నెల్లిమర్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నెల్లిమర్ల (ఆంగ్లం: Nellimarla), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన పట్టణము.[1]

పట్టణ స్వరూపం, జనాభా[మార్చు]

నెల్లిమర్ల పట్టణం చంపావతి నది వడ్డున ఉంది. దీని భౌగోళిక స్థానం 18.1667° N 83.4333° E.[2] సముద్ర మట్టం నుండి యెత్తు 190 మీటర్లు (626 అడుగులు).

2001 జనాభా లెక్కల ప్రకారం నెల్లిమర్ల పట్టణ జనాభా 19,352. ఇందులో పురుషుల సంఖ్య 48% మరియుస్త్రీల సంఖ్య 52%. పట్టణ అక్షరాస్యత 62% ఉంది. దేశపు సగటు అక్షరాస్యత అయిన 59.5% కంటే ఇది మెరుగు. నెల్లిమర్ల పట్టణపు పురుషుల అక్షరాస్యత 70% మరియు స్త్రీల అక్షరాస్యత 54%. మొత్తం జనాభాలో 8% వరకు ఆరు సంవత్సరాలలోపు బాలబాలికలు ఉన్నారు.

ఇదే 2001లో నెల్లిమర్ల మండలం జనాభా 73,753. ఇందులో పురుషుల జనాభా 36,657 కాగా మహిళల జనాభా 37,096. మండలం అక్షరాస్యత 51% ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 62%, మహిళల అక్షరాస్యత 41% ఉంది.

నెల్లిమర్ల వద్ద తూర్పు కనుమలు

వ్యవసాయం, నీటి వనరులు[మార్చు]

చంపావతి నదిపై "డెంకాడ ఆనకట్ట" 1965-68 కాలంలో నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు సరిపల్లి గ్రామం వద్ద ఉంది.[3] లభ్యమైన నీటిలో 0.640 TMC నీరు ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగం అవుతున్నది. ఇందువల్ల డెంకాడ, భోగాపురం మండలాలలో 5,153 ఎకరాల ఆయకట్టు స్థిరపడింది.

పరిశ్రమలు[మార్చు]

నెల్లిమర్ల జూట్‌మిల్లు రాష్ట్రంలో పెద్దదైన జనుపనార పరిశ్రమలలో ఒకటి. అకారణముగా అనేక సార్లు మూత పడడము వలన చెడ్డ పేరు గడించింది.

విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు[మార్చు]

  • సి.కె.ఎమ్.జి కాలేజి చుట్టుప్రక్కల ప్రసిద్ధి చెందింది.
  • మహారాజా వైద్య విద్యా సంస్థ 2003లో స్థాపించబడింది.

ఇతర విశేషాలు[మార్చు]

  • చంపావతి నది వడ్డున ఒక క్రీడా మైదానం ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో నెల్లిమర్ల మంచి క్రీడా కేంద్రంగా ప్రసిద్ధం. వెల్లిమర్ల నుండి మంచి ఫుట్‌బాల్ క్రీడాకారులు వచ్చారు.
  • నెల్లిమర్ల సమీంలోని మోడా గ్రామం ఇదివరకు పెన్మత్స జమీందారుల పాలనలో ఉండేది. ఇక్కడినుండి పెన్మత్స సాంబశివరాజు పలుమార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
  • బ్యాంకులు - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • నెల్లిమర్లలో శ్రీ ఛక్ర జూనియర్ కాలేజ్ 2004 లో స్థాపించబడెను, దానికి ప్రిన్షపాల్ కనకల రాంబాబు ఎమ్.ఎస్.సి, బి.ఈడి

Andhra bank (ramatheerdham in)

ఇవి కూడా చూడండి[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 77,031 - పురుషులు 38,225 - స్త్రీలు 38,806

మూలాలు, వనరులు[మార్చు]

  1. "Mandals in Vizianagaram district". మూలం నుండి 2006-11-15 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-02-26. Cite web requires |website= (help)
  2. Fallingrain.com Nellimarla
  3. "Irrigation profile of Vizianagaram district". మూలం నుండి 2007-09-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-07-01. Cite web requires |website= (help)