INS విక్రమాదిత్య

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
INS విక్రమాదిత్య ((R33)

INS విక్రమాదిత్య (సంస్కృతంలో विक्रमादित्य,విక్రమాదిత్య అంటే "సూర్యుని అంత ధైర్యము ఉన్నవాడు"

విక్రమాదిత్య పరివర్తిత కీవ్ శ్రేణి విమాన వాహక నౌక. దీనిని 1978 - 1982లో యుక్రైన్ లోని బ్లాక్ సీ నౌకా నిర్మాణ కేంద్రం, మైకొలయివ్లో నిర్మించారు. ఈ నౌకని సెవ్‍మశ్ నౌకా నిర్మాణ కేంద్రం సెవెరొడ్విన్స్క్, ఆర్ఖేంగెల్స్క్ ఒబ్లస్ట్, రషియాలో తిరిగి బాగు చేసారు.. ఇది భారతదేశంలో పని చేస్తున్న ఏకైక విమాన వాహక నౌక, INS విరాట్ కి ప్రత్యామ్నాయం ఔతుందని భావిస్తున్నారు. దీన్ని 16 దిసెంబరు 2013 న నౌకదళం లోకి ప్రవేశపెట్టారు.

ఇది 30 మికొయాన్ MiG-29K ఇంకా 6 హెలికాప్తర్ లను మొసుకెల్లగలదు.

చరిత్ర[మార్చు]

కొనుగోలు[మార్చు]

అడ్మిరల్ గోర్ష్‍కోవ్ గా ఉన్నప్పుడు ఈ విమాన వాహక నౌక

1987లో అడ్మిరల్ గోర్ష్‍కోవ్ రషియా సేవలలో చేరింది. ప్రచ్ఛన్న యుధ్ధం తర్వాత వచ్చిన బడ్జెట్ తో దీనిని కొనసాగించటం సాధ్యపడలేదు. తన విమనయాన సామర్ధ్యాన్ని పెంచుకోవలనుకునే భారతదేశం దృష్టిని ఈ నౌక ఆకర్షించింది.[1] కొన్ని సంవత్సరాల సంప్రదింపుల తర్వాత రషియా మరియు భారతదేశాలు జనవరి 20, 2004, నాడు నౌక అమ్మే వ్యవహారం పై సంతకాలు చేసాయి. నౌక ఉచితంగానే వచ్చినా, నౌక ఉద్ధరణ మరియు తిరిగి అమర్చటానికి గాను భారతదేశం యు.ఎస్.$800 ఇంకా విమాన మరియు ఆయుధ వ్యవస్థ కోసం యు.ఎస్.$1 బిల్లియన్లు చెల్లించాల్సి ఉంది. 2009లో నొర్థ్రొప్ గ్రుమన్ అధునాతనమైన E-2D హాక్ఐ ఇవ్వటానికి సంసిద్ధత వ్యక్త పరచటంతో, నావికా దళం ఈ నౌకలో E-2C హాక్ఐ ని అమర్చాలానే ఆలోచనని మానుకుంది.[2] [3]

ఈ వ్యవహారంలో యు.ఎస్.$1 బిలియనుతో 12 మికొయన్ మిగ్-29కె ’ఫల్క్రమ్-డి’ (ప్రొడక్ట్ 9.41) లు మరియు 4 MiG-29KUB విమానాలు (మరి 14 కొనుగోలు చేసే అవకాశంతో), ఇంకా గస్తీ మరియు జలాంతర్గామి విధ్వంసక శక్తి గల 6 కామోవ్ KA-31 హెలిక్స హెలికాప్టర్లు, టొర్పిడో నాళాలు, క్షిపణి వ్యవస్థలు మరియు శతఘ్నులు కూడా కొనుగోలులో కలసి ఉన్నాయి. వైమానికుల మరియు సాంకేతిక సిబ్బంది శిక్షణ కోసం కావలసిన సదుపాయాలు మరియు పద్ధతులు, సిమ్యులేటర్లు, విడి భాగాలు, మరియు భారత నావికాదళం కొరకు నిర్వాహణ సౌకర్యలు స్థాపించటం కూడా ఈ ఒప్పందంలో భాగము.

