Jump to content

ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ (2013)

వికీపీడియా నుండి
ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ (2013)
INS విక్రాంత్
History
India
పేరు: విక్రాంత్
Namesake: Vikrant (1961)
ఆపరేటరు: భారత నావికా దళం
Ordered: 2004
నిర్మాణ సంస్థ: కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్
వెల: 23,000 crore (US$2.9 billion)[1][2]
నిర్మాణం మొదలైనది: 2009 ఫిబ్రవరి 28
జలప్రవేశం: 2013 ఆగస్టు 12
సేకరించినది: 2022 జూలై 28[3]
కమిషనైనది: 2022 సెప్టెంబరు 2
Homeport: INS కదంబ, కార్వార్
Identification: పెన్నంట్ సంఖ్య: R11
Motto:
  • जयेम सं युधिस्पृधः (Sanskrit)
  • "నాతో పోరాడీనవారిని ఓడిస్తాను"
మారుపేర్లు: IAC-1
స్థితి: సేవలో ఉంది[4][5]
Badge:
సాధారణ లక్షణాలు
తరగతి, రకం: విక్రాంత్-class విమాన వాహక నౌక
డిస్‌ప్లేస్‌మెంటు:
పొడవు: 265 మీ. (869 అ.)
బీమ్: 62 మీ. (203 అ.)
ఎత్తు: 59 మీ. (194 అ.)[7]
డ్రాట్: 8.4 మీ. (28 అ.)
లోతు: 25.6 మీ. (84 అ.)
డెక్‌లు: 14
స్థాపిత సామర్థ్యం:
ప్రొపల్షన్: రెండు షాఫ్టులు
వేఘం: 30 kn (56 km/h; 35 mph)[9]
పరిధి: 8,000 nmi (15,000 కి.మీ.; 9,200 మై.)[10]
సిబ్బంది: 196 officers, 1,449 sailors (including air crew)[11]
సెన్సార్లు,
ప్రాసెసింగ్ వ్యవస్థలు:
ఎలక్ట్రానిక్ యుద్ధ
& డికాయ్‌లు:
ఆయుధాలు:
విమానాలు:
వైమానిక సౌకర్యాలు: 12,500 m2 flight deck[21]

ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ భారత్‌ దేశీయంగా నిర్మిస్తున్న తొట్ట తొలి విమాన వాహక నౌక. విక్రాంత్ వాహక నౌకల తరగతికి చెందిన తొలినౌక ఇది. కొచ్చిన్ షిప్‌యార్డ్ ఈ నౌకను నిర్మిస్తోంది. ఈ నౌక జయమ్ సమ్ యుద్ధి స్పర్ధః  అనే ఋగ్వేద శ్లోకాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. నన్ను ఎదుర్కొనేవారిని ఓడిస్తాను అని దీనర్థం.

1999 లో నౌక డిజైను మొదలైంది. 2009 ఫిబ్రవరి 28 న నౌక వెన్నుగాడి వేసారు. 2011 డిసెంబరు 29 న నౌక డ్రైడాక్ నుండి  బయటికి నడిచింది.[22] 2015 లో నౌకను లాంచ్ చేసారు. ప్రస్తుతం నౌకలో అంతర్భాగాలు, యంత్ర సామాగ్రి మొదలైన వాటిని అమరుస్తున్నారు. ఇది 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.[23] అయితే నౌకాదళం మాత్రం 2018 నాటికి నౌకను పాక్షికంగా కమిషను చెయ్యవచ్చని భావిస్తోంది. నౌక నిర్మాణ ఖర్చు పెరిగి 2014 నాటికి రూ.19,341 కోట్లకు చేరింది.[24]

ఇదే తరగతిలో రెండో నౌకను నిర్మించేందుకు కొచ్చిన్ షిప్‌యార్డు ప్రతిపాదించినప్పటికీ, నౌకాదళం మాత్రం దీనికంటే పెద్దదైన అణుచోదిత వాహక నౌక నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.[24]

డిజైను

[మార్చు]
INS Vikrant during its launch in August 2013
INS Vikrant during its undocking in June 2015

