శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం | |
---|---|
లంకమల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం | |
IUCN category IV (habitat/species management area) | |
![]() అంతరించిపోతున్న జెర్డాంస్ కోర్సర్ నెలవు, శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం | |
ప్రదేశం | వైఎస్‌ఆర్ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశం |
సమీప నగరం | కడప |
భౌగోళికాంశాలు | 14°36′N 78°53′E / 14.600°N 78.883°ECoordinates: 14°36′N 78°53′E / 14.600°N 78.883°E |
విస్తీర్ణం | 464.42 కి.మీ2 (4.9990×109 sq ft) |
శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్, వైఎస్‌ఆర్ జిల్లాలో కడప నగరానికి దగ్గరలోగల ఒక వన్యప్రాణుల అభయారణ్యం. జెర్డాంస్ కోర్సర్ అనే అరుదైన, అంతరిస్తున్న పక్షి ప్రపంచంలోకెల్లా కేవలం ఈ అడవుల్లోనే కనిపిస్తుంది. సుమారు 176 జాతుల వృక్షాలు, జంతువులు ఇక్కడ ఉన్నాయి.[1]
భౌగోళికం[మార్చు]
- కడప రైల్వే స్టేషన్ నుండి రహదారి మార్గంలో 60కి.మీ. ప్రయాణించి చేరుకోవచ్చు.
వృక్షజాలం[మార్చు]
అభయారణ్యంలో 1400 మొక్కల జాతులు, 176 చెట్ల కుటుంబాలు ఉన్నాయి. అభయారణ్యప్రాంతంలో లోతైన లోయలు, నిటారైన కొండలు ఆకురాల్చు అరణ్యం ఉంది. ఇక్కడ ఎర్రచందనం, స్థానిక జాతి చెట్లు ఉన్నాయి.[2]
జంతుజాలం[మార్చు]
అభయారణ్యం " జెర్డంస్ కర్సర్ " పక్షులకు ప్రసిద్ధిచెందింది. ఇది తీవ్రంగా అంతరించిపోతున్న పక్షిజాతికి చెందినదిగా భావిస్తున్నారు. ఈ పక్షిని మొదటిసారిగా 1848లో థామస్ సి. జెర్డంస్ చేత కనుగొనబడింది. దీనిని తిరిగి 1996లో తిరిగి ఈప్రాంతంలో కనుగొన్నారు.[3] ఈ పక్షి ఇప్పుడు అరుదుగా కొన్ని అరణ్య ప్రాంతాలలో, శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో కనిపిస్తుంది.
దీనిలో చిరుతపులి, స్లాత్ బీర్, జింక, సాంబార్, చౌసింగా, చొంకారా, నీల్గాయ్, అడవిపంది మొదలగు ప్రాణులు కూడా ఉన్నాయి.
యాత్రికులకు సమాచారం[మార్చు]
- వసతి సౌకర్యం: సిద్ధవటం, కడప వద్ద అటవీ శాఖ అతిథి గృహాలలో వసతి సౌకర్యం లభిస్తుంది.
- సీజన్ : అక్టోబరు నుండి మార్చి వరకు.[4]
మూలాలు[మార్చు]
- ↑ "Lankamalleswaram Wildlife Sanctuary". discoveredindia. Archived from the original on 2014-05-18.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2016-10-24.
- ↑ http://zeenews.india.com/news/eco-news/endangered-jerdons-courser-on-centres-priority-list_686915.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-01-25. Retrieved 2016-10-24.
