నాగుపాము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నాగు పాము
Cobra hood.jpg
పడగ విప్పిన నాగుపాము.
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: కార్డేటా
తరగతి: సరీసృపాలు
క్రమం: Squamata
ఉప క్రమం: Serpentes
కుటుంబం: Elapidae
జాతి: Naja
ప్రజాతి: N. naja
ద్వినామీకరణం
Naja naja
Linnaeus, 1758

భారతీయ త్రాచుపాము లేదా కళ్ళజోడువంటి గుర్తులున్న త్రాచుపాము(నజా నజా), లేదా ఆసియా త్రాచు భారతదేశానికి చెందిన విషము కలిగిన పాము. మిగతా త్రాచు పాములవలే నాగు పాము కూడా తన పడగ విప్పి భయపెట్టటంలో ప్రసిద్ధి చెందింది. పడగ వెనక వైపు రెండు అండాకార గుర్తులు ఒక వంపు గీతతో కలుపబడి ఉంటాయి. అవే మనకు కళ్ళజోడును గుర్తుకుతెస్తాయి. నాగుపాము సరాసరి ఒక మీటరు దాకా పొడవు ఉంటుంది. అరుదుగా రెండు మీటర్ల (ఆరు అడుగులు) పాము కూడా కనిపిస్తుంది. పడగ వెనకాల ఉండే కళ్ళజోడు గుర్తు పాము రంగు కూడా వివిధ రకాలుగా ఉ॰టాయి.

భారత దేశపు నాగుపాములు ఏప్రిల్, జులై నెలల మధ్య గుడ్లు పెదతాయి. ఆడ పాములు 12 నుండి 30 వరకు గుడ్లను బొరియలలో పెడతాయి. అవి 48 నుండి 69 రోజులలో పొదగబడతాయి. అప్పుడే పుట్టిన పిల్ల పాములు 8 నుంచి 12 అంగుళాల వరకు ఉంటాయి. అప్పుడే పుట్టిన పిల్ల పాములకు కూడా పూర్తిగా పనిచేసే విషపు గ్రంధులు ఉంటాయి. భారత దేశపు నాగు పాములకు అంత పేరు రావటానికి కారణం అవి పాములు ఆడించే వారికి బాగా ఇష్టమైనవి కావటం. నాగుపాము పడగ విప్పి పాములవాడి నాదస్వరానికి అనుగుణంగా ఆడటం చూడటానికి ఎంతో హృద్యంగా ఉంటుంది. పాములవాళ్ళు వాళ్ళ వెదురుబుట్టలో పాములు ఇవి భారత దేశంలో సాధారణంగా కనిపించే దృశ్యాలు. కానీ నాగుపాము చెవిటిది. అది పాములవాడి నాదస్వరం కదలికలకు, అతను కాళ్ళతో భూమిని తడుతుంటే వచ్చే ప్రకంపనలను గ్రహించి ఆడినట్లు కదులుతూ ఉంటుంది.

ఒకప్పుడు పాములవాళ్ళు నాగుపాము, ముంగిసల మధ్య పోట్లాట పెట్టి ప్రదర్శించేవాళ్ళు. ఆ అద్భుత ప్రదర్శనలో సాధరణంగా నాగుపామే మరణిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రదర్శనలు చట్టవిరుద్ధం. ముంగిసకు విషాన్ని తట్టుకునే శక్తి లేదు. దాని దట్టమైన వెండ్రుకలు, చురుకైన కదలికలు మాత్రమే దాన్ని కాపాడతాయి. నాగు పాములు ఎలుకలను తింటాయి. వాటి నివాస ప్రాంతములు అడవులు, పొలాలు. కాని మురుగుకాల్వలలో, బొరియలలో ఉండే ఎలుకలను తింటూ అవి పట్టణాలలో కూడా ఉండగలవు. జెర్రి పోతు పాములను నాగు పాములుగా పొరపాటుపడడం సాధారణం. కానీ జెర్రిపోతు పాములను వాటి పొడవాటి, బలమైన, పలకలు కలిగిన శరీరం ద్వారా పోల్ల్చుకోవచ్చు.

నాగుపాము గురించి ఎన్నో పుకారులు ప్రచారంలో ఉన్నాయి. ఉదా:నాగుపాము జెర్రిపోతుతో శృంగారంలో పాల్గొంటుంది అనేది అందులో ఒకటి.


పురాణాలలో[మార్చు]

  • భారతదేశంలో నాగుపాము అంటే ఎంతో భక్తి, భయము. హిందూ పురాణాలలో కూడా వాటికి ప్రత్యేక స్థానం ఉంది. పరమశివుడు నాగుపామును మెడలో ధరిస్తాడు. నాగులచవితి నాడు హిందువులు నాగుపామును పూజిస్తారు.
  • విష్ణుమూర్తి విశ్వాన్ని కాపాడే వాడు, ఐదు తలలు కలిగిన, సర్ప రాజైన ఆదిశేషువుపై పవళిస్తాడు.

నగరజు ఒకసరి

విష ప్రభావము[మార్చు]

నాగుపాము భారత దేశంలోని నాలుగు విషపూరితమైన పాములలో ఒకటి. ఈ నాలుగూ కలిసి భారత దేశంలోని పాముకాటు మరణాలన్నింటికి కారణమౌతున్నాయి.

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

Script error: No such module "Side box".

"https://te.wikipedia.org/w/index.php?title=నాగుపాము&oldid=1425099" నుండి వెలికితీశారు