నాగ్ క్షిపణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగ్
Nag with NAMICA Defexpo-2008.JPG
Nag missile with the NAMICA in the background. Picture taken during DEFEXPO-2008.
రకంAnti-tank guided missile
అభివృద్ధి చేసిన దేశంIndia
సర్వీసు చరిత్ర
సర్వీసులో2015[citation needed]
వాడేవారుSee Operators
ఉత్పత్తి చరిత్ర
తయారీదారుBharat Dynamics Limited (BDL)
విశిష్టతలు
బరువు42 కి.గ్రా. (93 పౌ.)
పొడవు1.90 మీ. (6 అ. 3 అం.)
వ్యాసం190 mమీ. (7.5 అం.)
వార్‌హెడ్8 కి.గ్రా. (18 పౌ.) tandem warhead[citation needed]

ఇంజనుTandem solid Propulsion
(Nitramine based smokeless extruded double base sustainer propellant)[citation needed]
వింగ్‌స్పాన్400 mm[citation needed]
ఆపరేషను
పరిధి
Land version: 500m to 4km (Air-launched: 7-10km)[1]
వేగం230 m/s[citation needed]
గైడెన్స్
వ్యవస్థ
Active Imaging infra-red (IIR) seeker,
millimetric wave (mmW active radar homing seeker (under development)[citation needed]
లాంచి
ప్లాట్‌ఫారం
నాగ్ క్షిపణి వాహనం (NAMICA)
HAL Dhruv Helicopter
HAL Light Combat Helicopter

నాగ్, భారత్ అభివృద్ధి చేసిన మూడవ తరం ట్యాంకు విధ్వంసక క్షిపణి.[2] భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, తన సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం (IGMDP) ద్వారా అభివృద్ధి చేసిన ఐదు క్షిపణుల్లో నాగ్ ఒకటి. దీన్నిరూ.300 కోట్ల ఖర్చుతో  అభివృద్ధి చేసారు.[3]

సాంకేతికాంశాలు[మార్చు]

క్షిపణి యొక్క NAMICA (నాగ్ మిస్సైల్ కారియర్) రూపం లాక్-బిఫోర్-లాంచ్ వ్యవస్థను కలిగి ఉంది. ఈ వ్యవస్థలో క్షిపణి ప్రయోగానికి ముందే లక్ష్యాన్ని గుర్తించి ఉంచుతారు. లక్ష్యాన్ని గుర్తించే వ్యవస్థ "చూసి గుర్తించడం"పై ఆధారపడి ఉంటుంది కాబట్టి, దీని పరిధి పరిమితంగా ఉంటుంది. అయితే, HELINA (హెలికాప్టర్ లాంచ్‌డ్ నాగ్) రూపం లాక్-ఆఫ్టర్-లాంచ్ వ్యవస్థను వాడుతుంది కాబట్టి, దీని పరిధి 7 క్.మీ. వరకూ ఉంటుంది. ఈ పరిస్థితిలో, క్షిపణిని లక్ష్యం దిశగా గురిచూసి ప్రయోగిస్తారు. అది లక్ష్యాన్ని సమీపిస్తూండగా, ఎదుట ఉన్న ప్రదేశపు చిత్రాలను ఆపరేటరుకు పంపిస్తుంది. తద్వారా ఆపరేటరు శత్రు ట్యాంకులను గుర్తించగలడు. ఏదైనా ట్యాంకును గురిచేసి, లాక్ చేసే ఆదేశాన్ని ఆపరేటరు క్షిపణి సీకరుకు పంపిస్తాడు. ఆ తరువాత క్షిపణి లక్ష్యాన్ని గురి చేసి, ఛేదిస్తుంది.[1]

మెరుగైన కూర్పులు[మార్చు]

నాగ్ క్షిపణి తల భాగం వద్ద ఉన్న ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ (IIR) సీకర్
లోపలి దృశ్యం

ప్రాథమికమైన భూతల, హెలికాప్టరు రకాలతో పాటు, అనేక ఇతర ఉన్నత, మెరుగైన రకాలను కూడా DRDO తయారుచేస్తోంది:

హెలినా[మార్చు]

హెలినా, (హెలికాప్టర్ లాంచ్‌డ్ నాగ్) కు  7- 8 కి.మీ. పరిధి ఉంది. దీన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వారి ధ్రువ్, లైట్ కాంబాట్ హెలికాప్టర్ నుండి ప్రయోగించవచ్చు. స్ట్రక్చరు పరంగా ఈ క్షిపణి నాగ్ కంటే విభిన్నంగా ఉంటుంది. నాగ్ లాగానే ఇది కూడా  లక్ష్యాన్ని చూసేందుకు  IIR సీకరును వాడుతుంది. వీటిని ప్రయోగించేందుకు అవసరమైన లాంచర్లను సిద్ధం చేసి, హెచ్.ఏ.ఎల్ కు పరీక్షార్థం అందించారు. 

