Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

అగ్ని-1

వికీపీడియా నుండి
అగ్ని-1
దస్త్రం:Agni-I launch.jpg
రకంమధ్యమ పరిధి బాలిస్టిక్ క్షిపణి
అభివృద్ధి చేసిన దేశంభారతదేశం
సర్వీసు చరిత్ర
సర్వీసులో2004[1]—present
వాడేవారుభారత సైనిక దళం
ఉత్పత్తి చరిత్ర
డిజైనరుభారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO)
తయారీదారుభారత్ డైనమిక్స్ లిమిటెడ్
ఒక్కొక్కదాని వెల 25-35 కోట్లు (INR) లేక $ 5.6-7.9 million (USD)[2]
విశిష్టతలు
బరువు12,000 కి.గ్రా.[3][4][5]
పొడవు15 మీ.[3][4][5]
వ్యాసం1.0 మీ.[4][5]
వార్‌హెడ్Strategic nuclear (15 kt to 250 kt), conventional HE-unitary, penetration, sub-munitions, incendiary or fuel air explosives

ఇంజనుఒకే దశ
ఆపరేషను
పరిధి
700-1250 km [3][4][6]
ఫ్లైట్ సీలింగు370 km[5]
ఫ్లైటు ఎత్తు~ 200 km [6]
వేగంమ్యాక్ 7.5 [6] or 2.5 km/s (Agni-I)[4]
గైడెన్స్
వ్యవస్థ
Ring Laser Gyro- INS (Inertial Navigation System), optionally augmented by GPS terminal guidance with possible radar scene correlation
కచ్చితత్వం25 మీ. వర్తుల దోష పరిధి [7]
లాంచి
ప్లాట్‌ఫారం
8 x 8 Tatra TELAR (Transporter erector launcher) Rail Mobile Launcher
అగ్ని క్షిపణుల పరిధి

అగ్ని-1, భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన మధ్యమ పరిధి బాలిస్టిక్ క్షిపణి. భారత సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దీన్ని తయారుచేసారు. ఈ ఒకే దశ క్షిపణిని కార్గిల్ యుద్ధం తరువాత తయారు చేసారు. 250 కి.మీ. ల పృథ్వి-2, 2500 కి.మీ.ల అగ్ని-2 మధ్య గల పరిధి అంతరాన్ని పూరించేందుకు ఈ క్షిపణిని తయారు చేసారు. 2002 జనవరి 25 న దీన్ని తొలిసారిగా ప్రయోగించారు. వీలర్ ఐలండ్‌లోని ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజి నుండి, రోడ్డు మొబైలు లాంచరు ద్వారా దీన్ని ప్రయోగించారు..[8]

చరిత్ర, అభివృద్ధి

[మార్చు]

చాందీపూర్ నుండి 1989 లో అగ్ని-1 ను మొదటిసారిగా ప్రయోగించారు. 1,000 కి.గ్రా.ల సాంప్రదాయిక లేదా అణు వార్‌హెడ్‌ను అది మోసుకుపోగలదు. 

అగ్ని-1 కి 700 – 1,250 కి.మీ. పరిధి ఉంది.[4][6] కనీస నిరోధ సామర్థ్యంలో అగ్ని-1 ఒక భాగమని భావిస్తారు.

అగ్ని-1 ఘన ఇంధన, ఒకటే దశ, రైలు రోడ్డు మొబైలు ద్వారా ప్రయోగించగల, మధ్యమ పరిధి బాలిస్టిక్ క్షిపణి. అగ్ని-2 అంతకు ముందే అభివృద్ధి  చెయ్యబడింది. DRDO 15 నెలల సమయంలో అగ్ని-1 ను అభివృద్ధి చేసింది.[9] MRV బాడీ-లిఫ్ట్ ఏరోడైనమిక్స్ దీనికి దిశా లోపాలను స్వయంగా  సరిదిద్దుకునే సామర్థ్యాన్ని, థెర్మల్ స్ట్రెస్‌లను తగ్గించుకునే సామర్థ్యాన్నీ ఇస్తాయి. MRV లో ఉన్న వేగ నియంత్రణ పాకేజీ ఈ లాంచి ట్రాజెక్టరీ వేరియన్సులను సరిచేస్తుంది. అగ్ని-1, 15 మీ. పొడవుతో 12 టన్నుల బరువు కలిగి 1,000 కి.గ్రా. వార్‌హెడ్‌ను మోసుకు పోగలదు.[4][5]  తక్కువ పేలోడుతో, కాంపోజైట్లతో  తయారైన బాడీతో ఈ క్షిపణి 1,500 కి.మీ. దూరాన్ని చేరగలదని అంచనా.[6]

