అగ్ని-3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అగ్ని-3
రకంమధ్యంతర పరిధి బాలిస్టిక్ క్షిపణి
ఉద్భవించిన దేశంభారతదేశం
సర్వీసు చరిత్ర
సర్వీసులోActive[1]
వాడేవారువ్యూహాత్మక బలగాల కమాండ్
ఉత్పత్తి చరిత్ర
డిజైనరుభారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO)
తయారీదారుBharat Dynamics Limited
ఒక్కొక్కదాని వెల250 మిలియను (US$4 million) – 350 మిలియను (US$5 million)[2]
విశిష్టతలు
బరువు22,000 కి.గ్రా. (Operational Version)[3]
పొడవు17 మీ[4]
వ్యాసం2.0 m[4]
వార్‌హెడ్వ్యూహాత్మక, అణ్వాయుధ (15 to 250 కిలోటన్ను) (2000 to 2500 కి.గ్రా.), సాంప్రదాయిక, థెర్మోబారిక్

ఇంజనురెండు ఘన ఇంధన దశలు
ప్రొపెల్లెంటుsolid HTPB[5]
ఆపరేషను
పరిధి
3,500 కి.మీ. – 5,000 కి.మీ.[6]
ఫ్లైటు ఎత్తు> 450 కి.మీ.[7]
వేగం5–6 కి.మీ./సె [8]
గైడెన్స్
వ్యవస్థ
Ring Laser Gyro- INS (Inertial Navigation System), optionally augmented by GPS, terminal guidance with possible radar scene correlation
స్టీరింగు
వ్యవస్థ
flex-nozzle Thrust vectoring(first and second stage)[5]
కచ్చితత్వం40 మీ కంటే తక్కువ[9]
లాంచి
ప్లాట్‌ఫారం
8 × 8 TELAR (Transporter erector launcher) Rail Mobile Launcher

అగ్ని-3 భారత్ అభివృద్ధి చేసిన మధ్యంతర పరిధి బాలిస్టిక్ క్షిపణి. అగ్ని శ్రేణిలో వచ్చిన ఈ మూడవ క్షిపణికి[6] 3,500 కి.మీ. - 5,000 కి.మీ. పరిధి ఉంది.[10] పొరుగు దేశాల సరిహద్దుల నుండి బాగా దూరంలో గల లక్ష్యాలను ఇది ఛేదించగలదు.[11] ఈ క్షిపణి వర్తుల దోష పరిధి 40 మీటర్ల లోపే. ఈ పరిధి క్షిపణులలో ప్రపంచంలోకెల్లా అత్యంత పదునైన క్షిపణి ఇది.[12] 2011 జూన్‌లో అగ్ని-3 ను సాయుధ బలగాల్లోకి తీసుకుని మోహరించినట్లుగా వార్తలు వెలువడ్డాయి.[13]

పరిచయం[మార్చు]

భారత్ యొక్క కనీస అణ్వస్త్ర నిరోధ కార్యక్రమంలో అణుత్రయం ఒక భాగం. అణుత్రయంలో సుదూర పరిధి క్షిపణి ఒకటి అవసరం. దేశంలో ఏ మూల నుండైనా, దేశానికి చెందిన ద్వీపాల నుండైనా, ప్రపంచంలో  ఏ మూలన  ఉన్న భారత నౌకాదళ యుద్ధ నౌకల నుండైనా  ప్రయోగించగలిగే సామర్థ్యం ఉండాలి. ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఎక్కువ పేలోడుతో, ఎక్కువ పరిధితో, లావుగా పొట్టిగా ఉండే అగ్ని-3 క్షిపణిని రూపొందించారు.  శత్రువు యొక్క బాలిస్టిక్ క్షిపణి వ్యతిరేక వ్యవస్థలకు అందకుండా దాడి చెయ్యగలిగే సామర్థ్యం కూడా ఈ క్షిపణికి ఉండాలి. అలాంటి సామర్థ్యం ఉండాలంటే, ఈ క్షిపణికి MIRV వంటి సామర్థ్యం ఉండాలి.

