రోళ్ళపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Blackbucks sparring at Rollapadu Wildlife Sanctuary

రోళ్లపాడు వన్య ప్రాణి సంరక్షణా కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఒక వన్యప్రాణి అభయారణ్యం.[1]

ఇది కర్నూలు నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. 6.14 km 2 విస్తీర్ణం కలిగి ఈ అభయారణ్యము 1988 లో స్థాపించబడింది, ఇది ఒక అంతరించిపోతున్నపక్షి జాతులైన బట్టమేక పక్షులకు ఆంధ్ర ప్రదేశ్ లో ఆవాసముగా ఉంది.[2][3] ఈ అభయారణ్యం ఎక్కువగా వేడిగా, పొడిగా వుండి విపరీత వాతావరణ పరిస్థితులు కలిగి అసమాన వర్షపాతంతో ఒక ఎత్తుపల్లాల కలిగి ఉంది. ఇది 290 మీటర్ల ఎత్తులో, ప్రతి సంవత్సరం వర్షపాతం 450 మి.మీ. కలిగి ఉంది.[4]

జంతుజాలం[మార్చు]

Indian coursers are found around the Rollapadu WLS during the monsoon seasons.

రోళ్లపాడి అభయారణ్యం విభిన్న జంతుజాల జాతులకు నిలయం. ఈ అభయారణ్యములో నక్కలు, బోనెట్ కోతి, అడవి పిల్లులు, ఎలుగుబంట్లు, కృష్ణ జింకలు అధికంగా ఉన్నాయి. రక్త పింజరి, నాగుపాము వంటి పాము జాతులు ఈ అభయారణ్యంలో ఉన్నాయి. ఇక్కడ వున్న అల్గనూర్ జలాశయానికి 132 పక్షి జాతులు వలస వస్తుంటాయి.బట్టమేక పక్షి, ఫ్లోర్కాన్ తోపాటు ఇతర పక్షి జాతులకు ఇది నిలయము. బాతులు, డెమోయిసెల్లె క్రేన్లు, పాలపిట్టలు, అనేక గోరింక జాతులు, పాము గ్రద్దలు, శీతాకాలంలో వలస పక్షులు వస్తుంటాయి.[5][6]

ఆందోళన[మార్చు]

అభయారణ్యంలో కృష్ణ జింక జనాభా పెరుగుదల బట్టమేక పక్షుల సంఖ్యలో పతనం గమనించారు. ఇక్కడ గడ్డిమైదానాలు, పొదలు కనుమరుగవుతుండడం వలన పక్షులకు ఆహారము తక్కువై కొన్ని రకాల పక్షుల మనుగడకు ప్రమాదమేర్పడినట్లు గమనించారు.[4][7] 1980 లో బట్టమేక పక్షుల సంరక్షణకు ఇది అనుకూలమయిన ప్రాంతంగా గుర్తించారు. బట్టమేక పక్షుల జనాభా ఇటీవల పడిపోవడం ఇటీవలి సంవత్సరాలలో తీవ్రమైన ఎదురుదెబ్బలు తగలడంతో వాటి రక్షణ కష్టతరమైనది. తరచుగా అభయారణ్యం యొక్క సరిహద్దులు దాటి వ్యవసాయ భూములను విస్తరించడము, ఈ అభయారణ్యానికి వ్యతిరేకంగా ప్రజల ఆందోళనలు, ఈ పక్షి జాతుల క్షీణతకు దారితీసింది. అభయారణ్యం ఆవరణం లోపల పశువుల మేతకు రావడం కూడా బట్టమేక పక్షుల సంతానోత్పత్తిని ప్రభావితం చేసింది. అభయారణ్యం యొక్క అంచున తెలుగు గంగ కాలువ నిర్మాణము కూడా ఒక కారణము. ఇలా అనేక కారణాల వల్ల నక్కలు, ఫ్లోర్కాన్, పాము గ్రద్దలు ఇటీవలి సంవత్సరాలలో అభయారణ్యంలో కానరాలేదు.

మూలాలు[మార్చు]

  1. "Concern over dwindling number of Great Indian Bustard". The Hindu. September 23, 2007. Archived from the original on 18 సెప్టెంబరు 2011. Retrieved 5 June 2013.
  2. "Rollapadu Wildlife Sanctuary". Department of Forests, Government of Andhra Pradesh. Archived from the original on 29 అక్టోబరు 2013. Retrieved 5 June 2013.
  3. "Out of Africa". The Hindu. June 1, 2013. Retrieved 5 June 2013.
  4. 4.0 4.1 Rao, K Thulsi; SMM Javed (October 2005). "The Great Indian Bustard Ardeotis Nigriceps (Vigors) in and around the Rollapadu Wildlife Sanctuary, Andhra Pradesh, India" (PDF). Zoos' Print Journal. 20 (11): 2053–2058. doi:10.11609/JoTT.ZPJ.1326.2053-8. Archived from the original (PDF) on 14 జూలై 2015. Retrieved 5 June 2013.
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; books.google అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. "Birding in RollapaduWildlife Sanctuary, Andhra Pradesh". Indian Wildlife Club. Retrieved 5 June 2013.
  7. Saberwal, Vasant K (2003). Battles Over Nature: Science and the Politics of Conservation. Delhi: Permanent Black. p. 123. ISBN 8178241412.