బాలాసోర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాలాసోర్ జిల్లా
జిల్లా
చాందీపూర్ బీచి
చాందీపూర్ బీచి
Nickname: 
ఒడిశా ధాన్యాగారం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంఒడిశా
ప్రధాన కార్యాలయంబాలాసోర్
విస్తీర్ణం
 • Total3,634 కి.మీ2 (1,403 చ. మై)
Elevation
90.08 మీ (295.54 అ.)
జనాభా
 (2011)
 • Total23,17,419
 • Rank4
 • జనసాంద్రత609/కి.మీ2 (1,580/చ. మై.)
భాషలు
 • అధికారఒరియా, హిందీ, English
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
756 xxx
టెలిఫోన్ కోడ్06782
Vehicle registrationOD-01
Coastline81 కిలోమీటర్లు (50 మై.)
సమీప పట్టణంBhubaneswar
లింగ నిష్పత్తి957 /
అక్షరాస్యత80.66%
శీతోష్ణస్థితిAw (Köppen)
అవపాతం1,583 మిల్లీమీటర్లు (62.3 అం.)
సగటు వేసవి ఉష్ణోగ్రత43.1 °C (109.6 °F)
సగటు శీతాకాల ఉష్ణోగ్రత10.6 °C (51.1 °F)
General Information
Subdivisions: 2
Blocks: 12
Towns: 4'
Municipalities: 1
N.A.C.: 3
Tehsils: 7
Grama panchayat: 289
Villages: 2971
Coast line: 81 km

ఒడిషా లోని జిల్లాలలో బాలాసోర్ జిల్లా ఒకటి. దీనిని బలేశ్వర్ జిల్లా అని కూడా అంటారు. ఒడిషా రాష్ట్ర తీరప్రాంత జిల్లాలలో ఇది ఒకటి. ఈ జిల్లా రాష్ట్ర ఉత్తర సరిహద్దులో ఉంది. ఇది పురాతన కళింగ రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. తరువాత రాజా ముకుందదేవ్ మరణించే వరకు (1828) ఈ ప్రాంతం తోషల్ లేక ఉత్కళ రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. ఇది బెంగాల్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉంటూ వచ్చింది.

సరిహద్దులు

[మార్చు]

2011 గణాంకాలను అనుసరించి జిల్లా వైశాల్యం 3634 చ.కి.మీ. జనసంఖ్య 23,17,419. జిల్లా ఉత్తర సరిహద్దులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మదీనాపూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో బంగాళాఖాతం, దక్షిణ సరిహద్దులో భద్రక్ జిల్లా , పశ్చిమ సరిహద్దులో మయూర్భంజ్ , కెందుఝార్ జిల్లాలు ఉన్నాయి. జిల్లా 20.48 నుండి 21.59 డిగ్రీల ఉత్తర అక్షాంశం , 86.16 to 87.29 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.

రాకెట్ స్టేషను

[మార్చు]

1989లో బాలాసోర్ జిల్లాలో ఒడిషా రాష్ట్ర తూర్పు తీరంలో 21.18 డిగ్రీల ఉత్తర అక్షాంశం , 86.36 డిగ్రీల తూర్పు రేఖాంశంలో " సౌండింగ్ రాకెట్స్" స్టేషను స్థాపించబడింది. అయినప్పటికీ శ్రీహరికోటలో లాగా ఇక్కడి నుండి శాటిలైట్లు ప్రయోగించబడడంలేదు. ఈ రాకెట్ స్టేషను బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్ వద్ద బంగాళాఖాతం సముద్రతీరంలో ఉంది. చాందీపూర్ రాకెట్ స్టేషను నుండి అగ్ని, పృధ్వి , త్రిశూల్ వంటి మిస్సైల్స్ పరిశోధన ప్రయోగం జరుగుతున్నాయి.

