బరాక్ 8

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బరాక్ 8/ ఎల్‌ఆర్-శామ్‌/ ఎమ్ఆర్-శామ్‌
Salon du Bourget 20090619 077.jpg
రకంLong-range surface-to-air missile
అభివృద్ధి చేసిన దేశంIndia, Israel
సర్వీసు చరిత్ర
సర్వీసులోInduction Phase[1]
వాడేవారుIndian Navy
Indian Air Force
Israeli Navy
ఉత్పత్తి చరిత్ర
డిజైనరుఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ
తయారీదారుRafael Advanced Defense Systems[2]
Bharat Dynamics Limited[3]
విశిష్టతలు
బరువు275 కి.గ్రా. (606 పౌ.)[4]
పొడవు4.5 మీ. (180 అం.)[4][5]
వ్యాసం0.225/0.54 m[4][5][6]
పేలుడు
మెకానిజమ్
Proximity (60 kg warhead)[4]

ఇంజనురెండు దశల పొగరాని పల్స్‌డ్ రాకెట్ మోటారు
వింగ్‌స్పాన్0.94 m[4][5]
ఆపరేషను
పరిధి
0.5–90km,[7][8] some media reports indicate a capability of 100km[9][10]
ఫ్లైట్ సీలింగు0–16 km[4][5]
వేగంMach 2 (680 m/s)[4]
గైడెన్స్
వ్యవస్థ
లాంచి
ప్లాట్‌ఫారం

బరాక్ 8 (హీబ్రూలో మెరుపు అని అర్థం) భారత ఇజ్రాయిలు దేశాల సంయుక్త క్షిపణి. ఇది సుదూర లేదా మధ్యమ శ్రేణి భూమి నుండి గాల్లోకి పేల్చే క్షిపణి రకానికి చెందినది.[12][13][14] దీన్ని విమానాలు, హెలికాప్టర్లు, నౌకా విధ్వంసక క్షిపణులు, మానవరహిత విమానాలు, బాలిస్టిక్ క్షిపణులను,[15]క్రూయిజ్ క్షిపణులను, యుద్ధవిమానాలనూ ఎదుర్కొనేలా తయారుచేసారు.[16] ఈ క్షిపణి యొక్క భూస్థిత, సాగర స్థిత కూర్పులు రెండూ కూడా ఉనికిలో ఉన్నాయి.[17]

బరాక్ 8 ని ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థలు, ఇజ్రాయిల్ ఆయుధాలు సాంకేతిక వ్యవస్థల నిర్వహణ సంస్థ, ఎల్టా సిస్టమ్స్, రఫేల్, మరికొన్ని ఇతర కంపెనీలు కలిసి సంయుక్తంగా తయారు చేసాయి. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ ఈ క్షిపణులను తయారు చేస్తుంది.

నేపథ్యం[మార్చు]

బరాక్ 8, బరాక్ 1 పై ఆధారపడి మెరుగైన సీకరుతో తయారు చేసిన క్షిపణి. దీని పరిధిని పెంచి సుమారుగా మధ్య పరిధి నౌకా వ్యవస్థలైన RIM-162 ESSM లేదా SM-2 స్టాండర్డ్ కు దగ్గరగా ఉంటుంది. 2009 జూలై 30 న ఇజ్రాయిల్ బరాక్ 2 క్షిపణిని జయప్రదంగా పరీక్షించింది. దీని రాడారు వ్యవస్థ 360 డిగ్రీల చూపు కలిగి, దాడికి వచ్చే శత్రు క్షిపణులను నౌకకు అతి దగ్గరలో - 500 మీటర్ల దూరంలో- కూల్చగలదు. ఒక్కో బరాక్ వ్యవస్థ (క్షిపణి కంటెయినరు, రాడారు, కంప్యూటర్లు, స్థాపన) సుమారు $2.4 కోట్లు ఉంటుంది.[18] 2009 నవంబరులో ఉన్నతీకరించిన బరాక్ 8 ఆకాశ రక్షక వ్యవస్థను సరఫరా చేసేందుకు ఇజ్రాయిల్ భారత్‌తో $1100 కోట్లకు ఒక ఒప్పందం కుదుర్చుకుంది.[19] 2017 మేలో భారత నౌకాదళం లోని నాలుగు నౌకల కోసం $63 కోట్ల ఆర్డరు వేసింది.[20]