ఈ నౌక ముందు భాగంలోని P-500 బజాల్ట్ క్షిపణి ప్రయోగ సాధనాలు, నాలుగు అంతే కింజల్ ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించే క్షిపణి ప్రయోగ సాధనాలు వంటి ఆయుధాలను తొలగించి 14.3 డిగ్రీల ఎత్తుకు దూసుకు వెళ్ళే జారుడు బండ లాంటి ముందు భాగము అమర్చటం మార్పిడి ప్రణాళికలోని కొన్ని భాగాలు.

నౌక ముందరి భాగాలలో ఉన్న ఆయుధాలను మరియు క్షిపణి ప్రయోగ నాళాలను తొలగించి కొంత దూరం వెళ్ళగానే విమానాలు పైకి ఎగిరే మరియు ఇతర సహాయంతో విమానాలు ఆగే (STOBAR) విధంగా తీర్చిదిద్దటం ఈ ఉద్ధరణ ప్రణాళికలో భాగం.[4] దీనితో గోర్ష్‍కోవ్ సంకర వాహనం నుంచి శుద్ధ విమాన వాహకంలా మారుతుంది.

INS విక్రమాదిత్య ను ఆగస్టు 2008 నాటికి అందిస్తామని చెప్పారు. అలా చేసినట్లయితే, భారత నౌకాదళంలో ఉన్న ఏకైక విమాన వాహక నౌక INS విరాట్ సేవల నుండి వైదొలగే నాటికి INS విక్రమాదిత్య సేవలో చేరి ఉండేది. INS విక్రమాదిత్యను సమయానికి అందివ్వని కారణం చేత INS విరాట్ యొక్క తొలగింపును 2012 నాటికి వాయిదా వేసారు.[5] వ్యయాతిక్రమణ ఈ ఆలస్యాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది. ఈ విషయాన్ని పరిష్కరించటానికి పై స్థాయిలో దౌత్య వ్యవహారాలు నడిచాయి. భారతదేశం అదనంగా యుఎస్$1.2 బిలియన్లు చెల్లించటానికి ఒప్పుకుంది. దీనితో మొదట అనుకున్న వ్యయం రెండింతల కంటే ఎక్కువ అయ్యింది.[6] విక్రమాదిత్య ను 2012లో అందించగలరని భావిస్తున్నారు. ఇలా అందించటంలో అవుతున్న ఆలస్యం వలన విరాట్ యొక్క నిష్క్రమణం ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది.విరాట్ చే పదవీ విరమణ చేయించినట్లయితే భారత నౌకా దళం 1960ల తర్వాత మొదటిసారి విమాన వాహక నౌక లేకుండా ఉంటుంది. భారతదేశం సొంతంగా తయారు చేసుకుంటున్న విక్రాంత్ రకం విమాన వాహక నౌక తయారి కనీసం ఒక సంవత్సరం ఆలస్యం అయినందున వీటిని 2013 కంటే ముందు పనిలో పెట్టలేము, ఇది ముందుగా అనుకున్న 2012 కంటే ఒక సంవత్సరం ఆలస్యం .[7]

ఓడ క్షీణ దశకు చేరుకోవడంతో దీని పై ఇంకా ఎక్కువ పని చేయాల్సి వస్తుందనే నెపంతో రషియా జులై 2008లో దీని ఖరీదు మొత్తం యుఎస్$3.4 బిలియన్లగా ప్రకటించినట్లుగా వార్తలు వచ్చాయి.[8] నవంబరు 2008 నాటికి భారతదేశం యుఎస్$400 మిలియన్లు చెల్లించింది. ఒకవేళ ఈ పెరిగిన ధర చెల్లించటానికి భారతదేశం సంసిద్ధంగా లేకపొతే తామే ఈ ఓడను వాడుకుంటామని రషియా యోచిస్తున్నట్టుగా చెప్పింది.[ఆధారం కోరబడింది] అడ్మిరల్ గోర్ష్‍కోవ్ ని కొనటమే అత్యుత్తమ వికల్పంగా భారత ప్రభుత్వం భావిస్తున్నట్టుగా డిసెంబరు 2008లో ప్రభుత్వ ప్రతినిధి సూచించారు.[9] ఈ నౌక వేరే వారు వాడిందని, దీని జీవిత కాలం తక్కువగా ఉంటుందని, క్రొత్త నౌక కన్నా 60% ఎక్కువ ఖరీదైనదని, మరియు దీనిని అందించటంలో ఇంకా ఆలస్యం జరిగే అవకాశం ఉందని భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (ప్రభుత్వ ప్రధాన సంప్రతి - కాగ్) ఈ కొనుగోలుకు అభ్యంతరం చెప్పారు.[10]