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]

బాలాసోర్ రైల్వే స్టేషను చెన్నై , కొలకత్తా రైలు మార్గంలో ఉంది. జిల్లా నుండి జాతీయరహదారి-5 పయనిస్తూ ఉంది. రహదారి మార్గంలో ఈ జిల్లా భువనేశ్వర్కు 12కి.మీ ఈశాన్యంలో ఉంది. చాందీపూర్‌లో దాదాపు 1 మైలు పొడవున ఉన్న లోతు తక్కువైన సౌకర్యవంతమైన సముద్రతీరం ఉంది. ప్రపంచంలో లోతు తక్కువైన సముద్రతీరాలలో చదీపూర్ సముద్రతీరం ఒకటిగా గుర్తించబడుతుంది. ఒకరోజుకు 4 మార్లు మాత్రమే తీరానికి ఆటుపోట్లు వస్తుంటాయి. 18వ శతాబ్దంలో నిర్మించబడిన క్షీరచోర- గోపీనాథ్ ఆలయం జిల్లాలోని ప్రత్యేక పర్యాటక ఆకర్షణలలో ఒకటి.

  • బాలాసోర్ జిల్లా భాషావేత్త , నవలా రచయిత " ఫకీర్ - మోహన్ - సేనాపతి " జన్మస్థం. ఫకీర్ - మోహన్ - సేనాపతి ఆధునిక ఒరియా భాషా పరిరక్షకుడుగా , స్వాతంత్ర్య సమరవీరుడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రఖ్యాత ఒరియా కవి కబీర్ రాధానాథ్‌రాయ్ ఈ జిల్లాలోనే జన్మించాడు.

బాలాసోర్ (ఆంగ్లం: Balasore) (ఇతరనామాలు బాలేశ్వర్ లేదా బాలేష్వర్) ఒడిషా రాష్ట్రంలోని ఒక నగరం. ఇది బాలాసోర్ జిల్లా కేంద్రం. ఇది చాందీపూర్కు ప్రసిద్ధి, ఇచట భారతీయ సేన తన క్షిపణులను పరీక్షించుటకు ప్రయోగించే స్థలం ఉంది. ఈ ప్రదేశం నుండే ఆకాశ్, నాగ్, అగ్ని పృథ్వీ మొదలగునవి పరీక్షించారు.

చరిత్ర

[మార్చు]

పురాతన చరిత్ర

[మార్చు]

బాలాసోర్ జిల్లా పురాతన కళింగరాజ్యంలో భాగంగా ఉండేది. తరువాత ముకుందదేవ్ మరణించే వరకు ఈ ప్రాంతం ఉత్కల్ (తోషల) రాజ్యంలో భాగంగా ఉండేది. 1568 నుండి 1750 -51 వరకు ఈ ప్రాంతాన్ని ముగల్ చక్రవర్తులు స్వాధీనపరచుకున్నారు. తరువాత ఒడిషాలోని ఈ ప్రాంతాన్ని మరాఠీ రాజులు అక్రమించుకున్నారు. 1803లో " ట్రీటీ ఆఫ్ దేవ్‌గావ్ " ఒపాందం ద్వారా ఈ ప్రాంతం బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి మారింది. తరువాత ఈ ప్రాంతం 1912 వరకు " బెంగాల్ ప్రెసిడెన్సీ "లో భాగంగా మారింది. ఢిల్లీలో షాజహాన్ చక్రవర్తిగా ఉన్న సమయంలో 1634 నుండి ఈ ప్రాంతంలోకి ఆగ్లేయుల నివాసాలు ఆరంభం అయ్యాయి. బ్రిటిష్, ఫ్రెంచ్ , డచ్ వ్యాపారులకు ఈ ప్రాంతం ఆరంభకాల నౌకాశ్రయం అని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో మొదటిసారిగా డచ్ కాలనీ నిర్మించబడింది. తరువాత బ్రిటిష్ కాలనీలు నిర్మించబడ్డాయి. 1640లో ఈ ప్రాంతంలో మొదటిసారిగా ఆంగ్లేయులు ఫ్యాక్టరీలు నిర్మించారు. ఈ సమయంలో డచ్ , డానిష్ కాకనీలు ఈ ప్రాంతంలో అధికరించాయి.

