Jump to content

నాగావళి

వికీపీడియా నుండి
నాగవళి నది
లాంగుల్య
శ్రీకాకుళం వద్ద నాగావళి నది
స్థానం
దేశంభారతదేశం
భౌతిక లక్షణాలు
మూలంలఖబహాల్
 • స్థానంకళాహింది
పొడవు256.5 కి.మీ. (159.4 మై.)approx.
ప్రవాహం 
 • స్థానంబంగాళాఖాతం
 • సగటు35 m3/s (1,200 cu ft/s)

నాగావళి నది దక్షిణ ఒడిషా, ఉత్తరాంధ్రలో ప్రవహించే నది. ఒడిషా రాష్ట్రములో పుట్టి, 225 కిలోమీటర్లు ప్రవహించి బంగాళా ఖాతములో చేరుతుంది. శ్రీకాకుళం పట్టణం ఈ నదీ తీరమునే ఉంది.[1]

నాగావళి నది ఒడిషా రాష్ట్రము, కలహంది జిల్లాలో తూర్పు కనుమలలో సముద్ర మట్టానికి 915 మీటర్ల ఎత్తున్న తూర్పు కనుమలలో ప్రారంభమవుతుంది. ఈ నది మొత్తము 256 కిలోమీటర్లు సముద్రానికి ప్రవహిస్తుంది. అందులో 161 కిలోమీటర్లు ఒడిషా రాష్ట్రములో, 2 కిలోమీటర్లు ఒడిషా - ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుపై, దాదాపు 93 కిలోమీటర్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రవహిస్తుంది.

బర్హా, బల్దియా, సత్నాల, సీతగుర్హ, శ్రీకోన, జంఝావతి, గుముడుగెడ్డ, వొట్టిగెడ్డ, సువర్ణముఖి, వోనిగెడ్డ, రెల్లిగెడ్డ, వేగావతి నదులు నాగావళి యొక్క ప్రధాన ఉపనదులు. నది యొక్క మొత్తము పరీవాహక ప్రాంతము 9,410 చ.కి.మీ అందులో 4,462 చ.కి.మీలు ఒడిషా రాష్ట్రములో (1006 చ.కి.మీలు కలహంది జిల్లాలో, 3,456 చ.కి.మీలు కోరాపుట్ జిల్లాలో), 4,948 చ.కి.మీలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో (1,789 చ.కి.మీలు శ్రీకాకుళం, 3,096 చ.కి.మీలు విజయనగరం జిల్లా, 63 చ.కి.మీలు విశాఖపట్నం జిల్లాలో) ఉంది.[2]

నాగావళి నది మీద తోటపల్లి, నారాయణపురం వద్ద నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి. తోటపల్లి నీటిపారుదల ప్రాజెక్టు యొక్క ఆయకట్టు 37,000 ఎకరాలు, నారాయణపురం ఆనకట్ట యొక్క ఆయకట్టు దాదాపు 40,000 ఎకరాలు.

నాగావళి శ్రీకాకుళం పట్టణం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్లేపల్లి గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

చిత్ర మాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Nagavali.CWC
  2. "నాగావళి". te.sciencegraph.net. Archived from the original on 2016-03-05. Retrieved 2015-04-28.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నాగావళి&oldid=3635153" నుండి వెలికితీశారు