భారత నావికా దళాధిపతి అడ్మిరల్ సురీష్ మెహత ప్రభుత్వ నిర్ణయాన్ని, ఈ ధరను ఇలా సమర్ధించారు: "నేను కాగ్ పై వ్యాఖ్యానించలేను. కాని మీరు ఓ విమాన వాహక నౌకను యుఎస్ $ 2 బిలియన్ల కంటే తక్కువ ధరకు తేగలరా? మీరు తేగలిగితే నేను ఇప్పుడే చెక్కు ఇవ్వగలను." దీనితో ఈ వ్యవహారంలోని తుది బేరం రెండు బిలియన్ల యుఎస్ $ కన్నా ఎక్కువగానే ఉండచ్చని అనిపిస్తోంది. నావికా దళం ఈ కొనుగోలు యొక్క విపత్తు విశ్లేషణ సరిగా చేయలేదని కాగ్ కనుగొనడాన్ని ప్రస్తావించగా, అయన ఇలా స్పందించారు, "అలాంటిదేమీ లేదని నేను మీకు హామీ ఇవ్వగలను. మేము ఈ ఓడని 90ల నుండి పరిశీలిస్తూ వచ్చాము." [11]

రషియా అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ జులై 2, 2009 నాడు ఈ నౌకా నిర్మాణం వీలైనంత త్వరితంగా చేయాలని, 2012లో భారతదేశానికి అందించేందుకు తయారు కావాలని చెప్పారు.[12] ఈ వ్యవహారం పై తుది నిబంధనలు ఒప్పందానికి వచ్చామని, కాని అందించేందుకు తేదిని నిర్ణయించలేదని డిసెంబరు 7, 2009 నాడు రషియా వర్గాలు తెలిపాయి.[13]

అడ్మిరల్ గోర్ష్‍కోవ్ కొనుగోలుకు సంబంధించిన కొత్త ఒప్పందం అక్టోబరు మధ్య సంతకాలు చేయబడుతుందని సెప్టెంబరు 3 నాడు రోస్తేక్నోలోజి అధినేత సెర్గీ చేమేజోవ్ మాస్కోలో చెప్పారు.[14]

డిసెంబరు 8, 2009 నాడు భారత మరియు రషియా దేశాలు గోర్ష్‍కోవ్ పై తుదికి యుఎస్$2.2 బిలియన్లకు ఒక ఒప్పందానికి వచ్చినట్లు కథనాలు వచ్చాయి. మాస్కో ఈ విమాన వాహక నౌకకు, మొదట్లో ఒప్పుకున్నా దానికంటే మూడు రెట్లు ఎక్కువగా యుఎస్$2.9 అడిగింది. అయితే, భారత ప్రభుత్వం దీని ఖరీదు యుఎస్$2.1 బిలియన్లు ఉండాలని కోరుకుంది.[15][16] చివరకు, రషియా ప్రధాని వ్లాదిమిర్ పూతిన్ భారతదేశపు రెండు రోజుల పర్యటన కన్నా ఒక రోజు ముందు, అనగా మర్చి 10 నాడు అడ్మిరల్ గోర్ష్‍కోవ్ యొక్క ధర యుఎస్$2.35 బిలియన్లకు ఒప్పందం కుదిరింది.[17]

తిరిగి మెరుగు పెట్టుట[మార్చు]

చట్రం పని 2008 నాటికి పూర్తి చేసి విక్రమాదిత్య ను 4 డిసెంబరు 2008[18] నాడు జల ప్రవేశం చేయించారు.[19] ఈ ఓడ మీద జూన్ 2010 నాటికి 99% నిర్మాణ సంబంధ పనులు మరియు 50% తంత్రీ పనులు పూర్తి అయ్యాయి. దాదాపుగా ఇంజనులు, జనరేటర్లు వంటి అన్ని పెద్ద ఉపకరణాలు అమర్చబడ్డాయి.[20] 2010లో INS విక్రమాదిత్య పై ఉన్న వ్యవస్థలను పరీక్షించేందుకు నావికా దళ మిగ్-29కే ప్రత్రి రూపాన్ని వాడటం మొదలు పెట్టారు.[21]

రూపకల్పన[మార్చు]

మిగ్-29కే లను INS విక్రమాదిత్య పై నియోగిస్తారు.