జిల్లాగా

[మార్చు]

1828లో బాలాసోర్ భూభాగం బెంగాల్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న సమయంలో బాలాసోర్ ప్రాంతానికి జిల్లా అంతస్తు ఇవ్వబడింది.బీహార్ రాష్ట్రం ఏర్పాటు చేసిన తరువాత బాలాసోర్ ప్రాంతం బెంగాల్ నుండి బిహార్‌లో చేర్చబడింది. 1936 ఏప్రిల్ 1 ఒడిషా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన తరువాత బాలాసోర్ ఒడిషా రాష్ట్రంలో భాగంగా మారింది. 1921లో మహాత్మాగాంధీ నాయకత్వంలో స్వాతంత్ర్య ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఉప్పుసత్యాగ్రం , శ్రీజంగ్ సత్యాగ్రం (ఆదాయం పన్ను ఎగవేత) స్వాతంత్ర్య పోరాటంలో ప్రధానపాత్ర వహించాయి. నీలగిరి రాజాస్థానానికి వ్యతిరేకంగా ప్రజా ఆందోళన మొదలైంది. 1948 జనవరిలో నీలగిరి రాజాస్థానం ఒడిషా రాష్ట్రంతో విలీనం అయింది. తరువాత నీలగిరి రాజాస్థానం బాలాసోర్ జిల్లాగా మారింది. 1993 ఏప్రిల్ 3 న భద్రక్ ఉపవిభాగాన్ని ప్రత్యేక జిల్లాగా రూపొందించారు.

వ్యాపార కేంద్రం

[మార్చు]

17వ శతాబ్దంలో బాలాసోర్ తూర్పుభారతదేశంలోని కోస్తాప్రాంతంలోని ప్రధాన వ్యారకూడలిగా ఉంది. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఆగ్నేయ ఆదియాలోని సుదూర ప్రాంతాలలోని నౌకాశ్రయాలకు పయనిస్తూ ఉండేవారు. ప్రధానంగా లక్షదీవులు , మాలదీవులతో అధికంగా వ్యాపార సంబంధాలు ఉండేవి. భొగ్రై వద్ద జరిగిన త్రవ్వకాలలో రాగినాణ్యాలు లభించాయి. ఆవనా, కుపారి, బాస్తా , అజోధ్య వద్ద త్రవ్వకాలలో లభించిన బుద్ధ విగ్రహాలు బాలాసోర్‌లో బౌద్ధమతం ఆధిక్యంలో ఉన్నట్లు భావిస్తున్నారు. బౌమకర్ సామ్రాజ్యం కాలంలో బాలాసోర్ ప్రాంతంలో బైద్ధమతం అభివృద్ధి చెందినట్లు భావిస్తున్నారు. 10-11 దశాబ్ధాలలో జలేశ్వర్, బాలాసోర్ , అవన ప్రాంతాలలో కనుగొనబడిన మహావీర శిల్పాల ఆధారంగా ఈ ప్రాంతంలో జైనిజం ఉనికిలో ఉన్నట్లు భావిస్తున్నారు.

భౌగోళికం

[మార్చు]
Balasore district is affected with flood in its coastal areas

బలాసోర్ జిల్లా ఒడిషా జిల్లా ఈశాన్యభాగంలో ఉంది. జిల్లా 21° 3' , 21° 59' డిగ్రీల ఉత్తర రేఖాంశంలో , 86° 20' నుండి 87° 29 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా సముద్రమట్టానికి 19.08 మీటర్ల ఎత్తులో ఉంది. జిల్లా వైశాల్యం 3634 చ.కి.మీ. జిల్లా ఉత్తర సరిహద్దులో పశ్చిమ బెంగాల్కు చెందిన మదీనాపూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో బంగాళాఖాతం, దక్షిణ సరిహద్దులో భద్రక్ జిల్లా, , పశ్చిమ సరిహద్దులో మయూర్‌భంజ్ జిల్లా , కెందుఝార్ జిల్లా ఉన్నాయి. బలాసోర్ జిల్లా " సిటీ ఆఫ్ శాండ్ " , " లాండ్ ఆఫ్ సీ షోర్ " గుర్తించబడుతుంది.