ఐ.ఎన్.ఎస్ విక్రాంత్  262 మీ. పొడవు, 60 మీ. వెడల్పుతో 40,000 టన్నుల బరువుంటుంది. దీనిలో స్కీ జంప్‌తో పాటు, షార్ట్ టేకాఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ (STOBAR) వ్యవస్థ ఉంటుంది.[25] మిగ్-29K విమానాలు ఎగరగలిగేలా దీని డెక్ ఉంటుంది. 30 విమానాలను  మోసుకెళ్ళగలదు. వీటిలో 24–26 వరకు విమానాలు.[26] (ప్రధానంగా మిగ్-29K) కాగా, 10 వరకు కమోవ్  Ka-31 గానీ, వెస్ట్‌లాండ్ సీకింగ్ గానీ హెలికాప్టర్లుంటాయి. తేజస్ మార్క్-2 నౌకాదళ రూపాన్ని మితిమీరిన బరువు కారణంగా 2016 డిసెంబరు 2 న నౌకాదళం తిరస్కరించింది.[27] Ka-31 ఆకాశ నిఘాను నిర్వహించగలదు. సీకింగులు జలాంతర్గామి ఛేదక శక్తిని సమకూర్చుతాయి.[28][29]

A schematic diagram of INS Vikrant

విక్రాంత్‌లో 80 మెగావాట్ల సామర్థ్యం కల జనరల్ ఎలక్ట్రిక్ వారి నాలుగు LM2500+ గ్యాస్ టర్బైన్లుంటాయి. ఇవి రెండు షాఫ్టులను తిప్పుతాయి. గేరుబాక్సులను ఎలెకాన్ ఇంజనీరింగువారు సరఫరా చేసారు.[22][30][31]

నిర్మాణం

[మార్చు]

విక్రాంత్ డిజైన్ను నేవల్ డిజైను డైరెక్టొరేట్ చెయ్యగా, నిర్మాణంలో అనేక ప్రైవేటు సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. రష్యా AB/A రకం స్టీలును సరఫరా చెయ్యాల్సి ఉండగా, అది సమస్యల్లో పడింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా డిఫెంస్ మెటలర్జికల్ లాబొరేటరీస్ లిమిటెడ్ (DMRL), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి ఆ స్టీలును భారత్‌లోనే తయారు చేసారు.[22][28] భిలాయ్, రూర్కెలాల్లోని కర్మాగారాల్లో నౌకకు అవసరమైన మూడు రకాల స్టీలును తయారుచేసారు. ఈవిధంగా విక్రాంత్ పూర్తిగా  దేశీయంగా  తయారైన స్టీలుతో నిర్మించిన తొలినౌకగా నిలిచింది.[32] 

ప్రధాన స్విచ్ బోర్డు, స్టీరింగు గేరు, నీరు చొరరాని తలుపులను లార్సెన్ & టూబ్రో నిర్మించింది. అధిక సామర్థ్యం కల ఎయిర్ కండిషనింగు,  రిఫ్రిజిరేషను  వ్యవస్థలను కిర్లోస్కర్ సంస్థ తయారుచేసింది. బెస్ట్ & క్రాంప్టన్ సంస్థ పంపులను ఇచ్చింది. ప్లాట్‌ఫార్ం నిర్వహణ వ్యవస్థను భెల్ తయారుచెయ్యగా, ఇటలీ సంస్థ ఏవియో అమర్చుతోంది. ఎలక్ట్రికల్ కేబుళ్ళను నిక్కో సంస్థ సరఫరా చేసింది.[33] 

నౌకను మాడ్యూళ్ళుగా తయారుచేసారు. నౌక దేహం 874 వివిధ బ్లాకుల కూర్పు. వెన్నుగాడి వేసేనాటికే, 8,000 టన్నుల బరువైన 423 బ్లాకులు  సిద్ధమైపోయాయి.[34] నిర్మాణ ప్రణాళిక ప్రకారం 2010 నాటికి నౌకను లాంచి చెయ్యాలి. అప్పటికి నౌక బరువు 20,000 టన్నులుంటుంది. అంతకంటే  బరువును తయారీ బే మొయ్యలేదు. రీఫిట్ బేలో మరో సంవత్సరపు నిర్మాణం తరువాత, నౌకను సర్వ చోదక వ్యవస్థలతో సహా లాంచి చెయ్యవచ్చని  తలచారు. ఆయుధ వ్యవస్థలు, సంబంధిత వ్యవస్థలను ఆ తరువాత బిగిస్తారు. 2013 లో సముద్ర పరిఅక్షలను మొదలు పెట్టి, 2014 లో నౌకను  కమిషను చెయ్యాలనేది తొలి సంకల్పం.[35][36]

