శౌర్య క్షిపణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శౌర్య క్షిపణి
దస్త్రం:Shaurya Missile.jpg
శౌర్య క్షిపణి తొలి ప్రయోగ పరీక్ష
రకంసంకర జాతి క్రూయిజ్ క్షిపణి[1]
భూమి నుండి భూమికి ప్రయోగించే క్షిపణి
అభివృద్ధి చేసిన దేశంIndia
సర్వీసు చరిత్ర
వాడేవారుభారతీయ సాయుధ బలగాలు
ఉత్పత్తి చరిత్ర
తయారీదారుభారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ
తయారీ తేదీ2011
విశిష్టతలు
బరువు6.2 ట. (6.8 short tons)[2]
పొడవు10 మీ. (33 అ.)[2][3]
వ్యాసం0.74 మీ. (2.4 అ.)[2]
వార్‌హెడ్180 to 1000 kg [4]

ఇంజనురెండు దశల ఘన ఇంధన చోదితం
ఆపరేషను
పరిధి
700 km[2][5] @ 1000 kg and 1900 km @ 180 kg [6][7]
ఫ్లైటు ఎత్తు40 కి.మీ. [2]
వేగంMach 7.5 (9,190 km/h; 5,710 mph; 2.55 km/s)[2]
గైడెన్స్
వ్యవస్థ
రింగ్ లేజర్ గైరో INS 30 m CEP[8]
లాంచి
ప్లాట్‌ఫారం
Canisterised launch from TEL or underground silo[2]

శౌర్య క్యానిస్టరు నుండి, భూమి నుండి భూమ్మీదకు ప్రయోగించే, వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి. అయితే మామూలు బాలిస్టిక్ క్షిపణిలాగా కాకుండా దీని ప్రయాణమంతా ఇంజను పనిచేస్తూనే ఉంటుంది. టర్మినల్ గైడెన్స్ వ్యవస్థను వాడుకుంటూ లక్ష్యంపై దాడి చేస్తుంది. అందుచేత దీన్ని క్రూయిజ్ క్షిపణిగా కూడా వర్గీకరించవచ్చు. అయితే క్రూయిజ్ క్షిపణులు గాలిని పీల్చుకుని ఇంధనంతో మండించి థ్రస్టును ఉత్పత్తి చేస్తాయి. కాని శౌర్య ఘన ఇంధనాన్ని వాడుకుని బాలిస్టిక్ పథంలో ప్రయాణిస్తుంది. అందుచేత దీన్ని బాలిస్టిక్ క్షిపణిగానే భావిస్తారు. దీన్ని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసింది. దానికి 750 నుండి 1,900 కి.మీ. పరిధి ఉంది. [6]  ఒక టన్ను సాంప్రదాయిక లేదా అణు వార్‌హెడ్‌ను మోసుకుపోగలదు.[9] శౌర్య మధ్యమ పరిధిలోని లక్ష్యాలను ఛేదించ గలదు.[3][10]

వివరం

[మార్చు]

జలాంతర్గామి నుండి ప్రయోగించే సాగరిక క్షిపణి యొక్క భూ రూపమే శౌర్య అని భావిస్తున్నారు.[11] అయితే దీన్ని DRDO ఖండించింది. [7] శౌర్యను క్యానిస్టరులో దాచుతారు. అందుచేత దాన్ని రవాణా చెయ్యడం తేలిక. క్యానిస్టరు నుండి క్షిపణి బయటికి రాగానే దానిలోని ఘన ఇంధన మోటారు పనిచెయ్యడం మొదలు పెట్టి క్షిపణిని లక్ష్యం వైపు తీసుకుపోతుంది.