నైసర్గికం

[మార్చు]

నైసర్గుకంగా జిల్లా 3 విభాగాలుగా విభజించబడింది. కోస్టల్ బెల్ట్, ఇన్నర్ అల్యూవియల్ ప్లెయిన్ , నైరుతీ కొండలు. సముద్రతీర ప్రాంతం 81 కి.మీ పొడవు ఉంటుంది. ఇక్కడ సముద్రతీరం వెంట కొన్ని చోట్ల ఇసుకదిబ్బలు ఉంటాయి. ఈ ప్రాంతం సదా వరదలతో ఉప్పునీటి ప్రవాహంతో లోతు తక్కువ నీరు కలిగి ఉంటుంది. ఇది వ్యవసాయానికి ఉపకరించదు. సమీపకాలంగా ఈ ప్రాంతం కొబ్బరి , పోక తోటలు పెంచబడుతున్నాయి. సమీపకాలంగా ఈ ప్రాంతంలో రొయ్యల పెంపకం , ఉప్పు ఉత్పత్తి కూడా చేపట్టబడుతుంది.తరువాత సారవంతమైన భూభాగం. ఇది వ్యవసాయానికి ఉపకరిస్తుంది. ఇది అటవీ ప్రాంతంలేని భూభాగం. అదే సమయంలో ఇది జనసాంధ్రత అధికంగా కలిగి ఉంది. మూడవ భూభాగం నైరుతీలో ఉన్న పర్వత ప్రాంతం. ఇది నీలగిరి ఉపవిభాగం ఉంది. కొండలతో నిండిన ఈ భూభాగంలో ఉష్ణమండాలానికి చెందిన అర్ధహరిత వృక్షాలు అధికంగా ఉంటాయి. నీలగిరి కొండలోఉన్న ఎత్తైన శిఖరం సముద్రమట్టానికి 543 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతంలో రాష్ట్రంలోని గిరిజన తెగలకు చిందిన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో విలువైన అటవీ సంపద , క్వారీలు అధికంగా ఉన్నాయి.

నదులు

[మార్చు]

బాలాసోర్ ఒడిషా లోని తీరప్రాంత జిల్లాలలో ఒకటి. సముద్రతీరం ఉన్న కారణంగా జిల్లాలో రెండు ప్రధాన నదులు ప్రవహిస్తున్నాయి:బుధబలంగ , సుబర్ణరేఖ నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తున్నాయి. బలాసోర్ జిల్లా అంతటా నీటిపారుదల సౌకర్యం ఉంది.

భూమి

[మార్చు]

బలాసోర్ జిల్లా భూమి సరావంతంగా ఉంటుంది. మద్యభూభాగంలో బంకమట్టి అఫ్హికంగా ఉంటుంది. బంకమట్టి , ఇసుక కలిసిన భూమి వరి పంటకు , ఇతర పంటలకు అనుకూలంగా ఉంటుంది. సముద్రతీరం వెంట సన్నగా సాలైన్ భూభాగం ఉంటుంది.

ఆర్ధికం

[మార్చు]

ఒరొస్సా రాధ్ట్రంలో ఆర్థికంగా శక్తినంతమైన జిల్లాలలో బాలాసోర్ జిల్లా ఒకటి. జిల్లా వ్యవసాయపరంగా , పారిశ్రామికంగా శక్తివంతంగా ఉంది. వ్యయసాయ ఆదాయం అధికంగా ఉన్న కారణంగా ప్రజలు అధికంగా వ్యవసాయ సంబంధిత వృత్తులను జీవనోపాధికి ఎంచుకుంట్జున్నారు. రాష్ట్ర తీరప్రాంత జిల్లాలలో ఒకటైన బాలాసోర్ జిల్లా తేమ , వేడి మిశ్రిత వాతావరణం, సారవంతమైన భూమి , జీవనదీ ప్రవాహాలు కలిగి ఉంది. నదీజలాలు జిల్లాను వ్యవసాయ రంగంలో సుసంపన్నం చేస్తున్నాయి. సమీపకాలంగా నిరుపయోగంగా ఉన్న భూములను సైతం ఉపయోగంలోకి తీసుకురావడం జిల్లా అభివృద్ధికి మరింత సహకరించింది. ఈ భూమిలో కొబ్బరి తోటలు , పోకతోటలు పెంచబడుతుంటాయి. బాలాసోర్ ఆదాయం వరిపంట , గోధుమ మీద ఆధారపడి ఉంది.