వివరాలు[మార్చు]

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన అగ్ని-3, అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యం కలిగిన రెండు దశల బాలిస్టిక్ క్షిపణి. DRDO కు చెందిన అడ్వాన్‌స్డ్ సిస్టమ్స్ లాబొరేటరీ లో అగ్ని-3 ని రూపొందించి, అభివృద్ధి చేసారు. ఈ సంస్థను 2001 సెప్టెంబరులో భారీ రాకెట్ మోటార్లను తయారు చేసే ధ్యేయంతో ఏర్పాటు చేసారు. ఘన ఇంధన మోటార్ల కోసం ప్రొపల్షన్ ప్లాంటును ASL తయారు చేసింది. ఈ రెండు దశల ఘన ఇంధన క్షిపణి, చిన్నదిగా, పొందికగా ఉండి, తేలికగా ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగే విధంగాను, భూమిపైన, భూమి లోపలా కూడా తేలిగా మోహరించగలిగేలానూ ఉంటుంది.[14]

ఈ క్షిపణిలో ఆధునిక దిశానిర్దేశ, నియంత్రణ వ్యవస్థలు, కంప్యూటరు వ్యవస్థలు ఉంటాయి. ఈ వ్యవస్థలన్నిటినీ ప్రకంపనాలను, ఉష్ణాన్ని, మోతలనూ తట్టుకునేలా రూపొందించారు. 2010 ఫిబ్రవరి 7 న జరిపిన పరీక్షలో, రింగ్ లేసరు గైరో ఆధారంగా పనిచేసే దిశానిర్దేశ వ్యవస్థను పరీక్షించారు.[15]

అగ్ని-3, 2 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఈ వ్యాసం కారణంగా ఈ క్షిపణిని భారత్ అభివృద్ధి చేసిన 2.3 మీ. వ్యాసంగల లాంచ్ వ్యవస్థల నుండి ప్రయోగించవచ్చు. 

క్షిపణి రూపకల్పన చేసిన తొలినాళ్ళలో మొదటి దశ 7.7 మీ. పొడవుతో, 32 టన్నుల బరువు కలిగి ఉండేది. రెండవ దశ 3.3 మీ. పొడవు, 10 టన్నుల బరువూ కలిగి ఉండేది. ఈ క్షిపణి వివిధ పరిధి-పేలోడు కలయికలను ప్రయోగించవచ్చు. 4,500 కి.మీ. అత్యధిక పరిధి, 2490 కి.గ్రా. అత్యధిక పేలోడునూ కలిగి ఉంటుంది.[6]

బరువును తగ్గించి తిరిగి రూపకల్పన[మార్చు]

DRDO అగ్ని-3 రూపకల్పనలో విస్తృతమైన మెరుగుదల చర్యలు చేపట్టింది. ఇంజను వ్యవస్థను తిరిగి రూపొందించింది. మేరేజింగ్ స్టీలును వాడారు. కాంపోజిట్ రాకెట్ మోటారును వాడారు. ఈ చర్యలతో, అగ్ని-3 బరువు 22 టన్నులకు తగ్గింది.[3]

ప్రొపల్షన్[మార్చు]

 అగ్ని-3 లో రెండు ఘన ఇంధన దశలుంటాయి. మొదటి దశ బూస్టరును కాంపోజిట్ పదార్థాలతో తయారు చేసారు. రెండవ దశ మేరేజింగ్ స్టీలుతో తయారైంది. రెండవ దశలో వెక్టరింగ్ నాజిళ్ళు ఉన్నాయి. ఇవి, క్షిపణి  గమన దిశను నియంత్రిస్తాయి. 

పునఃప్రవేశ వాహనం అగ్ని RV Mk 4[మార్చు]

అగ్ని-3 అనేక రకాల ఆయుధాలను మోసుకుపోగలదు. డీకాయ్‌లు, క్షిపణి నిరోధ వ్యవస్థల నుండి తప్పించుకునే పరికరాలతో సహా ఇది 600 కి.గ్రా నుండి 1,800 కి.గ్రా. వరకు పేలోడును తీసుకుపోగలదు. అగ్ని-3 పునఃప్రవేశ వాహనం వేగ నియంత్రక, దిశానిర్దేశక, పునఃప్రవేశ నియంత్రణ వ్యవస్థలు కలిగి స్వయంసమృద్ధంగా ఉంటుంది.

తేలికగాను, దృఢంగానూ ఉండే పునఃప్రవేశ వాహనానికి కార్బన్ కాంపోజిట్లతో కూడిన ఉష్ణ కవచం ఉంటుంది. ఇవి 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకోగలవు.

