సుందర్‌గఢ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుందర్‌గఢ్ జిల్లా
జిల్లా
ఒడిశా పటంలో జిల్లా స్థానం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంఒడిశా
ప్రధాన కార్యాలయంసుందర్‌గఢ్
Government
 • CollectorSri Bhupendra Singh Poonia, IAS
Area
 • Total9,712 km2 (3,750 sq mi)
Population
 (2001)
 • Total18,30,673
 • Density188/km2 (490/sq mi)
భాషలు
 • అధికారఒరియా, Sundargadi, English
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
769 xxx
Vehicle registrationOD-16
Literacy65.22%
లోక్‌సభ నియోజకవర్గంSundargarh
Vidhan Sabha constituency7
శీతోష్ణస్థితిAw (Köppen)
అవపాతం1,657.1 millimetres (65.24 in)

ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో సుందర్ఘర్ జిల్లా ఒకటి. జిల్లా పశ్చిమ సరిహద్దులో చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాయగడ జిల్లా, వాయవ్య సరిహద్దులో చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి జాష్పూర్ జిల్లా, ఉత్తర సరిహద్దులో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సిండెగ జిల్లా, తూర్పు సరిహద్దులో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పశ్చిం సింగ్‌భుం, దక్షిణ సరిహద్దులో కెందుఝార్ జిల్లా, ఝార్సుగూడా, దేవ్‌గర్, అంగుల్ జిల్లాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంగా సుందర్ఘర్ పట్టణం ఉంది.

భౌగోళికం

[మార్చు]

సుందర్ఘర్ జిల్లా ఒడిషా రాష్ట్ర వాయవ్యంలో ఉంది. జిల్లా రాష్ట్రంలో (6.23% భూభాగంతో) వైశాల్యపరంగా 2వ స్థానంలో ఉంది. జిల్లా వైశాల్యం 9712 చ.కి.మీ. జిల్లా 21°36′ఉ నుండి 22°32′ ఉ అక్షాంశం, 83°32′తూ నుండి 85°22′తూ రేఖాంశంలో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

ప్రస్తుత సుందర్ఘర్ జిల్లా ప్రాంతం మునుపటి గంగాపూర్, బొనైగర్ రాజాస్థానాలకు చెందినది. స్వాతంత్ర్యానంతరం 1948 జనవరి 1 న ఈ ప్రాంతం భారతప్రభుత్వం భూభాగంతో కలుపబడింది. ప్రాచీన కాలంలో దక్షిణ కోసలలో పాలకుల ఆధీనంలో ఉందని భావిస్తున్నారు. అయినప్పటికీ రాజకుటుంబం గురించి విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. బొనై మండలం అని పిలువబడిన బొనైగర్ ఉత్కల సామ్రాజ్యానికి సామంతరాజైన మయూర పాలకుల పాలనలో ఉండేది. ప్రస్తుత గంగాపూర్ రాజకుటుంబం పర్మర్ సామ్రాజ్యానికి చెందినదిగా భావించబడుతుంది. బొనైగర్ కడంబ సామ్రాజ్యానికి చెందినది.

ఈ రెండు రాజాస్థానాలు మరాఠీ చక్రవర్తుల నాగపూర్ సామ్రాజ్యానికి చెందిన సంబలపూర్ పాలకుల ఆధీనంలో ఉంటూ ఉండేది. 1803లో ఈ ప్రాతం నాగపూర్ సైన్యాధ్యక్షుడు రఘూజీ భోంసలా బ్రిటిష్ ప్రభుత్వానికి స్వంతం చేసాడు. ఈ ఒప్పందం రూర్కేలా వద్ద " దేవ్గర్ ఒప్పదం " పేరుతో నెరవేర్చబడింది. 1806 నాటికి ఈ ప్రాంతం తురిగి రఘూజీ భోంసలా ఆధీనంలో ఉంచబడింది. చివరగా 1826 నాటికి బ్రిటిష్ ప్రభుత్వం ఈ ప్రాతం తిరిగి బ్రిటిష్ ఆధీనంలోకి మారింది. 1905 నాటికి ఈ ప్రాంతం చోటానాగ్పూర్ కమీషనర్ ఆధీనంలోకి వచ్చింది. అంతేకాక ఈ ప్రాంతానికి ప్రత్యేక రాజకీయ ప్రతినిధిని ఏర్పాటు చేయబడింది. ఈ జిల్లా ప్రస్తుతం " రెడ్ కార్పెట్ "లో భాగంగా ఉంది.[2]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,080,664,[3]
ఇది దాదాపు. మసడోనియా దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం..[5]
640 భారతదేశ జిల్లాలలో. 221వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 214[3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.66%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే. 971:1000 [3]
అక్షరాస్యత శాతం. 74.13%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

