విజయనగరం జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయనగరం జిల్లా
.
.
India - Andhra Pradesh - Vizianagaram.svg
Countryభారత దేశం
Stateఆంధ్ర ప్రదేశ్
Regionకోస్తా
Headquarterవిజయనగరం
విస్తీర్ణం
 • మొత్తం6,539 కి.మీ2 (2,525 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం23,42,868
 • సాంద్రత358/కి.మీ2 (930/చ. మై.)
Languages
 • Officialతెలుగు
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
Telephone code+91 0( )
Literacy51.82 (2001)
Literacy Male63.0
Literacy Female40.73
జాలస్థలిhttps://www.guntur.ap.gov.in/

విజయనగరం జిల్లా భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్యాన ఉంది. విజయనగరం జిల్లాకు ముఖ్యపట్టణం విజయనగరం. రాష్ట్రం లోని జిల్లాలన్నిటికంటే, విజయనగరం జిల్లా అత్యంత కొత్తది. ఈ జిల్లా 1979 జూన్ 1 తేదీన ఏర్పడింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది. విజయనగరం బంగాళా ఖాతము నుండి 18 కి.మీ.ల దూరములో, విశాఖపట్నం నకు 40 కి.మీ.లు ఈశాన్యమున ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారము విజయనగరం జిల్లా యొక్క జనాభా 22,45,100. ఈ జిల్లా సరిహద్దులు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు, ఒడిషా రాష్ట్రం, బంగాళా ఖాతము. Map

జిల్లా చరిత్ర[మార్చు]

క్రీస్తు శకం 15 వ శతాబ్దం వరకూ కళింగ దేశం మీద ఎందరెందరో దండయాత్రలు చేసినా...ఇక్కడి భాషా సంస్కృతులు మారలేదు. గోదావరి నదికి అవతలి వారిని తెలుగువారని, ఇవతలి వారిని కళింగులని కొందరు భావించారు. ఒడిషా రాష్ట్రం సరిహద్దుగా ఉండడం వల్ల ఆ సంస్కృతి కొంత ఆంధ్రుల మీదా పడుతోంది. తెలంగాణా, రాయలసీమల లానే...కళింగం కూడా సమగ్రాంధ్రలో ఒక ప్రాంతం. ఒకప్పుడు ఇది చాలా వెనుక బడి ఉండేది. అందుచేత సంస్కృతాంధ్ర భాషాప్రభావం తక్కువ గానే ఉండేది. దీర్ఘతమసుడు అనే ఆయన అంగవంగ కళింగాలని ఏక దేశంగా చేసుకొని పాలించాడని మహా భారతంలో చెప్పబడింది. కళింగ దేశంలో ఏనుగులు ఎక్కువని అందుకే ఇక్కడి రాజులకి "గజపతులు" అని పేరు వచ్చిందని అర్ధశాస్త్రంలో ఉంది. విదేశీ చరిత్రకారులు ప్లీనీ, మెగస్తనీస్, హుయన్ చాంగ్ లు కళింగ దేశ నాగరికత గురించి రాశారు. కళింగ భూములు ఎంతో సారవంతమయినవని...బెల్లంకొండ నుంచి పాలకొండ వరకూ ఎన్నో కొండలున్నాయని ప్లీనీ రాశాడు. అక్కడి ప్రజలు మోటు వారయినా న్యాయం తప్పని వారని హుయాన్ చాంగ్ రాశాడు. క్రీస్తు పూర్వం తరువాత గంగరాజులు ఈ దేశాన్ని పాలించారు. బౌద్ధ, జైన మతాలు ఎక్కువ ప్రాభవం పొందాయి. సాలిహుండం మొదలు కొని జామి వరకూ బౌద్ధులూ జైనులూ నివసించారనడానికి ఆధారాలున్నాయి. అశోకుని సైతం అహింసావాదిగా మార్చిన అమృత సీమ ఈ కళింగసీమ అంటారు. ప్రస్తుత విజయనగరం జిల్లా పూర్వం శ్రీకాకుళం, విశాఖ జిల్లాలలో కలసి వుండేది. క్రీ.పూ. 4వ శతాబ్దం నాటికే గోదావరి మహానదుల మధ్య భాగాన్ని అంటే కటక్ నుంచి పిఠాపురం వరకూ ఉన్న ప్రాంతాన్ని కళింగదేశం అన్నారు.

