తూర్పు కనుమలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తూర్పు కనుమలు మరియు భారత భౌగోళికం.

తూర్పు కనుమలు (ఆంగ్లం Eastern Ghats) భారత ద్వీపకల్పానికి తూర్పు సముద్ర తీరం వెంట ఉండే కొండల వరుస.

ఇవి ఉత్తరంగా పశ్చిమ బెంగాల్ నుండి, ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్ ద్వారా దక్షిణంగా తమిళనాడు రాష్ట్రాలలోనికి వ్యాపించాయి. ఇవి మహానది, గోదావరి, కృష్ణా నది మరియు కావేరి నదుల ప్రవాహం వలన వేరుచేయబడ్డాయి. ఇవి బంగాళఖాతం సముద్రానికి సమాంతరంగా వ్యాపించాయి. వీని మధ్య ప్రదేశాన్ని కోస్తా ప్రాంతం అంటారు. దక్కను పీఠభూమి తూర్పు మరియు పడమర కనుమల మధ్యగా విస్తరించి ఉన్నది. పడమటి కనుమల కన్నా తూర్పు కనుమల ఎత్తు తక్కువగా ఉంటాయి.

దక్షిణ బాగాన తూర్పు కనుమలు విడిపొయి చిన్న చిన్న పర్వత శ్రేణులుగా విస్తరించి వుంటాయి. తూర్పు కనుమలు యొక్క దక్షిణ చివరి భాగం తమిళనాడులోని సిరుమలై మరియు కరన్ తమలై అనె పర్వతశేణితో ముగుస్తుంది. కావేరి నది ఉత్తరాన కొల్లి హిల్స్ (కొల్లమలై), పంచమలై హిల్ల్స్ షెవరోయ్ హిల్స్, సెర్వరోయన్,కల్ రాయన్ హిల్స్,చిత్తేరి,పల్లమలై మరియు మెత్తుర్ హిల్స్ అనె ఎత్తైన పర్వతాలు(తూర్పు కనుమలు) ఉత్తర తమిళనాడు లో విస్తరించి వున్నాయి. ఇక్కడ కొండలు పైన ఉష్ణోగ్రతలు చుట్టు ప్రక్కల ప్రదేశాల కంటే చల్లగాను తేమగాను వుంటాయి. ఈ ప్రదేశాల్లో కాఫీ తోటలు మరియు అడవులు ఉంటాయి. యార్కడ్ షెవరాయ్ కొండలలో ఉంది. బిల్గిరి కొండలు పశ్చిమ కనుమలు నుండి కావేరి నది వెంబడి తూర్పు కనుమలను కలుస్తాయి. తూర్పు మరియు పశ్చిమ కనుమలు మధ్య ఈ ప్రాంతము ఒక జీవ వైవిధ్య మనోహర ప్రదేశముగా భాసిల్లుతున్నది. అలాగే భారత దేశంలో ఏనుగుల సంచారం కలిగిన రెండవ అతి పెద్ద ప్రాంతంగా ఉన్నది.

తమిళనాడు లో తూర్పుకనుమలు

పొన్నాయర్ మరియు పలర్ నదులు కర్నాటకలోని కోలార్ పీఠభూమి నుండి తూర్పున బంగాళాఖాతంలో కలుస్తాయి, తూర్పు కనుమలలో భాగమైన జవధు కొండలు ఈ రెండు నదుల మధ్య ఉన్నవి. ఈ కొండలలో కిలియుర్ జలపాతము[1] కలదు పలర్ నదికి ఉత్తరాన ఆంధ్రప్రదెశ్ లో తూర్పుకనుమల మధ్య భాగం కలదు. ఇవు రెండు సమాంతర కొండలుగా కలవు, ఒకటి వెలికొండ రేంజి కాగా మరొకటి పాలికొండ-లంకమల్ల-నల్లమల రేంజి. వెలికొండ రేంజి నెల్లూరు వైపుగా కోస్తా ప్రాంతములో ఉంటుంది. నల్లమల కొండలు కృష్ణా నది వెంబడి యేర్పడ్డాయి. కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతంలో ఈ కొండలు తక్కువ ఎత్తులో ఉంటాయి, గోదావరి నది యొక్క ఉత్తర బాగాన తూర్పు కనుమలు ఎత్తుగా ఉంటాయి. ఈ ప్రాంతం అంతా సారవంతమైన భూమి కలిగి ఉంది. పశ్చమ కనుమలలో లాగ ఇక్కడ జలవిద్యుఛ్చక్తి కి అనువైనది కాదు. తూర్పు కనుమలు పశ్చమ కనుమల కన్నా పురాతనమైనవి. ఇవి రెండు ఖండాలు విడిపోయినప్పూడు ఏర్పడినవి. (రోడినియా మరియు గోండ్వాణ) తూర్పు కనుమలలో అనేక భౌగోళిక అద్భుత ప్రాంతాలు కలవు. అందులో కొన్ని

  • తిరుమల-తిరుపతి కొండలు
  • ఎర్రమల కొండలు
  • నల్లమల కొండలు
  • మధురవాడ డోము[2]
తూర్పు కనుమలలో ఉన్న అరకులోయ

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Jungle Look". The Hindu. Retrieved 2006-12-09. 
  2. http://www.igu.in/13-4/21jagadeesh.pdf