|- | గిరిజనులు 2001 | 50.9% |- | | |- | | |-

కిసాన్ తెగలకు చెందిన ఓరం, గోండ్ ప్రజలు వ్యవసాయం, ఆహారసేకరణ వంటి వృత్తులను చేపడుతుంటారు. వారి సంగీతానికి, నృత్యానికి, సేవలకు పేరు పొందారు. వారు సద్రి, సంబల్పురి, ఒరియా, హిందీ, ఇంగ్లీష్ భాషలను మాత్లాడుతుంటారు. కిసాన్ గ్రామాలలో కుత్రా గ్రామం ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. రాష్ట్ర రహదారి పక్కన ఉన్న రాజ్గంగ్పూర్ - సుందర్ఘర్ ఆధునిక గ్రామాలలో కుత్రా ఒకటి. సుందర్ఘర్ జిల్లాలో ఇది ఒక మండల కేంద్రం. ఇక్కడ పోలీస్ స్టేషను, అగ్నిమాపక కేంద్రం, హాస్పిటల్, పాఠశాలలు ఉన్నాయి. ఈ గ్రామంలో టొప్పోలు అధికంగా నివసిస్తున్నారు. బసు ప్రధాన ప్రయాణ సౌకర్యంగా ఉంది. సమీప ంలో ఉన్న రైలు స్టేషను రాజ్గంగ్పూర్‌లో ఉంది. జిల్లాలో ప్రధానంగా ఒరియా భాష వాడుకలో ఉంది. దీనిని సుందర్గాడియా ఒరియా అంటారు. అగారియా ప్రజలు అగారియా భాషను మాట్లాడుతుంటారు. ఇది ఒరియా, హిందీ మిశ్రిత భాష. జర్స్‌గుడా, రాజ్ఘర్ సమీప ంలో అంగారియాలు అధికంగా జీవిస్తున్నారు. సుందర్ఘర్ జిల్లాలో గిరిజన ప్రజలు అధికంగా జీవిస్తున్నారు. జిల్లాలో ముందరి, కురుఖ్, హో, ఖరియా, శాంతలి భాషలు గిరిజన ప్రజలకు మాతృభాషగా ఉంది. జార్ఖండ్, చత్తీస్‌గఢ్ సమీప ంలోని ప్రజలు హిందీ భాషను అర్ధం చేసుకుని మాట్లాడుతూ ఉంటారు. రూర్కెలాలో నాగరిక ప్రజలు ఒరియా, హిందీ భాషను మాట్లాడుతుంటారు. కార్యాలయాలలో ఆగ్లభాష ఆధిక్యత కలిగి ఉంది. జిల్లాలో ఒరియా, ఆగ్లం అధికార భాషగా ఉంది.

సంస్కృతి

[మార్చు]

జిల్లాలో చాలా ప్రాముఖ్యమైన ఉత్సవాలలో నౌకై ఒకటి. హిందువులు క్రిస్తవులు కలిసి జరుపుకునే ఉత్సవం ఇది. కర్మ కూడా హిందువులు క్రిస్తవులు కలిసి జరుపుకుంటారు. గిరిజనేతర ప్రజలు జగన్నాథుడికి రథయాత్ర ఉత్సవం నిర్వహిస్తుంటారు.

 • రామనవమి పండుగ :- సుందర్ఘర్‌లోని బర్గావ్‌లో రామనవమి యాత్ర, నామసంకీర్తన ఘనంగా నిర్వహించబడుతున్నాయి. బర్గావ్‌లోని దేవమండప వద్ద ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. దేవమండపం చుట్టూ మూడు వైపులా " జగన్నాథ ఆలయం, హనుమాన్ ఆలయం, ధర్మశాల ఉన్నాయి. నాలుగవ వైపు బర్గావ్- బస్తి రహదారి ఉంది.
 • రామనవమి యాత్రలో పలు బహిరంగ వేదికల మీద రామలీల గ్రామీణ కళాకారులు రామాయణ ఘట్టాలను ప్రదర్శిస్తుంటారు. గ్రామీణులు అందరూ అతిధులకు వసతి సౌకర్యాలు కల్పిండంలో అవిశ్రాంతా పని చేస్తుంటారు. ఈ కార్యక్రమాలు రాత్రివేళ నిర్వహిస్తుంటారు కనుక ప్రాతీయ స్వయం సేవకులు రక్షణబాధ్యత వహిస్తుంటారు.
 • రాజ్గంగ్పూర్ కూడా రామనామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతుంటాయి.
 • నామసంకీర్తన :- రామునికి, క్రిష్ణుడిని కీర్తించడం నామసంకీర్తనం అంటారు. వైష్ణవులు అందరూ కలిసి ఇది నిర్వహిస్తుంటారు. భక్తులు రామనామం చేస్తూ 1,3,9,21,156 రోజులు నిరంతరంగా భజన చేస్తుంటారు.

