విజయనగరం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?విజయనగరం
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
విజయనగరం కోట పశ్చిమ ద్వారం
విజయనగరం కోట పశ్చిమ ద్వారం
అక్షాంశరేఖాంశాలు: 18°07′N 83°25′E / 18.12°N 83.42°E / 18.12; 83.42
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 29.27 కి.మీ² (11 చ.మై)[1]
ముఖ్య పట్టణము విజయనగరం
ప్రాంతం కోస్తా
జనాభా
జనసాంద్రత
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
2,28,025[2] (2011)
• 343/కి.మీ² (888/చ.మై)
• 117,412
• 121,962
• 59.49
• 69.04
• 50.16

విజయనగరం పట్టణం భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్యాన ఉన్నది. ఇది విజయనగరం జిల్లాకు ముఖ్యపట్టణం. రాష్ట్రం లోని జిల్లాలన్నిటికంటే, విజయనగరం జిల్లా అత్యంత కొత్తది. 1979 జూన్ 1 న ఈ జిల్లా ఏర్పడింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది. విజయనగరం బంగాళా ఖాతము నుండి 18 కి.మీ.ల దూరములో, విశాఖపట్నం నకు 40 కి.మీ.లు ఈశాన్యమున ఉన్నది.

విజయనగరం పట్టణం[మార్చు]

విజయనగరం పట్టణం
ప్రముఖ కూడలి గంటస్తంభం

చరిత్ర[మార్చు]

విజయనగరం పట్టణం చారిత్రక ప్రశస్తి కలిగినది. ప్రపంచప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకంలోని ప్రధాన వేదిక విజయనగరమే! పట్టణంలోని కొన్ని ప్రధాన ప్రాంతాలు - అయ్యకోనేరు, బొంకులదిబ్బ మొదలైన వాటి ప్రస్తావన ఈ నాటకంలో ఉంది. ఆ నాటక రచయిత గురజాడ అప్పారావు విజయనగరం రాజావారి ఆస్థానంలో ఉద్యోగస్తుడే.

విజయనగర వైభవం[మార్చు]

పైడితల్లి అమ్మవారి ఆలయం[మార్చు]

ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు విజయనగరం పట్టణంలో 300 ఏళ్లుగా జరుగుతున్నాయి. బొబ్బిలియుద్ధం సమయంలో విజయనగర రాజుల ఆడపడుచైన పైడితల్లి ఆత్మాహుతికి పాల్పడి ఇలవేల్పుగా అవతరించినట్లు భావిస్తారు. అప్పటినుంచి ఆమెను భక్తితో పూజిస్తున్నారు. లక్షలాదిమంది భక్తులు దీనికి హాజరవుతారు.

విజయనగరం పట్టణం మధ్యలో 'పెద్ద చెరువు' చాలా విశాలమైనది. 18వ శతాబ్దంలో కోట నిర్మాణానికి కావల్సిన మట్టి కోసం దీన్ని తవ్వించారు. ఈ చెరువులోని నీటితో ఆయకట్టు రైతులు ఏటా మూడు పంటలు పండిస్తుంటారు. ఈ చెరువు పశ్చిమ భాగంలోనే పైడిమాంబ విగ్రహం సాక్షాత్కారమైనది. ఈ చెరువులోనే అమ్మవారి తెప్పోత్సవం నిర్వహిస్తారు.

గంట స్థంభం కూడలి[మార్చు]

విద్యుశ్చక్తి లేని రోజుల్లో నాటి పురపాలక సంఘం వారు 'మూడు లాంతర్లు కూడలి' లో మూడు వైపులా మూడు హరికెన్ లాంతర్లు ఏర్పాటుచేశారు. రాత్రిపూట నెల్లిమర్ల, ధర్మపురి, గంటస్తంభం దారులలో ఎడ్లబళ్ళుతో వెళ్ళేవారికి, పాదచారుల సౌకర్యార్ధం నెలకొల్పారు. విజయనగర రాజులు 'అవృతఖానా' ను పెద్ద పూలకోటలో నిర్మించారు. 'ఖానా' అంటే మదుము అని 'అవృత' అనే ఆంగ్లపదంతో కలిసి రూపొందింది. 'నీరు బయటకు పోయే మదుము' అని దీని అర్ధం. ఇది గంటస్తంభం నమూనాలో ఉన్నది. పైభాగంలో స్నానానికి అనువుగా పెద్ద తొట్టె ఉన్నది. క్రిందిభాగంలో నుయ్యి, దిగడానికి మెట్లు వున్నాయి. మహారాజులు ఇందులో స్నానాలు చేసేవారని పెద్దలు అంటారు.

రాజావారి కోట[మార్చు]

కోట ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశాన్ని 'బొంకుల దిబ్బ' అంటారు. నాడు ఈ ప్రదేశాన్ని మహారాజులు సైనిక విన్యాసాలకు కవాతులకు వినియోగించేవారు. 'బంకు' అనేది మహారాష్ట్ర పదం దీనికి 'తలవాకిట పహరా' అని అర్ధం. కాలక్రమేణా ఈ బంకులదిబ్బే బొంకులదిబ్బగా రూపాంతరం చెందింది. ఈ ప్రదేశానికి ఈ పేరు రావడానికి మరో కథనం కూడా ప్రచారంలో ఉన్నది. ఒక ఫ్రెంచి ఇంజినీరు భూగర్భ జలాల్ని బయటకు తెప్పిస్తానని గొట్టాలను తెప్పించి వాటిని ఇక్కడే భూమిలోకి దించాడట. తన ప్రయత్నం విఫలం కావడంతో చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రే పారిపోయాడట. ఆ ఇంజినీరు పలికిన బొంకు లేదా అబద్ధం ఆ ప్రదేశానికి స్థిరపడిందంటారు. మహాకవి గురజాడ అప్పారావు తన కన్యాశుల్కం నాటకాన్ని బొంకుల దిబ్బ సీనుతోనే ఆరంభించారు. ప్రస్తుతం ఈ ప్రదేశం కూరగాయల మార్కెట్ గా ఉపయోగపడుతుంది.