పరిశ్రమలు

[మార్చు]

ఒడిషా ప్రజలలో అత్యధికులు వ్యవసాయరంగం, పరిశ్రమలు మీద ఆధారపడుతుంటారు. 1978 నుండి జిల్లాలో డి.ఐ.సి చురుకుగా పనిచేస్తుంది. జిల్లా పారిశ్రమికంగా కూడా గుర్తినచతగినంతగా అభివృద్ధి చెందుతుంది. జిల్లాలో చిన్నతరహా, మద్యతరహా , బృహత్త పరిశ్రమలకు డి.ఐ.సి తగిన సహకారం అందిస్తుంది. అంతే కాక కుటీరపరిశ్రమలకు , హస్థకళా పరిశ్రమలు కూడా సకకారం అందిస్తుంది. జిల్లాలో ఒరి ప్లాస్ట్ లిమిటెడ్, జగన్నాథ్ బిస్కట్ ప్రైవేట్ లిమిటెడ్, ఒడిషా రబ్బర్ , ఒడిషా ఫ్లాస్టిక్ మంటి అవార్డులను పొందిన చిన్నతరహా పరిశ్రలు ఉన్నాయి. అలాగే జిల్లాలోని బిర్లా టైర్స్, ఇస్పాట్ అల్లాయ్స్ లిమిటెడ్, ఎమామి పేపర్ మిల్స్ లిమిటెడ్ మరొయు పోలార్ ఫార్మా ఇండియా లిమిటెడ్ వంటి బృహత్తర పరిశ్రమలు జిల్లా ఆర్థికరంగానికి పెద్ద ఎత్తున సకకరిస్తున్నాయి.

ప్రైవేట్ పరిశ్రమలు

[మార్చు]

ప్రభుత్వాధీన పరిశ్రమలతో ప్రైవేట్ సంస్థలు కూడా జిల్లాలోని పారిశ్రామికాభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారు. ఈ పరిశ్రమలు ప్రాంతీయవాసులకు ఉపాధిని కల్పించడమేగాక ఎగుమతులను అధికం చేయడం ద్వారా జిల్లాకు అదనపు ఆదాయాన్ని ఇస్తున్నాయి.

విద్య

[మార్చు]
  • పబ్లిక్ పాఠశాలలు: ఆధునిక పబ్లిక్ స్కూల్, కేంద్రీయ విద్యాలయ, మహర్షి విద్యా మందిర్, సెయింట్ థామస్ కాన్వెంట్ స్కూల్
  • పబ్లిక్ కళాశాలలు: ఫకీర్ మోహన్ కాలేజ్, కుంతల కుమారి సబాత్ ఉమెన్స్ కాలేజ్
  • యూనివర్సిటీ: స్త్రీ విశ్వవిద్యాలయం

విభాగాలు

[మార్చు]

బాలాసోర్ జిల్లా 2 ఉపవిభాగాలు, 12 మండలాలుగా విభజించబడ్డాయి. జిల్లాలో 7 తాలూకాలు, 289 గ్రామపంచాయితీలు ఉన్నాయి. జిల్లాలో 4 పట్టణాలు, 1 ముంసిపాలిటీ , 3 ఎన్.ఎ.సిలు ఉన్నాయి. జిల్లాలో 2971 గ్రామాలు ఉన్నాయి. వీటిలో 2602 నివాసిత గ్రామాలు కాగా మిగిలినవి నిర్జన గ్రామాల

బ్లాకులు

[మార్చు]

జిల్లాలో బ్లాకులు:-

  1. బాలాసోర్ ఉపవిభాగం -బహనంగ, బలెసోర్, బలియపల్, బస్త, భొగ్రై, దేవాయలము, ఖైర, రెమున, సిముల, సొరొ.
  2. నీలగిరి ఉపవిభాగం - నీలగిరి, ఔపద.

తాలూకాలు

[మార్చు]

తాలూకాలు, బాలాసోర్, భొగ్రై, బలియపాల్, బస్త, జలేశ్వర్, నిలగిరి, సిములియ, సోరో, రెమున & ఖైర. .

