Jump to content

కేంద్రపడా జిల్లా

వికీపీడియా నుండి
(కేంద్రపరా జిల్లా నుండి దారిమార్పు చెందింది)
కేంద్రపడా జిల్లా
జిల్లా
పెంటా బీచ్
పెంటా బీచ్
ఒడిశా పటంలో జిల్లా స్థానం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంఒడిశా
ప్రధాన కార్యాలయంకేంద్రపడా
Government
 • కలెక్టరుDurga Prasad Behera, IAS
 • పార్లమెంటు సభ్యుడుBaijayant Panda, BJD
విస్తీర్ణం
 • Total2,644 కి.మీ2 (1,021 చ. మై)
జనాభా
 (2011)
 • Total14,39,891
 • జనసాంద్రత492.38/కి.మీ2 (1,275.3/చ. మై.)
భాషలు
 • అధికారఒరియా, హిందీ,ఇంగ్లీషు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
754 xxx[1]
Vehicle registrationOD-29
లింగ నిష్పత్తి0.986 /
male7,17,695
female7,22,196
అక్షరాస్యత77.33%
లోక్‌సభ నియోజకవర్గంKendrapara
Vidhan Sabha constituency6 (5 full,1 part)
 
  • Aul (Ali)
    Bari-Derabish (part)
    Kendrapara
    Patkura
    Pattamundai (SC)
    Rajnagar
శీతోష్ణస్థితిAw (Köppen)
అవపాతం1,501.3 మిల్లీమీటర్లు (59.11 అం.)

ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో కేంద్రపడా జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా కేంద్రపడా పట్టణం ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో భద్రక్ జిల్లా, తూర్పు సరుహద్దులో బంగాళాఖాతం, దక్షిణ సరిహద్దులో జగత్‌సింగ్‌పూర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో కటక్ జిల్లా, జాజ్‌పూర్ (ఒడిషా) జిల్లాలు ఉన్నాయి.

భౌగోళికం

[మార్చు]

కేంద్రపడా జిల్లా ఒడిషా రాష్ట్ర తీరప్రాంత జిల్లాలలో ఒకటి. 20° 20’ ఉత్తర నుండి 20° 37’ డిగ్రీల ఉత్తర అక్షాంశం, 86° 14’ తూర్పు నుండి 87° 01’ డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా తూర్పు సరిహద్దులో బంగాళాఖాతం ఉంది. జిల్లాలో 48కి.మీ సముద్రతీరం (ధంరా ముహాన్ నుండి బతిఘర్) ఉంది. కేంద్రపడా, రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుండి 85 కి.మీ దూరంలో ఉంది. కేంద్రపడా జిల్లాలో బ్రహ్మణి, బైతరిణి, మహానది నదులు ప్రవహిస్తున్నాయి. బైతర్కణిక మాంగ్రోవ్, బైతరికనిక నేషనల్ పార్క్, గహిర్మాతా బీచ్,, బలదేవ్ ఆలయం ఉన్నాయి. జిల్లాలో శుక-పరీక్షిత ఆశ్రమం, కూడనగరి, పెంథ సీ బీచ్, హరిహర్ క్షేత్ర మహాల, గాంధార గిసైన్ పీఠం, కొరుయా మొదలైన సుందర ప్రదేశాలు ఉన్నాయి. జిల్లాలో 9 మండలాలు ఉన్నాయి: అవుల్, డెరబిష్, గరద్పుర్, మహాకలపద,మర్షఘై,కెంద్రపర తలుకా, రాజనగర్,రాజ్కనిక, పతముందై.

విభాగాలు

[మార్చు]

జిల్లాలో 6 తాలూకాలు, 9 మండలాలు ఉన్నాయి:- [2] అవి వరుసగా :

తాలూకాలు

  • అవుల్
  • కనికా
  • కేంద్రపడా
  • మార్షఘై
  • పట్టముందై
  • ఋజ్ఞగర్
  • మహాకల్పద
  • బ్లాకులు:-
  • పెరుగుదల
  • డెబ్రిస్
  • ఘొరద్పుర్
  • కేంద్రపడా
  • మాహకల్పద
  • మార్షఘై
  • ఫతముందై
  • రాజకనిక
  • ఋజ్ఞగర్

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,439,891,[3]
ఇది దాదాపు. స్వాజిలాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. హవాలి నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 334వ స్థానంలో ఉంది..[3]
1చ.కి.మీ జనసాంద్రత. 545 .[3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 10.59%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 1006:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 85.93%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

జిల్లాలో ఒరియా భాష ప్రధానభాషగా ఉంది. అంతేకాక జిల్లాలో బెంగాలీ, ఉర్దూ భాషలు వాడుకలో ఉన్నాయి. జిల్లా అంతటా హిందీ భాష అర్ధం చేసుకుంటారు.