శౌర్య పరిధి తక్కువగా ఉండడం వలన దాని సైలోలను భారత దేశపు సరిహద్దుకు దగ్గరగా ఉంచాలి. లేదా దాని పరిధిని మరింత పెంచాలి. రెండు దశల, అత్యంత వేగవంతమైన శౌర్య తన పథాన్ని తేలిగ్గా మార్చుకుంటూ పోగలదు. ఆ విధంగా క్షిపణి వ్యతిరేక రక్షణ వ్యవస్థల దాడి నుండి తప్పించుకోగలదని రక్షణ శాస్త్రవేత్తలు తెలిపారు.[12] తక్కువ ఎత్తులో కూడా శౌర్య మ్యాక్ 7.5 వేగాన్ని అందుకోగలదు. 2008 నవంబరు 12 న చేసిన ప్రయోగంలో అది 300 కి.మీ. దూరాన్ని చేరేసరికి మ్యాక్ 5 వేగాన్ని అందుకుంది. ఉపరితల ఉష్ణోగ్రత 700° సెల్సియస్ కు చేరింది. ఈ ఉష్ణాన్ని ఉపరితలమంతా సమానంగా వ్యాపింపజేసేందుకు  క్షిపణి గుండ్రంగా తిరిగింది. ఉచ్ఛస్థాయి నేవిగేషన్, గైడెన్స్ వ్యవస్థలతో, సమర్ధమైన ప్రొపల్షన్ వ్యవస్థతో, అత్యుత్తమ నియంత్రణ వ్యవస్థతో, క్యానిస్టరు ప్రయోగంతో శౌర్య క్షిపణి ఒక సంక్లిష్టమైన వ్యవస్థగా రూపొందింది. దీన్ని TEL (ట్రాన్స్‌పోర్టర్, ఎరెక్టర్, లాంచర్) వాహనంపై తేలికగా రవాణా చెయ్యవచ్చు. ఆ వాహనం నుండే క్షిపణిని ప్రయోగించనూ వచ్చు. ఈ ఏక వాహన వ్యవస్థ కారణంగా దీన్ని మోహరించడం తేలిక, ఉపగ్రహాల ద్వారా కనుక్కోవడం శత్రువుకు కష్టం.

శౌర్య క్షిపణి వ్యవస్థలో ఉన్న అనేక కొత్త సాంకేతికాలలో ప్రధానమైంది, రింగ్ లేజర్ గైరోస్కోప్, యాక్సెలరోమీటర్. దీన్ని హైదరాబాదు లోని రీసెర్చి సెంటర్ ఇమారత్ లో పరీక్షించి, క్షిపణితో మేళవించారు.[9] శౌర్య క్షిపణిని జలాంతర్గాముల నుండి ప్రయోగించేందుకు అనువుగా డిజైను చేసారని వెల్లడైంది. సీనియర్ DRDO శాస్త్రవేత్త దీన్ని ధ్రువీకరిస్తూ, 50 కి.మీ. ఎత్తుకు చేరాక క్షిపణి హైపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి లాగా ప్రయాణిస్తుంది. లక్ష్యం దాపులకు చేరగానే లక్ష్యం వైపుకు తిరిగి 20, 30 మీటర్ల కచ్చితత్వంతో లక్ష్యాన్ని కొట్టేస్తుంది.[5]

పరీక్ష

[మార్చు]

2011 సెప్టెంబరు 24 న క్షిపణిని మూడవసారి దాని పూర్తి రూపంలో విజయవంతంగా ప్రయోగించారు. అది మ్యాక్ 7.5 తో ప్రయాణించి, 700 కి.మీ దూరాన్ని 500 సెకండ్లలో పూర్తి చేసింది. ఈ పరీక్ష తరువాత శౌర్య భారత నౌకా దళంలో మోహరింపుకు సిద్ధమైంది.[2]

ఉత్పత్తి

[మార్చు]
శౌర్య క్షిపణి పరిధి - పేలోడ్ గ్రాఫ్

క్షిపణి యొక్క మొదటి బ్యాచ్ ఉత్పత్తి మొదలైంది. 2011 సెప్టెంబరు 24 న బ్యాచి లోంచి ఒక క్షిపణిని తీసి పరీక్షించారు.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు వనరులు

[మార్చు]
  1. "Shaurya surfaces as India's underwater nuclear missile". Business Standard News.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 Shaurya missile launch successful
  3. 3.0 3.1 ""Shourya missile cannot be easily detected"". Archived from the original on 2008-12-16. Retrieved 2016-07-30.
  4. [1]
  5. 5.0 5.1 "Shaurya surfaces as India's underwater nuclear missile - 1 - National News – News – MSN India". Archived from the original on 2012-03-27. Retrieved 2016-07-30.
  6. 6.0 6.1 http://www.indiaresearch.org/Shourya_Missile.pdf
  7. 7.0 7.1 "India successfully test-fires ballistic missile". RIA Novosti. 12 November 2008. Retrieved 13 November 2013.
  8. http://www.nti.org/media/pdfs/design_characteristics_of_india_ballistic_cruise_missiles.pdf?_=1415821730
  9. 9.0 9.1 Missile success - Frontlineonnet[permanent dead link]
  10. "India successfully test fires 'Shaurya' missile". expressindia.com. November 12, 2008. Archived from the original on 2012-09-16. Retrieved 2016-07-30.
  11. Subramanian, T.S. (13 November 2008). "Shourya test-fired successfully". The Hindu. Archived from the original on 16 డిసెంబరు 2008. Retrieved 13 November 2013.
  12. Pandit, Rajat (November 13, 2008). "India successfully test fires Shaurya missile". Times of India. Archived from the original on 2011-10-10. Retrieved 2016-07-30.