కె-4 జలాంతర్గామి ప్రయోగిత బాలిస్టిక్ క్షిపణి[మార్చు]

కె-4, కె క్షిపణుల శ్రేణిలో భాగంగా అభివృద్ధి చేసిన క్షిపణులలో ఒకటి.[16] అగ్ని-3 యొక్క జలాంతర్గామి కూర్పును అభివృద్ధి చెయ్యడంపై DRDO దృష్టి పెట్టింది. దీనితో భారత్‌కు సముద్రం నుండి అణ్వాయుధాలను ప్రయోగించగల ఎదురుదాడి సామర్థ్యం కలుగుతుంది.[17] 3,500 కి.మీ. పరిధి గల కె-4 క్షిపణిని 2016 మార్చి 31 న  విశాఖపట్నం వద్ద అరిహంత్ జలాంతర్గామి నుండి విజయవంతంగా ప్రయోగించారు. 5,000 కి.మీ. పరిధిగల కె-4 క్షిపణి అభివృద్ధి దశలో ఉంది.[18]

పరీక్షా ప్రయోగాలు[మార్చు]

అగ్ని క్షిపణుల పరిధి

2006 జూలై 9 న మొదటిసారి అగ్ని-3 పరీక్ష జరిగింది. అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఈ పరీక్ష జరిగింది.[6] క్షిపణి లక్ష్యాన్ని చేరలేదు, సముద్రంలో పడిపోయి,  ప్రయోగం  విఫలమైంది. వేడి వాయువులు క్షిపణి కవచంలోకి వెళ్ళి మొదటి దశలోని ఎలక్ట్రానిక్ పరికరాలను నాశనం చెయ్యడంతో  ఏర్పడిన లోపం వలన, ఈ ప్రయోగం విఫలమైందని DRDO వెల్లడించింది.[19] క్షిపణి ప్రయాణించవలసిన 15 నిముషాల కాలానికి గాను 5 నిముషాలే ప్రయాణించడం వలన ఈ ప్రయోగం పాక్షిక విజయం సాధించిందని  భారత  రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించాడు.[20]

2007 ఏప్రిల్ 12 న చేసిన రెండవ ప్రయోగం విజయవంతమైంది. భారత ప్రభుత్వ రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీ[21] "3,000 కి.మీ. దూరాన ఉన్న లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగల ఈ క్షిపణితో భారత అణునిరోధక సామర్థ్యపు విస్తృతి నిరూపితమైంది" అని ప్రకటించింది.[22]

2008 మే 7 న జరిగిన అగ్ని-3 మూడవ పరీక్ష కూడా విజయవంతమైంది.[23] ఒరిస్సాలోని బాలసోర్ నుండి చేసిన ఈ ప్రయోగంలో[24] క్షిపణి సెకండుకు 5,000 మీటర్ల వేగంతో ప్రయాణించింది. క్షిపణిలో అమర్చిన కొత్త సాఫ్టువేరు, దిశానిర్దేశక వ్యవస్థలు మరింత కచ్చితత్వాన్ని, మరింత వినాశకశక్తినీ కలిగించాయి.[25] ఈ విజయం, 5,000–6,000 కిమీ. పరిధి గల ఖండాంతర క్షిపణి, అగ్ని-5 అభివృద్ధికి తలుపులు తెరిచింది .[26]

2009 ఆగస్టులో తలపెట్టిన అగ్ని-3 పరీక్షను ఆపేసారు. కారణాలు తెలియరాలేదు.[27]

2010 ఫిబ్రవరి 7 న అగ్ని-3 ని నాలుగోసారి విజయవంతంగా ప్రయోగించారు. క్షిపణి ప్రయోగ ధ్యేయాలన్నిటినీ చేరుకుని, లక్ష్యాన్ని చక్కటి కచ్చితత్వంతో ఛేదించింది. లక్ష్యానికి దగ్గర్లో ఉంచిన రెండు నౌకలు క్షిపణి తన లక్ష్యాన్ని  చేదిస్తూండగా గమనించాయి.[28]  ఈ పరీక్ష ద్వారా అణ్వాయుధాన్ని ట్రిగ్గరు చేసే మెకానిజాన్ని పరీక్షించారు.[7] భారత సైన్యంలోకి అగ్ని-3 ని చేర్చుకునే ముందు చేపట్టే పరీక్షల్లో భాగం ఈ పరీక్ష.[29]

అగ్ని-3 మోహరింపుకు సిద్ధంగా ఉందని 2010 ఆగస్టులో భారత రక్షణ మంత్రి ప్రకటించాడు.[30] ఈ క్షిపణిని సాయుధ బలగాల్లోకి చేర్చారని 2011 జూన్‌లో వార్తలు వచ్చాయి.[13]

అగ్ని-3 క్షిపణులతో కూడిన ఒక క్షిపణి బలగాన్ని ఏర్పాటు చేస్తున్నారని 2012 సెప్టెంబరులో వార్తలు వచ్చాయి.[31]

