భద్రక్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భద్రక్ జిల్లా
జిల్లా
పైన: ధమ్రా పోర్ట్ దిగువ: కంజియాపాల్ సమీపంలోని పొలాలు
ఒడిశా పటంలో జిల్లా స్థానం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంఒడిశా
ప్రధాన కార్యాలయంభద్రక్
Government
 • కలెక్టరుSri Krushna Chandra Patra
 • పార్లమెంటు సభ్యుడుArjun Charan Sethi, BJD
Area
 • Total2,505 km2 (967 sq mi)
Population
 (2011)
 • Total15,06,522
 • Rank12
 • Density601/km2 (1,560/sq mi)
భాషలు
 • అధికారఒరియా, హిందీ,ఇంగ్లీషు
Time zoneUTC+5:30 (IST)
టెలిఫోన్ కోడ్06784
Vehicle registrationOD-22
సమీప పట్టణంBaleshwar
లింగ నిష్పత్తి981 /
male760,591
female745,931
అక్షరాస్యత83.25%
అవపాతం1,427.9 millimetres (56.22 in)
సగటు వేసవి ఉష్ణోగ్రత48 °C (118 °F)
సగటు శీతాకాల ఉష్ణోగ్రత17 °C (63 °F)

ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో భద్రక్ జిల్లా ఒకటి.

పేరు వెనుక చరిత్ర[మార్చు]

జిల్లాకేంద్రంగా భద్రక్ పట్టణం ఉంది కనుక దీనికి ఈ పేరు వచ్చింది.

చరిత్ర[మార్చు]

పురాతన చరిత్ర[మార్చు]

స్వాతంత్ర్య సమరంలో భద్రక్ జిల్లాలోని బాసుదేవ్‌పూర్ వద్ద 30మంది బ్రిటిష్ పోలీసుల చేత కాల్చి చంపబడ్డారు. పురాణ కాలంలో ఒడిషాలో సంపదలతో వర్ధిల్లింది. చరిత్రను అనుసరించి రాజా ముకుంద్ దేవ్ భద్రక్ ప్రాంతానికి చివరి పాలకుడయ్యాడు. 1575లో ఈ ప్రాంతంలో ముస్లిములు నివసించడం మొదలైంది. తరువాత ఉస్మాన్ నాయకత్వంలో ఆఫ్గగన్లు రాజామాన్ సింగ్‌ను ఓటమికి గురిచేసారు.

మొగలు కాలం[మార్చు]

మొగల్ పాలనలో భద్రక్ జిల్లా బెంగాల్ నవాబుల సుభాహ్‌గా ఉండేది. మొగల్ సామ్రాజ్య పతనం తరువాత భద్రక్ ప్రాంతం పలు రాజాస్థానాలలో అంతర్భాగంగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం మొత్తం ఒడిషా భూభాగాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత ఈ ప్రాంతం బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా మారింది.

స్వాతంత్రం తరువాత[మార్చు]

స్వాతంత్ర్యం తరువాత భద్రక్ ప్రాంతం విద్య, పరిశ్రమలు, వ్యవసాయం, వాణిజ్యం, ఆర్థికం వంటి వైవిధ్యరంగాల మీద దృష్టిని కేంద్రీకరించింది.

ఆలయాలు[మార్చు]

జిల్లాలో పలు చారిత్రాత్మక ప్రదేశాలు, స్మారక భవనాలు ఉన్నాయి. పలియాలో బిరంచినారాయణ ఆలయం ఉంది. " భద్రక్ జిల్లాలో రాధామనోహర ఆలయం " ప్రముఖ యాత్రీక ప్రదేశంగా ఉంది. చందబలికి 10కి.మీ దూరంలో ఉన్న అరడిలో అఖందలమణి ఆలయం ఉంది. 1993 ఏప్రిల్ 1 న బాలాసోర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరు చేసి ఈ జిల్లా రఒందించబడింది.