ఈ నౌక 14.3 డిగ్రీల ఎత్తుకు దూసుకు వెళ్ళే జారుడు బండ లాంటి ముందు భాగము, మూడు వేగ నిరోధకలైన తంత్రులు వెనుక భాగంలోనూ ఉండి STOBAR పధ్ధతిలో నిర్వహించబడుతుంది. మిగ్-29కే మరియు సి హరియర్ విమానాలు ఈ ఒడపై పని చేయటానికి ఇది తోడ్పడుతుంది. 160 - 180 మీటర్ల వ్యవధిలో విక్రమాదిత్య మీద MiG-29K విమానం పైకి ఎగారగలుగుతుంది.

ఈ ఓడ వల్ల ఇంకొక లాభం "అడ్మిరల్ గోర్ష్‍కోవ్" తిన్నె పై కట్టడం - దీని పై మొదట అమెరికా నావికా దళానికి చెందిన USS లాన్గ్ బీచ్ పై కనిపించిన బల్లపలకలా ఉండే ఎన్టిన్నాలతో శక్తివంతమైన సమతలంగా ఉండే లేదా దశల విన్యాసంలో ఉండే రాడార్ వ్యవస్థ అమర్చవచ్చు. విస్తృతమైన ఆదేశ-నియంత్రణ వ్యవస్థతో కలసి ఈ రాడార్ వాయు మార్గంలో దండయాత్రకు తోడ్పడుతుంది. SAM మరియు/ లేదా CIWS వంటి బలిష్ఠమైన వాయు రక్షణాయుధాల సంయోజనాలు ఇందులో అమర్చాలానే అలోచన ఉంది.[22]

దీని చట్రం యొక్క నిర్మాణం 1982లో జల ప్రవేశం చేసిన అడ్మిరల్ గోర్ష్‍కోవ్ చట్రం పైనే ఆధారపడి ఉన్నా దానికన్నా ఎక్కువ పూర్తి భార నిర్వాసన కలిగి ఉంటుంది. ఈ నౌక ముందు భాగంలోని P-500 బజాల్ట్ క్షిపణి ప్రయోగ సాధనాలు, నాలుగు అంతే కింజల్ ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించే క్షిపణి ప్రయోగ సాధనాలు వంటి ఆయుధాలను తొలగించి 14.3 డిగ్రీల ఎత్తుకు దూసుకు వెళ్ళే జారుడు బండ లాంటి ముందు భాగము అమర్చటం మార్పిడి ప్రణాళికలోని కొన్ని భాగాలు. విమానానికి పూర్తి శక్తి వచ్చే వరకు రెండు గట్టి తాళ్ళు నిరోధకంలా వ్యవహరించి ఆ విమానం ఎత్తుకు ఎగిరేందుకు సహాయపడే జారుడు బండ మీదిగుండా కొంత దూరం ప్రయాణించి పైకి ఎగరడానికి సహాయం చేస్తాయి. ఒక సారి ఒక విమానమే గాలిలోకి ఎగుర వేయగలిగే సామర్ధ్యం కొన్ని సందర్భాలలో ఆటంకంగా పరిణమించవచ్చు. ఆధునికీకరణ ప్రణాళికలో పై కట్టడం పక్కన ఉన్న 20 టన్నుల ఉద్ధారక యంత్రం అలాగే ఉన్నా, వెనుక భాగంలో ఉన్నా ఉద్ధారక యంత్రం పెద్దది చేయబడి 30 టన్నుల సామర్ధ్యానికి పెంచబడుతుంది. కోణాకారంలో ఉన్న ఓడ చివరి భాగంలో మూడు ఆపే యాంత్రిక పరికరాలు అమర్చారు. LAK దృగ్విజ్ఞానాధారిత దిగే వ్యవస్థ లాంటివి కలుపుకొని యాన మార్గ నిర్దేశకత మరియు వాహక నౌక మీద దిగేందుకు ఉపయుక్త పరికారాలు కదలిక లేని రెక్కల విమానాలు ఉపయోగించే STOBAR ప్రక్రియకు సహాయపడే విధంగా ఈ నౌకకి మెరుగు పెడుతున్నారు.[23]

గాలితో తేలి ముందస్తు హెచ్చరికలు చేసే పనిలో నియోగించటానికి కామోవ్ కా-31 హెలిక్స్ లను INS విక్రమాదిత్య పై వాడతారు.

