అగ్ని-2
అగ్ని-2 | |
---|---|
రకం | మధ్య పరిధి బాలిస్టిక్ క్షిపణి |
అభివృద్ధి చేసిన దేశం | భారత దేశం |
సర్వీసు చరిత్ర | |
వాడేవారు | భారత సైన్యం |
ఉత్పత్తి చరిత్ర | |
డిజైనరు | భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) |
తయారీదారు | భారత్ డైనమిక్స్ లిమిటెడ్ |
ఒక్కొక్కదాని వెల | ₹25–35 కోట్లు[1] |
విశిష్టతలు | |
బరువు | 16,000 కి.గ్రా. (1,000 కి.గ్రా. వార్‌హెడ్‌తో సహా) |
పొడవు | 21 మీ.[2] |
వ్యాసం | 1.3 మీ.[3] |
వార్‌హెడ్ | Strategic nuclear (15 kt to 250 kt), conventional HE-unitary, penetration, sub-munitions, incendiary or fuel-air explosives |
ఇంజను | రెండున్నర దశల ఘన ఇంధన ఇంజను |
వింగ్స్పాన్ | తెలియదు |
ఆపరేషను పరిధి | 2,000–3,000 km[2][4] |
ఫ్లైట్ సీలింగు | 405కి.మీ. [3] |
ఫ్లైటు ఎత్తు | 230కి.మీ. [2] |
వేగం | ~mach 12 or 3.9 km/s (Agni-II)[3][5] |
కచ్చితత్వం | 30–40 మీ. (తాజా కూర్పు) |
లాంచి ప్లాట్‌ఫారం | 8 x 8 Tata TELAR (Transporter erector launcher) Rail Mobile Launcher |
అగ్ని-2 ఒక వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి. భారత క్షిపణి ఆధారిత వ్యూహత్మక అణు నిరోధకంలో అగ్ని శ్రేణి క్షిపణులు కీలకమైనవి. అగ్ని-2, రెండు దశల, ఘన ఇంధన చోదిత, మధ్య పరిధి బాలిస్టిక్ క్షిపణి. పోస్ట్ బూస్ట్ వాహనం (PBV) పునఃప్రవేశ వాహనం (RV) తో సమకూర్చబడింది. అగ్ని-2ఎ, అగ్ని-2 కంటే ఆధునికమైనది. మరింత తేలికైన పదార్థాలతో తయారైన ఈ క్షిపణి పరిధి ఎక్కువగా ఉంటుంది. ఈ అగ్ని-2ఎ పేరునే తరువాతి కాలంలో అగ్ని-4 గా మార్చారు. ఇది అగ్ని-2, అగ్ని-3 ల మధ్య అంతరాన్ని పూరిస్తుంది. 2010 డిసెంబరులో చేసిన అగ్ని-2 పరీక్ష విఫలం కాగా, 2011 నవంబరులో చేసిన రెండవ పరీక్ష విజయవంతమైంది[6] అగ్ని-2 ను భారత సాయుధ బలగాల్లోకి చేర్చుకున్నారు.[7]
పరీక్షలు
[మార్చు]1999 ఏప్రిల్ 11 న అగ్ని-2 ను పరీక్షించారు. పరీక్షకు అనుగుణంగా మార్పులు చేసిన రైలు కోచ్ నుండి ఈ పరీక్ష జరిపారు. 2000 కి.మీ. పరిధిలో పరీక్షించిన అగ్ని-2 పూర్తిగా ఘన ఇంధనంతో పనిచేస్తుంది. 2001 జనవరి 17 నాటి పరీక్ష తరువాత క్షిపణి ఉత్పత్తికి ఆమోదం ఇచ్చారు. సంవత్సరానికి 12 క్షిపణుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఆ నాటి పరీక్షలో 700 కి.గ్రా. వార్‌హెడ్‌ను 2,100 కి.మీ. దూరానికి మోసుకెళ్ళింది. రైలు మొబైల్ లాంచరునుండి ప్రయోగించినప్పటికీ, అగ్ని-2 కు రోడ్డు మొబైలు లాంచరు నుండి ప్రయోగించే రూపు కూడా ఉంది. అగ్ని-2 ఎల్లప్పుడూ ప్రయోగ సన్నద్ధ స్థితిలో ఉంటుంది. 15 నిముషాల్లో అగ్ని-2 ను ప్రయోగించవచ్చు. అదే అగ్ని-టిడిని సన్నద్ధం చేసేందుకు ఒక పూట పట్టేది. అగ్ని-2 ఉత్పత్తి ప్రారంభించినట్లు 2002 మార్చి 14 న అప్పటి రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ పార్లమెంటులో ప్రకటించాడు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అగ్ని-2 ను ఉత్పత్తి చేస్తోంది. సంవత్సరానికి 18 క్షిపణుల సామర్థ్యంతో, ఒక్కొక్కటి ₹ 35 కోట్ల ఖర్చుతో వీటిని ఉత్పత్తి చేస్తోంది.