రూపకల్పన[మార్చు]

బరాక్ 8 లాంచరు మాడ్యూలు

బరాక్ 8 4.5 మీ. పొడవు, 0.225 మీ. వ్యాసం కలిగి  at missile body, and 0.54 meters at the booster stage, రెక్కల వెడల్పు 0.94 మీ. కలిగి 275 కిలోల బరువు కలిగి ఉంటుంది. ఈ బరువులో 60 కిలోల వార్‌హెడ్ కూడా చేర్చి ఉంటుంది. ఈ వార్‌హెడ్ సమీపంలోకి రాగానే పేలుతుంది. క్షిపణి గరిష్ఠ వేగం మ్యాక్ 2,  గరిష్ఠ పరిధి 70 కి.మీ.,[21][22] పరిధిని తరువాతి కాలంలో 100 కి.మీ కు పెంచారు.[9][10] బరాక్ 8 లో డ్యుయల్ పల్స్ రాకెట్ మోటారు, థ్రస్ట్ వెక్టర్ కంట్రోలు ఉన్నాయి.[23] లక్ష్యాన్ని ఛేదించే లోపు అధిక స్థాయిలో విన్యాసాలు చెయ్యగలదు. అంత్య దశలో రెండవ మోటారు జ్వలిస్తుంది. ఈ దశలో యాక్టివ్ రాడార్ సీకరు చేతనమై, శత్రు లక్ష్యంపై గురిపెడుతుంది. ఆధునిక ఆకాశ రక్షణ వ్యవస్థతో చేర్చినపుడు, బరాక్ 8 ఏకకాలంలో బహుళ లక్ష్యాలకు గురిపెట్టగలదు.[11]

ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ బరాక్ 8 "ఉన్నతమైన సుదూర పరిధి గల క్షిపణి రక్షక, ఆకాశ రక్షక వ్యవస్థ" అని వివరిస్తూ దానికి కింది ప్రధాన విశేషాలున్నాయని తెలిపింది:[24]

 • సుదూర పరిధి
 • రెండు దిశల డేటా లింకు (GPS S band)
 • యాక్టివ్ రాడార్ సీకర్ క్షిపణి
 • 360 డిగ్రీల చూపు
 • నిట్టనిలువు లాంచి
 • ఏకకాలంలో అనేక లక్ష్యాలకు గురిపెట్టడం
 • పాయింట్ డిఫెన్స్ బాలిస్టిక్ ఛేదక క్షిపణి[25]

ఎమ్‌ఆర్ శామ్‌[మార్చు]

ఎమ్‌ఆర్ శామ్‌, ఈ క్షిపణి యొక్క భూస్థిత రూపం. దీనిలో కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, ట్రాకింగ్ రాడార్, క్షిపణి, మొబైల్ లాంచర్ వ్యవస్థలు ఉంటాయి. ఒక్కో లాంచరులో 8 క్షిపణులుంటాయి. వీటిని క్యానిస్టరు కాన్ఫిగరేషనులో ప్రయోగిస్తారు. ఈ వ్యవస్థలో అడ్వాన్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ కూడా ఉంటుంది.[26]

భారత సైన్యం ₹17,000 కోట్లతో ఐదు రెజిమెంట్లకు ఆర్డరు వేసింది. దీనిలో 40 లాంచర్లు, 200 క్షిపణులూ ఉంటాయి. వీటిని 2023 నాటికి మోహరిస్తారు.[27][28][29]

ఎల్‌ఆర్‌ శామ్‌ (బరాక్-8ER)[మార్చు]

బరాక్ 8 యొక్క ER (ఎక్స్టెండెడ్ రేంజి) రూపం అభివృద్ధిలో ఉందని తెలిసింది. దీని పరిధి 150 కి.మీ. వరకు పెంచుతారు. లాంచి సమయంలో ఉండే క్షిపణి పొడవును 4.5 మీ. నుండి 6 మీ. కు పెంచుతారు. బూస్టరును విసర్జించాక ఉండే పొడవు మౌలిక బరాక్-8 కంటే కొద్దిగా చిన్నదిగా ఉంటుంది. క్షిపణి వ్యాసము, రెక్కల పరిమాణం మాత్రం మారవు.

