Jump to content

భద్రక్

వికీపీడియా నుండి
భద్రక్
—  పట్టణం  —
[[File:
పైన, ఎడమ నుండి: పట్టణ దృశ్యం, ధంరా రేవు, అఖండలమణి ఆలయం, రైల్వే స్టేషను
|250px|none|alt=|]]
భద్రక్ is located in Odisha
భద్రక్
భద్రక్
ఒడిశా పటంలో పట్టణ స్థానం
దేశం  India
రాష్ట్రం ఒడిశా
జిల్లా భద్రక్
జనాభా (2011)[1]
 - మొత్తం 107,369
Population rank India 456th, Odisha 9th
భాషలు
 - అధికారిక ఒరియా
Time zone IST (UTC+5:30)
PIN 756100

భద్రక్ ఒడిషా రాష్ట్రం భద్రక్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. పురాణాల ప్రకారం, పట్టణానికి ఈ పేరు సలాండి నది ఒడ్డున ఉన్న భద్రకాళి దేవి నుండి వచ్చింది.[2]

చరిత్ర

[మార్చు]

పురాణాల ప్రకారం, భద్రక్ అనే పేరు భద్రకాళి దేవి నుండి వచ్చింది. ఈ ఆలయం పట్టణ నైరుతి శివార్లలో ఉంది.[3]

ఒడిశా సముద్ర, వ్యవసాయ పురోభివృద్ధికి, వ్యాపార వాణిజ్యాల వృద్ధికీ భద్రక్ చేసిన తోడ్పాటు చరిత్రలో భాగం. మొఘల్ కాలంలో భద్రక్, బెంగాల్ నవాబుల కింద ఒక సుబా లేదా ప్రావిన్సుగా ఉండేది. మొఘలుల సామ్రాజ్యం క్షీణించినప్పుడు, ఈ ప్రాంతం కనికా, నాంపో, అగరపడ అనే సంస్థానాలుగా విడిపోయింది.వీటిని క్షత్రియ ప్రభువులు పాలించేవారు.[3]

1804 జూన్‌లో బ్రిటిష్ వారు ఒడిశాను ఆక్రమించిన తరువాత, భద్రక్, కటక్‌లో ఒక పరిపాలనా విభాగంగా ఉండేది. 1828లో, బాలాసోర్‌ను ప్రత్యేక జిల్లాగా చేసినప్పుడు, భద్రక్‌ను అందులో ఒక సబ్-డివిజనుగా చేసారు. కానీ మున్సిఫ్ కోర్టు 1901 వరకు జాజ్‌పూర్‌లో ఉండేది.[3]

జాతీయ పోరాట కాలంలో భద్రక్ ముందంజలో ఉండేది. 1920లో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించాడు. 1921 మార్చిలో గాంధీ, భద్రక్‌ సందర్శించాడు. 1922లో అతను కనికా తిరుగుబాటును ప్రారంభించాడు. బ్రిటిష్ దళాలు అణచివేయడానికి ప్రయత్నించాయి; కానీ చివరికి కౌలుదారుల ఉద్యమం కనికాకు చెందిన చక్రధర్ బెహరా నాయకత్వంలో విజయం సాధించింది.[3]

1930లో శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభమైనప్పుడు భద్రక్ కూడా ఉప్పు చట్టాన్ని ధిక్కరించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడింది. ఈ ఉద్యమంలో హరేకృష్ణ మహతాబ్ పాత్ర భద్రక్‌లో ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఆధునిక భారతదేశ చరిత్రలో భాగమైంది. 1934లో మళ్లీ భద్రక్‌ సందర్శించిన గాంధీ, మహతాబ్ నివాసంలో ఉండి, జింబరన్ ఆశ్రమంలో (నుసాహి, ఆశ్రమం, గరద్‌పూర్) హరిజన్ కార్మికుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సమయంలోనే ఈరామ్‌కు చెందిన బంచనిధి మొహంతి తన దేశభక్తి గీతాల ద్వారా ప్రజలలో జాతీయ చైతన్యాన్ని రూపొందించడం, ఉత్తేజపరిచడం జరిగింది.[3]

జనాభా వివరాలు

[మార్చు]

2011 జనగణన ప్రకారం, భద్రక్ జనాభా 1, 07,463. ఇందులో పురుషులు 51% (55,090 మంది), స్త్రీలు 49% (52,373 మంది). పట్టణంలో అక్షరాస్యత 79.49%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 83.99% కాగా, స్త్రీలలో ఇది 74.77%. జనాభాలో 12% (13,138) మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.[1]

రవాణా

[మార్చు]

భద్రక్ పట్టణం నుండి ఒడిషా రాష్ట్రం లోని పట్టణాలు, దేశం లోని ఇతర ప్రాంతాలతో చక్కటి రవాణా సౌకర్యాలున్నాయి. ఈ పట్టణం జాతీయ రహదారి 16 పై, రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు ఈశాన్యంగా 130 కి.మీ. దూరంలో ఉంది.[4]

భద్రక్ పట్టణంలో మూడు బస్ స్టేషన్లు ఉన్నాయి, కటక్, భువనేశ్వర్, బాలాసోర్, కలకత్తాల నుండి తరచుగా బస్సులు ఉన్నాయి. 

భద్రక్ రైల్వే స్టేషను పట్టణ కేంద్రం నుండి 3 కి.మీ. దూరంలో ఉన్న చరంప వద్ద ఉంది.

సమీప విమానాశ్రయం 135 కి.మీ. దూరం లోని భువనేశ్వర్‌లో ఉన్న బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం.[4]

శీతోష్ణస్థితి

[మార్చు]
శీతోష్ణస్థితి డేటా - Bhadrak, Odisha
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 27.2
(81.0)
30.0
(86.0)
34.3
(93.7)
36.9
(98.4)
37.1
(98.8)
34.6
(94.3)
31.4
(88.5)
31.3
(88.3)
31.5
(88.7)
30.5
(86.9)
28.9
(84.0)
27.0
(80.6)
31.7
(89.1)
సగటు అల్ప °C (°F) 14.4
(57.9)
17.1
(62.8)
21.4
(70.5)
24.9
(76.8)
26.7
(80.1)
26.3
(79.3)
25.7
(78.3)
25.9
(78.6)
25.6
(78.1)
23.4
(74.1)
18.0
(64.4)
14.3
(57.7)
22.0
(71.6)
సగటు వర్షపాతం mm (inches) 13
(0.5)
31
(1.2)
34
(1.3)
45
(1.8)
85
(3.3)
212
(8.3)
306
(12.0)
326
(12.8)
273
(10.7)
161
(6.3)
38
(1.5)
6
(0.2)
1,530
(59.9)
Source: en.climate-data.org

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "భద్రక్ సిటీ సెన్సస్ 2011 డేటా". ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ & సెన్సస్ కమీషనర్, ఇండియా. Retrieved 20 మే 2018.
  2. "About District". Bhadrak district. 2018. Retrieved 2 June 2018.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 "About the District". Bhadrak district. 2007. Archived from the original on 21 October 2017. Retrieved 20 May 2018. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "BhadrakDistrictLocationOld" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. 4.0 4.1 "How to Reach". Bhadrak district. Retrieved 20 May 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=భద్రక్&oldid=4074070" నుండి వెలికితీశారు