నిర్భయ్ క్షిపణి
(నిర్భయ్ క్షిపణి నుండి దారిమార్పు చెందింది)
నిర్భయ్ క్షిపణి | |
---|---|
రకం | దూర పరిధి, అన్ని కాలాల, సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి[1][2] |
అభివృద్ధి చేసిన దేశం | భారతదేశం |
సర్వీసు చరిత్ర | |
వాడేవారు | భారతీయ నౌకా దళం భారత సైన్యం భారతీయ వాయు సేన |
ఉత్పత్తి చరిత్ర | |
తయారీదారు | DRDO |
తయారీ తేదీ | తెలియదు పరీక్షల దశలోనే ఉంది |
విశిష్టతలు | |
బరువు | 1,000 kg[3] |
పొడవు | 6 మీ |
వ్యాసం | 0.52 మీ |
ఇంజను | turbofan |
వింగ్‌స్పాన్ | 2.84 మీ |
ఆపరేషను పరిధి | 1,000 km[1][3] |
వేగం | మ్యాక్ 0.8 |
గైడెన్స్ వ్యవస్థ | INS |
నిర్భయ్ ఒక దూర పరిధి సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. దీనిని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసింది.
వివరణ
[మార్చు]నిర్బయ్ తక్కువ ఖర్చుతో, అన్నికాలాలలో, రహస్యంగా, కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించ గల సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. దీని పరిధి 1000 కి.మీ. బరువు ఒక టన్ను (1000 కి.గ్రా.), పొడవు 6 మీ. కచ్చితమైన గమనం కోసం రింగ్ లేజర్ గైరోస్కోప్, కచ్చితమైన ఎత్తును కొలిచేందుకు రేడియో ఆల్టిమీటర్ ను ఈ క్షిపణిలో అమర్చారు.
ప్రయోగాలు
[మార్చు]ఇప్పటి వరకు ఆరు నిర్భయ్ పరీక్షలు జరపగా మూడు విఫలమయ్యాయి. మూడు విజయవంతమయ్యాయి. ఆ వివరాలివి:
- మొదటి పరీక్ష– 2013 మార్చి 12– విఫలం– ప్రయాణంలో ఉండగా క్షిపణి కూలిపోయింది
- రెండవ పరీక్ష – 2014 అక్టోబరు 17– విజయవంతం – 100% పనితనం
- మూడవ పరీక్ష– 2015 అక్టోబరు 16 – విఫలం - క్షిపణి కూలిపోయింది
- నాలుగవ పరీక్ష - 2016 డిసెంబరు 21 - విఫలం - క్షిపణి కూలిపోయింది[4][5][6]
- 2017 నవంబరు 7 న నిర్వహించిన ఐదవ పరీక్ష విజయవంతమైంది. ఈ పరీక్షలో నిర్భయ్ క్షిపణి 50 నిముషాల పాటు ప్రయాణించి, 647 కి.మీ. దూరాన్ని అధిగమించింది.[7]
- 2019 ఏప్రిల్ 15 న జరిగిన ఆరవ పరీక్షలో నిర్భయ్ క్షిపణి 650 కి.మీ. దూరం ప్రయాణించింది. పరీక్ష స్ంపూర్ణంగా విజయవంతమైనట్లు డిఆర్‌డివో ప్రకటించింది.[8] నేలను హత్తుకుంటూను, నీటిపై రాసుకుంటూనూ ప్రయాణించ గల సామర్థ్యాలను కూడా ఈ ప్రయోగంలో విజయవంతంగా పరీక్షించారు.[9] దీనితో నిర్భయ్ క్షిపణి అభివృద్ధి పరీక్షలు పూర్తయ్యాయి. తరువాతి పరీక్షలు భారత రక్షణ దళాల అవసరాల మేరకు నిర్వహిస్తారు.[10]
మోహరింపు
[మార్చు]2020 సెప్టెంబరులో చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారతదేశం, తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి నిర్భయ్ క్షిపణులను పరిమిత స్థాయిలో మోహరించింది. దీనితో పాటు బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులను కూడా మోహరించింది.[11][12]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "India Develops Sub-sonic Stealth Cruise Missile". Archived from the original on 2012-03-10. Retrieved 2014-02-05.
- ↑ 3.0 3.1 "Nirbhay Cruise Missile". Indian Defense Projects Sentinel. Mar 7, 2012. Archived from the original on 2013-06-05. Retrieved March 10, 2012.
- ↑ "Nirbhay missile test "an utter failure"". Archived from the original on 2016-12-21. Retrieved 2016-12-21.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Subsonic cruise missile Nirbhay flight test fails". Archived from the original on 2016-12-21. Retrieved 2016-12-21.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Nuclear-capable Nirbhay cruise missile's test fails for the fourth time". Archived from the original on 2016-12-21. Retrieved 2016-12-21.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "India conducts successful flight test of Nirbhay cruise missile". Archived from the original on 2017-11-08. Retrieved 2017-11-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "పాకిస్థాన్ గుండెల్లో పిడుగు వేసిన భారత్...నిర్భయ్ క్షిపణి ప్రయోగం సక్సెస్". న్యూస్18 తెలుగు. 2019-04-15. Archived from the original on 2020-09-29. Retrieved 2020-09-29.
- ↑ "Sub-sonic cruise missile 'Nirbhay' successfully test-fired". The Hindu (in Indian English). Special Correspondent. 2019-04-16. ISSN 0971-751X. Retrieved 2019-08-26.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ "Nirbhay cruise missile to be tested with 'desi' engine in future". The Week. 16 April 2019. Retrieved 26 August 2019.
- ↑ "డ్రాగన్‌పై 'నిర్భయ' గురి..!". www.eenadu.net. Retrieved 2020-09-29.
- ↑ "ఎల్‌ఏసీకి బ్రహ్మోస్ క్షిపణి". ఆంధ్రజ్యోతి. 2020-09-29. Archived from the original on 2020-09-29. Retrieved 2020-09-29.