భౌగోళికం[మార్చు]

జిల్లా వైశాల్యం 2505 చ.కి.మీ. భద్రక్ పట్టణం ఒడిషా రాజధాని భువనేశ్వర్ కు 125 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ జిల్లా గుండా సలంది నది ప్రవహిస్తుంది.

ఆర్ధికం[మార్చు]

భద్రక్ జిల్లాలో ప్రముఖ " ఎఫ్.ఎ.సి.ఒ.ఆర్ " ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలో దేశంలోనే నాణ్యమైన ఫెర్రో క్రోం ఉతపత్తి చేయబడుతుంది. నౌకానిర్మాణ పరిశ్రమ వంటి ఇండస్ట్రీలు ప్రతిపాదించబడ్డాయి.

పర్యాటక ఆకర్షణ[మార్చు]

అఖండల్మణి ఆలయం[మార్చు]

అఖండల్మణి ఆలయం బైతరణి నదీతీరంలో ఉంది. ఆలయంలో ప్రధాన దైవం శివుడు. 350 సంవత్సరాల క్రితం రాజా నీలాద్రి శర్మ సింఘా మొహపాత్రా శివుని ఆరధిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజా కలలో భూమిలో ఉన్న నల్లని శివలింగం కనిపించింది. రాజు ఆశివలింగాన్ని పైకి తీసి ఆలయం నిర్మించజేసాడు. తరువాత ఇది ప్రముఖ పర్యాటక కేంద్రగా యాత్రాస్థలంగా మారింది. ఆలయంలోని శిల్పచాతుర్యం పర్యాటకులను ముగ్ధులను చేస్తుంది. అఖండల్మణి ఆలయప్రాంతంలో శివరాత్రి నాడు పలు ఉత్సవాలు, సంతలు నిర్వహించబడుతుంటాయి. ఈ సందర్భంలో దూరప్రాంతాల నుండి కూడా యాత్రీకులు ఇక్కడకు వస్తుంటారు. శ్రావణ మాసంలో కూడా శివాలయానికి పలువురు యాత్రీకులు స్వామిని ఆరాధిస్తుంటారు. అఖండల్మణి ఆలయం ఒడిషా రాష్ట్ర పర్యాటక రంగానికి ఆదాయం సమకూర్చడానికి ముఖ్యవనరులలో ఒకటిగా ఉంది.

ధర్మ రేవు[మార్చు]

ధర్మా నౌకాశ్రయం: బైతరిణి నదీతీరంలో ఉన్న పురాతనమైన రేవు ధర్మా. ఇది కనిక ప్యాలెస్‌కు 5 కి.మీ దూరంలో ఉంది. డైరెక్షన్ టవర్, ఇతర పురాతన స్మారక చిహ్నాలు ఉన్నాయి.

ప్రయాణసౌకర్యాలు[మార్చు]

జిల్లాలో ధర్మా పోర్ట్ ప్రతిపాదించబడింది. అంతేకాక సరికొత్తగా భద్రక్- ధర్మా రహదారి నిర్మించబడింది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,506,522,[1]
ఇది దాదాపు. గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. హవాయి నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 332వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 601 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 12.95%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే. 981:1000 [1]
అక్షరాస్యత శాతం. 83.25%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

జిల్లాలోని ప్రజలు అత్యధికంగా ఒడిషా భాష వాడుకభాషగా ఉంది. కొంతమంది ఉర్దు భాషను మాట్లాడుతుంటారు.

