రాయగడ జిల్లా
రాయగడ జిల్లా | |||
---|---|---|---|
జిల్లా | |||
దేశం | India | ||
రాష్ట్రం | ఒడిషా | ||
స్థాపన | 1992 అక్టోబరు 2 | ||
ముఖ్యపట్టణం | రాయగడ | ||
Government | |||
• లోక్ సభ సభ్యుడు | జయరాం పంగి | ||
విస్తీర్ణం | |||
• Total | 7,584.7 కి.మీ2 (2,928.5 చ. మై) | ||
జనాభా (2001) | |||
• Total | 8,23,000 | ||
• జనసాంద్రత | 116/కి.మీ2 (300/చ. మై.) | ||
భాషలు | |||
• అధికారిక | ఒరియా, ఇంగ్లీషు | ||
• ఇతర ముఖ్య | తెలుగు | ||
Time zone | UTC+5:30 (IST) | ||
పిన్‌కోడ్ | 765 xxx | ||
Vehicle registration | OD-18 | ||
లింగ నిష్పత్తి | 0.972 ♂/♀ | ||
అక్షరాస్యత | 35.61% | ||
లోక్ సభ నియోజకవర్గం | Koraput | ||
Vidhan Sabha constituency | 3
| ||
శీతోష్ణస్థితి | Aw (Köppen) | ||
అవపాతం | 1,521.8 మిల్లీమీటర్లు (59.91 అం.) |
రాయగడ (Rayagada) ఒడిషా రాష్ట్రంలో తెలుగు వారు నివసిస్తున్న ప్రదేశం, రాయగడ జిల్లా కేంద్రం , పురపాలసంఘం. ఇది తూర్పు కోస్తాలోని విజయనగరం జిల్లాకు దగ్గరలో ఉంది.
చరిత్ర
[మార్చు]ఈ ప్రాంతం ప్రాచీన కళింగ రాజ్యంలో భాగంగా అశోక చక్రవర్తి చేత పాలించబడింది. ఆరోజుల్లో వంశధార , నాగావళి మధ్య ప్రాంతం మసాలా దినుసులకు ప్రసిద్ధిచెందింది.[1] ఆ తర్వాత పాలించిన రాష్ట్రకూటులు ఖర్వేల వంశీకులచే చౌపగడ యుద్ధంలో ఓడింపబడ్డారు.[2]
గంగవంశం , సూర్యవంశపు రాజుల పాలనాకాలంలో ఈ ప్రాంతాన్ని కళింగ-ఉత్కళ రాజు దాదర్నాబ్ దేవ్ పరిపాలించాడు.[3] తర్వాత చివరి గజపతి రాజైన ముకుంద్ దేవ్ ను 1519 లో గోహెరా టిక్రి వద్ద ఓడించి బహమనీ సుల్తానుల వశమైంది. నందాపుర్ రాజవంశీయులు సుమారు 47 సంవత్సరాలు పాలించారు. విశ్వంభర్ దేవ్ ను చంపి సర్కారు జిల్లాలను పాలిస్తున్న మొఘల్ రాజైన హసిన్ ఖాన్ దీన్ని వశంచేసుకున్నాడు.
ఈ ప్రాంతం కొంతకాలం బొబ్బిలి జమిందారీలో భాగంగా ఉండేది. తర్వాత బ్రిటిష్ పరిపాలనలో ఇది జాజ్‌పూర్ పాలనలోను తర్వాత కొరాపుట్ జిల్లాలో భాగంగాను ఉండేది. ఒడిషా విస్తరణలో భాగంగా 1992 అక్టోబరు 2 తేదీన రాయగడ జిల్లాగా అవతరించింది.
భౌగోళికం
[మార్చు]రాయగడ జిల్లా వైశాల్యం 7584 చ.కి.మీ. జిల్లాలో బ్ఫ్లిమలి, అజిమలి, తిక్రిమలి ఔషధ మొక్కలు , వన్యమృగాలకు ప్రత్యేకంగా గుర్తించబడుతుంది.