భౌగోళిక స్వరూపం[మార్చు]

వాతావరణం[మార్చు]

విజయనగరం-వాతావరణం
నెల జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు సంవత్సరం
సగటు అధిక °C (°F) 38.7 31.3 36.2 37.2 37.0 35.1 32.9 32.8 33.3 31.9 30.2 29.8 33.87
సగటు అల్ప °C (°F) 17.2 19.1 23.2 26.1 27.0 26.8 25.7 26.3 25.7 22.8 19.5 17.1 23.04
అవక్షేపం mm (inches) 11.4 7.7 7.5 27.6 57.8 105.6 134.6 141.2 174.8 204.3 65.3 7.9 945.7
Source: [1]

ఆర్ధిక స్థితి గతులు[మార్చు]

గురభక్తులకొండ బౌద్ధారామం, రామతీర్థం, విజయనగరం జిల్లా

పరిశ్రమలు[మార్చు]

విజయనగరంలోని ప్రముఖ వస్త్ర సముదాయం బాలాజి మార్కెట్
ఫేకర్ ఖనిజ పరిశ్రమ (FACOR main unit of Ferro-alloy production unit)

ఈ జిల్లాలోని ప్రారిశ్రామిక అభివృద్ధి ప్రధానంగా వ్యవసాయ పంటల మీద ఆధారపడినది. వీనిలో నార మిల్లులు, చక్కెర కర్మాగారాలు, ధాన్యం, నూనె మిల్లులు, పెంకుల తయారీ ముఖ్యమైనవి. ఇక్కడి ఖనిజాల్ని ఫేకర్, ఇతర పరిశ్రమలు వినియోగిస్తున్నాయి. ఈ జిల్లాలో సుమారు 520 కర్మాగారాలు నమోదు చేయబడి ఇంచుమించు 27,800 కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి.

జిల్లాలోని మండలాలు[మార్చు]

మండలాలుతో విజయనగరం జిల్లా రేఖా పటం

భౌగోళికంగా విజయనగరం జిల్లాను 34 రెవిన్యూ మండలాలుగా విభజించారు.[8][9] జిల్లాలో 1552 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[10] అందులో 67 నిర్జన గ్రామాలు.

కొన్ని విశేషాలు[మార్చు]

 • రెవెన్యూ విభాగాలు (2): విజయనగరం, పార్వతీపురం
 • నదులు: గోస్తని, చంపావతి, నాగావళి, గోముఖనది, సువర్ణముఖీ, వేగావతి. నాగావళిని దిగువ ప్రాంతాల్లో లాంగుల్య నది అని వ్యవహరిస్తారు.
 • ఆంధ్రుల పౌరుషాన్ని చాటిచెప్పిన బొబ్బిలి యుద్ధం జరిగిన జిల్లా.

జనాభా లెక్కలు[మార్చు]

సాలూరు వద్ద టేకు తోటలు

2011 జనాభా లెక్కల ప్రకారం విజయనగరం జిల్లా జనాభా 2,342,868,[11] ఇది లాట్వియా (Latvia) దేశ జనాభాకి, అమెరికాలో న్యూ మెక్సికో (New Mexico)[12] రాష్ట్ర జనాభాకి సమానం [13] ఇది భారతదేశంలో జనాభా ప్రకారం 193వ స్థానం ఆక్రమించింది (640 జిల్లాలలో).[11] ఇక్కడ జనాభా సాంధ్రత 358 inhabitants per square kilometre (930/sq mi) .[11] జనాభా వృద్ధి రేటు (2001-2011) 4.16 %.[11] విజయనగరంలో 1000 మంది పురుషులకు 1016 మహిళలు ఉన్నారు,[11] అక్షరాస్యత రేటు 59.49 %.[11]

ఈ జిల్లా జనాభా 1901 లెక్కల ప్రకారం 9,58,778. ఇది శతాబ్ద కాలంలో 2001 సంవత్సరానికి 22,49,254 చేరుకుంది.[14] వీరిలో 11,19,541 మంది పురుషులు, 11,29,713 మహిళలు. ఇక్కడ 1000 మంది పురుషులకు 1009 స్త్రీలు ఉన్నారు. ఈ జిల్లా మొత్తం 6,539 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. జనాభా సాంధ్రత 344 persons per km². చివరి దశాబ్ద కాలంలో జనాభా వృద్ధి 6.55 శాతం.