ఆర్ధికం

[మార్చు]
 • సుందర్ఘర్ జిల్లాలోని రూర్కేకాలో బృహత్తర పరిశ్రమలు ఉన్నాయి. రూర్కెలా స్టీల్ ప్లాంట్. భారతదేశంలో ఎల్.డి ఆక్సిజన్ ఉపయోగిస్తున్న ఒకేఒక సంస్థగా ఇది గుర్తుంచబడుతుంది. అంతేకాక విదేశీ సహకారంతో (జర్మన్) ప్రభుత్వం స్థాపించిన మొదటి సంస్థగా ఇది గుర్తించబడుతుంది.
 • రాజ్నగర్ :- రూర్కెలా, సుందర్ఘర్ మద్య ఉన్న ప్రధాన నగరం రాజ్నగర్. ఇక్కడ ఒ.సి.ఎల్ సిమెంటు సంస్థ మరుయు పలు చిన్నతరహా పరిశ్రమలు, తరన్ టెక్స్‌టైల్ కంపనీ ఉన్నాయి.
 • కంస్బహల్ :- ఇక్కడ ఎల్.&టి కి చెందిన ఫ్యాబ్రికెంట్ ప్లాంట్ ఉంది.
 • సుందర్ఘర్‌లో 2 యు.ఎం.పి.పి సంస్థలు ఉన్నాయి.[6] ఒకటి ఎన్.టి.పి.సి వారిచే దర్లిపలి వద్ద నిర్మినచబడుతున్న 1600 మె.వా థర్మల్ పవర్ ప్లాంట్.[7]

రెండవది భెదబహల్ వద్ద నిర్మించబడుతుంది. వీటితో మరొక దానిని బొనై వద్ద నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. 2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సుందర్ఘర్ జిల్లా ఒకటి అని గుర్తించింది..[8] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్ర 19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[8]

రాజకీయాలు

[మార్చు]

అసెంబ్లీ నియోజకవర్గాలు

[మార్చు]

The following is the 7 Vidhan sabha constituencies[9][10] of Sundergarh district and the elected members[11] of that area

క్ర.సం నియోజకవర్గం రిజర్వేషను పరిధి 14 వ శాసనసభ సభ్యులు పార్టీ
8 తలసర షెడ్యూల్డ్ తెగలు సుబ్బెగ, బలిశంకర, బరాగావ్, లెఫిపరా (భాగం) ప్రఫుల్లా మఝి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
9 సుందర్ఘర్ షెడ్యూల్డ్ సుందర్ఘర్ (ఎం), సునర్ఘర్, తంగపలి, హెంగ్రి, లెఫ్రిపరా (భాగం) జోగేష్ కుమార్ సింఘ్ ఐ.ఎన్.సి
10 బిరమిత్రపూర్ Biramitrapur షెడ్యుల్డ్ తెగలు బిరమిత్రపూర్ (ఎం), కుయార్ముండ, నాగావ్, బిస్రా (భాగం) జార్జ్ తిర్కె స్వతంత్ర
11 రఘునాధ్పల్లి షెడ్యూల్డ్ కులాలు రూర్కెలా (టౌన్‌షిప్, లథికల (భాగం) Subrat Tarai బి.జె.డి
12 రూర్కెలా లేదు రూర్కెలా (ఎం), కులుంగ (ఒ.జి), బిస్ర (పార్ట్) Sశారదాప్రసాద్ నుడే బి.జె.డి
13 రాజ్గంగ్పూర్ షెడ్యూల్డ్ తెగలు రాజ్గంగ్పూర్ (ఎం), రాజ్గంగ్పూర్, కుత్రా, లతికత (భాగం) గ్రెగొరీ మింజ్ ఐ.ఎన్.సి
14 బొనై షెడ్యూల్డ్ తెగలు గురుండియా, బొనైగర్, లహునిపరా, కొయిర. భీంసేన్ చౌదరీ బి.జె.పి

పర్యాటక ప్రదేశాలు

[మార్చు]
మందిరా ఆనకట్ట
 • మందిరా ఆనకట్ట
 • ఘొగర్ ధామ్
 • ఖండధర్ ( జలపాతం)
 • మిరిగిఖోజ్ జలపాతం
 • వేదవ్యాస్
 • డార్జింగ్
 • పితమహళ్ ఆనకట్ట (కలుంగ)
 • కంసబహల్ ఆనకట్ట.
 • దియోధర్
 • సుఖ మహదేవ్ మందిర్ (బలిషంకర)
 • రాణి సతి మందిర్ (బిరమిత్రపూర్)
 • హనుమాన్ వాటిక (రూర్కెలా )
 • మా వైష్ణో దేవి టెంపుల్, రూర్కెలా

మూలాలు

[మార్చు]
 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-07-02. Retrieved 2014-10-16.
 2. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 11 December 2009. Archived from the original on 27 అక్టోబరు 2011. Retrieved 17 September 2011.
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
 4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011. Macedonia 2,077,328 July 2011 est.
 5. "2010 Resident Population Data". U.S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011. New Mexico – 2,059,179
 6. http://www.projectstoday.com/News/NewsDetails.aspx?smid=24&nid=25095
 7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-11-30. Retrieved 2014-10-16.
 8. 8.0 8.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
 9. Assembly Constituencies and their EXtent
 10. Seats of Odisha
 11. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013. MEMBER NAME

వెలుపలి లింకులు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]