ప్రయాణసౌకర్యాలు

[మార్చు]
  • చెన్నై నుండి కొలకత్తా రైలు మార్గంలో బాలాసోర్ రైలు స్టేషను ఉంది.
  • జాతీయ రహదారి 5 , జాతీయరహదారి -60 బాలాసోర్ జిల్లాను కొలకతా నగరంతో అనుసంధానం చేస్తున్నాయి.
  • భువనేశ్వర్ , కొలకత్తా లలో ఉన్న విమానాశ్రయానికి దాదాపు 3.30 గంటల కారుప్రయాణ కాలంలో చేరుకోవచ్చు.
  • భువనేశ్వర్ , కొలకత్తాల మధ్య పాయింటు టు పాయింటు సర్వీసులను నడుపుతున్న రాష్ట్రీయ ఒ.టి.డి.సి బసులు బలాసోర్ మీదుగా ప్రయాణిస్తాయి.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,317,419,[1]
ఇది దాదాపు. లత్వియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 195వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 609 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 14.47%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 957:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 80.66%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

భాషలు

[మార్చు]

జిల్లాలో ప్రధానంగా ఒరియా భాష వాడుకలో ఉంది. తరువాత స్థానంలో ఉన్న భుంజియా భాషను దాదాపు 7,000 మంది భుంజియా ఆదివాసీలు మాట్లాడుతుంటారు. [4] తరువా స్థానంలో శాంతల్ భాష ఉంది.

కళలు , సంస్కృతి

[మార్చు]
Sari draping style of Balasore region

బాలాసోర్ జిల్లాకు కళలు, సంప్రదాయం , సంస్కృతి కలగలిసిన అద్భుతమైన చరిత్ర ఉంది. జిల్లాలో పలు సుందర ప్రదేశాలు , అందమైన ఆలయాలు ఉన్నాయి. జిల్లాలో హిందువులు, ముస్లిములు, సిక్కులు, క్రైస్తవులు మొదలైన విభిన్న మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. జిల్లాలో విభిన్న సంప్రదాయాల మతవిశ్వాసాల మిశ్రిత వాతావరణం కనిపిస్తుంది. జిల్లాలోని భొగ్రై వద్ద లభించిన రాగినాణ్యాలు , ఆవన, కుపారి , అయోధ్య వద్ద లభించిన బౌద్ధ శిల్పాలు ఈ ప్రాంతంలో బుద్ధిజం ఉందని భావించడానికి నిదర్శనంగా ఉన్నాయి. భౌమాకర్ కాలంలో బుద్ధిజం ప్రాబల్యంలో ఉంది. జలేశ్వర్, ఆవన , బాలాసీర్ లలో ఉన్న మహావీరుని శిల్పాలు ఈ ప్రాంతంలో జైనిజం ఉన్నదని తెలియజేస్తున్నాయి. 10-11 శతాబ్ధాలలో ఈ ప్రాంతంలో జైనిజం శక్తివంతంగా ఉంది.

శైవం

[మార్చు]

బాలాసోర్ జిల్లా సైబపీఠం చాలా ప్రాముఖ్యత కలిగినది. జిల్లా అంతటా పలు శివాలయాలు ఉన్నాయి. వీటిలో చందనేశ్వర్, బనేశ్వర్, ఝదేశ్వర్, పనచలింగేశ్వర్, భూసందేశ్వర్ , మణినాగేశ్వర్ వద్ద ఉన్న శివాలయాలు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

శక్తిపీఠం

[మార్చు]

జిల్లాలో శక్తిపీఠాలు కూడా ఉన్నాయి. సజనాఘర్ వద్ద " భుధర్ చంఢీ, ఖాంతపరా వద్ద " దండకపరా , ఖర్జురేశ్వర్ వద్ద చంఢీ మందిర్ ఉన్నాయి. అయోధ్య, సెరాఘర్, నీలగిరి, , భర్ధన్‌పూర్‌ల వద్ద సూర్యాలయాలు ఈ ప్రాంతంలో సూర్యారాధకులు ఉన్నారని తెలియజేస్తున్నాయి. గుప్తుల కాలంలో ఈ ప్రాంతంలో వైష్ణవం ప్రాముఖ్యత సంతరించుకుంది. జిల్లాలోని ఖిరొచోరా ఆలయం (రెండవ నరసింగదేవా కాలంలో నిర్మించబడింది ) ఇతర వైష్ణవాలయాలు జిల్లా ప్రజల సాంస్కృతిక వైవిధ్యానికి నిదర్శనంగా ఉన్నాయి.