ఈ జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు జనాభా 2,38,023, షెడ్యూల్డ్ తెగలు జనాభా 2,14,839. ఇది జిల్లా మొత్తం జనాభాలో 10.58 %, 9.55 %.

ఈ జిల్లా ప్రజలలో 18.37 లక్షల మంది అనగా 82 % పల్లెల్లో నివసించగా 4.12 లక్షల మంది అనగా 18 % పట్టణాలలో నివసిస్తున్నారు. ఈ జిల్లాలో 12 పట్టణాలు ఉన్నాయి. అవి: విజయనగరం, చీపురుపల్లి, గాజులరేగ, కనపాక, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, శ్రీరాంనగర్, నెల్లిమర్ల, కొత్తవలస, చింతలవలస, జరజాపుపేట, గజపతినగరం. ఈ జిల్లాలోని ఒకే ఒక్క మొదటి తరగతి పట్టణం విజయనగరంలో 1,95,801 మంది జీవిస్తున్నారు.

సంస్కృతి[మార్చు]

విజయనగరం, తూర్పు కోస్తా రైల్వేలో ముఖ్యమైన కూడలి

విజయనగరం జిల్లా ప్రజల సాంఘిక కట్టుబాట్లు చిన్న తేడాలతో దక్షిణ భారతీయ పద్ధతిలో ఉంటాయి. ఇక్కడి ప్రజలు మృదు స్వభావం, జాలిగలిగి, గట్టి కుటుంబ వ్యవస్థను కలిగివుంటారు. గురజాడ అప్పారావు గారి నవలలు, నాటకాలు, గీతాలు, కథలు ఈ ప్రాంత భాషా సంస్కృతులను ప్రతిబింబిస్తాయి.

ఈ ప్రాంతంలో ప్రధానమైనది హిందూ మతం. వీరు జరుపుకునే పండుగలలో సంక్రాంతి, ఉగాది, శ్రీరామ నవమి, మహాశివరాత్రి, దీపావళి, వినాయక చవితి, విజయదశమి ముఖ్యమైనవి. శ్రీరామ నవమి, వినాయక చవితి, దసరా ఉత్సవాలలో భాగంలో జరిగే నవరాత్రోత్సవాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఆ తొమ్మిది రోజులు నాటకాలు, హరికథలు, బుర్రకథలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్న పట్టణాలు కళకలలాడుతాయి. ఇక్కడి గ్రామదేవత పండుగలు బాగా ప్రసిద్ధిచెందాయి. వీటన్నింటిలోకి విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి పండుగ ప్రధానమైనది కాగా శంబర పోలమ్మ జాతర, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం పట్టణాలలో జరుగుతాయి.

వీరి ప్రధాన ఆహారంలో అన్నంతో కలిపి పప్పు, రసం లేదా సాంబార్, కూరలు, ఆవకాయ, పెరుగుతో పరిపూర్ణంగా ఉంటుంది.

పశుపక్ష్యాదులు[మార్చు]

రామతీర్థం వద్ద ఒక సుందర దృశ్యం

అరణ్యాలు ఈ జిల్లా ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రధానపాత్ర పోషిస్తుంది. జిల్లాలోని అరణ్యాల రకాలు: 1.Southern tropical mixed deciduous forests, 2.Northern tropical dry deciduous forests, 3.Southern tropical dry mixed deciduous forests, 4.Dry deciduous green forests and 5.Dry evergreen forests.

దట్టమైన కొండ ప్రాంతాలలో జంతుజాలం నివసిస్తూ; కొన్ని జాతులు అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు అరణ్యాలను నరకడం, అదుపులేని వేట. ఇక్కడి ప్రధానమైన జంతువులు గబ్బిలాలు, ఎలుగుబంట్లు, అడవి దున్న, నక్క, హైనా, తోడేలు, ముంగిస మొదలైనవి. ఇక్కడి పక్షులలో పావురాలు, కాకి, పిచ్చుక మైనా మొ. ముఖ్యమైనవి.