ఆర్ధికం
[మార్చు]గత 6 దశాబ్ధాలలో రాయగడలో ఐ.ఎం.ఎఫ్.ఎ, జె.కె.పి.ఎ.పి.ఇ.ఆర్ మిల్లులు ఆర్థికరంగాన్ని సుసంపన్నం చేసాయి. రాయగడలో బాక్సైట్, సిలికాన్ వంటి ఖనిజవనరులు అధికంగా ఉన్నాయి. ప్రపంచ బాక్సైట్ వనరులలో 56% భారతదేశంలో ఉన్నాయని. భారతదేశ బాక్సైట్ వనరులలో 62% ఒడిషాలో ఉన్నాయని, ఒరిసాలోని బాక్సైట్ వనరులలో 84% రాయగడలో లభిస్తుందని, అంతర్జాతీయ సర్వేలు తెలియజేస్తున్నాయి. దీనిని ఆధారంగా తీసుకుని బిర్లా, ఎల్&టి, స్టెరిలైట్ వంటి సంస్థలు రాయగడ మీద ఆసక్తి కనబరుస్తున్నాయి. రాయగడ హోటెల్ ఇండస్ట్రీకి ప్రత్యేక గుర్తింపు పొందింది. సాయీ ఇంటర్నేషనల్, జ్యోతిమహల్, వంశీకృష్ణ, తేజశ్విని, కపిలాస్, రాజ్‌భవన్ వంటి ప్రముఖ హోటళ్ళు తమ ప్రత్యేకత చాటుతున్నాయి. చిన్నతరహా , మద్యతరహా పరిశ్రమలు రాయగడ ఆర్థికరంగం మీద ప్రభావం చూపుతున్నాయి. వీటిలో కోణార్క్ అల్యూమినియం పరిశ్రమ, సత్యం ప్యాకర్స్ , ప్రోసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మొదలైనవి ముఖ్యమైనవి. అదనంగా జైపోర్ షుగర్స్ లిమిటెడ్, ఫెర్రో మేనేజ్మెంటు జిల్లాకు అదనపు ఆదాయాన్ని అందిస్తున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో స్థాపించబడిన జాజ్‌పూర్ షుగర్ మిల్లులో పనిచేయడానికి సమీప ప్రాంతాల నుండి కూలీలను తరలించే వారు. అభుతమైన వాతావరణం, వనరుల లభ్యత , పారిశ్రామిక వాతావరణం రాయగడను ఒడిషాలో ప్రముఖ నగరంగా చేయాయి.
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో రాయగడ జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్ర 19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]
రాజకీయాలు
[మార్చు]అసెంబ్లీ నియోజకవర్గాలు
[మార్చు]The following is the 3 Vidhan sabha constituencies[5][6] of Raygada district and the elected members[7] of that area
క్ర.సం | నియోజకవర్గం | రిజర్వేషను | పరిధి | 14 వ శాసనసభ సభ్యులు | పార్టీ |
---|---|---|---|---|---|
138 | గునపూర్ | షెడ్యూల్డ్ తెగలు | గునుపూర్ (ఎన్.ఎ.సి), గుదారి (ఎన్.ఎ.సి), గునుపూర్, గుదారి, రమణగూడా, పదంపూర్. | రామమూర్తి ముతిక | బిజూజనతాదళ్ బి.జె.డి |
139 | బిస్సం కటక్ | ఎస్.టి. | బిస్సం, కటక్, మునిగుడా, చంద్రపూర్. | దంబరుధారా ఉలక | ఐ.ఎన్.సి. |
140 | రాయగడ | ఎస్.టి | రాయగడ (ఎం), రాయగడ, కాషిపూర్, కొల్నర, కల్యాన్‌సింగ్‌పూర్. | లాల్ బిహారి హిమిరిక | బి.జె.డి |
రాయగడ కొరాపుట్ పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉంది[8] శ్రీ జయరాం పంగి (బిజూ జనతాదళ్) 2009 ఎన్నిలకలో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుండి 9 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
ప్రయాణ సౌకర్యాలు
[మార్చు]రైలు
[మార్చు]రాయగడ రైల్వే స్టేషను నుండి చెన్నై, కొలకత్తా, హైదరాబాదు, భువనేశ్వర్, రాజ్పూర్, బెంగుళూరు, అహమ్మదాబాదు, ముంబై, జంషెడ్పూర్, ఢిల్లీ , ఇతర ప్రముఖ నగరాలకు రైలు సౌకర్యం ఉంది. జిల్లాలో గుణుపూర్ రైల్వే స్టేషను ప్రాముఖ్యత సంతరించుకుంది. గుణుపూర్ నుండి పర్లఖెముండి మీదుగా నౌపడా రైల్వే జంక్షన్ చేరుకోవచ్చు.