2012 సెప్టెంబరు 21 న వ్యూహాత్మక బలగాల కమాండ్ తన శిక్షణా ప్రయోగాల్లో భాగంగా అగ్ని-3 ను రైలు మొబైలు లాంచరు ద్వారా ప్రయోగించింది. ఉత్పత్తి చేసిన క్షిపణులలోంచి ఒకదాన్ని ఎంచుకుని,  ఈ ప్రయోగం చేసారు. క్షిపణి అన్ని ధ్యేయాలనూ అందుకుని, లక్ష్యాన్ని రెండకెల కచ్చితత్వంతో ఛేదించింది.[32]

2013 డిసెంబరు 23 న వ్యూహాత్మక బలగాల కమాండ్ అగ్ని-3 ను విజయవంతంగా పరీక్షించింది.[33]

2015 ఏప్రిల్ 16 న వ్యూహాత్మక బలగాల కమాండ్ మళ్ళీ పరీక్షించింది. అబ్దుల్ కలాం ద్వీపం నుండి చేసిన ప్రయోగం విజయవంతమైందని ఇంటెరిం టెస్ట్ రేంజి డైరెక్టరు ఎం వి కె వి ప్రసాద్ తెలిపారు.[34]

మూలాలు[మార్చు]

 1. Subramanian, T.S. (2006). "Agni-V next". Frontline, The Hindu. Retrieved 30 April 2012.
 2. "Technical tune to Agni test before talks". Calcutta, India: The Telegraph. 30 August 2004. Archived from the original on 11 December 2007. Retrieved 2007-12-13.
 3. 3.0 3.1 Agni-V vital: Tessy Thomas
 4. 4.0 4.1 "India tests long-range nuclear-capable Agni-III missile". Yahoo News. Archived from the original on 9 February 2010. Retrieved 2010-02-07.
 5. 5.0 5.1 Brügge, Norbert. "India's solid-fuel ballistic missile-family "Agni"". Presentation of Space Launch Vehicles. Archived from the original on 8 December 2015. Retrieved 29 November 2015.
 6. 6.0 6.1 6.2 6.3 "Agni-III test fired by India". The Indian Express. Archived from the original on 13 July 2006. Retrieved 2006-07-09. ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "expressindia.com" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "expressindia.com" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "expressindia.com" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 7. 7.0 7.1 Subramanian, T. S. (7 February 2010).
 8. Vishwakarma, Arun (1 July 2007). "Indian Long Range Strategic Missiles" (PDF). Lancer Publishers and Distributors. Archived from the original (PDF) on 29 నవంబర్ 2007. Retrieved 2007-12-13. Check date values in: |archivedate= (help)
 9. http://www.army-technology.com/projects/agniballisticmissile/[నమ్మదగని మూలం?][permanent dead link]
 10. "Agni-3".
 11. "Agni – India Missile Special Weapons Deilivery System".
 12. "Successful Agni-III missile tests provide India with a credible deterrent, boost for DRDO" Archived 2010-02-14 at the Wayback Machine.
 13. 13.0 13.1 PTI (3 June 2011).
 14. "New kid on the nuclear block".
 15. PTI (7 February 2015).
 16. Sandeep Unnithan (23 July 2009).
 17. "DRDO working on 5,500 Km Agni" Archived 2011-07-25 at the Wayback Machine.
 18. Sandeep Unnithan (20 November 2010).
 19. T.S. Subramanian.
 20. "Indian missile test 'was failure'".
 21. "Agni test fired successfully".
 22. "Agni iii launched successfully".
 23. "Agni-3 flight tested successfully for the third time" Archived 2011-07-25 at the Wayback Machine.
 24. "Livefist: Agni-III's Final Development Test This October" Archived 2019-08-03 at the Wayback Machine.
 25. "Agni-III launch on May 7".
 26. Pandit, Rajat (8 May 2008).
 27. "Agni-III test fire". Archived from the original on 2012-11-05. Retrieved 2016-12-10.
 28. "Fourth Test Flight of Long Range Missile AGNI-3 Successful".
 29. Super Admin (7 February 2010).
 30. "Agni-III ready for induction: AK Antony – Sci/Tech – DNA".
 31. Ajai Shukla (4 September 2012).
 32. Agni-III test-fired successfully
 33. Agni-III test-fired successfully
 34. http://economictimes.indiatimes.com/news/defence/agni-iii-successfully-test-fired-from-odisha-coast/articleshow/46941664.cms

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అగ్ని-3&oldid=3177722" నుండి వెలికితీశారు