విద్యాసంస్థలు[మార్చు]

కోరుకొండ సైనిక పాఠశాల ప్రధాన ద్వారము

విజయనగరం జిల్లా విద్యావంతుల పరంగా వెనుకబడింది. అక్షరాస్యత రేటు 51.82 % రాష్ట్ర సరాసరి 61.55 % కన్నా బాగా తక్కువ.ఈ జిల్లాలో 2379 ప్రాథమిక పాఠశాలలు, 462 ప్రాథమికోన్నత పాఠశాలలు, 341 ఉన్నత పాఠశాలలు (2004-2005 అంచనాల ప్రకారం) ఉన్నాయి. అదే ఉన్నత విద్యలో 81 జూనియర్, 33 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ 14 పారిశ్రామిక శిక్షణా సంస్థలు, 2 పాలిటెక్నిక్ కళాశాలు ఉన్నాయి. అదే 9 బి.ఇడి. కళాశాలు, ఒక ఎమ్.ఎడి. కళాశాల, ఒక సంస్కృత కళాశాల, ఒక సంగీత నృత్య కళాశాలలు కూడా ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం క్రింద ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్, 5 ఇంజినీరింగ్ కళాశాలలు, 2 న్యాయ కళాశాలలు, ఒక వైద్య కళాశాల ఈ జిల్లాలో స్థాపించబడ్డాయి.

డెంకాడ ఆనకట్ట

ఈ జిల్లాలో 38 గ్రంథాలయ శాఖలు ఉన్నాయి. వీటిని జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్వహిస్తున్నది. ఇది ప్రతి మండలంలో 1-2 చొప్పున ఉన్నాయి.

 • అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, భోగాపురం.[15]
 • గోకుల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బొబ్బిలి.
 • కోడి రామమూర్తి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల, బొబ్బిలి.[16]
 • మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల.
 • మహారాజా సంస్కృత కళాశాల.
 • మహారాజా విజయరామ గజపతి రాజు న్యాయ కళాశాల, విజయనగరం.
 • మహారాజా పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్, విజయనగరం.
 • మహారాజా విజయరామ గజపతి రాజు ఇంజినీరింగ్ కళాశాల, విజయనగరం.[17]
 • మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నెలిమర్ల.
 • సెయింట్ తెరిస్సా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, గరివిడి.[18]
 • తాండ్ర పాపారాయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బొబ్బిలి.[19]
 • శ్రీనివాస జూనియర్, డిగ్రీ కళాశాల, విజయనగరం
 • గాయత్రీ జూనియర్, డిగ్రీ కళాశాల, విజయనగరం
 • మహారాజా కళాశాల, విజయనగరం
తాటిపూడి జలాశయం

ఆకర్షణలు[మార్చు]

సరిపల్లి దిబ్బలింగేశ్వర ఆలయం
విజయనగరం కోట గోడలు
విజయనగరం కోట ముఖద్వారం

జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ కలిపి 2017లో 44 లక్షల మంది పైచిలుకు, 2016లో 55 లక్షల పైచిలుకు పర్యాటకులు సందర్శించారని ప్రభుత్వ అంచనా.[20]

బొబ్బిలి కోటలో ఒక మండపం

క్రీడలు[మార్చు]

విజయనగరం బస్సు రవాణ సముదాయము

విజయనగరం యువరాజు పూసపాటి విజయానంద గజపతి రాజు క్రికెట్ ఆటలో సర్ విజ్జీగా ప్రసిద్ధిచెందారు. విజ్జీ ఒకప్పుడు భారత క్రికెట్ టీమ్ కు కెప్టెన్ గా విదేశాలు పర్యటించాడు. ఆ తర్వాత నిర్మాహకుడుగా, వ్యాఖ్యాతగా కూడా పనిచేశాడు. పిదప ఇతడు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు. న్యూఢిల్లీ లోని ఫిరోజ్ షా కొట్లా మైదానం నిర్మాణం కోసం భారీగా విరాళం ఇచ్చిన గొప్ప దాత. ఇతని స్మారకార్ధం విజయనగరం పట్టణంలో విజ్జీ స్టేడియం నిర్మించబడింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని మొదటి తరగతి క్రికెట్ ఆడే క్రీడా ప్రాంగణం.