విద్య
[మార్చు]గిరిజన ప్రజలు అధికంగా ఉన్న విద్యారంగం మీద దృష్టి కేంద్రీకరించారు. రాయగడ జిల్లాలో విద్యారంగంలో పురాతనమైన జి.సి.డి ఉన్నత పాఠశాల ప్రముఖ్యవహిహిస్తుంది. గోపబంధు మునిసిపల్ ఉన్నత పాఠశాల విద్యాసేవలు అందించడంలో ముందంజలో ఉంది. సేక్రెడ్ హార్ట్ స్కూల్, మహర్షి విద్యామందిర్, ఎస్.టి క్సేవియర్ ఉన్నత పాఠశాల (సి.బి.ఎస్.ఇ), ఎల్.పి.ఎస్. పబ్లిక్ స్కూల్, ఎల్.పి.ఎస్. స్కూల్ ( జైకయ్పూర్), విఙాన విద్యాలయ [9] , గ్రీన్ వెల్లీ పబ్లిక్ స్కూల్ (పెంటా) ఉన్నాయి. అంతేకాక ఇంగ్లీష్ మీడియం స్కూల్ తెరుబలి చిన్మయా విద్యాలయ ఉన్నాయి. రాయగడ కాలేజి జూనియర్ కాలేజి, ఆర్ట్స్ , కామర్స్ విద్యను అందిస్తుంది. మహిళా కాలేజి జూనియర్ కాలేజి, ఆర్ట్స్ , కామర్స్ విద్యను అందిస్తుంది. అయినప్పటికీ డిగ్రీ మాత్రం ఆర్ట్ డిగ్రీ మాత్రమే ఉంది. నాగబలి సమీపంలో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న " ఉత్కల్ గౌరబ్ మధుసూదన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ "లో ఇంజనీఫింగ్ డిప్లొమా కోర్సులను అందిస్తుంది. జిల్లాలో బి.టెక్, ఎం.సి.ఎ, ఎం.బి.ఎ, ఎం.టెక్ , బయో టెక్నాలజీ విద్యలకు అవకాశంఉంది.
పర్యాటక ప్రదేశాలు
[మార్చు]- మజ్జి గైరమ్మ దేవాలయం (మా మఝిగైరాణి ఆలయం) - ఈ గ్రామ దేవత చాలా శక్తివంతమైనదిగా ఒడిషా , ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చే భక్తులచే కొలవడుతున్నది. కొండరాతి మీద మీద వెలసిన అమ్మవారి ముఖం మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.
- హతీ పత్తర్ (హతిపథర్) - జిల్లా కేంద్రం నుండి 3 కి.మీ.దూరంలో ప్రకృతి సుందరమైన ప్రదేశం రెండు జలపాతాలు నాగావళి నది ప్రవాహంలో ఏర్పడి కనులవిందు చేస్తాయి. ఇక్కడి రెండు కొండ రాళ్ళు ఏనుగుల వలె కనిపించడం వలన ఈ పేరు వచ్చింది.
- లక్ష్మీనారాయణ దేవాలయం:- ఇక్కడ జగన్నాధస్వామి, బలభద్రుడు, సుభద్ర సహితంగా పూజింపబడుతున్నాడు. ఇది తెరువళి (Therubali) ప్రాంతంలో ఉంది. ఇక్కడ పూరీ లోవలె రథాయాత్ర జరుగుతుంది.
- పాయకపాడు :- తెరువళి ప్రాంతంలోనే ఇదొక పవిత్రమైన శివక్షేత్రం. ఇది మహాభారత యుద్ధం అనంతరం పరశురాముడు ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిచెందినది. ఇక్కడ శివుడు పాయకేశ్వర స్వామిగా భక్తులచే కొలవబడుచున్నాడు.
- చిత్రకోన :- ఇవి కొండలు , లోయలతో సుందరమైన ప్రదేశము. ఇక్కడి మహాదేవుని ఆలయం ప్రసిద్ధిచెందినది.
- దేవగిరి : - ఇక్కడ గుహలో శివలింగం ప్రసిద్ధిచెందినది. కొండపైకి చేరడానికి మెట్లదారి ఉంది. చదునైన కొండ పైన త్రివేణి సంగమం ఉంది.
- పదంపూర్ :- ఇక్కడ ప్రాచీనమైన మణికేశ్వరి శివాలయం ప్రసిద్ధిచెందినది. ఇది 7వ శతాబ్దపు బౌద్ధ ప్రముఖుడైన ధర్మకీర్తి నివసించిన ప్రాంతం.
భీమాశంకర్ జ్యోతిర్లింగ
[మార్చు]లింగపురాణ కథనం అనుసరించి భీమాపూరులోని భీమాశంకర్ ఆలయం రాయగడకు 100 కి.మీ దూరంలో, గుణుపూర్ నుండి 30కి.మీ, ఉంది. పవిత్ర మహేంద్రగిరి పశ్చిమ భాగంలో , మహేంద్రతనయ నదీతీరంలో ఉంది. ఈ ఆలయం జ్యోతిర్లింగ ఆలయాలలో ఒకటి. చరిత్రకారులు ఈ ప్రాంతాన్ని డాకిని ప్రాంతం అని భావిస్తున్నారు.
ఉత్సవాలు , పండుగలు
[మార్చు]- ప్రధానంగా హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించబడుతున్న మా జల ఘరీని దేవత చైత్ర పర్బ అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తుంది.
