త్రిశూల్ క్షిపణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్రిశూల్
రకంభూమి నుండి గాల్లోకి
అభివృద్ధి చేసిన దేశంIndia
సర్వీసు చరిత్ర
వాడేవారుIndian Armed Forces
ఉత్పత్తి చరిత్ర
తయారీదారుభారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO)
Bharat Dynamics Limited (BDL)
విశిష్టతలు
బరువు130 kg (290 lb)
పొడవు3.1 m (10 ft)

ఇంజనుఒకే దశ ఘన ఇంధనం[1]
ఆపరేషను
పరిధి
9 km (5.6 mi)[2]

త్రిశూల్ తక్కువ పరిధి గల, భూమి నుండి గాల్లోకి ప్రయోగించే క్షిపణి. దీన్ని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసింది. సముద్ర తలాన్ని తాకుతూ ప్రయాణించి ఓడలపై దాడి చేసే సీ స్కిమ్మర్ క్షిపణులకు వ్యతిరేకంగా కూడా ఈ క్షిపణిని ప్రయోగించవచ్చు.[1]

చరిత్ర, అభివృద్ధి[మార్చు]

త్రిశూల్ క్షిపణి ప్రాజెక్టు 1983 లో సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మొదలైంది. దాన్ని 1992 లో పూర్తిచేసి, క్షిపణిని సీ స్కిమ్మర్  వ్యతిరేక క్షిపణిగా బ్రహ్మపుత్ర తరగతి ఫ్రిగేట్లలో అమర్చాలని ప్రణాళిక.[3] 1985 లో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో  త్రిశూల్ తన మొదటి గైడెన్స్-లేని ప్రయాణం చేసింది. 1989 లో పూర్తి పరిధి గైడెడ్ ప్రయాణం చేసింది. 1992 లో లక్ష్యం మీద దాడి చేసే పరీక్షను విజయవంతంగా చేసింది. ఈ పరీక్షలో త్రిశూల్ మ్యాక్ 2 వేగాన్ని అందుకుంది.[3] 1997 లో సంబంధిత సీస్కిమ్మర్ క్షిపణులను కనిపెట్టే రాడార్ వ్యవస్థలు సిద్ధమయ్యాయి. లాంచి వ్యవస్థను  భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 1998 లో తయారు చేసింది.[3]

బ్రహ్మపుత్ర తరగతి ఫ్రిగేట్ల కోసం త్రిశూల్‌ను అభివృద్ధి చెయ్యడంలో జరుగుతున్న ఆలస్యంపై 1997 లో భారతీయ నౌకా దళం తన అసంతుష్టిని తెలియజేసింది. దానికి ప్రత్యామ్నాయంగా నౌకా దళం ఇజ్రాయిల్‌కు చెందిన బరాక్-1 క్షిపణిని ఎంచుకుంది.[3] 1998 నాటికి క్షిపణి 24 పరీక్షలు జరుపుకుని 1999 లో భారత సైన్యం, భారతీయ వాయు సేనలలో చేరింది.[4] 

2001 అక్టోబరులో DRDO ఈ క్షిపణిని సమీక్షించింది. క్షిపణి వ్యవస్థ లో లోపాలు కనుక్కొంది. ట్రాకింగు రాడార్ బీముకు మధ్యమధ్యలో అవాంతరాలు వస్తున్నాయని, అందుచేత క్షిపణి లక్ష్యాన్ని ఛేదించలేదనీ కనుక్కొంది. సైన్యానికి అవసరమైన నాణ్యతా ప్రమాణాలు లేవని కూడా తెలిపింది.[5] 2002 లో నేవీ రకం సీ స్కిమ్మరు లాగా పరీక్షించారు.[4] 2003 లో భారత ప్రభుత్వం ఈ క్షిపణిని ఇతర ప్రాజెక్టుల నుండి తప్పించి, ఇది కేవలం సాంకేతిక ప్రదర్శన అని ప్రకటించింది. 2005 లో క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు.[6] త్రిశూల్ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం 282 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 2008 లో త్రిశూల్ కార్యక్రమాన్ని మూసేస్తున్నట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.[7]

లక్షణాలు[మార్చు]

త్రిశూల్ పరిధి 9 కిమీ [5] దాని బరువు 130 కెజి. 15 కెజి వార్‌హెడ్‌ను అది మోసుకుపోగలదు. అది సూపర్‌సోనిక్ వేగంతో పోతుంది.

మూలలు వనరులు[మార్చు]

  1. 1.0 1.1 About Trishul. DRDO.
  2. "Trishul has a range of 9 km". FAS. Retrieved 30 November 2015.
  3. 3.0 3.1 3.2 3.3 Indian navy missile defence. indiadefencereview.com.
  4. 4.0 4.1 Trishul missile. globalsecurity.org.
  5. 5.0 5.1 DRDO's Integrated Guided Missile Development Programme. ipcs.org.
  6. "India Successfully Tests Trishul Missile". spacewar.com. 8 December 2005.
  7. "Govt announces closure of work on Trishul missile". Times of India. 27 February 2008.