ప్రముఖవ్యక్తులు[మార్చు]

విజయనగరం సంస్థానం రాజముద్ర
గురజాడ అప్పారావు గారు
బొబ్బిలి తాండ్ర పాపారాయుడు
 • పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు (1893 - 1964) ఒక గొప్ప వయొలిన్ (వాయులీనం) విద్వాంసుడు. సంగీత కళానిధి పురస్కార గ్రహీత.
 • చెలికాని అన్నారావు (1908 - ?) తిరుమల బాలాజీ సన్నిధిలో జీవితాన్ని చరితార్థం చేసుకున్న కార్యనిర్వహణాధికారి. వీరు జిల్లాలోని బొబ్బిలి రాజవంశంలో జన్మించారు.
 • సుప్రసిద్ధ తెలుగు గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు (1922 - 1974) గారు సంగీతం నేర్చుకున్నది విజయనగరంలోనే.
 • సాలూరి రాజేశ్వరరావు (1922 - 1999) : తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించి, తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకులలో ఒకడు.
 • సుప్రసిద్ద తెలుగు గాయకురాలు పి. సుశీల గారి జన్మస్థలం. 50 సంవత్సరాల సినీ జీవితములో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో 25 వేలకు పైగా సినిమా పాటలు పాడిన విదుషీమణి.
 • కలియుగ భీమగా పిలువబడే కోడి రామమూర్తి నాయుడు జన్మ స్థలం.
 • విజయనగరం యువరాజు పూసపాటి విజయానంద గజపతి రాజు క్రికెట్ ఆటలో సర్ విజ్జీగా ప్రసిద్ధిచెందారు. విజ్జీ ఒకప్పుడు భారత క్రికెట్ టీమ్ కు కెప్టెన్ గా విదేశాలు పర్యటించాడు. ఆ తర్వాత నిర్వాహకుడు, వ్యాఖ్యాతగా కూడా పనిచేశాడు. పిదప ఇతడు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు. న్యూఢిల్లీ లోని ఫిరోజ్ షా కొట్లా మైదానం నిర్మాణం కోసం భారీగా విరాళం ఇచ్చిన గొప్ప దాత. ఇతని స్మారకార్ధం విజయనగరం పట్టణంలో విజ్జీ స్టేడియం నిర్మించబడింది.
 • కాళ్ల సత్యనారాయణ (1948 - 2018): చిత్రకారుడు. విజయనగరం జిల్లాలో జన్మించాడు.

పూసపాటి వంశం[మార్చు]

 • పూసపాటి అమల రాజు (స్థాపకుడు)
 • పూసపాటి రాచి రాజు
 • పూసపాటి తమ్మ భూపాలుడు (1620-1670)
 • పూసపాటి పెద విజయరామ రాజు (1670-1756)
 • పూసపాటి చిన విజయరామ రాజు (1760-1794)
 • పూసపాటి విజయరామ గజపతి రాజు (1826-1879)
 • పూసపాటి ఆనంద గజపతి రాజు (1879-1897)
 • పూసపాటి విజయరామ గజపతి రాజు (1883-1902)
 • పూసపాటి అలక నారాయణ గజపతి రాజు (1902-1937)
 • పూసపాటి విజయరామ గజపతి రాజు (1945-1995)
 • పూసపాటి ఆనంద గజపతి రాజు (1950- )
 • పూసపాటి అశోక గజపతి రాజు (1951- )
 • పూసపాటి కార్తికేయ విజయవంశీరామ రాజు (1983- )

నియోజకవర్గాలు[మార్చు]

నియోజక వర్గ పునర్విభజనలో విజయనగరం జిల్లాలోని పార్లమెంట్ నియోజక వర్గాలు రెండు నుండి ఒకటికి తగ్గిపోయాయి.

లోక్‌సభ నియోజకవర్గాలు[మార్చు]

శాసనసభ నియోజకవర్గాలు:[మార్చు]

నియోజకవర్గ పునర్విభజనలో విజయనగరం జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాలు 14 నుండి తొమ్మిదికి తగ్గిపోయాయి.