- రోడ్డు వైపు , వీధుల్లో ప్రత్యేక సమూహాలు కలిసి జూలైలో రయగడ వద్ద రథయాత్ర నిర్వహిస్తారు.
- బ్లాక్ కాలనీ వద్ద వినాయక చవితి పండుగ ఆకర్షణ కేంద్రంగా ఉంది
- కాళి పూజ, నవంబరులో రయగద కుమర్పుర్నిమ సమయంలో న్యూ కాలనీ, రయగద వద్ద
- జే.కే. వద్ద గజ లక్ష్మీ పూజ
- దసరా పూర్ & బ్రాహ్మణ వీధి, అక్టోబరులో రయగడ.
- రయగడ వద్ద మార్చి ఏప్రిల్ (9 రోజులు) పాటు గ్రామ దెవత వార్షిక వేడుక (తిరనాళ).
- జె.ఇ.ఎల్ ఏళ్ చర్చిలో క్రిస్మస్.
- శ్రీ శ్రీ మహొస్తవ్ ఉద్బొధన్ ఠాకూర్ అనుకుల్ చంద్ర, శెరికొన, రయగడవద్ద, జనవరి శుభ
- గాయత్రీ నగర్ సమీపంలో నందా పహాడ్ ఉన్న శ్రీ మహాకాల ఆలయం మరప్రియు గాయత్రీ ఆలయం
సాహిత్యం
[మార్చు]రాయగడ జిల్లా ఒరియా సాహిత్యం ప్రత్యేక గుర్తింపును పొందింది. జిల్లాలో పలు సాంస్కృతిక పత్రికలు ప్రచురించబడుతున్నాయి. జిల్లాలో శ్రీ బంబొరుధర్ పట్నాయక్, డాక్టర్ దుష్మంత కుమార్ మొహంతి, డాక్టర్ కుముదొ సి.హెచ్. మిశ్రా, సిబొ ప్రసాద్ గంతయత్, సత్యనారాయణ గంతయత్, బసుదెవ్ పాత్రొ, శుసంత్ నాయక్, ద్వితిచంద్ర సాహు, రామ్ కృష్ణ ఫాత్‌త్నిక్, కిషోర్ మొహపాత్రొ, బొలొక్ దొలై, ప్రతిభా దాస్, ప్రతిభా మిశ్రా, ప్రకెష్ మొహపత్రొ, పార్థ్ సారథి బరిక్, మొదలైన ప్రముఖ రచయితలు , సాహిత్యకారులు ఉన్నారు.
జ్యూత్స్న
[మార్చు]ఒరియా సాహిత్య పత్రిక " ది జ్యోత్స్న రాగడ సాహిత్య స్వరంగా భావించబడుతుంది. ఇది 1972 నుండి ప్రచురించబడుతుంది. గతంలో జ్యోత్స్న పత్రిక అవిభాజిత కొరౌట్ జిల్లాలోని సునబెడాలో ప్రచురించబడేది. బాసుదేవ్ పాత్రో దీనిని స్త్యైంచాడు. శాంతిలత పాత్రో ఈ పత్రికకు సంపాదకురాలిగా పనిచేసాడు. శాంతి లత పలు కథలు, పద్యాలు, నవలలు, సొన్నెట్స్ వ్రాసాడు. ఆయన వ్రాసిన కోణార్క్ ఒడిషా ప్రజల ఆదరణను చూరగొన్నది. ప్రస్తుతం కోణార్క్ ఆంగ్లంలో ప్రచురించ బడుతుంది.
ఇతర పత్రికలు
[మార్చు]రాయగడ సాంస్కృతిక కోణం సమృద్ధమైన పంచబొతి , రాయగడ సమాచార్ , ఆకాష్ ',' 'గ్రీన్ రూమ్',. ఒరియా పత్రిక సర్వో దయొ 'మొదలైనపత్రికలు ప్రచురించబడుతున్నాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ As evident by Andhra Historical Journal XXVII edition at page 46
- ↑ The rock inscription of Allahbad inscribed by Mahamantri Harisena provides evidence to this effect.
- ↑ A rock inscription found at Pataleswar temple in Brahmi script provides an evidence to this effect.
- ↑ 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ Assembly Constituencies and their EXtent
- ↑ Seats of Odisha
- ↑ "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013.
MEMBER NAME
- ↑ "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Orissa" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 2009-03-04. Retrieved 2008-09-18.
- ↑ http://www.vignanvidayalaya.com[permanent dead link]
బయటి లింకులు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Pages using infobox settlement with unknown parameters
- Pages using infobox settlement with no coordinates
- Commons category link from Wikidata
- ఒడిశా జిల్లాలు
- Rayagada district
- 1992 స్థాపితాలు