భారత సైన్యం 2009 మే 19 న అగ్ని-2 వాడుకరి పరీక్షలు మొదలు పెట్టింది. మొదటి పరీక్ష విఫలమైంది[8] రెండవ దశ సరిగ్గా పనిచెయ్యలేదు. వెంటనే చేపట్టిన రెండవ పరీక్ష కూడా అలాగే విఫలమైంది.[9] 2010 మే 17 న చేసిన క్షిపణి పరీక్ష విజయవంతమైంది. 660 సెకండ్ల ప్రయాణంలో క్షిపణి పూర్తి పరిధిని చేరుకుని, లక్ష్యాన్ని చేరుకుంది.[10]
2011 సెప్టెంబరు 30 న అగ్ని-2 ను మరోసారి విజయవంతంగా పరీక్షించారు. రైలు మొబైలు లాంచరు నుండి ప్రయోగించిన క్షిపణి 2,000 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని 10 నిముషాల్లో ఛేదించింది. అన్ని ప్రయోగ లక్ష్యాలనూ సాధించింది[11] 2012 ఆగస్టు 9 న వ్యూహాత్మక బలగాల కమాండ్ మరో విజయవంతమైన పరీక్ష చేసింది.
2013 ఏప్రిల్ 7 న వ్యూహాత్మక బలగాల కమాండ్ మరోసారి అగ్ని-2 ను విజయవంతంగా పరీక్షించింది.[12]
ప్రొపల్షన్
[మార్చు]మొదటి దశ: అగ్ని-2 మొదటి దశలో ఘన ఇంధనాన్ని వాడుతుంది.[13]
రెండవ దశ: రెండవ దశ 4,200 కి.గ్రా. బరువుంటుంది. ఘన ఇంధనం వాడుతుంది. ఈ దశలో దిశ నియంత్రణకు ఫ్లెక్స్ నాజిళ్ళుంటాయి.
అగ్ని-RV Mk 2 విశేషాంశాలు
[మార్చు]పునఃప్రవేశ వాహనానికి ఉండే రెక్కల వలన కింది అనుకూలతలు కలుగుతాయి;
- బాలిస్టికేతర పథంలో ప్రయాణం చెయ్యడం వలన దాన్ని అడ్డుకోవడం మరింతగా కష్టమౌతుంది.
- హైపర్‌సోనిక్ వేగంతో ప్రయాఅణించేటపుడు ఉష్ణ, భౌతిక వత్తిడులను తగ్గించేలా బాడీని తగు కోణంలో ఉంచుతుంది.
- పథంలో ఉండే దోషాలను ప్రయాణపు చివరి దశలో కూడా సరిచేయవచ్చు.
- ఛేదనకు ముందు చేసే విన్యాసం కారణంగా లక్ష్యాన్ని మరింత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఈ విధంగా వర్తుల దోష పరిధి తగ్గుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ "Technical tune to Agni test before talks". Calcutta, India: The Telegraph. 30 August 2004. Archived from the original on 11 December 2007. Retrieved 13 December 2007.
- ↑ 2.0 2.1 2.2 Mallikarjun, Y. (18 May 2010). "Agni-II missile test-fired successfully". The Hindu. Chennai, India. Retrieved 20 October 2011.
- ↑ 3.0 3.1 3.2 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;bharat-rakshakagni2
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-18. Retrieved 2016-12-21.
- ↑ Vishwakarma, Arun (1 జూలై 2007). "Indian Long Range Strategic Missiles" (PDF). Lancer Publishers and Distributors. Archived from the original (PDF) on 29 నవంబరు 2007. Retrieved 21 డిసెంబరు 2016.
- ↑ T.S. Subramanian (2011-11-15). "Missile success". Thehindu.com. Retrieved 2012-09-20.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;thehindu1
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Agni-II 'flunks' trial". The New Indian Express. 2009-05-20. Archived from the original on 2016-01-15. Retrieved 2012-09-20.
- ↑ "Nov 2009 Agni-II night trial ends in failure". Hindu.com. 2009-11-25. Archived from the original on 2009-11-28. Retrieved 2012-09-20.
- ↑ Mallikarjun, Y. (17 May 2010). "Agni-II missile test-fired successfully". The Hindu. Chennai, India. Archived from the original on 20 May 2010. Retrieved 17 May 2010.
- ↑ Subramanian, T.S.; Mallikarjun, Y. (30 September 2011). "News / National : Agni-II soars in success". The Hindu. Chennai, India. Retrieved 20 October 2011.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-06-28. Retrieved 2016-12-21.
- ↑ "New kid on the nuclear block". The Hindu. Chennai, India. 18 November 2011. Retrieved 4 December 2011.