జగత్‌సింగ్‌పూర్ జిల్లా
జగత్‌సింగ్‌పూర్ జిల్లా | ||||
---|---|---|---|---|
జిల్లా | ||||
Nickname: బనిక్షేత్ర | ||||
దేశం | India | |||
రాష్ట్రం | ఒడిశా | |||
ప్రధాన కార్యాలయం | జగత్‌సింగ్‌పూర్ | |||
విస్తీర్ణం | ||||
• Total | 1,759 కి.మీ2 (679 చ. మై) | |||
Elevation | 559.31 మీ (1,835.01 అ.) | |||
జనాభా (2001) | ||||
• Total | 10,58,894 | |||
• జనసాంద్రత | 602/కి.మీ2 (1,560/చ. మై.) | |||
భాషలు | ||||
• అధికార | ఒరియా, హిందీ,ఇంగ్లీషు | |||
Time zone | UTC+5:30 (IST) | |||
పిన్‌కోడ్ | 754103 | |||
Vehicle registration | OD-21 | |||
లింగ నిష్పత్తి | 1.038 ♂/♀ | |||
అక్షరాస్యత | 69.79% | |||
లోక్‌సభ నియీజకవర్గం | జగత్‌సింగ్‌పూర్ | |||
శాసనసభ నియోజకవర్గాలు | 5 | |||
శీతోష్ణస్థితి | Aw (Köppen) | |||
అవపాతం | 1,501.3 మిల్లీమీటర్లు (59.11 అం.) |
ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో జగత్‌సింగ్‌పూర్ జిల్లా ఒకటి ఒకటి. జగత్‌సింగ్‌పూర్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రం.
చరిత్ర
[మార్చు]2011లో సౌత్ కొరియా " పొహాంగ్ ఇరన్ & స్టీల్ కో " నిర్మించడానికి జగత్‌పుర్ జిల్లా ప్రజలు వ్యతిరేకించారు.[1]
భౌగోళికం
[మార్చు]ఈ జిల్లాలో ఫులపతన, హరిష్పుర్, ఒడిషా నహరన్, మరిచ్పుర్, బలిపతన, భనుహర్ బెలరి మొదలైన గరమాలు బే ఆఫ్ బెంగాల్ ఉన్నాయి.
వాతావరణం
[మార్చు]1999 అక్టోబరులో సంభవించిన పెను తుఫానులో ఘోరంగా దెబ్బతిన్న జిల్లాలలో జగత్‌సింగ్‌పూర్ జిల్లా ఒకటి. ఈ తుఫానులో 10,000 కంటే ఎక్కువ మంది మరణించారు.
ఆర్ధికం
[మార్చు]1960లో అధునిక డీప్ వాటర్ పోర్ట్ పరదీప్ నిర్మించారు. ఇది ప్రస్తుతం విదేశీ పెట్టుబడులకు కేంద్రంగా ఉంది. పి.ఒ.ఎస్.సి.ఒ రవాణా అవసరాలకు స్వంతగా రేవు నిర్మించడానికి ప్రయత్నిస్తోంది.
విభాగాలు
[మార్చు]జిల్లాలో 8 ఉపవిభాగాలుగా ఉన్నాయి: జగత్‌సింగ్‌పూర్ తాలూకా, కుజంగ్, తిర్తల్, బైలికుడా, బిరిది, నౌగావ్, ఎర్స్మ, రఘునాథ్‌పూర్. చివరి నాలుగిటిని 2008లో ఏర్పరచారు.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,136,604, [2] |
ఇది దాదాపు. | సిప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | రోడే ద్వీపం నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 410వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 681 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 7.47%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 967:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 87.13%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
సస్కృతి
[మార్చు]జగత్‌సింగ్‌పూర్‌లో ప్రఖ్యాత సరళ ఆలయం ఉంది. జిల్లా ఒడిషా సాంస్కృతిక కేంద్రంగా ఖ్యాతి గడించి ఉంది. ఒడిషా రాష్ట్రంలో ఈ జిల్లా వైశాల్యపరంగా అతి చిన్నది. జిల్లాలో సరళాదాసా, బిరాకిషోర్, గోపాల్ చొతరే, ప్రతిభా రే, బిభుతి పాట్నాయక్ వంటి సాహిత్యకారులు జన్మించారు. పంచసఖాలలో ఒకడైన జషోబంటా దాస్ (మిగిలిన నలుగురు అచుటా, అనంత్, బలబంటి, జగన్నాథ్) ఒకరు. జషోబంటా దాస్ రచన మలికా. జిల్లాలో జాత్రా కళాకారులు బహిరంగంగా ప్రదర్శిస్తారు. ఈ కళాకార బృందాలు క్రమంగా ఒడిషా రాష్ట్ర ప్రధాన వినోద ప్రవాహంలో భాగంగా మారారు.
రాజకీయాలు
[మార్చు]అసెంబ్లీ నియోజకవర్గాలు
[మార్చు]జిల్లాలో కింది నాలుగు శాసనసభ స్థానాలున్నాయి.[5][6]
క్ర.సం. | నియోజకవర్గం | రిజర్వేషను | పరిధి | 14 వ శాసనసభలో ప్రతినిధి | పార్టీ |
---|---|---|---|---|---|
101 | ప్రదీప్ | లేదు | ప్రదీప్ (ఎం), కుజంగ్, తిర్తొల్ (భాగం) | దామోదర రౌత్ | బి.జె.డి |
102 | తిర్తొల్ | షెడ్యూల్డ్ కులాలు | బిర్ది, రఘునాథ్పూర్, తిర్తోల్ (భాగం) | రాజష్రీ మల్లిక్ | బి.జె.డి |
103 | బలికుడ- ఎర్సమ | లేదు | బలికుడ, ఎరసమ | ప్రశాంత కుమార్, ముదులి. | బి.జె.డి |
104 | జగత్‌సింగ్‌పూర్ | లేదు | జగత్‌సింగ్‌పూర్ (ఎం), జగత్‌సింగ్పుర్, నౌగావ్. | చిరంజిబి బిస్వాల్ | కాంగ్రెస్ |
జిల్లా ప్రముఖులు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Eastern India villagers protest land clearing for steel plant
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Cyprus 1,120,489 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Rhode Island 1,052,567
- ↑ Assembly Constituencies and their EXtent
- ↑ Seats of Odisha