వీ. ఆర్. రాజా | |
---|---|
![]() పీవీఆర్ రాజా | |
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | పెనుమత్స వెంకట రామరాజు |
ఇతర పేర్లు | * షార్ట్ ఫిలిమ్స్ మాస్ట్రో * లఘు చిత్రాల ఇళయరాజా |
జననం | [1] ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం | 1985 జూన్ 1
సంగీత శైలి | సినిమా |
వృత్తి | స్వరకర్త, రికార్డు నిర్మాత, పాటల రచయిత, సంగీత దర్శకుడు |
వాయిద్యాలు | గిటార్ |
క్రియాశీల కాలం | 2013–ప్రస్తుతం |
పీవీఆర్ రాజా (PVR Raja) గా పేరొందిన పెనుమత్స వెంకట రామరాజు ఒక సంగీత దర్శకుడు, కవి, గేయ రచయిత.[2][3][4][5][6][7][8] విటమిన్ షి,[9][10] మది[11][12] చిత్రాలకు సంగీత దర్శకుడు. 250కి పైగా లఘు చిత్రాలకి సంగీత దర్శకత్వం చేసి, లఘుచిత్రాల ఇళయరాజా, షార్ట్ ఫిలిమ్స్ మాస్ట్రో గా తెలుగు లఘు చిత్ర పరిశ్రమలో జనాదరణ పొందాడు.[13][14][15][16][17][18]
వ్యక్తిగత జీవితం[మార్చు]
పి.వి.ఆర్. రాజా తండ్రి చంద్ర శేఖర్ రాజు , తల్లి సత్యవతి.[19] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విజయనగరం జిల్లాలో జూన్ 1, 1985 లో జన్మించాడు. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో భరతనాట్యం, షాలోమ్స్ మ్యూజిక్ స్కూల్లో గిటారు నేర్చుకొని 2005 లో డిగ్రీ పూర్తి చేసి, సినిమా అవకాశాల కోసం హైదరాబాదు చేరుకున్నాడు.[20]
సినిమా జీవితం[మార్చు]
పీ.వీ.ఆర్. రాజా హైదరాబాద్ వచ్చి సినిమాల్లో అనేక విభాగాలలో సహాయకుడిగా, సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ దగ్గర ఉంటూనే 2011 వరకు పాఠశాలల్లో సంగీత ఉపాధ్యాయుడిగా పని చేసాడు. నటుడు, రచయిత ఎల్. బి. శ్రీరామ్ స్వీయ నిర్మాణంలో చిత్రించిన షార్ట్ ఫిలిమ్స్ కి పివిఆర్ రాజా సంగీతం అందించాడు. నటి రోజా సెల్వమణి నిర్మించిన వన్ అవర్ షార్ట్ ఫిలిం కి బాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు.[21] విటమిన్ షి ఓటీటీ ఫిలింకి సంగీతం అందించాడు.[22] [23] [24] [25] [26]
లఘు చిత్ర ప్రయాణం[మార్చు]
2011 లో మొదట తాను సొంతంగా కొన్ని లఘు చిత్రాలు నిర్మించి, ఆ తరువాత వివిధ యూట్యూబ్ సంస్థలలో సంగీత దర్శకుడిగా పని చేసాడు. ఆ తరువాత లఘు చిత్రాలతో పాటు, డాక్యూమెంటరీ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు, ప్రైవేట్ మ్యూజిక్ వీడియోస్ అలాగే ఆల్బమ్స్, OTT సినిమాలు, వెండితెర సినిమాలు చేశారు.[27]
సంగీత పోటీలలో[మార్చు]
- - 2005 విజయనగరం జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలలో తృతీయ స్థానం.
- - 2007 చెన్నై లో ఎ. ఆర్. రెహమాన్ నిర్వహించిన హూ.. లలల్లా .. మ్యూజిక్ బ్యాండ్ హంట్ లో పాల్గొని షాలోమ్స్ బ్యాండ్ తరుపున టాప్ 18 లో నిలిచాడు.
- - 2011 హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలలో సొంతంగా రాసి కంపోజ్ చేసుకున్న పాటకు లైట్ మ్యూజిక్ విభాగంలో రాష్ట్ర స్థాయి అవార్డు.
- - 2011 ప్రతి ఏటా భారత ప్రభుత్వం నిర్వహించే జాతీయ స్థాయి యువజనోత్స పోటీలలో ఉమ్మడి సమైక్య ఆంధ్ర ప్రదేశ్ తరుపున ప్రధమ స్థానం లో నిలిచి, గిటారు విభాగంలో ఉదయపూర్ రాజస్థాన్‌లో జరిగిన పోటీలకి జాతీయ స్థాయికి ఎంపిక అయ్యాడు.[28]
- - 2013 హైదరాబాద్ టైమ్స్ ఫ్రెష్ పేస్ 2013 కంపిటిషన్స్ లో ఫైనల్స్ కి ఎంపిక అయ్యాడు.
- - 2016 తెలుగు షార్ట్ ఫిలిమ్స్ లో నిరంతర సంగీత సేవలకు గాను షార్ట్ ఫిలిం డైమండ్ అవార్డు (నవరత్నాలు)తో సత్కరించారు.