ఆపరేషన్ చరిత్ర

[మార్చు]

భారత సైన్యం ఎప్పటికప్పుడు యూజరు పరీక్షలను నిర్వహిస్తూ ఉంటుంది. తన ఐబ్బందికి శిక్షణ ఇవ్వడంలో భాగంగా ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. వ్యూహాత్మక బలగాల కమాండ్ సాధారణంగా ఈ పరీక్షలు చేస్తుంది. DRDO ఇందు కవసరమైన లాజిస్టిక్ మద్దతు ఇస్తుంది.[10][11][12] 2007 అక్టోబరు 5 న మొదలైనప్పటి నుండి అనేక మార్లు ఈ పరీక్షలు జరిగాయి. 2015 నవంబరు 27 న ఓ పరీక్ష జరిగింది.[13] తరువాత 2016 మార్చి 14 న వీలర్ ఐలాండ్ లోని లాంచిపాడ్-4 నుండి మరో పరీక్షను నిర్వహించారు[14][15]

వాడుకదారులు

[మార్చు]

సికందరాబాదులోని వ్యూహాత్మక బలగాల కమాండ్ నేతృత్వంలో ఉన్న 334 క్షిపణి గ్రూపు, అగ్ని-1 క్షిపణిని వాడుతుంది[7] [3][4][10]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Dikshit, Sandeep (5 July 2004). "Army's missile group to maintain Agni A-1". The Hindu. Archived from the original on 4 ఫిబ్రవరి 2015. Retrieved 4 February 2015.
  2. "Technical tune to Agni test before talks". Calcutta, India: The Telegraph. 30 August 2004. Archived from the original on 11 December 2007. Retrieved 2007-12-13.
  3. ఇక్కడికి దుముకు: 3.0 3.1 3.2 3.3 "India successfully test-fires Agni I ballistic missile". Indian Express. Nov 25, 2010. Retrieved 19 October 2011.
  4. ఇక్కడికి దుముకు: 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 "India test-fires nuclear-capable Agni-I missile". The Times of India. Nov 25, 2010. Archived from the original on 2012-11-04. Retrieved 19 October 2011.
  5. ఇక్కడికి దుముకు: 5.0 5.1 5.2 5.3 5.4 "India successfully test-fired Agni-I". Asian Tribune. 5 July 2004. Archived from the original on 31 మే 2012. Retrieved 20 October 2011.
  6. ఇక్కడికి దుముకు: 6.0 6.1 6.2 6.3 6.4 "Nuclear-Capable Agni-1 Ballistic Missile's Range Can Be Extended To 1500 Km". Aa Me, In. 2012-11-28. Retrieved 2012-12-04.
  7. ఇక్కడికి దుముకు: 7.0 7.1 "Agni-1". MissileThreat. Archived from the original on 2012-10-18. Retrieved 2012-12-04.
  8. T. S. Subramanian (2 February 2002). "The significance of Agni-I". Frontline. Retrieved 3 February 2015.
  9. Subramanian, T.S. (13 July 2012). "Agni-I a success". The Hindu. Chennai, India. Retrieved 28 July 2012.
  10. ఇక్కడికి దుముకు: 10.0 10.1 Subramanian, T S (December 1, 2011). "Strategic Forces Command test fires Agni". The Hindu. Chennai, India. Retrieved 1 December 2011.
  11. "Agni 1 Missile Test Fired, Part of Army User Trials-India Defence Dated:25 Nov 2010". India-defence.com. Retrieved 2012-12-04.
  12. "Successful test-firing of Agni-I". Deccan Herald. 13 July 2012. Retrieved 13 July 2012.
  13. http://indiatoday.intoday.in/story/agni-i-nuclear-capable-missile-test-fired-successfully-in-odisha/1/532763.html
  14. "India successfully test-fires Agni-I ballistic missile". IBNLive. Archived from the original on 2016-03-15. Retrieved 2016-03-14.
  15. "India successfully test-fired Agni-I ballistic missile". Jagranjosh.com. Archived from the original on 2016-03-14. Retrieved 2016-03-14.
"https://te.wikipedia.org/w/index.php?title=అగ్ని-1&oldid=4299365" నుండి వెలికితీశారు