ఫర్నేస్ తైలాన్ని ఉపయోగించే ఎనిమిది కాగులను తొలగించి డీజలు వాడే వాటిని అమర్చారు. అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపడేటట్లు మురికి నీరు శుద్ధి చేసే యంత్రం మరియు నునే-నీరు వేరు చేసే యంత్రాలు కూడా అమర్చారు. ఇటలీలో తయారైన వర్త్సిలా 1.5 మెగా వాట్ల డీజలు విద్యుదుత్పాదకం, భౌగోళిక సముద్ర ప్రసార సాధన వ్యవస్థ, స్పెర్రి బ్రిడ్జ్‍మాస్టర్ యాన నిర్దేశకత రాడార్, కొత్త దూరవాణీ నిలయం, కొత్త సమాచార వ్యవస్థ మరియు IFF Mk XI వ్యవస్థ ఈ నౌకలో అమర్చుతున్నారు. యార్క్ ఇంటర్నేషనల్ శీతలీకరణ మరియు వాతానుకూలనం ఇంకా కొత్త నీటి-ఉత్పత్తి యంత్రాలతో ఈ ఓడలోని సేవలను మెరుగుపరుస్తున్నారు. పది మంది మహిళా అధికారుల ఉపయోగార్ధం ఓ కొత్త వంటశాలను, మెరుగు పరచబడ్డ సేవలు మరియు వసతితో ఈ ఓడను అభివృద్ధి చేస్తున్నారు.[23]

అధికారికంగా దీని జీవిత కాలం 20 సంవత్సరాలుగా భావిస్తున్నా, ప్రజ్ఞావంతులు దీని సేవలను ఉపయోగించుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి కనీసం 30 సంవత్సరాలు పని చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఆధునికీకరణం పూర్తి అయిన తర్వాత, ఈ నౌకలో 70 శతం ఉపకరణాలు కొత్తవి ఉంటాయి. మిగిలినవి మెరుగు పరచబడి ఉంటాయి.[23]

స్థితి[మార్చు]

మాక్స్ ఎయిర్ షో లో భారత నావికా దళానికి చెందిన మిగ్-29కే విమానాలు.

రష్యాలోని సెవెరొడ్విన్స్క్ లో పునరాకృతి పనులన్నీ చేస్తున్నారు. అయితే తంత్రీ సంబంధ పనులను తక్కువగా అంచనా వేయటం వలన ఈ పని పూర్తి చేయటంలో మూడు సంవత్సరాల ఆలస్యంగా 2012 నాటికి సేవలో చేరనుంది.[24] ఈ విషయాన్నీ పరిష్కరించటానికి ఇరు దేశాల సాంకేతిక మరియు విత్త సంబంధ ప్రజ్ఞావంతుల మధ్య చర్చలు జరిగాయి.[25] ఫిబ్రవరి 2010 నుంచి మిగ్-29కే భారత దేశపు సేవలో నియోగించబడ్డాయి. ఇరు దేశాలు ఓ రాజీకి వచ్చాయి. ఇందులో భాగంగా భారతదేశం బహిరంగపరచని అదనపు పైకము చెల్లించటానికి ఒప్పుకుంది. పాత వ్యవస్థలను బాగు చేయటం కాక, రష్యా కొత్త వ్యవస్థలు అమర్చి ఈ ఓడను 2011లో అప్పగిస్తుంది. తదుపరి, భారత నావికా దళంలో నియోగించే ముందు ఈ నౌక 18 నెలల పాటు సముద్రంలో పరీక్షింపబడుతుంది.[26]

జును 1, 2010 నాడు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనాన్ని బట్టి ఒక నౌకాదళ అధికారి ఇలా చెప్పారు: "జనవరి 2004లో $974 మిలియన్లకు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మూడు సంవత్సరాలు కటువైన జగడం కొనసాగింది. ఇప్పుడు భారతదేశం 2.33 బిలియన్లకు పెంచిన ధరను అంగీకరించటంతో ఈ వాహక నౌక పనిని పర్యవేక్షించటానికి ఓ ఉన్నత స్థాయి సంఘాన్ని నియమించింది." ఈ నౌక 2011 మొదట్లో సముద్రపు పరీక్షలకు సిద్ధమై 2012 చివరి నాటికి భారతదేశానికి అప్పగించబడుతుందని ఆశిస్తున్నారు.[20]

నామకరణం[మార్చు]

సంస్కృతంలో విక్రమాదిత్య అంటే సూర్యుని అంత ధైర్యము గల వాడని అర్ధము[27]. భారత చరిత్రలో చాలా ప్రసిద్ధి గాంచిన కొంత మంది రాజులు దీనిని బిరుదుగా వాడారు. వైభవశాలి మరియు మహా యోధుడు అయిన ఉజ్జయినీ రాజ్య పాలకుడు వీరిలో ఒకడు. క్రీ.శ. 375-413/15 మధ్య పాలించిన భారత రాజు రెండో చంద్రగుప్తుడు కూడా ఈ బిరుదును వాడి ఉన్నాడు.