2012 మార్చిలో ఎలికాన్ గేరు బాక్సులను సరఫరా చెయ్యడంలో జాప్యం జరిగింది. పొడవాటి ప్రొపెల్లరు షాఫ్టుల కారణంగా గేరుబాక్సుల డిజైనులో మార్పులు చెయ్యాల్సివచ్చిందని సంస్థ తెలిపింది.[37] ఓ డీజిలు జనరేటరులో జరిగిన ప్రమాదం వలనా, దాని ఎలైన్‌మెంటుతో తలెత్తిన ఇబ్బందుల వలనా కూడా  ఆలస్యం జరిగింది.[38] 75% నౌక నిర్మాణం పూర్తైందని, 2011 డిసెంబరులో లాంచి చేస్తామనీ 2011 ఆగస్టులో రక్షణ శాఖ లోక్‌సభకు తెలిపింది.[39][40] 2011 డిసెంబరు 29 న 14,000 టన్నుల బరువున్న నౌక దేహాన్ని డ్రైడాక్ నుండి బయటికి తీసుకువచ్చారు.[30] 2012 మధ్య వరకు అంతర్గత పనులు చేసి, తిరిగి డ్రైడాక్‌లో నిలిపి ప్రప్ల్షన్‌కు సంబంధించిన పనులు చేస్తారు.[10][22]

2012 జూలైలో టైమ్స్ ఆఫ్ ఇండియాలోను,[41] నవంబరులో NDTV లోనూ వచ్చిన కథనాల ప్రకారం, నౌక నిర్మాణం ఆలస్యమవడంతో 2018 లోగానీ అది నౌకాదళంలోకి చేరదని తెలిసింది.[42] 

లాంచి

[మార్చు]

2013 ఆగస్టు 12 న అప్పటి రక్షణ మంత్రి భార్య, ఎలిజబెత్ ఆంటోనీ నౌకను లాంచి చేసింది.[43]దీంతో నౌక నిర్మాణపు మొదటి దశ పూర్తైంది.

లాంచి సమయానికి 83% ఫ్యాబ్రికేషను పని 75% నిర్మాణపు పనీ పూర్తైందని అడ్మిరల్ రాబిన్ ధోవన్ చెప్పాడు. 90% దేహము, of the 50% ప్రొపల్షన్ వ్యవస్థ, 30% ఆయుధ వ్యవస్థ దేశీయంగా డైజైను చేసి తయారుచేసామని కూడా ఆయ్న చెప్పాడు.[44] నౌకను తిరిగి డ్క్‌లో చేర్చి, రెండవ దశ నిర్మాణం మొదలుపెట్టారు. ఈ దశలో వివిధ ఆయుధాలు, సెన్సర్లు, ప్రొపల్షను వ్యవస్థలనూ అమర్చుతారు. ప్లైట్ డెక్ ను విమాన కేంద్రంతో అనుసంధానం చేస్తారు.[33] విక్రాంత్‌ను 2018 లో కమిషను చేస్తారని 2014 డిసెంబరులో  వార్తలు వెలువడ్డాయి.

డాకు నుండి మళ్ళీ బయటికి

[మార్చు]