సస్కృతి

[మార్చు]

పర్యాటకం

[మార్చు]

కేంద్రపడా జిల్లాలో పలు పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న బతిఘ్రర లైట్‌హౌస్ తూర్పు భారతదేశ తీరప్రాంతాలలో మొదటి లైట్ హౌస్‌గా గుర్తించబదుతుంది. దీని చుట్టూ సహజ సౌందర్యం ప్రతిబింబిస్తూ ఉంటుంది. జిల్లా కేంద్రం కేంద్రపడాకు ఇది 50కి.మీ దూరంలో ఉంది. ఈ నౌకాశ్రయం 1855 లో స్థాపినచబడుతుంది. కేంద్రపడా జిల్లాలో అత్యధిక ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రదేశాలలో " కనిక ప్యాలెస్ " ముఖ్యమైనది. రాజభవనం అందచందాలు సాటిలేనిది, అద్భుతమైనది. ఇది రాజ్కనిక మండలంలో ఉంది. కేంద్రపడా నుండి 50 కి.మీ దూరంలో ఉంది. 40 ఎకరాల వైశాల్యంలో నిర్మించబడిన పురాతన మైన అవుల్ ప్యాలెస్ పర్యాటక ఆకర్షణలో మరొకటి. జిల్లాలో రాజ్బతి, రాణిమహల్, గోడశాల, భందర్, ఉదయన్ దేబాలయ, దేవి మందిర్ వంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. కనిక ప్యాలెస్‌కు 5 కి.మీ దూరంలో దామోదర్ నదీతీరంలో ఉన్న నైకాశ్రయం అతి పురాతనమైనదిగా భావించబడుతుంది. సముద్రతీర వ్యాపారకేంద్రంగా పత్కురా నియోజకవర్గంలో ఉన్న కూడనగర్ భావించబడుతుంది. ఇక్కడ అటవీ ప్రాంతంలో 15 ఎకరాల విస్తీర్ణంలో 25 అడుగుల ఎత్తున ఉన్న ఇసుక తిన్నెలు పర్యాటకులు సందర్శించే ప్రదేశాలలో ఒకటి.

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]
  • భలదేవ్‌జ్యూ ఆలయం, కేంద్రపడా టౌన్.
  • లక్ష్మణ్‌జెవ్ ఆలయం ఇన్ భలిపత్న, పట్టణానికి 4కి.మీ దూరంలో ఉంది.
  • లక్ష్మీ వరాహ ఆలయం, ఆవుల్, కేంద్రపడా పట్టణానికి 40 కి.మీ దూరంలో ఉంది.
  • ఘహిర్మథ బీచ్
  • ఖుదనగరి శుక ఫరీక్షిత ఆశ్రమం
  • హరిహర్ క్షేత్ర, మహల్
  • మా దక్షిణ ఖాళి ఆలయం ( ఖుదనగరి)
  • మల్లికేశ్వర్ శివాలయం, ఆధంగమల్లికేశ్వర్ పుర్ (ఛందొల్),
  • భతిఘర్
  • ఖనిక ప్యాలెస్
  • ఆవుల్ ప్యాలెస్
  • డెరబిష్ ప్యాలెస్

రాజాకీయాలు

[మార్చు]

అసెంబ్లీ నియోజకవర్గాలు

[మార్చు]

జిల్లాలో 5 ఒరిస్సా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.[6][7][8]

క్ర.సం నియోజకవర్గం రిజర్వేషను పరిధి 14 వ శాసనసభ సభ్యులు పార్టీ
96 పత్కురా లేదు డెరాబొష్, గరదపూర్, మర్షఘై (భాగం) బెడ్ ప్రకాష్ అగర్వాలా బి.జె.డి
97 కేంద్రపడా షెడ్యూల్డ్ కులాలు కేంద్రపడా (ఎం), కేంద్రపడా, పట్టముండై (భాగం) శ్రీమతి సిప్రా మల్లిక్ బి.జె.డి
98 అవుల్ లేదు అవుల్, రాజ్కనిక ప్రతాప్ కేషరి డెబ్ బి.జె.డి
99 రాజనగర్ లేదు పట్టముండై (ఎన్.ఎ.సి), రాజనగర్, పట్టముండై (భాగం) అలేఖ్ కుమార్ జెనా బి.జె.డి
100 మహాకల్పదా లేదు మహాకలపద, మర్షఘై (భాగం) ఆటను సభ్యసాచి నాయక్ బి.జె.డి

మూలాలు

[మార్చు]
  1. "PinCode: Kendrapara, Orissa, India, All Post Office Addresses Data, Pincode.net.in". pincode.net.in. Archived from the original on 17 జనవరి 2013. Retrieved 11 January 2013. KENDRAPARA 754211
  2. h http://orissa.gov.in/e-magazine/orissaannualreference/ORA-2005/pdf/list_of_districts.pdf
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Swaziland 1,370,424
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301
  6. Assembly Constituencies and their EXtent
  7. Seats of Odisha
  8. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013. MEMBER NAME

వెలుపలి లింకులు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]