Jump to content

మల్కనగిరి

అక్షాంశ రేఖాంశాలు: 18°21′N 81°54′E / 18.35°N 81.90°E / 18.35; 81.90
వికీపీడియా నుండి
మల్కనగిరి
పట్టణం
మల్కనగిరి is located in Odisha
మల్కనగిరి
మల్కనగిరి
ఒడిశా పటంలో పట్టణ స్థానం
Coordinates: 18°21′N 81°54′E / 18.35°N 81.90°E / 18.35; 81.90
దేశం India
రాష్ట్రం ఒడిశా
జిల్లామల్కనగిరి
Founded byమలకిమర్ధన్ కృష్ణ దేవ్
Named afterమాలిక్‌మర్ధనగిరి
ప్రభుత్వం
 • రకంమునిసిపాలిటీ
 • సంస్థMalkangiri Municipality
 • కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ఆసిష్ ఈశ్వర్ పాటిల్, IAS
 • సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్నితేష్ వాధ్వానీ, IPS
 • శాసనసభ సభ్యుడుఆదిత్య మాధి (భాజపా)
ఎత్తు
178 మీ (584 అ.)
జనాభా
 (2011)
 • మొత్తం
31,007
భాషలు
 • అధికారికఒరియా
కాల మండలంUTC+5:30 (IST)
PIN
Vehicle registrationOD-30

మల్కనగిరి ఒడిషా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లాలో ఒక పట్టణం. ఇది మల్కనగిరి జిల్లాకు ప్రధాన కేంద్రం. చారిత్రికంగా దీన్ని 'మాలిక్‌మర్ధనగిరి' అని పిలుస్తారు. దండకారణ్య ప్రాజెక్ట్ కింద 1965 నుండి పునరావాసం పొందిన తూర్పు పాకిస్తాన్ శరణార్థుల (ప్రస్తుత బంగ్లాదేశ్) కొత్త నివాసం మల్కనగిరి. అలాగే 1990ల ప్రారంభంలో LTTE సాయుధ పోరాటం తర్వాత కొంతమంది శ్రీలంక తమిళ శరణార్థులు మల్కనగిరి పట్టణంలో పునరావాసం పొందారు (వారిలో రెండు కుటుంబాలు మినహా మిగతావాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు). ప్రస్తుతం ఇది రాష్ట్రంలో అత్యంత నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలలో ఒకటి, రెడ్ కారిడార్‌లో భాగం.[1] పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.

చరిత్ర

[మార్చు]

మల్కనగిరి లేదా మలికమర్ధన్‌గిరి పట్టణాన్ని ఒడిశాలోని నందాపూర్- జైపూర్ రాజ్యాన్ని పాలించిన సింహాద్రి వివేక్ (1676-1681), తన రాణి కోసం స్థాపించాడు. అతను ఫ్రెంచి, గోల్కొండల ఉమ్మడి దళాలను ఓడించి పదిహేను ఫ్రెంచ్ ఫిరంగులను స్వాధీనం చేసుకున్న సైనిక మేధావి. మాలిక్ మొహమ్మద్ అనే గోల్కొండ సైన్యాధిపతిని చంపాడు. అందువల్ల అతనికి 'మాలిక్-మర్ధన్' అని పేరు వచ్చింది. అతను మాలికమర్ధాంగద అనే పేరుతో ఒక బలమైన కోటను కూడా నిర్మించాడు ఆ కోట ఉన్న ప్రాంతమంతా కాలక్రమేణా మాలికమర్ధంగిరిగా ప్రసిద్ధి చెందిందని తరువాత బ్రిటిష్ వారు దానిని మల్కనగిరిగా మార్చారని భావిస్తున్నారు. [2]

భౌగోళికం

[మార్చు]

మల్కనగిరి 18°21′N 81°54′E / 18.35°N 81.90°E / 18.35; 81.90 వద్ద,[3] సముద్ర మట్టం నుండి 170 మీ. ఎత్తున ఉంది. తూర్పు, పశ్చిమ వైపులా తూర్పు కనుమల కొండల మధ్య ప్రాంతంలో ఇది ఉంది. వర్షాకాలంలో, పట్టణం నడవలేనంత చిత్తడిగా మారుతుంది, భారీ వరదలు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల నుండి దీనిని వేరు చేస్తాయి.[4]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

మల్కాన్‌గిరి జనాభా దాదాపుగా వ్యవసాయం, ప్రాథమిక రంగంలో నిమగ్నమై ఉంది, ఎందుకంటే ఇది ఇతర పట్టణాలు మరియు నగరాలతో పోలిస్తే ఒడిశాలోని మిగిలిన ప్రాంతాల నుండి సాపేక్షంగా వేరుచేయబడింది, ద్వితీయ, తృతీయ రంగాలకు సంబంధించిన అభివృద్ధి దశలు ఇంకా పూర్తి కాలేదు. మొత్తం శ్రామిక శక్తిలో ప్రాథమిక రంగం 46.35% వాటా కలిగి ఉంది. జనాభా ఆధారపడిన మరో ముఖ్యమైన పరిశ్రమ పర్యాటకం, ఎందుకంటే పట్టణంలో, చుట్టుపక్కల అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. అందువల్ల, దీనికి ఇంకా పెద్ద మొత్తంలో అవకాశాలు ఉన్నాయి.[5]

జనాభా వివరాలు

[మార్చు]

2011 జనగణన ప్రకారం, మల్కనగిరి జనాభా 31,007. ఇందులో పురుషులు 52% కాగా, స్త్రీలు 48%. అక్షరాస్యత 57%, ఇది దేశ అక్షరాస్యత 59.5% కంటే తక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 65%, కాగా స్త్రీలలో 48%. పట్టణ జనాభాలో 15% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.

మూలాలు

[మార్చు]
  1. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  2. KSB Singh 1939, p. 60.
  3. Falling Rain Genomics, Inc - Malkangiri
  4. Falling Rain Genomics, Inc - Malkangiri
  5. "Economy". Government of Odisha. Retrieved 8 January 2024.