దేహ నిర్మాణ పనులు పూర్తయ్యాక, 2015 జూన్‌లో విక్రాంత్‌ను డాక్ నుండి బయటికి తెచ్చారు, కేబుళ్ళు, పైపులైనులు, వెంటిలేషను  మొదలైన పనులు 2017 నాటికి పూర్తౌతాయి. ఆ తరువాత సముద్ర పరీక్షలు మొదలౌతాయి.[45] 2015 అక్టోబరు నాటికి ఫ్లైట్ డెక్ పనులు జరుగుతున్నాయి.[46] 2016 జనవరి నాటికి యంతర్ సామాగ్రి, పైపులైన్లు, ప్రొపెల్లరు షాఫ్టుల స్థాపన జరుగుతోంది. నౌక ఏవియేషను వ్యవస్థలోని యంత్ర భాగాలను సరఫరా చెయ్యడంలో రష్యావైపున జాప్యం జరుగుతోందని తెలియవచ్చింది.[47]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "India's first indigenous aircraft carrier INS Vikrant sets off for sea trials from Kochi". The New Indian Express. 4 August 2021. Archived from the original on 5 August 2021. Retrieved 4 August 2021.
  2. "IAC Vikrant, India's first indigenously-built aircraft carrier, commissioned on September 2". msn. Retrieved 23 August 2022.
  3. "Indigenous aircraft carrier INS Vikrant handed over to Indian Navy". 29 July 2022. Archived from the original on 28 July 2022. Retrieved 28 July 2022.
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; delivery_IAC అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. "Aircraft carrier Vikrant completes third sea trials, returns to Kochi harbour". The New Indian Express. Archived from the original on 15 May 2022. Retrieved 2022-01-17.
  6. Farley, Robert. "An Update on India's Aircraft Carrier Aspirations". thediplomat.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 20 January 2022. Retrieved 2020-10-25.
  7. "Commencement of Sea Trials of Indigenous Aircraft Carrier IAC-P71 "VIKRANT"". Press Information Bureau. Government of India. 4 August 2021. Archived from the original on 27 February 2022. Retrieved 6 August 2021.
  8. "LM2500 Engines To Power India's First Indigenous Aircraft Carrier". Naval News (in ఇంగ్లీష్). Archived from the original on 29 January 2023. Retrieved 10 December 2022.
  9. 9.0 9.1 "Indigenous Aircraft Carrier, to be named INS Vikrant, is biggest ship made in India". The Hindu (in Indian English). 2021-06-25. ISSN 0971-751X. Archived from the original on 28 June 2021. Retrieved 2021-07-10.
  10. 10.0 10.1 "India Floats out Its First Indigenous Aircraft Carrier". DefenceNow.com. 2 January 2012. Retrieved 18 May 2015.
  11. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; iron_beast అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  12. "Annual Report 2019–20" (PDF). Cochin Shipyard Ltd. Archived (PDF) from the original on 18 October 2020. Retrieved 25 September 2020.
  13. 13.0 13.1 Philip, Snehesh Alex (2022-09-02). "Floating airfield — PM Modi commissions INS Vikrant, India's first indigenous aircraft carrier". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 4 February 2023. Retrieved 2023-02-04.
  14. Philip, Snehesh Alex (2021-06-25). "Sea trials of first indigenous aircraft carrier INS Vikrant in July, commissioning mid-2022". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-12-14.
  15. "MilPower - Show warship class". www.milpower.org. Retrieved 2024-09-21.
  16. Philip, Snehesh Alex (2021-06-25). "Sea trials of first indigenous aircraft carrier INS Vikrant in July, commissioning mid-2022". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-09-21.
  17. "List of Aircraft Carriers Under Construction: 2013". World Defense Review. Archived from the original on 19 May 2015. Retrieved 17 May 2015.
  18. Navy to go for VISHAL | Vikrant's Lift 10x14m యూట్యూబ్లో
  19. Anand, Nisha (2022-08-25). "India's indigenous aircraft carrier Vikrant to be commissioned on Sept 2". Hindustan Times (in ఇంగ్లీష్). Archived from the original on 4 February 2023. Retrieved 2023-02-04.
  20. "India selects naval version of Rafale: Dassault Aviation". The Hindu (in Indian English). 2023-07-15. ISSN 0971-751X. Archived from the original on 15 July 2023. Retrieved 2023-07-15.
  21. "INS Vikrant: Inside India's newly-commissioned aircraft carrier". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2022-09-01. Archived from the original on 3 September 2022. Retrieved 2023-02-04.
