క్షిపణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

క్షిపణి అంటే తనంతట తానుగా ఎగరగలిగిన ఒక ఆయుధం. ఇవి రాకెట్ల ద్వారా లేదా జెట్ యంత్రాల ద్వారా పైకి ఎగురుతాయి. ఇవి సాధారణంగా విస్ఫోటనం చెందగల వార్ హెడ్లను కలిగి ఉంటాయి.

రెండవ ప్రపంచ యుద్ధం కోసం నాజీలు మొట్టమొదటి సారిగా క్షిపణుల్ని తయారు చేశారు. వీటిలో బాగా ప్రాచుర్యం పొందినవి వి1 ఫ్లైయింగ్ బాంబ్, వి2 ఫ్లైయింగ్ బాంబ్. ఇవి యాంత్రికంగా ముందుగా నిర్దేశించబడిన పథంలో ప్రయాణించేలా రూపకల్పన చేయబడ్డాయి.

చరిత్ర

[మార్చు]

నిర్దేశక వ్యవస్థ

[మార్చు]

క్షిపణులకు చాలా రకాలుగా గమ్యాలను నిర్దేశించవచ్చు. బాగా వాడుకలో ఉన్న పద్ధతి ఇన్‌ఫ్రారెడ్, లేజర్లు, రేడియో తరంగాలు వాడటం. ఈ తరంగాలు గమ్యం నుంచీ ఉత్పత్తి అవుతుండవచ్చు లేదా క్షిపణిలోనే నిర్మితమై ఉండవచ్చు లేదా మధ్యవర్తుల ద్వారా రావచ్చు.

రకాలు

[మార్చు]

క్షిపణులను, వాటిని ప్రయోగించే ప్లాట్‌ఫారము, ఛేదించే లక్ష్యాలనూ బట్టి వర్గీకరిస్తారు. స్థూలంగా చెప్పాలంటే ఇవి భూతలం (నేల లేదా నీరు), గాలి అనే రెండు వర్గాలుగా చెప్పవచ్చు. వీటి లక్ష్యాన్ని బట్టి (ఉదా: ట్యాంకు ఛేదక, నౌకా ఛేదక) ఉపవర్గాలుగా విభజించవచ్చు. చాలా క్షిపణులు భూతలం నుండి, గాల్లోనుండీ కూడా ప్రయోగించేలా రూపొందించారు. కొన్ని క్షిపణులు భూతల లక్ష్యాలను, గాల్లోని లక్ష్యాలనూ కూడా ఛేదించ గలవు.

భూమి నుండి భూమికి/గాలి నుండి భూమికి

[మార్చు]

బాలిస్టిక్ క్షిపణి

[మార్చు]
An R-36 ballistic missile launch at a Soviet silo

బాలిస్టిక్ క్షిపణులు, బూస్టరు దశను దాటాక, బాలిస్టిక్ పథంలో ప్రయాణిస్తాయి. ఎక్కువగా వీటిని భూతలంపైని లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగిస్తారు. అణ్వయుధాలను మోసుకెళ్ళే వాటితో పాటు సాంప్రదాయిక ఆయుధాలను మోసుకెళ్ళే బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి.

వీటి కచ్చితత్వం తక్కువగా ఉంటుంది. అయితే ఇంర్షియల్ నేవిగేషన్ వువస్థ వంటి ఆధినుక సాంకేతికత అందుబాటులోకి వచ్చాక, కచ్చితత్వం పెరిగింది. ప్రాథమికంగా ఈ క్షిపణులను భూతలం నుండి ప్రయోగిస్తారు. అందుకుగాను మొబైలు లాంచర్లు, సైలోలు, ఓడలు, జలాంతర్గాములనూ వాడుతారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న బాలిస్టిక్ క్షిపణుల్లో రష్యాకు చెందిన తొపోల్ ఎమ్ అత్యంత వేగవంతమైనది (7,320 మీ/సె). The Russian Topol M (SS-27 Sickle B) is the fastest (7,320 m/s) missile currently in service.[1]

క్రూయిజ్ క్షిపణి

[మార్చు]
అమెరికా వారి టోమహాక్ క్రూయిజ్ క్షిపణి
భారత సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్

క్రూయిజ్ క్షిపణులు నేలపైని లక్ష్యాలను, నీటిపైని లక్ష్యాలనూ ఛేదించేందుకు వాడుతారు. వీటిని ప్రాథమికంగా నీటిపైన, నీటిలోపల, గాలిలోనుండీ ప్రయోగిస్తారు. నేలపైనుండి ప్రయోగింఛే లాంచర్లు కూడా ఉన్నాయి.

నౌకా ఛేదక

[మార్చు]

ట్యాంకు ఛేదక

[మార్చు]

నేలపై నుండి గాల్లోకి

[మార్చు]

విమాన ఛేదక

[మార్చు]

బాలిస్టిక్ క్షిపణి ఛేదక

[మార్చు]

గాల్లో నుండి గాల్లోకి

[మార్చు]

ఉపగ్రహ ఛేదక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "World's military powers". The Independent. Archived from the original on 2010-05-30. Retrieved 2016-09-25.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=క్షిపణి&oldid=3846585" నుండి వెలికితీశారు