- షార్ట్ ఫిలిమ్స్‌లో ఉత్తమ సంగీత దర్శకుడిగా పొందిన అవార్డులు
- - 2016 లోటస్ ఫిలిం అవార్డ్స్ ఉత్తమ సంగీత దర్శకుడు (ఇట్లు మీ లైలా)
- - 2017 తానా ఇంటర్నేషనల్ తెలుగు షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ఉత్తమ సంగీత దర్శకుడు (ఇట్లు మీ లైలా)
- - 2018 లోటస్ ఫిలిం అవార్డ్స్ ఉత్తమ సంగీత దర్శకుడు (ఒక్క క్షణం)
- - 2020 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు సైమా షార్ట్ ఫిలిం అవార్డ్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నామినీ (అంతరార్ధం)
జాబితా[మార్చు]
- విటమిన్ షి (2020)
- మది (2022)
బయటి లింకులు[మార్చు]
- *ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పివిఆర్ రాజా పేజీ
- *ఫేస్బుక్ లో పీవీఆర్ రాజా
మూలాలు[మార్చు]
- ↑ "Happy birthday PVR Raja: From Vizianagaram to musical stardom, journey of the musician". E TIMES. The Times Of India. Retrieved 1 June 2023.
- ↑ "Music Director PVR Raja : లఘుచిత్రాల ఇళయరాజా.. ఈ పీవీఆర్ రాజా". ETV BHARAT. ETV Telangana. Retrieved 15 June 2022.
- ↑ "Music is way of life for this Hyderabad-based multi-talented musician". Telangana Today. Telangana Today. Retrieved 15 June 2022.
- ↑ "#BehindTheCamera: Music director PVR Raja". E Times. Times Of India. Retrieved 15 June 2022.
- ↑ "PVR Raja". Spotify. Spotify. Retrieved 15 June 2022.
- ↑ "PVR Raja". JioSaavn. Retrieved 15 June 2022.
- ↑ "PVR Raja". Amazon Music. Retrieved 15 June 2022.
- ↑ "PVR Raja". Apple Music. Retrieved 15 June 2022.
- ↑ "Vitamin She". jiosaavn.com. Times Music.
- ↑ "Vitamin She Movie Review & Rating". www.thehansindia.com. The Hans India. Retrieved 30 December 2020.
- ↑ "Madhi". Spotify. Aditya Music. Retrieved 18 November 2022.
- ↑ "Madhi Movie Review : An emotionally stirring romantic drama". Times Of India. Bennett, Coleman & Co. Ltd. Retrieved 10 November 2022.
- ↑ "సంగీత సామ్రాట్.!". Sakshi. 6 July 2022. Archived from the original on 6 జూలై 2022. Retrieved 6 July 2022.
- ↑ "Music Director PVR Raja : లఘుచిత్రాల ఇళయరాజా.. ఈ పీవీఆర్ రాజా". Etv Telangana. Etv Bharat. Retrieved 15 June 2022.
- ↑ "From introvert to International Book of Records". The Hans India. THE HANS INDIA. Retrieved 15 June 2022.
- ↑ "Introducing Music PVR Raja మ్యూజిక్ డైరెక్టర్ పివిఆర్ రాజా పరిచయం". Zindhagi.[permanent dead link]
- ↑ "Pvr Raja". IMDb. IMDb. Retrieved 15 June 2022.
- ↑ "లఘు చిత్రాల సంగీత దర్శకుడిగా పీవీఆర్ రాజా రాణింపు PVR Raja Music Director". ETV Telangana. ETV Telangana. Retrieved 15 June 2022.
- ↑ "షార్ట్ ఫిలిమ్ మ్యూజిక్ మాస్ట్రో". Nava Telangana. Nava Telangana. Retrieved 15 June 2022.
- ↑ Today, Telangana (2021-12-20). "Music is way of life for this Hyderabad-based multi-talented musician". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2022-06-08.
- ↑ https://www.teluguone.com/tmdb/amp/news/Telugu-Cinema-tl-66760c1.html
- ↑ https://telugu.asianetnews.com/entertainment/vitamin-she-telugu-movie-review-jsp-qm3n23
- ↑ https://m.dailyhunt.in/news/india/telugu/andhrajyothy-epaper-jyothy/+vitamin+shi+muvi+rivyu-newsid-n240631422?listname=topicsList&index=0&topicIndex=0&mode=pwa
- ↑ https://telugu.filmibeat.com/reviews/vitamin-she-movie-review-093928.html
- ↑ https://telugu.news18.com/news/movies/vitamin-she-movie-review-and-jayashankar-says-about-misusing-of-phone-pk-706604.html
- ↑ https://m.iqlikmovies.com/reviews/telugu/2020/12/29/vitamin-she-movie-review-and-rating/36796
- ↑ "Music Director PVR Raja : లఘుచిత్రాల ఇళయరాజా.. ఈ పీవీఆర్ రాజా". ETV Bharat News. Retrieved 2022-06-08.
- ↑ "షార్ట్ ఫిలిం జర్నీలో 10 వసంతాలు పూర్తి చేసుకున్న పీవీఆర్ రాజా". Klpaboard Post. Retrieved 19 July 2022.