వీటిని కూడా చూడండి[మార్చు]

సూచికలు[మార్చు]

 1. http://www.strategypage.com/htmw/htnavai/articles/20100603.aspx
 2. IndiaDefence.com - వేడిగా ఉన్నది ఏమిటి? ఈ మధ్య జరిగిన విశేషాల విశ్లేషణ - ఏరో ఇండియా 2005 - నావికా దళాల ఆసక్తులు - IDC వారి నివేదిక
 3. భారతీయ నావికా దళం నార్త్రోప్ అదునతాన హాకై కొనే విషయం పై సుదీర్ఘ ఆలోచన
 4. డిఫెన్స్ టాక్ - గోర్ష్‍కోవ్ పై మరమ్మత్తు జరుగుతున్న చిత్రాలు
 5. డిఫెన్స్ ఇండస్ట్రి డైలీ- INS ఆలస్యమౌతున్న విక్రమాదిత్య , పెరుగుతున్న ధర
 6. పెరుగుతున్న ధర పై NDTV సమాచార కథనం
 7. డిసెంబరు లో స్వదెశీ తయారీకి సిద్ధమౌతున్న విమాన వాహక నౌకకు కింది మధ్య భాగం వేస్తున్నారు.
 8. భారత దేశం $2 బిలియన్లు ఎక్కువ చెల్లిస్తే రష్యా వారి విమాన వాహక నౌక 2012లో తయారు అవుతుంది.
 9. [1]
 10. [2]
 11. [3]
 12. భారత విమాన వాహక నౌకను పూర్తి చేయమని అర్ధిస్తున్న మెద్వెదేవ్
 13. రషియ భారతదేశంతో వాహక నౌక ఒప్పందం షరతులు ఒప్పుకుంది
 14. [4]
 15. http://timesofindia.indiatimes.com/india/India-Russia-end-stalemate-over-Gorshkov-price-deal/articleshow/5314150.cms
 16. http://www.indianexpress.com/news/usd-2.2billion/551431/
 17. [5]
 18. గోర్ష్‍కోవ్ చట్రం పై మరమ్మత్తు పూర్తి అయింది
 19. Christopher P. Cavas (December 8, 2008). "Russian Carrier Conversion Moves Forward". Retrieved December 10, 2008. 
 20. 20.0 20.1 http://timesofindia.indiatimes.com/India/Gorshkov-to-be-handed-over-to-India-by-Dec-12/articleshow/5995560.cms
 21. http://www.janes.com/news/defence/jni/jni100622_1_n.shtml
 22. http://www.indiadefence.com/mig29k.htm
 23. 23.0 23.1 23.2 http://www.globalsecurity.org/military/world/india/r-vikramaditya.htm
 24. భారత రక్షణ వాణిజ్యం నుంచి రష్యాను దూరం చేయటానికి ప్రయత్నిస్తున్న యు.ఎస్.
 25. గోర్ష్‍కోవ్ ఒప్పందం పై సాంకేతిక, విత్తపరమైన షరతుల పై అంగీకారం మిగిలి ఉంది
 26. సోవియట్ నాటి విమాన వాహక నౌక విషయంలో తగాదాకు స్వస్తి పలికిన భారత మరియు రష్యా దేశాలు
 27. ప్రతిపదార్ధ దృష్టితో విక్రమాదిత్య అంటే "సూర్యుని (ఆదిత్య) యొక్క శౌర్యం (విక్రమ)". ఆదిత్య (సూర్యుడు)అనే పదానికి అర్ధం "అదితి కి చెందిన"

బాహ్య లింకులు[మార్చు]

మూస:Indian Navy aircraft carriers

Coordinates: 64°34′51.22″N 39°48′31.56″E / 64.5808944°N 39.8087667°E / 64.5808944; 39.8087667