జగన్నాథ ఆలయాలు

[మార్చు]

బాలాసోర్ పట్టణ కేంద్రంలో రెండు జగన్న్నథ ఆలయాలు , నీలగిరి, మంగల్పూర్, గుడ్, జలేశ్వర్, కమర్ద, డ్యులిగన్ , బలిపల్ వద్ద జగన్నాథ ఆలయాలు జిల్లా మత సంప్రదాన్ని వివరిస్తున్నాయి. జిల్లాలో పలు మసీదులు, చర్చిలు, గురుద్వారా (రెమునా వద్ద) ఉన్నాయి. జిల్లాలో పలు మతాలకు చెందిన సంప్రదాయాలు ఉన్నాయి.

.

పండుగలు

[మార్చు]

జిల్లాలో మకర సంక్రాంతి, రాజ సంక్రాంతి, గంగామేళా, దుర్గా పూజ, కాళీపూజ, గణేశ్ చతుర్ధి, సరస్వతీ పూజ, లక్ష్మీ పూజ, బిష్వకర్మా పూజ, చందన్ సెస్టివల్, రథయాత్ర, డోలా పూర్ణిమ, ఈద్, మొహరం, క్రిస్మస్ మొదలైన పండుగలు ఉత్సాహపూరితంగా జరుపుకుంటారు. జిల్లాలో " అఖడా " క్రీడను హిదువులు దుర్గాపూజ సమయంలో ముస్లిములు మొహరం సమయంలో చాలా ఉత్సాహంగా , సంతోషంగా నిర్వహిస్తుంటారు. ఒడిషా రాష్ట్ర విభజన సమయంలో బాలాసోర్ జిల్లా ప్రజలు భాషోధ్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. వైస కబి ఫకీర్ మోహన్ సేనాపతి కృషితో " బోదాధ్యాయినీ" , " బాలాసోర్ సంబాద్ బాహిక " వంటి పత్రికా ప్రచురణ , ఒరియా భాషోధ్యమ బీజాలు నాటడం , ఒరియా సాహిత్య అభివృద్ధి సాధ్యమైంది.

సాహిత్యం

[మార్చు]

ఒడిషా సాస్కృతిక చరిత్ర రాజా బైకుంట నాథ్ దేవ్ సేవను ఒడిషాను ప్రత్యేక భూభాగంగా గుర్తించడానికి , ఒడిషా సాహిత్యం , భాషను సుసంపన్నం చేయడానికి విస కబి ఫకిర్ మోహన్ , రై బహదూర్ రాధా చరణ్ దాస్ చేసిన కృషిని ఎన్నటికీ మరువదు.

ప్రముఖులు

[మార్చు]

ఆహారం

[మార్చు]

బాలాసోర్ జిల్లాలో సంప్రదాయకమైన , రుచికరమైన ఆహారాలు ఉన్నాయి. బలృశ్వర్ లోని గజా పిథాతయారీకి పేరుపొందింది. సముద్రతీర ప్రాంతంగా ఉప్పునీటి చేపలు , మంచినీటి చేపలు ఒరియా ఆహారసస్కృతిలో ప్రధానపాత్ర వహిస్తున్నాయి. మచ్చా ఘంటా, మచ్చా బెసరా, చునా మచ్చా ఖటా, మచ్చా భాజా వంటి చేపల వంటకాలు ఒడిషా ప్రజల అభిమాన ఆహారాలలో భాగస్వామ్యం వహిస్తున్నాయి. జిల్లా అంతటా ఒడిషా డిసర్ట్‌ సంబంధిత తీపి వంటకాలు లభ్యమౌతూ ఉంటాయి.

పర్యాటకం

[మార్చు]
Gautama Buddha in Marichi Temple, Ayodha, Baleswar

ఈశాన్య సముద్ర తీరప్రాంత జిల్లా అయిన బాలాసోర్ ప్రకృతి సౌనర్యం పర్యాటకులను అధింకంగా ఆకర్షించడం వలన పర్యాటకప్రదేశంగా కూడా ప్రసిద్ధి చెందింది. బాలాసోర్ జిల్లా " సీనరీస్ ఆఫ్ ఒడిషా"గా గుర్తించబడుతుంది. జిల్లాలోని చండీపూర్, తలసారి బీచ్, చౌముఖ, , డగ్రా (బలేశ్వర్), కస్పల్ , ఖరసహపూర్‌లలో పచ్చని వరి పొలాలు, నదీప్రవాహాలు. నీలివర్ణ పర్వతాలు, విశాలమైన పచ్చికబయళ్ళు , సుందర సముద్రతీరాలు ఉన్నాయి.