ఉత్తరపల్లి, నాగూరు, నెల్లిమర్ల, తెర్లాం, సతివాడ (2009 నుంచి నియోజకవర్గ హోదా కోల్పోయాయి)

జిల్లా కలెక్టర్లు[మార్చు]

ఇది విజయనగరం జిల్లా కలెక్టర్ల జాబితా:

కలక్టరు పేరు నుండి వరకు
ఎస్. పి. కె. నాయిడు 1979 జూన్ 1 1979 జూన్ 15
ఎమ్. సి. మహాపాత్ర 1979 జూన్ 16 1979 జూన్ 23
ఎ. కె. ఝా 1979 జూలై 27 1979 సెప్టెంబరు 21
పి. వి. బేడీ 1979 సెప్టెంబరు 22 1981 ఏప్రిల్ 19
పాల్ భూమన్ 1981 ఏప్రిల్ 20 1983 ఏప్రిల్ 9
వి. శర్మా రావు 1983 ఏప్రిల్ 10 1987 మార్చి 28
జి. సుధీర్ 1987 మే 11 1987 అక్టోబరు 26
ఎమ్. వి. ఎస్. ప్రసాద్ 1987 నవంబరు 27 1989 జనవరి 31
ఎమ్. ఎస్. ప్రసాద్ 1989 ఫిబ్రవరి 27 1989 డిసెంబరు 5
జె. ఆర్. ఆనంద్ 1990 జనవరి 18 1991 జనవరి 3
టి. రాధ 1991 జనవరి 4 1992 డిసెంబరు 3
వి. నాగిరెడ్డి 1992 డిసెంబరు 4 1995 జనవరి 11
టి. విజయ కుమార్ 1995 జనవరి 11 1996 జూలై 31
కె. ఆర్. డబ్లూ. యేసుదాస్ 1996 ఆగస్టు 1 1997 మే 23
పూనం మాలకొండయ్య 1997 మే 23 1999 నవంబరు 12
కె. మంగపతి రావు 1999 నవంబరు 12 2000 జూలై 12
హర్ ప్రీత్ సింగ్ 2000 జూలై 12 2002 అక్టోబరు 24
రజిత్ కుమార్ 2002 అక్టోబరు 25 2004 నవంబరు 17
బి. వెంకటేశ్వరరావు 2004 నవంబరు 17 2006 మే 12
డా. ఎమ్. జగన్ మోహన్ రావు 2006 మే 13 2006 మే 18
డా. బి. కిషోర్ 2006 మే 19 2008
రామ్ నారాయణ్ రెడ్డి 2010 జూన్ 30
ఎమ్. వీరబ్రహ్మయ్య 2010 జూలై 7 ...
ఎం. హరి జవహర్ లాల్ ప్రస్తుతం

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. Handbook of Statistics, Vizianagaram district, 2004-2005, compiled and published by The Chief Planning Officer, Vizianagaram
 2. sQuareindia Advisory Pvt. Ltd.
 3. "Sri Padma Infoway". Archived from the original on 2017-02-19. Retrieved 2020-01-15.
 4. FACOR group
 5. "Jindal Steel plants". Archived from the original on 2011-11-26. Retrieved 2012-01-11.
 6. Andhra Ferro Alloys
 7. "Matrix Laboratories". Archived from the original on 2011-12-29. Retrieved 2012-01-11.
 8. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో విజయనగరం జిల్లా తాలూకాల వివరాలు Archived 2007-09-30 at the Wayback Machine. జూలై 28, 2007న సేకరించారు.
 9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-10.
 10. https://www.codes.ap.gov.in/revenuevillages
 11. 11.0 11.1 11.2 11.3 11.4 11.5 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; districtcensus అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 12. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179
 13. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est. line feed character in |quote= at position 7 (help)
 14. "Census GIS India". Archived from the original on 2015-04-25. Retrieved 2012-01-13.
 15. "Avanthi Engineering College.Cherukupally". Archived from the original on 2012-01-02. Retrieved 2012-01-07.
 16. Rama Murthy College of Physical Education[permanent dead link]
 17. "M.V.G.R.College of Engineering". Archived from the original on 2007-06-18. Retrieved 2012-01-07.
 18. St. Theressa Institute of Engineering and Technology
 19. Thandra Paparaya Institute of Science and Technology
 20. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఫుట్‌ఫాల్స్ సమాచారం (ఆర్కైవ్)

బయటి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు[మార్చు]