ఆలయాలు[మార్చు]

భద్రక్ జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన భద్రకాళీ ఆలయం ఉంది. అంతేకాక జిల్లాలో అరది, చందబలి, ధమనగర్, ధమర, గుమ్ల నౌసాసన్ ఆలయాలు ఉన్నాయి. గెల్పూర్ పనచాయితీలో నలంగా గ్రామంలోని నలేశ్వరాలయం జిల్లాలోని ప్రధానాలయాలలో ఒకటి. నలేశ్వర్ ఆలయం ఒడిషా లోని పురాతన ఆలయాలలో ఒకటి. ప్రజాకవి జగన్నాథ్ పాణి (బైష్ణవ పాణి ) జన్మస్థలం నలంగా గ్రామం. జిల్లాలోని బసవదేవ్‌పూర్ నియోజకవర్గంలోని బ్రహ్మంగన్ గ్రామంలో ప్రముఖ ప్రసన్న కామేశ్వర మహాదేవాలయం ఉంది. ఇక్కడ హోళి సందర్భంలో మెలన జాత్రా నిర్వహించబడుతుంది. ఈ గ్రామంలో దుర్గా పూజ, జగర్ కూడా ప్రాముఖ్య సంతరించుకున్నాయి. బంట, బసంటియా, బాసుదేబ్‌పూర్‌లలో మేళాలు నిర్వహించబడుతుంటాయి. పంచుక పూర్ణిమ దినం బసంతియా గ్రామంలో నిర్వహించే తెప్ప ఉత్సవంకూడా ప్రబలమైన ఉత్సవాలాలోఒకటి. ఈ ఆరాధన తరువాత ఒరియా సధబాలు (వ్యాపారులు) సమీపంలోఉన్న జావా, ఇండోనేషియా, బొర్నియో దీవులకు కొన్ని మాసాల కాలం వ్యాపారానికి బయలుదేరుతుంటారు. ఈ మేళాలో కళాకారులు ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు.[4][5]

ప్రముఖులు[మార్చు]

 • ఘౌరహరి దాస్ (1960 -), నవలా రచయిత, వ్యాసకర్త, శంధగద గ్రామం నుండి మీడియా చిహ్నం.
 • డాక్టర్.హరెక్రుష్న మహాతబ్, అగరపద, భద్రక్
 • డాక్టర్ .హ్రుషికెష్ పాండా ఐఎఎస్ టాపర్ బెతద, భద్రక్
 • డాక్టర్ .బిభు సంతోష్ బెహెర, యంగ్ సైంటిస్ట్, ఎఫ్.ఏ.ఎస్.డ్బల్యూ అవార్డు 2014 (జీవనాధార భద్రత), గనిజంగ్, భద్రక్ (2013-14) ప్రస్తుతం పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్, ఒ.యు.ఏ.టీ.భువనేశ్వర్

రాజకీయాలు[మార్చు]

అసెంబ్లీ నియోజక వర్గాలు[మార్చు]

The following is the 5 Vidhan sabha constituencies[6][7] of Bhadrak district and the elected members[8] of that area

క్ర.సం నియోజకవర్గం రిజర్వేషను పరిధి 14 వ శాసనసభ సభ్యులు పార్టీ
43 భందరిపోఖరి లేదు భందరిపోఖరి, బొంథ్. ప్రఫుల్ల సమల్ బి.జె.డి
44 భద్రక్ లేదు భద్రక్ (ఎం), భద్రక్ జుగల్ కిషోర్ పట్నాయక్ బి.జె.డి
45 బాసుదేవర్ లేదు బసుదేవ్‌పూర్, తిహిది (భాగం) బిజయ్ష్రీ రౌటరీ బి.జె.డి
46 ధాంనగర్ షెడ్యూల్డ్ ధాంనగర్, తిహిది (భాగం) రాజేంద్ర కుమార్ దాస్ బి.జె.డి
47 చందబలి లేదు చందబలి, తిహిది (భాగం) బిజయ నాయక్ బి.జె.డి

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gabon 1,576,665
 3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301
 4. Bhadrak district Archived 2010-01-16 at the Wayback Machine, Orissa Diary
 5. Bhadrak District Archived 2014-09-01 at the Wayback Machine, District Info
 6. Assembly Constituencies and their EXtent
 7. Seats of Odisha
 8. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013. MEMBER NAME

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]