2010 అంతానికల్లా హెలినాను పరీక్షించాలని భావించారు. 2011 లో మొదటి భూతల పరీక్షను నిర్వహించారు. దీనిలో ఒక లక్ష్యాన్ని  కేంద్రీకరించి, ప్రయోగించారు. క్షిపణి ప్రయాఅణంలో ఉండగా, లక్ష్యాన్ని మార్చి మరో లక్ష్యాన్ని ఎంచుకున్నారు. క్షిపణి లక్ష్యాన్ని ఛేదించి, క్షిపణి సామర్థ్యాఅన్ని నిరూపించింది. 2014 లో హెలినాను ధ్రువ్ ద్వారా ప్రయోగించి పూర్తి 7 కి.మీ. పరిధిలో పరీక్షించారు.[4]

2015 జూలై 13 న రాజస్థాన్ లోని జైసల్మీర్‌లో మూడు రౌండ్ల పరీక్షలు జరిపారు. రుద్ర నుండి ప్రయోగించిన ఈ మూడు క్షిపణుల్లోను  రెండు 7 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగా, మూడోది లక్ష్యాన్ని చేరలేదు.[5]

భూతల కూర్పు[మార్చు]

భూతలం నుండి ప్రయోగించే నాగ్ క్షిపణి పరిధిని పొడిగించేందుకు దాని లాంచరును 5 మీ. ఎత్తైన మాస్టు పైనుంచి ప్రయోగించారు. దీనితో క్షిపణి పరిధిని  7-8 కి.మీ. కు పొడిగించగలిగారు.[మూలాలు తెలుపవలెను]

గాలిలో నుండి ప్రయోగించే కూర్పు[మార్చు]

జాగ్వార్ IS విమానం నుండి ప్రయోగించే నాగ్ క్షిపణికి 10 కి.మీ. పరిధి ఉంటుంది. విమానపు ముక్కు భాగంలో అమర్చిన  మిల్లీమెట్రిక్-వేవ్ యాక్టివ్ రాడార్ సీకరు ద్వారా ఇది లక్ష్యాన్ని  చూస్తుంది.

మనిషి మోసుకెళ్ళగలిగే కూర్పు [మార్చు]

మనిషి మోసుకెళ్ళగలిగే నాగ్ కూర్పును తయారుచేసేందుకు DRDL పనిచేస్తోంది. దీని బరువు 14 కి.గ్రా. లోపు ఉంటుంది.[6]

నామికా[మార్చు]

నామికా (నాగ్ మిస్సైల్ కారియర్), భారత సైన్యం కోసం తయారుచేసిన ట్యాంకు విధ్వంసక వ్యవస్థ. లక్ష్యాన్ని చూసేందుకు గాను  దీనిలో థర్మల్  ఇమేజరును అమర్చారు. నామికా అనేది మార్పులు చేసిన BMP-2 IFV. దీన్ని భారత్‌లో "శరత్" పేరుతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ వాహనం 14.5 టన్నుల బరువుతో, నీటిలో 7 కి.మీ./గం వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది 12 క్షిపణులను మోసుకెళ్ళగలదు. వీటిలో 8, పేల్చేందుకు సర్వసిద్ధంగా ఉంటాయి. 2008 లో నామికా వాహనాన్ని 155 కి.మీ. రవాణా పరీక్షలు జరిపారు.[7]

స్థితి[మార్చు]

2010 జూలై 6 న నాగ్ వాడుకరి పరీక్షలు జరిగాయి. మరిన్ని పరీక్షల తరువాత నాగ్‌ను భారత సైన్యం లోకి చేర్చుకునే ప్రతిపాదన ఉంది.[8] అయితే 2012 ఆగస్టులో రాజస్థాన్‌లో చేసిన చివరి వాడుకరి పరీక్షను మార్పులు చేసిన లాంచ్‌ప్యాడు నుండి చెయ్యగా అది విఫలమైంది.[మూలాలు తెలుపవలెను]

2009 జూలైలో నాగ్ ట్యాంకు వ్యతిరేక గైడెడ్ క్షిపణి (ATGM) ఉత్పత్తికి అనుమతి లభించింది.[9] 

వాడుకదారులు[మార్చు]

 India

2011 నాటికి 450 నాగ్ క్షిపణులు, 13 నామికా వాహనాలతో సహా సైన్యంలోకి చేర్చాల్సి ఉంది. అయితే రాజస్థాన్‌లో జరిపిన వాడుకరి పరీక్షల్లో వైఫల్యాల తరువాత ఇది కొంతకాలంపాటు వాయిదా పడింది.[10] 7000 నాగ్ క్షిపణులు, 200 నామికాల అవసరం ఉన్నట్లుగా సైన్యం తన ప్రణాళికలో చూపింది.[11]

విశేషాలు[మార్చు]

దాడి స్థితి: లాక్-బిఫోర్-లాంచ్ ; పైనుంచి దాడి సీకర్: IIR, మిల్లీమెట్రిక్ వేవ్ (mmW)  మొదటి దాడి ఛేదన సంభావ్యత: 0.77

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 Ajai Shukla (8 March 2010). "Army opts for Nag missile as it enters final trials". Retrieved 6 February 2015. CS1 maint: discouraged parameter (link)
 2. Kalam's unrealised 'Nag' missile dream to become reality next year. (30 July 2015). URL accessed on 30 July 2015.
 3. "Nag anti-tank missile back in reckoning". Archived from the original on 2012-10-21. Retrieved 2016-12-21.
 4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2016-12-21.
 5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-09-23. Retrieved 2016-12-21.
 6. Helicopter version of Nag under way. The Hindu Business Line. URL accessed on 6 February 2015.
 7. Nag missile testfired. The Hindu. URL accessed on 6 February 2015.
 8. [1]
 9. India Clears Anti-Tank Nag Missile for Production. URL accessed on 6 February 2015.
 10. "Nag's final validation trials completed". The Hindu. Chennai, India. 16 July 2010.
 11. "Nag waits for sweetheart NAMICA". Express News Service. Bangalore/Hyderabad, India. 23 December 2011. Archived from the original on 7 మార్చి 2016. Retrieved 21 డిసెంబర్ 2016. Check date values in: |access-date= (help)

బయటి లింకులు[మార్చు]