విజయనగరం రైల్వే స్టేషను వద్ద ఒక రైలు ఇంజను నమూన

చరిత్ర[మార్చు]

విజయనగరం ఒక సంస్థానం. పూసపాటి వంశం వారు దీని పాలకులు. 1754 లో, విజయనగర పాలకుడైన పూసపాటి విజయరామ గజపతి రాజు, ఫ్రెంచి వారితో ఒప్పందం కుదుర్చుకొని, తన పాలన సాగించాడు. కానీ కొంత కాలానికే ఈ సంస్థానం బ్రిటిషు వారి ఏలుబడిలోకి వెళ్ళింది. స్వాతంత్ర్యం వచ్చేవరకు బ్రిటిషువారి ఏలుబడిలోనే ఉంది.

విజయనగరం కోట[మార్చు]

ప్రసిద్ధిచెందిన విజయనగరం కోట ముఖద్వారం

విజయనగర రాజులు మొదట్లో కుమిలి లోని మట్టి కోటలో నివసించేవారు. ఆనంద గజపతి రాజు విజయనగరం కోట నిర్మాణాన్ని క్రీ.శ. 1712-1714 ల మధ్య ప్రారంభించారు. అయిదు విజయాలకు చిహ్నంగా అనగా విజయ నామ సంవత్సరంలో, విజయదశమి, మంగళవారం నాడు (తెలుగులో జయవారం) ఈ కోట నిర్మాణం మొదలైంది. తన కుమారుడు విజయరామ రాజు పేరిట దీనికి 'విజయనగరం' అని పేరు వచ్చింది. అయితే 1717 సంవత్సరంలో ఆనందరాజు పరమపదించగఅ విజయరామరాజు కోట నిర్మాణాన్ని పూర్తిచేశారు.2012 నాటికి 300 సం. అయ్యాయి.

విజయనగరం కోటను కొండరాళ్లతో నిర్మించారు. ఇది 26 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు కోణాల్లో నలుగు పెద్ద బురుజులతో నిర్మితమైనది. కోట చుట్టూ 19,653 చదరపు అడుగుల కందకం తవ్వించారు. నాడు కందకం నిండా నీరు ఉండేది. ఇది సుమారు రెండు ఏనుగులు మునిగేటంత లోతు ఉంటుంది. గోడలు సుమారు 30 అడుగుల ఎత్తు కలిగివున్నాయి.

ప్రముఖులు[మార్చు]

  • భమిడిపాటి రామగోపాలం: ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. ఆయన బి.ఎ. వరకు విద్యాభ్యాసాన్ని విజయనగరంలో పూర్తిచేసుకున్నారు.[3]

మరిన్ని విశేషాలు[మార్చు]

భౌగోళికం[మార్చు]

Vizianagaram is located at 18°07′N 83°25′E / 18.12°N 83.42°E / 18.12; 83.42. It has an average elevation of 74 metres (242 feet). విజయనగరం భౌగోళికంగా 18 ° 07'N 83 ° 25'E / 18,12 ° N 83,42 ° E / 18,12 ప్రాంతం లో ఉంది. ఇది 74 మీటర్ల (242 అడుగులు) సగటు ఎత్తులో ఉంది.

ఆర్ధికరంగం[మార్చు]

వ్యవసాయం[మార్చు]

పరిశ్రమలు[మార్చు]

నియోజక వర్గాలు[మార్చు]

విజయనగరం లోకసభ నియోజకవర్గం[మార్చు]

విజయనగరం శాసనసభా నియోజకవర్గం[మార్చు]

  • పూర్తి వ్యాసం విజయనగరం శాసనసభా నియోజకవర్గం లో చూడండి.
  • విజయనగరం ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గం. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత విజయనగరం మండలాన్ని మాత్రం ఇందులో ఉంచారు.

మూలాలు[మార్చు]

  1. "Basic Information of Municipality". Commissioner & Director of Municipal Administration. Municipal Administration & Urban Development Department, Govt. of Andhra Pradesh. Retrieved 5 August 2014. 
  2. "Andhra Pradesh (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts". citypopulation.de. 
  3. అత్తలూరి, నరసింహారావు (మార్చి 1990). ఇట్లు మీ విధేయుడు (పదినిమిషాల్లో భరాగో పరిచయము వ్యాసం). విశాఖపట్టణం: విశాఖ సాహితి. Retrieved 10 March 2015.  Check date values in: |date= (help)
  • ఈనాడు విజయనగం ఎడిషన్ 14 అక్టోబర్ 2008 తేదీన, శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి జాతర ప్రత్యేక అనుబంధంలో ప్రచురించిన సమాచారం.

బయటి లింకులు[మార్చు]

మూసలు, వర్గాలు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=విజయనగరం&oldid=1878920" నుండి వెలికితీశారు