ఈ క్షిపణిని భారత నౌకాదళపు విశాఖపట్నం తరగతి విధ్వంసక నౌకలపై మోహరిస్తారు[30][31]

పరీక్షా ప్రయోగాలు[మార్చు]

బరాఅక్ 8 ను ప్రయోగిస్తున్న ఐఎన్‌ఎస్ కోల్‌కతా
 • 2010 మేలో బరాక్ 2 క్షిపణిని ఒక ఎలక్ట్రానిక్ లక్ష్యంపై జయప్రదంగా ప్రయోగించారు. ఆ ప్రయోగం దాని తొలి లక్ష్యాలను సాధించింది. రెండవ పరీక్షను అదే సంవత్సరం కూడా చెయ్యాల్సి ఉంది.[32] "ఇజ్రాయిల్‌తో కలిసి అభివృద్ధి చేస్తున్న ఈ క్షిపణిలో 70 శాతం పైచిలుకు దేశీయంగా తయారుచేసినదే." అని డిఆర్‌డివో నేత వి.కె.సరస్వత్ చెప్పాడు.[33]
 • 2014 నవంబరు 10 న ఇజ్రాయిల్లో బరాక్ 8 యొక్క పూర్తిస్థాయి పరీక్షను జయప్రదంగా నిర్వహించారు. భూస్థిత, సాగర స్థిత వ్యవస్థలు రెంటినీ పరీక్షించారు.[34][35]
 • 2015 నవంబరు 26 న ఒక డ్రోన్‌ను లక్ష్యంగా ఎంచుకుని జయప్రదంగా పరీక్షించారు.[36]
 • 2015 డిసెంబరు 29, 30 న భారత నౌకాదళం ఐఎన్‌ఎస్ కోల్‌కతా నుండి జయప్రదంగా పరీక్షించారు.[37][38] అరేబియా సముద్రంపై వేగంగా కదులుతున్న లక్ష్యాలపై రెండు క్షిపణులను ప్రయోగించారు.[39][40]
 • 2016 జూన్ 30 న  భారత్ భూస్థిత బరాక్ 8 వ్యవస్థను జయప్రదంగా పరీక్షించింది. చాందీపూర్ నుండి చేసిన ఈ పరీక్షలో పైలట్ రహిత విమానాన్ని లక్ష్యంగా చేసుకుని జయప్రదంగా ఛేదించారు.[41] అదేరోజు మధ్యాహ్నం మరో పరీక్షను జరిపి మరో పైలట్ రహిత విమానాన్ని ఛేదించారు. ఈ పరీక్షను భారత్ ఇజ్రాయిల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి.[42][43][44][45]
 • 2016 జూలై 1 న చాందీపూర్‌లో భూస్థిత క్షిపణిని మూడవసారి మళ్ళీ పరీక్షించారు. పైల్ట్ రహిత విమానాన్ని మళ్ళీ ఛేదించింది.[46]
 • 2016 సెప్టెంబరు 20 న మరోసారి సుదూర పరిధి క్షిపణిని చాందీపూర్ నుండి జయప్రదంగా పరీక్షించారు.[47]
 • 2016 డిసెంబరు 25 న అజర్‌బైజాన్ ఈ క్షిపణిని జయప్రదంగా పరీక్షించింది.[48]
 • 2017 ఫిబ్రవరి 10 న ఇజ్రాయీ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సాగర స్థిత పరీక్షను నిర్వహించింది.[49][50]
 • 2017 మే 16 న ,ఐఎన్‌ఎస్ కొచ్చి నుండి భారత నౌకాదళం జయప్రదంగ క్షిపణిని పరీక్షించింది.[51][52]

మోహరింపు[మార్చు]

బరాక్ 8 ని ఇజ్రాయిల్ నేవీ తమ సార్ 5 కార్వెట్‌లలో మోహరించింది..[53] భారత నౌకాదళం తమ కోల్‌కతా తరగతి డిస్ట్రాయర్లలో ఈ క్షిపణిని మోహరించింది.[54]

ఆపరేటర్లు[మార్చు]

Map with Barak 8 operators in blue (doesn't include Azerbaijan)