రాయ్బనియా కోట

[మార్చు]

లక్ష్మన్నథ్ వద్ద తూర్పు గంగారాజులలో ఒకడైన రాజా లంగులా నరసింహదేవా నిర్మించిన రాయ్బనియా కోటల సమూహం ఉంది. దీనిని ఒడిషాలోకి మొగలుల చొరబాటును అడ్డుకోవడానికి సరిహద్దులో రక్షణగా నిర్మించారు.[5][6]

ఆలయాలు

[మార్చు]

జిల్లాలో రెమునలోని ఖిరచొర గోపీనథ ఆలయం, పంచలింగగేష్వర్, భుధర చండి ఆలయం, సజనగర్హ్, మరీచి ఆలయం, చందనేస్వర్, అయోద్య (బలేస్వర్), అభనలో బ్రాహ్మణి ఆలయం, భర్ధంపుర్ వద్ద నీలగిరి, మనినగేస్వర్ ఆలయం, జగన్నాథ ఆలయం వంటి అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. , తల్సరి సముద్రతీరం చాలా ప్రత్యేక అనుభవం అందించే అత్యంత ప్రశాంతమైన ప్రదేశం. సిమిలపల్ ఫారెస్ట్ అభయారణ్యం , నీలగిరి అభయారణ్యాలు ప్రకృతి ప్రేమికులకు సెలవులను గడపటానికి అవసరమైన వసతి సౌకర్యాలు అందిస్తున్నాయి. దెషూన్ పొఖరి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం.

Panoramic view of Kuldiha sanctuary

రాజకీయాలు

[మార్చు]

The district has 1 Loksabha constituency and 7 vidhan sabha constituencies.

అసెంబ్లీ నియోజక వర్గాలు

[మార్చు]

The following is the 8 Vidhan sabha constituencies[7][8] of Balasore district and the elected members[9] of that area

క్ర.సం నియోజకవర్గం రిజర్వేషను పరిధి 14 వ శాసనసభ సభ్యులు పార్టీ
35 జలేశ్వర్ లేదు జలేశ్వర్ (ఎన్.ఎ.సి), జలేశ్వర్, బస్తా (భాగం) దేబిప్రసన్నా చంద్ INC
36 భోగరై లేదు భోగరై అనంత దాస్ బి.జె.డి
37 బస్తా లేదు బలియపాల్, బస్తా (భాగం) రఘునాథ్ మొహంతు బి.జె.డి
38 బాలాసోర్ లేదు బాలాసోర్ (ఎం), బాలాసోర్ (భాగం) జిబాన్ ప్రదీప్ దాష్ బి.జె.డి
39 రెమునా షెడ్యూల్డ్ కులాలు రెమునా, బాలాసోర్ (భాగం) సుదర్షన్ జెనా బి.జె.డి
40 నీలగిరి లేదు నీలగిరి (ఎన్.ఎ.సి), జీలగిరి, ఔపద, భహంగ (భాగం) ప్రతాప్ చంద్ర సారంగి స్వతంత్ర
41 సోరో షెడ్యూల్డ్ కులాలు సోరో (ఎన్.ఎ.సి), సోరో, బహంగ (భాగం) సురేంద్ర ప్రసాద్ ప్రమంక్ ఐ,ఎన్.సి
42 సిముల లేదు సిముల ఖైర పర్సురాం పాణిగ్రాహి బి.జె.డి

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179
  4. M. Paul Lewis, ed. (2009). "Bhunjia: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.
  5. Stirling's Orissa p. 77
    "The boldnes and enterprise of the Oriya monarchs in those days, may surprise us when we consider the situation of Kola in the heart of Central India beyond Kalberga and Bedar".
  6. THE FORT OF BARABATI Archived 2016-09-10 at the Wayback Machine. Dr H.C. Das. pp.3
  7. Assembly Constituencies and their EXtent
  8. Seats of Odisha
  9. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013. MEMBER NAME

వెలుపలి లింకులు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]