  22. 22.0 22.1 22.2 22.3 Anandan, S.; Martin, K. A. (30 December 2011). "Navy floats out first Indigenous Aircraft Carrier". The Hindu. Retrieved 18 May 2015.
  23. Pandit, Rajat.
  24. 24.0 24.1 Mazumdar, Mrityunjoy (17 June 2015). "India's indigenous carrier is floated out". IHS Jane's Defence Weekly. 52 (24): 8.
  25. Shrivastava, Sanskar (25 August 2013). "Comparison of Chinese Aircraft Carrier Liaoning and Indian INS Vikrant". The World Reporter. Archived from the original on 28 ఆగస్టు 2013. Retrieved 18 May 2015.
  26. Ramsay, Sushil (March 2014). "Force Projection and Modernization of Indian Navy". 9 (1). SP's Naval Forces: 4–6. Archived from the original on 4 మే 2014. Retrieved 18 May 2015. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  27. "Indian Navy rejects naval version of Tejas LCA, seeks alternative". IHS Jane's 360. Retrieved 22 December 2016.
  28. 28.0 28.1 Anandan, S. (29 September 2008). "Keel-laying of indigenous aircraft carrier in December". The Hindu. Retrieved 18 May 2015.
  29. Simha, Rakesh Krishnan (5 December 2012). "Vikramaditya and Liaoning – forces of the future". IndRus. Retrieved 18 May 2015.
  30. 30.0 30.1 Vora, Rutan (26 December 2011). "Elecon to supply gears for India's first aircraft carrier". Business Standard. Retrieved 18 May 2015.
  31. "India starts work on second indigenous aircraft carrier". The Economic Times. 16 July 2012. Retrieved 18 May 2015.
  32. Shukla, Ajai (7 August 2013). "INS Vikrant's first victory: being built from Indian steel". Business Standard. Retrieved 18 May 2015.
  33. 33.0 33.1 "'Vikrant' Reborn in Indigenous Avtar". Indian Defence Review. 12 August 2013. Retrieved 18 May 2015.
  34. Ray, Kaylan (1 March 2009). "India joins elite warships club". Deccan Herald. Archived from the original on 15 జూలై 2012. Retrieved 18 May 2015.
  35. Unnithan, Sandeep (18 February 2009). "Keel laying of indigenous aircraft carrier next week". Indiatoday. Retrieved 18 May 2015.
  36. Sharma, Suman (7 October 2010). "Indigenous Aircraft Carrier's nucleus ready". Dnaindia.com. Retrieved 18 May 2015.
  37. Anandan, S. (12 March 2011). "Indigenous aircraft carrier a year behind schedule". The Hindu. Retrieved 18 May 2015.
  38. Prasad, K.V. (3 December 2011). "INS Arihant on track". The Hindu. Retrieved 18 May 2015.
  39. "'Indigenous aircraft carrier launch this Dec'". Zeenews. 2 August 2011. Retrieved 18 May 2015.
  40. "First indigenous aircraft carrier to be completed by Dec: Govt". Ibnlive.in.com. 2 August 2011. Archived from the original on 7 నవంబరు 2012. Retrieved 4 జనవరి 2017.
  41. "India's first indigenous aircraft carrier to be inducted in 2018 - Times of India". The Times of India.
  42. Sen, Sudhi Ranjan (20 November 2012). "Indian aircraft carrier: More costly, already delayed". Ndtv.com. Retrieved 18 May 2015.
  43. "India launches home-built, 37,500-tonne aircraft carrier in a shot across the bow to China". National Post. Associated Press. 12 August 2013. Archived from the original on 14 ఆగస్టు 2013. Retrieved 18 May 2015. The 37,500 tonne INS Vikrant is expected to go for extensive trials in 2016 before being inducted into the navy by 2017, reports say. With this, India joins the select group of countries comprising the United States, the United Kingdom, Russia and France capable of building such a vessel.
  44. Sen, Sudhi Ranjan (11 August 2013). "INS Vikrant, first Indian-made aircraft carrier, enters water next week". NDTV. Retrieved 18 May 2015.
  45. Anandan, S. (10 June 2015). "Cochin Shipyard undocks INS Vikrant". The Hindu. Retrieved 12 June 2015.
  46. Gupta, Jayanta (15 October 2015). "Aircraft carrier INS Vikrant will be delivered to Navy on time: Cochin Shipyard chief". Times of India. Retrieved 18 October 2015.
  47. "Navy chief reviews Vikrant project". The Hindu. 17 January 2016. Retrieved 30 March 2016.