ప్రస్తుత ఆపరేటర్లు[మార్చు]

భవిష్యత్తు ఆపరేటర్లు[మార్చు]

– 2014 లో తమ నేవీలో చేర్చుకునేందుకు పోలండు బరాక్ 8 ని పరిశీలించింది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "India's most-advanced warship to get the missing Missiles". Retrieved 30 July 2016.
 2. "WATCH: IAI carries out successful trial of Barak 8 air and missile defense system". Retrieved 30 July 2016.
 3. "India's Most-Advanced Warship to Get the Missiles That Were Missing". Retrieved 30 July 2016.
 4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 Polish navy tests Barak-8 missile, flightglobal.com, 4 September 2014
 5. 5.0 5.1 5.2 5.3 5.4 "Naval Barak-8 Missiles, Israel". Retrieved 30 July 2016.
 6. "Barak-8 Missiles, Israel, India". 22 November 2012. Retrieved 30 July 2016.
 7. "India commissions second Kolkata-class destroyer". http://www.janes.com/. IHSJanes. 29 September 2015. Retrieved 30 December 2015. External link in |publisher= (help)
 8. "EXCLUSIVE: Indo-Israeli LRSAM Range Extended By A Third". LIVEFIST. 25 September 2015. Retrieved 30 December 2015.
 9. 9.0 9.1 Israel ship missile test for India, The Telegraph, 28 November 2015
 10. 10.0 10.1 Gen Next missile defence shield built by Israel and India clears first hurdle, The Times of India, 28 November 2015
 11. 11.0 11.1 11.2 IAI PDF - Barak 8 Archived 2015-07-06 at the Wayback Machine, iai.co.il
 12. "Long-Range Surface-to-Air Missile (LRSAM)". www.globalsecurity.org. Retrieved 2016-01-16.
 13. "Indo-Israeli LR Sam Test Fired Aboard Indian Warship". Defense News. Retrieved 2016-01-16.
 14. "India's Modi approves $2.5 billion missile deal with Israel". JNS.org (in ఇంగ్లీష్). Archived from the original on 2017-02-24. Retrieved 2017-02-24.
 15. Next-Gen: Barak-8, defenseindustrydaily.com, Accessed 25 November 2014
 16. "Indian Navy successfully test fires Barak-8 long range missile from INS Kolkata". The Indian Express. Retrieved 30 December 2015.
 17. Bourne, Jason. "The Barak Connection- India and Israel". merinews. Archived from the original on 29 నవంబర్ 2014. Retrieved 16 November 2014. Check date values in: |archive-date= (help)
 18. Shiv Aroor (2006-02-07). "India, Israel tie up on next-gen Barak missiles in 2000". ExpressIndia.com. Retrieved 2008-03-30.
 19. "India buys upgraded Israeli air defences for $1.1bn". Reuters. 2009-11-09.
 20. "Israel Aerospace gets $630m missile defense deal for Indian Navy". The Times of Israel (in ఇంగ్లీష్). Retrieved 2017-05-21.
 21. "Barak 8 Missile to Be Test-Fired This Month". NDTV. 2 August 2015. Retrieved 30 December 2015.
 22. "Indian Navy to start fitting Barak-8 naval SAM by end of year". IHS Janes. 8 February 2015. Retrieved 30 December 2015.
 23. "IAI en route to extended range Barak-8ER - IHS Jane's 360". Retrieved 30 July 2016.
 24. IAI - Naval Barak 8 Israel Aerospace Industries
 25. Next-Gen: Barak-8, defenseindustrydaily.com, Accessed 25 November 2014
 26. Bhat, Aditya. "India clears deal; army to acquire air defence systems from Israel soon". International Business Times, India Edition (in ఇంగ్లీష్). Retrieved 2017-02-24.
 27. "India's Modi approves NIS 9.4 billion missile deal with Israel". The Times of Israel (in ఇంగ్లీష్). Retrieved 2017-02-24.
 28. "India signs MRSAM deal | IHS Jane's 360". www.janes.com. Retrieved 2017-04-18.
 29. Sputnik. "India to Buy Israeli Barak Eight Surface-to-Air Missile for Aircraft Carrier". sputniknews.com (in ఇంగ్లీష్). Retrieved 2017-04-18.
 30. Naval Barak-8 Missiles, Israel, India, naval-technology.com, Accessed 25 November 2014
 31. Barak 8 / MR-SAM Test Program to Begin in Early 2012, http://defense-update.com/, 21 November 2011
 32. "Indo-Israeli missile successfully test-fired: DRDO chief". Retrieved 30 July 2016.
 33. "Politics/Nation". The Times Of India. 2010-07-01.
 34. "Successful comprehensive trial for IAI's Barak-8 defense missile system". November 11, 2014.
 35. "Israel Aerospace Industries (IAI) Successfully Tested the Barak-8 Air & Missile Defense System". November 13, 2014.
 36. "Israel tests Barak-8 missile co-developed with India". 27 November 2015. Retrieved 30 July 2016.
 37. "Indian Navy test-fires surface-to-air missile developed with Israel". mid-day. Retrieved 2015-12-29.
 38. "Indian Navy test-fires missile developed with Israel". Retrieved 2015-12-29.
 39. "Indian Navy successfully test fires surface-to-air missile Barak-8". www.brahmand.com. Archived from the original on 2016-01-08. Retrieved 2015-12-30.
 40. "Proud Moment. Indian Navy Tests The Most Formidable Missile In Its Arsenal". indiatimes.com. Retrieved 2015-12-30.
 41. "Barak-8 missile test-fired from Chandipur". Archived from the original on 2016-07-24. Retrieved 2017-08-21.
 42. "India's newly developed surface-to-air missile 'Barak- 8' successfully test-fired off Odisha coast". 2016-06-30. Retrieved 2016-06-30.
 43. Eshel, Tamir. "Successful Tests for Indo-Israeli Land-Based Air Defense System | Defense Update:". defense-update.com. Retrieved 2016-06-30.
 44. "Israel Aerospace Barak 8 undergoes successful Indian trials - Globes English". Globes. Retrieved 2016-06-30.
 45. "India Test Fires Barack-8 Missile, An Indo-Israel Project". pragativadi.com. Archived from the original on 2016-07-01. Retrieved 2016-07-01.
 46. "MR SAM hits target successfully for the second time in two days proving its reliability".
 47. "India successfully test fires surface-to-air missile Barak-8". Retrieved 2016-09-20.
 48. Julian, Hana Levi (2016-12-26). "Azerbaijan Successfully Test-fires Israeli-Produced Barak-8 Missile System". The Jewish Press (in ఇంగ్లీష్). Retrieved 2017-01-24.
 49. "IAI's Barak-8 test-fired at sea". UPI (in ఇంగ్లీష్). Retrieved 2017-02-12.
 50. "Israel Test Fires Barak-8 Missile". www.defenseworld.net. Retrieved 2017-02-12.
 51. "Indian Navy successfully test fires MRSAM from INS Kochi". The New Indian Express. Retrieved 2017-05-17.
 52. "Navy successfully test fires MR-SAM from INS Kochi". www.oneindia.com (in ఇంగ్లీష్). Retrieved 2017-05-17.
 53. "Israeli Navy to begin installing Barak 8 on Sa'ar 4.5 corvettes | IHS Jane's 360". www.janes.com. Retrieved 2016-02-14.
 54. Sputnik. "Indian Navy Test-Fires Extended Range Barak 8 Missile". sputniknews.com (in ఇంగ్లీష్). Retrieved 2017-05-21.
 55. "List of ammunition purchased by Azerbaijan made public". news.az. 2012-03-27. Retrieved 2012-03-28.
 56. "Azerbaijan has successfully test-fired Israeli-made Barak-8 long-range surface-to-air missile". Army Recognition. 2016-12-28. Retrieved 2016-12-30.
 57. Diplomat, Franz-Stefan Gady, The. "India, Israel Conclude $2 Billion Missile Deal". The Diplomat (in ఇంగ్లీష్). Retrieved 2017-04-18.
 58. "Sea Ceptor scores new success, gets set for Chile showdown - IHS Jane's 360". Retrieved 30 July 2016.
 59. "Watch: India tests Barak 8 missile". Retrieved 30 July 2016.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బరాక్_8&oldid=2977744" నుండి వెలికితీశారు